Author: Editor's Desk, Tattva News

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ దేశంలో విజృంభిస్తున్నది. ఇప్పటి వరకు దేశంలో 200 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 54 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఆ తర్వాత తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14, ఉత్తరప్రదేశ్‌లో 2, ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కొక్క కేసు నమోదైనట్లు చెప్పింది. సోమవారం వరకు దేశంలో 174 కేసులు నమోదవగా.. మంగళవారం వరకు 200కు పెరిగాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 28 మంది, ఢిల్లీలో 12 మంది, కర్ణాటకలో 15 మంది, రాజస్థాన్‌లో 18, ఉత్తరప్రదేశ్‌, ఏపీ, బెంగాల్‌లో బాధితులు కోలుకున్నారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. కాగా, దేశంలో గడిచిన 24 కొత్తగా 5,326 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజాగా 8,043 మంది బాధితులు…

Read More

బాల్య వివాహాల నిరోధ‌క స‌వ‌ర‌ణ బిల్లు 2021ను ఇవాళ లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. కేంద్ర మ‌హిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని మ‌తాల్లో వివాహ వ‌య‌సు ఒక్క‌టిగా ఉండాల‌ని పేర్కొన్నారు. ఈ స‌వ‌ర‌ణ బిల్లుతో.. మ‌హిళ‌ల క‌నీస వివాహ వ‌య‌సును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల‌కు పెంచ‌నుని తెలిపారు. మ‌హిళ‌ల వివాహ వ‌య‌సు బిల్లుకు మ‌ద్ద‌తు ఇచ్చిన స‌భ‌లోని పురుష స‌భ్యుల‌కు మంత్రి స్మృతీ ఇరానీ థ్యాంక్స్ తెలిపారు. అయితే ఈ బాల్య వివాహ నిరోధ‌క స‌వ‌ర‌ణ బిల్లును స్టాండింగ్ క‌మిటీకి సిఫార‌సు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం చ‌రిత్రాత్మ‌కం అని, మ‌హిళ‌ల ప‌ట్ల త‌మ‌కు ఎటువంటి భేద‌భావం లేద‌ని ఆమె స్పష్టం చేశారు. మ‌హిళ‌ 18 ఏళ్ల‌కు గ‌ర్భ‌వ‌తి అయితే.. అప్పుడు గ‌ర్భ‌స్రావం అయ్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని, అలాంటి…

Read More

* బంగ్లా యుద్ధం – 6 1971 డిసెంబర్ 3న భారత్ తో యుద్ధం ప్రారంభం కావడానికి ముందే భారత నౌకాదళంకు చెందిన యుద్ధనౌక ఐఎన్ఎఎస్ విక్రాంత్ ను ధ్వంసం చేయడం కోసం విశాఖపట్నం వద్ద గల భారత నౌకాశ్రయంలోకి జొరబడిన పాకిస్థాన్ జలాంతర్గామి పిఎన్ఎస్ ఘాజీ ఆ రోజునే అదృశ్యమైనది. ఇప్పటి వరకు పాకిస్థాన్ సైన్యం అదేమైనదో నోరువిప్పడం లేదు. ఇది దక్షిణాసియాలోని మొదట్టమొదటి జలాంతర్గామి కావడం గమనార్హం. దానిని కనిపెట్టి భారత సేనలు కూల్చివేసాయా? నీటిలో ఎక్కువసేపు ఉండలేక అందులో గల పేలుడు ఆయుధాలు పేలి నీటిలోనే ధ్వంసమైనదా? ఇక్కడికి స్పష్టత లేదు. ఏది ఏమైనా భారత్ సేనల వ్యూహం ముందు పాక్ కు భారీ నష్టం జరిగింది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే భారత్ సేనలకు లభించిన భారీ విజయం. స్వతంత్ర భారత్ నమోదు చేసిన మొదటి అతిపెద్ద విజయం. అయితే అందుకు నిర్దుష్టమైన ఆధారాలు మాత్రం లేవు. పిఎన్ఎస్ ఘాజీ…

Read More

టి ఇంద్రసేనారెడ్డి, పర్యావరణ, సామజిక శాస్త్రవేత్త గ్లాస్గో సదస్సులో వచ్చే పదేండ్లలో వాతావరణ మార్పుల సమస్యలను కలసి ఎదుర్కుంటామని, అధిక ఉద్గారాలకు నిలయంగా ఉన్న అమెరికా, చైనా దేశాలు రెండూ ప్రతిజ్ఞ చేశాయి. మీథేన్‌ ఉద్గారాలు, శుద్ధ ఇంధనాలకు మారడం, కర్భన ఉద్గారాల నియంత్రణ సహా అనేక అంశాలపై చర్యలు చేపడతామని, కలసి పని చేస్తామని రెండు దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. ఈ క్రమంలో ఇండియా కూడా ఉద్గారాలను సున్నా చేసే దిశగా ప్రయత్నిస్తామని ప్రకటించింది. అయితే, మారుతున్న వాతావరణం విపత్కర ప్రభావాలను నివారించడానికి అవసరమైన – పారిశ్రామిక పూర్వ స్థాయిల కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదలలో ప్రపంచాన్ని ఉంచడానికి ఈ ఒప్పందం సరిపోతుందా అనేది ఆలోచించాల్సిన విషయం.గ్లాస్గోలో ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు ముగిసింది. ఇందులో భాగంగా చరిత్రలో మొదటిసారిగా, శిలాజ ఇంధనాలకు ముగింపు పలకవలసిన అవసరాన్ని అధికారికంగా గుర్తించారు. వాతావరణ సంక్షోభంలో అతిపెద్ద శత్రువు చివరకు…

