Author: Editor's Desk, Tattva News

హైదరాబాద్ నగరవాసులను ట్రాఫిక్ సమస్యతో పాటు పార్కింగ్ సమస్య కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తలపెట్టిన పూర్తి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే తొలిసారిగా జర్మన్ పాలిస్ పార్కింగ్ విధానంలో, తక్కువ స్థలంలో ఎక్కువ వాహనాలు పార్కింగ్ చేసేలా ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఈ మేరకు ఆదివారం రోజున ఇంజనీరింగ్ అధికారులతో కలిసి హెచ్ ఎం ఆర్ ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఎంఎల్‌పీ పనులను పరిశీలించారు. ఈ ప్రాజెక్టును పీపీపీ విధానంలో రూ.80 కోట్లతో నిర్మించామని తెలిపారు. నాంపల్లి మెట్రో రైల్ స్టేషన్‌కు సమీపంలో హెచ్‌యంఆర్‌కు చెందిన అర ఎకరం స్థలంలో 15 అంతస్తులుగా ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. లక్షా నలభై నాలుగు వందల చదరపు అడుగుల మొత్తం నిర్మాణ విస్తీర్ణంలో 68 శాతం పార్కింగ్‌కు, మిగిలిన…

Read More

ఇన్సులిన్‌ ఇవ్వకుండా తన భర్తను జైల్లో హత్య చేసేందుకు బిజెపి యత్నిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. బిజెపి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఇండియా కూటమి పోరాడి విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం రాంచీలో జరిగిన ‘ఉల్గులన్‌ న్యారు ర్యాలీ’ లో ఆమె మాట్లాడారు. ” నా భర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ని చంపాలనుకుంటున్నారు. అతని ఆహారంపై నిఘా ఉంచారని, ఇన్సులిన్‌ అందించడం లేదు. నా భర్త 12 సంవత్సరాలుగా ఇన్సులిన్‌ తీసుకుంటున్నారు. ఆయనకు రోజుకి 50 యూనిట్ల ఇన్సులిన్‌ అవసరం” అని ఆమె పేర్కొన్నారు. ప్రజలకు సేవచేసిందుకు తన భర్తను జైలుపాలయ్యారని మండిపడ్డారు. నేరం రుజువు కాకుండానే కేజ్రీవాల్‌, హేమంత్‌ సోరెన్‌లను జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్అధినేత తీసుకునే భోజనాన్ని అధికారులు క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నార‌ని, కేజ్రీవాల్ తీసుకునే ఆహారాన్ని ప‌సిగ‌ట్టేందుకు కెమెరాల‌ను ఏర్పాటు చేశార‌ని,…

Read More

* రాహుల్ కు వయనాడ్ సీటు కూడా దక్కదన్న మోదీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు కుటుంబ సంబంధాల గురించి కాదని, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య సంగ్రామమని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పుణె జిల్లాలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్‌సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కన్హేరీలోని హనుమాన్ ఆలయంలో శనివారం పూజలు నిర్వహించిన అనంతరం ఆమె అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అజిత్ పవార్‌తోపాటు ఆయన కుమారులు పునీత్, జై, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సునేత్రకు ప్రత్యర్థిగా అజిత్ పవరా సోదరి, శరద్ పవార్ కుమార్తె, మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన సుప్రియా సూలె పోటీ చేస్తున్నారు. ఎన్‌సిపి(శరద్ పవార్) తరఫున పోటీ చేస్తున్న సుప్రియ, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్‌సిపి తరఫున పోటీ చేస్తున్న సునేత్ర…

Read More

శ్రీలంకలో మైనార్టీలుగా ఉన్న వేద్దా తెగ ప్రజల్లో భారతీయ మూలాలు ఉన్నట్టు సీసీఎంబీ, మరో నాలుగు అధ్యయన సంస్థలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. ఐదు సంస్థ ల నుంచి పది మంది పరిశోధకులు శ్రీలంకలోని మైనార్టీ సమూహమైన వేద్దా జనాభా జన్యు చరిత్ర విషయాలను వెలుగులోకి తెచ్చారు. వీరిని స్థానికంగా వన్నియలేటోలుగా పిలుస్తారు. వేద్దా తెగ భాష, వ్యవహారికం, సాంస్కృతిక లక్షణాలు వైవిధ్యంగా ఉండటమే ఈ పరిశోధనకు కారణమని సీసీఎంబీ సైంటిస్ట్‌ డాక్టర్‌ కే తంగరాజ్‌ తెలిపారు. ఈ తెగ భారతీయులతో గణనీయమైన జన్యు సంబంధాన్ని కలిగి ఉన్నట్టు తమ ఆటోసోమల్‌ విశ్లేషణలో తేలిందని బీహెచ్‌ యూ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ జ్ఞానేశ్వర్‌ చౌబే పేర్కొన్నారు. వీరిలో శ్రీలంకలోని సింహళీయులు, శ్రీలంక తమిళుల మూలాలు కూడా ఉన్నాయని కొలొంబో యూనివ ర్సిటీకి చెందిన రువాండీ రణసింగ్‌ చెప్పారు. ఈ పరిశోధన ద్వారా దక్షిణాసియా జనాభా చరిత్రపై మరిన్ని కోణాలు ఉంటాయని భావిస్తున్నారు. తమ…

