Author: Editor's Desk, Tattva News

రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల ఖరారుపై ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోను తోసిపుచ్చుతూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు సోమవారం తీర్పు చెప్పారు. ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఆగస్టు 24వ తేదీన వెలువరించిన 53, 54జీవోలను సవాల్‌ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, ఇతర విద్యా సంస్థలు హైకోర్టులో రిట్లు దాఖలు చేశాయి. ఆయా విద్యా సంస్థల యాజమాన్యాల నుంచి తిరిగి ప్రతిపాదనలు తీసుకున్న తర్వాత కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రెండు జీవోలను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.భౌగోళిక ప్రాంతాలను ఆధారంగా చేసుకుని ఫీజులను ఖరారు చేయడం సరికాదని చెప్పింది. దానితోపాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. తరగతులు, కేటగిరీల వారీగా కమిషన్‌ ఫీజులను సిఫారసు చేయలేదని తప్పుపట్టింది. మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని విద్యా సంస్థలను వర్గీకరించి ఫీజుల ప్రతిపాదన చేయాలని చెప్పింది. రికార్డులన్నింటినీ పరిశీలించిన తర్వాతే 2020%ు21, 2022ు23, 2023ు%24 బ్లాక్‌ పిరియడ్‌కు ఫీజులను…

Read More

దేశంలో కరోనా కేసులతోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండడంతో ఆంక్షలను 2022 జనవరి 31 వరకు అమలు చేయాలనికేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.  కరోనా కట్టడికి ఇప్పటికే డిసెంబర్ 21 న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అనుసరించాలని ఆదేశాలిచ్చింది. ఈమేరకు పరీక్ష, కనుగొనడం, చికిత్స, వ్యాక్సినేషన్ తదితర ఐదంచెల వ్యవస్థపై నిరంతరం దృష్టి కేంద్రీకరించాలని, అవసరమైతే కేసుల పరిస్థితిని బట్టి ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించవచ్చని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా సూచించారు.  పండగ సీజన్ అయినందున స్థానికంగా ఎవరూ గుమికూడకుండా నియంత్రించాలని, కరోనా నిబంధనలు మాస్క్‌ధరించడం, సామాజిక దూరం పాటించడం తదితర నిబంధనలు కచ్చితంగా జనం పాటించేలా చూడాలని సూచించారు.  దేశం మొత్తమ్మీద క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టాయని, అయితే ఒమిక్రాన్ కేసులు డెల్టా వేరియంట్ కన్నా మూడు రెట్లు ఎక్కువగా పెరిగాయని ఫలితంగా అరికట్టడం…

Read More

బంగారు తెలంగాణ కోసం మరో ఉద్యమానికి  సిద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. బీజేపీ నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం దీక్ష చేస్తోన్న బండి సంజయ్‌కు మద్దతుగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అరెస్టులు చేసినా పెద్ద ఎత్తున కార్యకర్తలు దీక్షా ప్రాంగణానికి చేరుకున్నారని తెలిపారు.  తెలంగాణలో కేసీఆర్ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని ఆయన  విమర్శించారు. తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ చెప్పారని… ఉద్యోగాలు  వచ్చాయా? అని నిలదీశారు. కేసీఆర్ ఇంట్లో వారికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.  టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులకు సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని చెబుతూ అందుకే ఉద్యమ వీరులు ఒకొక్కరు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు.  ఏడేళ్ల మోదీ…

