అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని స్థలాల పేర్లను చైనా మార్చడంపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. ఈ రాష్ట్రం ఎప్పటికీ భారత దేశంలో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. చైనా కొత్తగా కనిపెట్టి, పెట్టే పేర్ల వల్ల ఈ యథార్థం మారబోదని తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా తన భాషలో పేర్లను మార్చినట్లు వస్తున్న వార్తల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించినపుడు భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తీవ్రంగా స్పందించారు. ఈ కథనాలను గమనించినట్లు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ గతంలో, ప్రస్తుతం, భవిష్యత్తులో ఎన్నటికీ భారత దేశంలో అంతర్భాగమేనని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు, ప్రదేశాలకు కొత్తగా కనిపెట్టిన పేర్లను పెట్టడం వల్ల ఈ యథార్థం మారబోదని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు, ప్రదేశాలకు చైనా పేర్లు పెడుతుండటం ఇదే మొదటిసారి కాదన్నారు. 2017 ఏప్రిల్‌లో కూడా ఇదే విధంగా…
Author: Editor's Desk, Tattva News
వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ రేటును యధావిధిగా కొనసాగించనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వస్త్రాలపై ఇప్పుడున్న జీఎస్టీ రేటు 5 శాతాన్ని అదేవిధంగా కొనసాగించాలని, దానిని 12 శాతానికి పెంచొద్దని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. వస్త్రాలపై జీఎస్టీ రేటు అంశాన్ని పన్ను రేట్ల హేతుబద్ధీకరణ కమిటీకి పంపుతామని, ఆ కమిటీ ఫిబ్రవరిలోగా తన నివేదికను సమర్పిస్తుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన దేశ రాజధానిలో జరిగిన జిఎస్‌టి కౌన్సిల్ అత్యవసర సమావేశంలో వస్త్రాలపై జిఎస్‌టి రేటు యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో టెక్స్‌టైల్ సమస్య గురించి మాత్రమే చర్చించామని, పాదరక్షలపై జీఎస్టీ పెంపు అంశం చర్చించలేదని ఆర్థిక మంత్రి తెలిపారు. సెప్టెంబరు 17న లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జౌళి, పాదరక్షల వస్తువులపై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంపు నిర్ణయం జనవరి 1, 2022 నుంచి అమలు…
బంగ్లా యుద్ధం – 16 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం ప్రాదేశికంగా చిన్న. అది దాదాపు 56,000 చదరపు మైళ్లకు పరిమితమైంది. కానీ అంతర్జాతీయంగా ముఖ్యంగా మూడు ప్రధాన దేశాలు ఈ యుద్ధం విస్తృత పరిణామాలకు దారితీస్తుందని మొదటి నుంచి అప్రమత్తంగా ఉంటూ వచ్చాయి. అవి అమెరికా, సోవియట్ యూనియన్, చైనా. దానితో అతి తక్కువకాలం – 8 నెలల 21 రోజుల పాటు జరిగిన ఈ విముక్తి యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. ప్రాంతీయ శక్తులలో, భారతదేశానికి ప్రత్యేక ప్రమేయం కూడా ఉంది. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం ప్రపంచ క్రమం అస్థిరంగా ఉన్న సమయంలో జరిగింది. ఒకవైపు, అప్పటి రెండు అగ్రరాజ్యాలైన అమెరికా, సోవియట్ యూనియన్ ల ప్రభావం క్షీణిస్తున్నా, వారి ప్రాబల్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రత కొంచెం తగ్గుతూ వస్తున్నది. మరోవైపు, రష్యా – చైనా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చైనాకు దగ్గరయ్యేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది.…