Read More

పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాల విస్తరణకు అగ్రరాజ్యం అమెరికా అడ్డుతగిలింది. ఈ క్షిపణి కార్యక్రమాల లోసం సాంకేతిక పరికరాలను సరఫరా చేసే చైనా, బెలారస్ కంపెనీలను అమెరికా నిషేధించింది. చైనాకు చెందిన జియాన్ లాంగ్డే టెక్నాలజీ డెవలప్‌మెంట్, టియాంజిన్ క్రియేటివ్ సోర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ గ్రాన్‌పెక్ట్ కంపెనీ లిమిటెడ్, బెలారస్‌కు చెందిన మిన్‌స్క్‌వీల్ ట్రాక్టర్ ప్లాంట్ మొత్తం ఈ నాలుగు కంపెనీలపై నిషేధం వేటు వేసింది. ఈ కంపెనీలు ప్రమాదకరమైన ఆయుధాలను తయారు చేయడంలో సహాయపడే కార్యకలాపాలలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాయని అమెరికా ఆరోపించింది. ఈ కంపెనీలు క్షిపణుల తయారీలో పాకిస్థాన్‌కు సహకరిస్తున్నాయని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. ఆందోళన కలిగించే ఇలాంటి కార్యకలాపాలను నిరోధించి ప్రపంచ దేశాలకు ఎలాంటి విస్తరణ కాంక్షలేని తరాన్ని బలోపేతం చేయడానికి అమెరికా ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు సర్వకాల మిత్రదేశంగా చైనా ఉంటూ పాకిస్థాన్ ప్రతిష్టాత్మక…

Read More

రష్యావ్యాప్తంగా శుక్రవారం రాత్రి డ్రోన్లతో బాంబుల వర్షాన్ని ఉక్రెయిన్ కురిపించినట్లు మాస్కోలోని రక్షణ శాఖ శనివారం ప్రకటించింది. రష్యాలోని విద్యుత్ కేంద్రాలను లక్షంగా చేసుకుని ఈ దాడులు జరిగినట్లు రక్షణ శాఖ అనుమానం వ్యక్తం చేసింది. రష్యాలోని వివిధ ప్రాంతాలపై ఉక్రెయిన్ ప్రయోగించిన 50 డ్రోన్లను రష్యా కూల్చివేసింది. ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని బెల్గోరోడ్ ప్రాంతంపై దాడి చేసిన 26 డ్రోన్లు కూడా ఇందులో ఉన్నాయి. డ్రోన్ల కూల్చివేత వల్ల మంటలు చెలరేగి ఒక ఇల్లు దగ్ధం కావడంతో ఒక మహిళ, ఒక పురుషుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. బ్రియాంస్క్, కుర్స్, తులా, సమోలెస్క్, రియాజన్, కలుగ ప్రాంతాలపై కూడా ఉక్రెయిన్ డ్రోన్లు దూసుకురాగా వాటిని రష్యా సైన్యం కూల్చివేసినట్లు తెలుస్తోంది. కలుగ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడి వల్ల విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంటలు చెలరేగినట్లు ఆ ప్రాంత అధిపతి ఒకరు శనివారం తెలిపారు. రష్యాపై మానవరహిత డ్రోన్ల దాడికి ఉక్రెయిన్…

Read More

ఉత్తర్ ప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన తొలి దశ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్-సమాజ్‌వాది(ఎస్‌పి) కూటమి తుడిచిపెట్టుకుపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌ను యువరాజులుగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలోని సహరన్‌పూర్, బిజ్నోర్, కైరానా, ముజఫర్‌నగర్, నగీన(రిజర్డ్), మొరాదాబాద్, రాంపూర్, పిలిభిత్ సీట్లలో శుక్రవారం పోలింగ్ జరిగింది. కాగా..అంతకుముందు మీరట్‌లో జరిగిన ఒక ఎన్నికల ప్రచార సభలో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వాతావరణం మారిపోయిందని, తొలి దశ పోలింగ్‌లో ప్రజలు బిజెపిని తరిస్కరించారని చెప్పారు. కాగా..మథుర నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్న సిట్టింగ్ ఎంపి హేమమాలిని తరఫున బృందావనంలో ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా ప్రసంగిస్తూ రూ. 12 లక్షల కోట్ల కుంభకోణాలు, అవినీతికి పాల్పడిన కాంగ్రెస్, ఎస్‌పి ఒకవైపు, 23 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పనిచేసినప్పటికీ ఒక్కపైసా అవినీతి మరక అంటని నరేంద్ర మోడీ మరో వైపు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు…