Read More

బంగ్లా యుద్ధం – 12 1971 ఇండో-పాక్ యుద్ధం చరిత్రలో భారతదేశం సైనిక చొరవ తీసుకున్న అరుదైన సందర్భాలలో ఒకటి. ఇది భారతదేశానికి భారీ విజయం లభించిన సమయం.  ముఖ్యంగా పాకిస్తాన్‌కు అగ్రరాజ్యం అమెరికా కొండంత అండగా ఉండడమే కాకుండా, విమాన వాహక నౌక యుఎస్ఎస్ ఎంటర్‌ప్రైజ్‌తో సహా ఏడవ ఫ్లీట్‌లో కొంత భాగాన్ని భారత్ లక్ష్యంగా బంగాళాఖాతంలోకి పంపింది. 1962 ఇండో-చైనా యుద్ధంలో ఎదుర్కొన్న వైఫల్యాల పైననే మన రాజకీయ విశ్లేషణలతో ఎక్కువగా దృష్టి సారిస్తున్నాము గాని,  భారతదేశం అపూర్వ విజయం సాధించిన యుద్ధాలపై తక్కువ శ్రద్ధ చూపుతున్నామని చెప్పవలసిందే. ఇది భారతదేశ చరిత్ర గతినే మార్చివేసింది.  ఆ తర్వాత వరుసగా అనేక రంగాలలో ఎవ్వరు ఊహించని విజయాలను సొంతం చేసుకొంటూ, నేడు అగ్రరాజ్యాల సరసన నిలబడే సామర్థ్యం కలిగించిన సందర్భం. సైన్స్, టెక్నాలజీ, వ్యాపారం లేదా క్రీడలలో కావచ్చు.  భారత  క్రికెటర్లు టోర్నీ గెలిచినప్పుడే భారత్ విజయాన్ని సంబరాలు చేసుకుంటాము. కానీ, సైనిక, సైనికేతర విజయాలను ఎవరైనా జరుపుకోకపోతే…

Read More

దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్‌ టుటు (90) ఆదివారం కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. టుటు మరణ వార్తను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫొసా తెలియజేశారు. ‘ఈ ఉదయం కేప్‌ టౌన్‌లోని ఒయాసిస్‌ ఫ్రైల్‌ కేర్‌ సెంటర్‌లో టుటు తుదిశ్వాస విడిచారు’ అని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దక్షిణాఫ్రికా నల్ల జాతీయుల విముక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిన ఒక గొప్ప యోధుడిని కోల్పోయామని అధ్యక్షుడు రమఫొసా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. అయన అసమాన దేశభక్తుడు. జహానెస్‌బర్గ్‌కు మొదటి నల్లజాతి బిషప్‌, తరువాత కేప్‌ టౌన్‌ ఆర్చ్‌ బిషప్‌గా టుటు పలు బాధ్యతలు నిర్వహించారు. 1980 దశకంలో దక్షిణాఫ్రికాలో నల్ల జాతీయులపై శ్వేత దుర్హంకార ప్రభుత్వం సాగించిన క్రూరమైన అణచివేత, వర్ణవివక్షకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం సాగించారు. నల్లజాతీయులపై సాగిస్తున్న దురాగతాలను వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన…

Read More

భారత్‌లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు అత్యధికంగా ఢిల్లీలో 142 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 141, కేరళలో 57, గుజరాత్‌లో 49, రాజస్థాన్‌లో 43 చొప్పున ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. దేశంలో మొత్తంగా ఇప్పటి వరకు 578 మందికి ఒమిక్రాన్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.  ఇందులో 151 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారని చెప్పింది. కాగా, దేశంలో గడిచిన 24 గంటల్లో 6,531 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. యాక్టివ్ కేసుల్లో 7,141 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 75,841 మంది కరోనా చికిత్స పొందుతున్నారని పేర్కొంది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.4 శాతంగా ఉందని తెలిపింది. ఇక ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యయి. ఢిల్లీలో ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నారు. రాత్రి 11గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్…

Read More

ఒక వంక, కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకరెన్సీని నియంత్రించేందుకు చట్టాన్ని రూపొందిస్తుండగా, స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్ జె ఎం) ప్రైవేట్ డిజిటల్ కరెన్సీని నిషేధించాలని డిమాండ్ చేసింది. అయితే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అన్వేషణకు మద్దతు ఇచ్చింది. గ్వాలియర్‌లో మంచ్ రెండు రోజుల జాతీయ సమావేశాలలో ఆమోదించిన తీర్మానంలో, “అంతర్లీన ఆస్తి లేదు”, “జారీదారుని గుర్తించలేము”, “క్రిప్టోకరెన్సీ గుర్తింపు ఊహాజనిత వ్యాపారంకు దారితీయవచ్చు” వంటి కారణాలను పేర్కొంటూ వర్చువల్ కరెన్సీని నిషేధించాలని ఈ సంస్థ స్పష్టం చేసింది. పైగా, మనీలాండరింగ్ కు, ఉగ్రవాద ఫైనాన్సింగ్‌కు దారితీయవచ్చని హెచ్చరించింది. క్రిప్టోకరెన్సీలను కలిగి ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను శాఖకు సమాచారాన్ని సమర్పించే నిబంధనకు లోబడి తక్కువ వ్యవధిలో విక్రయించడానికి లేదా మార్పిడి చేయడానికి అనుమతించవచ్చని తెలిపింది. అలాగే ఆర్‌బిఐ ద్వారా డిజిటల్ కరెన్సీ జారీకి సంబంధించిన చట్టాన్ని తీసుకురావాలని, అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. క్రిప్టోకరెన్సీని అనుమతించడం వలన “వెనుక తలుపు నుండి మూలధన ఖాతా మార్పిడికి దారి తీస్తుంది” అని ఎస్ జె ఎం వారించింది. అయితే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని క్రిప్టోకరెన్సీలకు మాత్రమే లింక్ చేయరాదని, ఆర్థిక లేదా సామాజిక…