మతం పేరుతో భారత దేశాన్ని విభజించడానికి కారకుడైన, పాకిస్థాన్ వ్యవస్థాపకుడైన మొహమ్మద్ జిన్నా పేరుతో స్వతంత్ర భారత దేశంలో ప్రముఖ నగరమైన గుంటూరు నడిబొడ్డున ఒక సెంటర్ అనడం, అక్కడ ఆయన విగ్రహం నెలకొనడం తాజాగా వివాదంకు దారితీస్తుంది. ఈ విషయమై గతంలో సహితం పలు సందర్భాలలో వివాదాలు తలెత్తునా, ఏదో విధంగా సద్దుమణిగిపోయాయి. తాజాగా, బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఈ అంశాన్ని ప్రస్తావించడంతో బిజెపి నేతలు అందరు పల్లవి అందుకున్నారు. అక్కడ జిన్నా విగ్రహం ఉన్నచోట అబ్దుల్ కలాం విగ్రహం పెట్టాలనే డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ను బీజేపీ నేతలు కలిసి జిన్నా టవర్ పేరు మార్చాలంటూ వినతిపత్రం ఇచ్చారు. బీజేపీ నేత సత్యకుమార్ మాట్లాడుతూ మహ్మద్ అలీ జిన్నా భారతదేశ ద్రోహి అని, అటువంటి వ్యక్తి పేరుమీద గుంటూరు వంటి ప్రధాన నగరంలో టవర్ ఉండటానికి వీలులేదని దాని పేరు మార్చి అబ్దుల్ కలాం లేదా గుర్రం జాషువా…
దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి ఒక్కసారిగా పెరిగిపోయింది. గడచిన 24 గంటల్లో13 వేలకు పైగా కేసులు, 268 మరణాలు నమోదయ్యాయి. దాదాపు రెండు నెలల తర్వాత కేసులు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటి సారి. మరో వైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య సైతం వెయ్యికి చేరువవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. దేశంలో ఇప్పటి వరకు 1270 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. మహారాష్ట్రకు చెందిన ఒమిక్రాన్ బాధితుడు గుండెపోటుతో మృతిచెందాడు. పూణేలోని పింప్రీ చించువాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. యశ్వంత్ రావు చవాన్ ఆసుపత్రిలో సదరు బాధితుడు కరోనాకు చికిత్స పొందుతూ ఈ నెల 28న మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. బాధితుడు గుండెపోటుతో చనిపోగా.. అనంతరం చేసిన పరీక్షల్లో అతనికి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, అతను ఒమిక్రాన్…
30 ఏళ్ళ క్రితం జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాద విస్ఫోటనం తర్వాత మొదటిసారిగా క్రియాశీల ఉగ్రవాదుల సంఖ్య 200 కంటే తక్కువకు పడిపోయింది. క్రియాశీలకంగా ఉన్న స్థానిక తీవ్రవాదుల సంఖ్యా 86గా మాత్రమే ఉంది. ఈ విషయాన్ని ఐజిపి కశ్మీర్ విజయ్ కుమార్ శ్రీనగర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జిఓసి)తో విలేకరుల సమావేశంలో తెలిపారు. 15 కార్ప్స్, లెఫ్టినెంట్ జనరల్ డిపి పాండే, అనంతనాగ్ ఎస్ ఎస్ పి ఆశిష్ కుమార్ మిశ్రాలతో కలసి దక్షిణ కాశ్మీర్‌లోని ఖాజిగుండ్‌లోని వుజూర్ ప్రాంతంలోని 2 సెక్టార్ ఆర్ ఆర్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాజాగా,అనంత్‌నాగ్, కుల్గామ్‌లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ఆరుగురు జైష్-ఎ-మహమ్మఫ్ (జెఎమ్) ఉగ్రవాదులు హతమైన సంఘటనల వివరాలను పంచుకోవడానికి విలేకరుల సమావేశం జరిగింది. ఒక జవాను కూడా మరణించగా, ఒక పోలీసు, ఒక సైనికుడు గాయపడ్డారు. “చనిపోయిన సైనికుడిని సిపాయి జస్బీర్ సింగ్‌గా గుర్తించారు” అని పాండే చెప్పారు. గాయపడిన…
కేంద్ర నిఘా సంస్థలు కట్టుదిట్టంగా తమపై నిఘా ఉంచుతూ ఉండడంతో, నిషేధం విధించడానికి అదను కోసం కేంద్ర ప్రభుత్వం ఎదురు చూస్తున్నదనే అనుమానంతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, నిషిద్ధ సిమి ఉగ్రవాద సంస్థ తరపున పీఎఫ్ఐ పని చేస్తోంది. ఇప్పుడు దీనిపై కూడా నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు భావించి, దేశవ్యాప్తంగా సంక్షేమ సొసైటీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తోంది. వీటికి వేర్వేరు పేర్లు పెట్టాలని యోచిస్తోంది. వీటన్నిటి ఎజెండా ఒకటే ఉంటుంది. వీటిని స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కూడా చేయిస్తుంది. పీఎఫ్ఐ అగ్ర నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఇస్లామిక్ రాడికలైజేషన్ వంటివాటికి పీఎఫ్ఐ పాల్పడుతోందని గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), రాష్ట్ర పోలీసులు సహా ఇతర ప్రభుత్వ…