Read More

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని.. ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో కీలకమైన కర్తవ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌ ‘మై ఓట్‌ మై వాయిస్‌’ మిషన్‌కు ఆయన వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత పౌరులమని.. రాజ్యాంగం పౌరులైన మనకు అనేక హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. అయితే, ప్రతి ఒక్కరూ తనకు అప్పగించిన కర్తవ్యాన్ని నిర్వర్తించాలన్నారు. పౌరులకు రాజ్యాంగం కల్పించిన విధుల్లో ఒకటి ఓటు వేయడమని చెప్పారు. గొప్ప మాతృభూమి పౌరులుగా బాధ్యతాయుతంగా ఓటు వేసే అవకాశాన్ని వదులుకోవద్దని అందరినీ అభ్యర్థిస్తున్నానని చంద్రచూడ్ తెలిపారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఐదు నిమిషాలు కేటాయించవచ్చని, గర్వంగా ఓటు వేయాలని సీజేఐ పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో పౌరులకు పాత్ర ఉందని, అందుకే రాజ్యాంగంలో ‘భారత ప్రభుత్వం ప్రజలచే.. ప్రజల కొరకు’ అని…

Read More

18వ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఉత్కంఠ ఎంతగా ఉందంటే ప్రజలు ఎండ వేడిని కూడా పట్టించుకోకుండా వచ్చి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. సీట్ల పరంగా ఇదే అతిపెద్ద దశ. ఈ క్రమంలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 63.5% (రాత్రి 11 గంటల నాటికి) ఓటింగ్ నమోదైంది.  పశ్చిమ బెంగాల్‌లో చెదురుమదురు హింసాత్మక సంఘటనల మధ్య 77.57 శాతం ఓటింగ్ జరగగా, చాలా చోట్ల ప్రశాంతంగా ముగిసింది. నక్సల్స్ ప్రభావిత బస్తర్ ప్రాంతం, పశ్చిమ బెంగాల్, మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.  ఇప్పటివరకు వచ్చిన నివేదికల ప్రకారం త్రిపురలో అత్యధికంగా 81.5%, సిక్కింలో 80% నమోదు కాగా, మణిపూర్, పుదుచ్చేరిలో (78.3%), మేఘాలయలో (74.5%), అసోంలో (73.4%) ఓటింగ్ నమోదైంది.  ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మొదటి దశ లోక్‌సభ ఎన్నికలలో నక్సల్స్ ప్రభావిత బస్తర్ లోక్‌సభ స్థానంలో 63.41 శాతానికి పైగా ఓటర్లు…

Read More

విశాఖపట్టణంలోని ఉక్కు కర్మాగారంలో 2023 ఫిబ్రవరిలో సుమారు రూ.45 కోట్ల విలువైన నాసిరకం బగ్గును యాజమాన్యం కొనుగోలు చేసింది. నాసిరకం బగ్గు కొనుగోలుకు సంబంధించి భారీగా కుంభకోణం జరిగిందని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం బృందం ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ మల్లికార్జునకు, విశాఖపట్నంలోని సిబిఐ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఐదుగురు అధికారులతో కూడిన సిబిఐ బృందం శుక్రవారం స్టీల్‌ప్లాంట్‌లో సోదాలు చేపట్టింది. రూ.45 కోట్ల విలువైన 16 వేల టన్నుల జమ్‌కోల్‌ను అత్యవసరం అంటూ ఉక్కు చైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్థాయిలో అప్పట్లో కొనుగోలు చేశారు. ఈ బగ్గును మంచిరకం బగ్గులో కలిపి వాడేసిందని అప్పట్లో పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలతో  దేశంలోగల పేరెన్నికగన్న లేబరేటరీల్లో ఈ బగ్గు నమూనాలను పరీక్షించారు. నాశిరకం బగ్గు అని తేలడంతో సిబిఐ అధికారులు తాజాగా ప్లాంట్‌లోకి వెళ్లారు. స్టీల్‌…

Read More