Read More

జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారనడం అతిపెద్ద భ్రమ అని  సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ కొట్టిపారేసారు. కానూరులోని సిద్ధార్థ బీటెక్‌ కాలేజీలో జస్టిస్‌ లావు వెంకటేశ్వరరావు స్మారకోపన్యాసం చేస్తూ ‘భారత న్యాయవ్యవస్థ- భవిష్యత్ సవాళ్లు’ అనే అంశంపై మాట్లాడారు.  జడ్జిల నియామకాల్లో కేంద్ర న్యాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియం, ఇంటెలిజెన్స్ బ్యూరో, అత్యున్నత స్థాయి అధికారుల పాత్ర కూడా ఉంటుందని తేల్చి చెప్పారు. జడ్జిల నియామకాల్లో ఇంత జరుగుతున్నా, అది తెలిసిన వాళ్లు కూడా ‘జడ్జిలను జడ్జిలే నియమిస్తున్నారు’ అని కామెంట్ చేయడం సరికాదని స్పష్టం చేశారు.  ఇటీవల పార్లమెంట్ లో ‘ద హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ జడ్జెస్ సవరణ బిల్లు 2021’ చర్చ సందర్భంగా కేరళ ఎంపీ జాన్ బ్రిట్టీస్.. జడ్జిలను జడ్జిలే నియమించడం ఏంటని, దానిని తానెక్కడా వినలేదని వాఖ్యానించారు.   చట్టాలు చేసే ముందు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ప్రభుత్వాలకు హితవు…

Read More

ఉద్యోగాల భర్తీకి వెంటనే కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీచేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో జరుపదలచిన `నిరుద్యోగ దీక్ష’ కు కరోనా ఆంక్షల పేరుతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దానితో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో యధావిధిగా దీక్షను కొనసాగించాలని బిజెపి నాయకులు నిర్ణయించారు.  బీజేపీ దీక్షకు భయపడే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ నిరుద్యోగ దీక్ష చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ దీక్ష కోసం బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది.  కాగా రాష్ట్రంలో ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు చేపట్టవద్దని హైకోర్టు జీవో జారీ చేసింది. ఈ మేరకు జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధమని హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ సభలు నిషేధం. ఈ…

Read More

ఇటీవల వివాదాస్పదంగా మారిన సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ)ను నాగాలాండ్  నుండి ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కనిపిస్తున్నది. ఈ చట్టం ఉపసంహరణ గురించి పరిశీలించేందుకు కేంద్ర హోం వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి (ఎన్ఈ) నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని నాగాలాండ్ ప్రభుత్వం ప్రకటించింది.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ,  ఐజిఎఆర్ (ఎన్), సీఆర్‌పీఎఫ్ ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఈ కమిటీ నివేదిక 45 రోజుల్లోగా వస్తుందని పేర్కొంది. ఈ సిఫారసుల ఆధారంగా తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఇప్పటికే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరుతూ నాగాలాండ్ అసెంబ్లీ తీర్మానం చేసింది.  కల్లోలిత ప్రాంతాల్లో సాయుధ దళాలకు ఈ చట్టం ప్రత్యేక అధికారాలను కల్పిస్తోంది. వారంట్ లేకుండా అనుమానితులను అరెస్టు చేయడానికి భద్రతా దళాలకు ఈ చట్టం ప్రకారం అధికారాలు లభిస్తున్నాయి. ఈ విషయమై భద్రతా దళాలకు తమ వచ్చే ఆరోపణలను…

Read More