Read More

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లో రూ.371 కోట్ల విడుదల వరకూ అక్రమాలు జరిగినయనే ఆరోపణలపై ఏపీ సిఐడి పోలీసులు తాజాగా చేస్తున్న కసరత్తును చూస్తుంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యంగా జరుగుతున్నట్లు కనిపిస్తున్నది. గతంలో అర్ధాంతరంగా పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణ రాజును అరెస్ట్ చేసి, చిత్రహింసలకు కూడా గురిచేసిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొని, ఉన్నత న్యాయస్థానాల ముందు దోషిగా నిలబడిన సిఐడి పోలీసులు ఈ సారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే ఈ ఈకేసు విషయంలో ఎంపిక చేసిన కొందరిని లక్ష్యంగా చేసుకొని సిబిడి వ్యవహరిస్తున్నట్లు స్వయంగా ఏపీ హైకోర్టు ఇప్పటికే మొట్టికాయలు వేసింది. తాజాగా సీఆర్‌పీసీ 160 కింద మాజీ ఎండీ-సీఈవో ప్రేమచంద్రారెడ్డికి, రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్‌కు నోటీసులిచ్చింది. ఈ సందర్భంగా సంధిస్తున్న 40 ప్రశ్నలలో చంద్రబాబునాయుడుకు గల సంబంధం గురించే కేంద్రీకరించడం గమనార్హం. ‘అప్పట్లో ఏం జరిగింది.? నాటి సీఎం చంద్రబాబుకు సంబంధం ఉందా.? ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి తెలుసా..? ప్రతిపాదనలు ఎవరిచ్చా…

Read More

రాజ్యసభలో ప్రతిపక్షం “గందరగోళం, అంతరాయం” మంత్రంతో పని చేస్తుందని బిజెపి తీవ్రంగా ఆరోపించింది. 12 మంది ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ కారణంగా సభలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రభుత్వం పిలిచిన సమావేశానికి ఐదు ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరుకాకపోవడంతో, సభ నడవడంవారికి ఇష్టం లేదని వెల్లడైనదని విమర్శించింది. గత సమావేశాలలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, శివసేనతో సహా ఈ పార్టీలు – రాజ్యసభలో వికృతంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఈ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వం మొత్తం ప్రతిపక్షాలను సమావేశానికి పిలిచి ఉండాల్సిందని వాదించాయి. రాజ్యసభలో సభానాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు సభను నడపడానికి ఆసక్తి చూపడం లేదని ధ్వజమెత్తారు. “వారు సమావేశంకు హాజరై తమ అభిప్రాయాన్నిచెప్పి ఉండవలసింది. అప్పుడు ప్రభుత్వం అందరినీ ఆహ్వానించి ఉండవచ్చు,” అని ఆయన పేర్కొన్నారు, రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు ఆదేశాల మేరకు ఐదు పార్టీల నాయకులను పిలిచామని పేర్కొంటూ ఆయన ఒక పరిష్కారం కనుగొనడానికి ఇరుపక్షాలు…

Read More

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫెడరేషన్‌(బిడబ్ల్యుఎఫ్‌) అథ్లెట్స్‌ కమిషన్‌ సభ్యురాలిగా భారత మహిళా షట్లర్‌ పివి సింధు ఎంపికైంది. బిడబ్ల్యుఎఫ్‌ 2021-25 ఐదేళ్ల కాలానికి ఆరుగురు సభ్యులతో సభ్యులను ఎంపిక చేయగా అందులో సింధు ఒకరు.  సింధుతోపాటు ఇరిస్‌ వాంగ్‌(అమెరికా), రాబిన్‌ తలబెలింగ్‌(నెదర్లాండ్స్‌), గ్రేసియా పొల్లి(ఇండోనేషియా), కిమ్‌ సొయాంగ్‌(కొరియా), జంగ్‌ సి వురు(చైనా) ఎంపికైనట్లు బిడబ్ల్యుఎఫ్‌  ఓ ప్రకటనలో వెల్లడించింది. బిడబ్ల్యుఎఫ్‌ కమిషన్‌ ఛైర్‌ అండ్‌ డిప్యూటీ ఛైర్‌ సభ్యులు ఆరుగురు షట్లర్లను ఎంపిక చేశారు.  పివి సింధు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి చరిత్రను సృష్టించడం.. అథ్లెట్స్‌ కమిషన్‌ మెంబర్‌గా ఎంపికకు ప్రధాన అర్హతగా అందరికంటే ముందువరుసలో నిలిచినట్లు ఛైర్‌ సభ్యులు తెలిపారు. అలాగే ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు రజితాలు, మరో రెండు కాంస్యాలతోపాటు 2019లో స్వర్ణ పతకం సాధించడం కూడా సింధు ఎంపికకు దోహదపడ్డాయి.