2021లో ప్రపంచవ్యాప్తంగా 45 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. ఇంటర్నేషనల్ ప్రెస్ ఇనిస్టిట్యూట్ (ఐపీఐ) విడుదల చేసిన వార్షిక ‘డెత్ వాచ్’ జాబితా ప్రకారం.. 2021లో ప్రపంచవ్యాప్తంగా 45 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అధికంగా మెక్సికోలో 7 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. వరుసగా రెండో ఏడాది అధికంగా జర్నలిస్టు హత్యల హత్యలతో ఐపీఐ డెత్ వాచ్ జాబితాలో మెక్సికో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో భారత్ (6), ఆఫ్ఘానిస్థాన్ (6), డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (3)లు ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేసిన ఈ నివేదిక జర్నలిస్టుల భద్రత రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతున్నదనీ, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి హత్యలు పెరుగుతున్నాయని పేర్కొంది. సాపేక్షంగా అధిక స్థాయి పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశాలలో కూడా జర్నలిస్టుల జీవితాలపై ప్రత్యక్షంగా ప్రభావానికి గురికావడం ఆందోళనకరమైన విషయమని పేర్కొంది. హత్యకు గురైన 45 మంది జర్నలిస్టులలో 28 మంది వారి పనిలో లక్ష్యంగా చేసుకోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు…
తెలంగాణలో కరోనా థర్డ్‌వేవ్ మొదలైందని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించాయిరు. ప్రస్తుత దశను రెండో ప్రమాద హెచ్చరికగా ఆయన అభివర్ణించారు. దేశంలో, తెలంగాణలోనూ మరోసారి కరోనా సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని చెప్పారు. వచ్చే 2 నుంచి 4 వారాలు కీలకమైనవని పేర్కొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వ్యాప్తి కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తికీ హానికలిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తెలంగాణలో సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు రోజుకు 10 వేల కేసులొచ్చాయని, ఇప్పుడు కొద్దికాలంలోనే అత్యధిక స్థాయికి వెళ్లి రోజుకు 30 వేల కేసుల దాకా రికార్డయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. అయితే అంతే త్వరగా వైరస్ తీవ్రత తగ్గిపోయి కేసులు సాధారణ స్థాయికి చేరుకుంటాయని, ఒమిక్రాన్‌తో వచ్చే 6 నెలల్లో కోవిడ్ నుంచి విముక్తి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కంటే కూడా దాని…
వివాహమంటే బంధుమిత్రులతో అంగరంగవైభవంగా జరుగే వేడుక. ఎంతో ఘనంగా జరిగే ఈ వేడుకలు మాత్రం ఇప్పుడు కరోనా సమయంలో అతికొద్ది చుట్టాల మధ్యనే తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా ప్రవేశంతో ప్రభుత్వాలు వేడుకలను ఎప్పుడు రద్దు చేస్తాయో అర్థంకాక చాలామంది పెళ్లిళ్లను రద్దు చేసుకున్న సంఘటనలెన్నో ఉన్నాయి. అప్పటివరకు ఎంతో వైభవంగా పెళ్లి చేసుకుందామనుకొని, . దానికోసం ఎంతో ఖర్చు పెట్టుకున్న వారు పూర్తిగా నిరాశత చెందడమే కాక, ఆర్థికంగా చితికిపోయే పరిస్థితులు దాపురించాయి. జీవితంలో అనుకోకుండా జరిగే ప్రమాదాలకు ఆరోగ్య పాలసీలు ఉన్నట్లే.. ఎవరూ ఊహంచని ఇటువంటి హఠాత్ పరిణామాలతో ఆర్థికంగా ఎంతో నష్టపోతున్న వారికీ అందరికీ అందుబాటులోకి వివాహ బీమా వచ్చేసింది. వివాహ బీమా మొత్తం అనేది పెళ్లి బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది. బీమాపై విధించే ప్రీమియం మొత్తం బీమా మొత్తంలో 0.7- 2 శాతం మధ్య ఉంటుంది. సుమారు రూ. 10 లక్షల బీమా పొందాలంటే రూ.…