Read More

గత ఐదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ విదేశీ సంస్థ రుణాలు ఇవ్వలేదని, రాష్ట్రం మొత్తమ్మీద రుణభారం రూ. 2,37,747 కోట్లు ఉందని కేంద్రమంత్రి పంకజ్ చౌదరీ సమాధానం చెప్పారు. దేశీయంగా వివిధ సంస్థలు, బ్యాంకుల నుంచి 2,34,912 కోట్లు, విదేశీ సంస్థల నుంచి 2,835 కోట్ల అప్పులు తీసుకుందని వెల్లడించారు. నవంబర్ 30, 2021 వరకు మొత్తం తెలంగాణ అప్పులు 2,37,747 కోట్లుగా ఉందని, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం చెప్పారు. ఇందులో రూ. 2,835 కోట్లు విదేశాల నుంచి తీసుకున్న రుణాలున్నాయని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో విదేశీ రుణాల రూపంలో కేంద్రం నుంచి తెలంగాణకు ఎలాంటి అదనపు సహాయం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం గత ఐదేళ్లలో రూ.382.21 కోట్ల మేర విదేశీ రుణాలు, రూ. 147.53 కోట్ల మేర వడ్డీ చెల్లింపులు జరిపిందని వెల్లడించారు. జపాన్ ప్రభుత్వం, ఇంటర్నేషనల్…

Read More

ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు(ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం బిల్లుకు) లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు చివరిదాకా యత్నించాయి. విపక్షాల ఆందోళన మధ్యే సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. బోగస్ ఓట్లను తొలగించడానికే ఈ బిల్లు తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. బిల్లును ఆమోదించాక సభ మంగళవారానికి వాయిదాపడింది. గత వారం కేంద్ర కేబినెట్‌లో ఈ బిల్లును ఆమోదించిన కేంద్రం.. సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఎన్నికల చట్ట (సవరణ) 2021 పేరుతో బిల్లును కేంద్రం తెచ్చింది. ఓటరు జాబితాలో పేర్లను నమోదు చేసుకోవాలి అనుకునేవారి గుర్తింపు పత్రంగా ఆధార్ నెంబర్‌ను అడిగే హక్కు ఎన్నికల నమోదు అధికార్లకు ఉండేలా చట్టంలో మార్పుల బిల్లును లోక్ సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. ఇవాళ మ‌ధ్యాహ్నంఒ స్వ‌ల్ప చ‌ర్చ త‌ర్వాత ఎన్నిక‌ల చ‌ట్టాల స‌వ‌ర‌ణ బిల్లుకు ఆమోదం ద‌క్కింది. ఈ బిల్లు ఆమోదంతో ఇప్పుడు ఓట‌రు కార్డుతో…

Read More

ఈడీ విచారణకు ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ హాజరయ్యారు. పనామా పేపర్స్ లీక్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపడంతో సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఈడీ కార్యాలయ్యానికి ఐశ్వర్య రావ్ వెళ్లింది.  ఫెమా చట్టం ఉల్లంఘించినట్లు ఐశ్వర్యా రాయ్ పై ఆరోపణలు వచ్చాయి. ప‌నామా పేప‌ర్ లీక్ కేసులో ఇండియాలో పలువురు రాజ‌కీయ నాయ‌కులు, న‌టులు, క్రీడాకారులు, వ్యాపార‌వేత్త‌లు త‌దిత‌రులతో కలిపి మొత్తం 500 మందికి ప్ర‌మేయం ఉన్న‌ట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. వీరంతా ప్ర‌భుత్వానికి ప‌న్నులు ఎగ‌వేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.  ఈ కేసులో ఇప్పటికే ఐశ్వ‌ర్య రాయ్ భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్ ఈడీ విచారించి.. ఆయ‌న నుంచి కొన్ని డాక్యుమెంట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ కేసులో విచారించేందుకు సమన్లు జారీ చేయగా.. తనకు మరింత సమయం కావాలని రెండు సార్లు కోరినట్లు తెలుస్తోంది.  గ‌త నెల ఐశ్వ‌రాయ్ భ‌ర్త అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా ఈ కేసులో…

Read More