Author: Editor's Desk, Tattva News

టోల్ ప్లాజాల దగ్గర మాన్యువల్‌గా టోల్ ఛార్జీల వసూలువల్ల రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోతుండటంతో 2016లో ఆటోమెటిక్‌గా టోల్ వసూలు చేసే ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు కేంద్ర సర్కారు ఫాస్టాగ్‌ల కంటే వేగంగా టోల్‌ కలెక్ట్‌ చేసే కొత్త సిస్టమ్‌ను తీసుకురాబోతోంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్‌ ద్వారా టోల్‌ వసూలుకు వాహనదారులు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడూ తగినంత క్యాష్ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. ప్రతిసారి ఇలాంటి తలనొప్పులు లేకుండా ఫాస్టాగ్‌ల నుంచి జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్‌కి మారాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల హైవే ప్రయాణం మరింత వేగంగా, సాఫీగా మారుతుంది. జీపీఎస్‌ ఆధారిత టోల్ సిస్టమ్ అనేది ఒక కొత్త టెక్నాలజీ. ప్రస్తుతం దీనిని ముంబైలోని అటల్ సేతు లాంటి కొన్ని రహదారులపై పరీక్షిస్తున్నారు. ఈ సిస్టమ్‌ కదిలే వాహనాల నంబర్ ప్లేట్లను…

Read More

తెలంగాణ అసెంబ్లీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. మూలధన వ్యయం రూ. 29,669 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం రూ. 2,01,178 కోట్లుగా వెల్లడించారు. ద్రవ్యలోటు రూ.33,786 కోట్లు ఉండగా, రెవెన్యూఖాతాలో మిగులు రూ.9,031 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు.  మూలధన వ్యయం రూ.24,178 కోట్లు ఉన్నట్లు తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను సవరించిన అంచనాలు రూ.2,24, 625 కోట్లుగా తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమ‌లుకు రూ. 53,196 కోట్లు ప్ర‌తిపాదించిన‌ట్లు చెబుతూ ఈ కేటాయింపు ఒక ప్రాథ‌మిక అంచ‌నా ప్ర‌కారం మాత్ర‌మే చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. హామీల‌కు సంబంధించిన విధివిధానాల‌ను రూపొందించే ప‌ని ఇంకా కొన‌సాగుతున్నందున‌, అది పూర్త‌యిన వెంట‌నే అమ‌లుకు అవ‌స‌ర‌మైన పూర్తి నిధులు కేటాయిస్తాం అని స్పష్టం చేశారు. ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణ‌మాఫీ ప‌థ‌కాన్ని అమ‌లు…

Read More

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు శుక్రవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలంటూ మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నేత జగదీష్ రెడ్డి సుప్రీంలో ట్రాన్స్‌ఫర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మోహతా బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం, ఇతర ప్రతివాదులకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. నోటీసులకు నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ సిఎంగా బాధ్యతలు చేపట్టి 60 రోజులు పూర్తైంది. ఈ క్రమంలో ఓటుకు నోటు కేసు తెరపైకి రావడం, సుప్రీం నుంచి నోటీసులు రావడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ…

Read More

మూడు దశాబ్దాల తర్వాత భారతదేశం ప్రపంచ సుందరి(మిస్‌ వరల్డ్‌) 71వ ఎడిషన్‌ పోటీలకు వేదిక కానుంది. భారత్‌లో ఈ నెల 18 నుంచి మార్చి 9 వరకు ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు భారత్ ప్రపంచ దేశాల నుంచి వచ్చే సుందరీ మణులకు ఆతిథ్యం ఇవ్వబోతున్నదని తెలుస్తుంది. ఇందులో ప్రస్తుత మిస్ వరల్డ్ తో పాటు నలుగురు మాజీ విజేతలు పాల్గొని కీలక విషయాలను వెల్లడించారు. 70వ ఎడిషన్ విన్నర్ కరోలినా బిలావ్స్కా, టోనీ అండ్ సింగ్ 69వ ప్రపంచ సుందరి, వెనెస్సా పోన్స్ డీ లియోన్ 68వ ప్రపంచ సుందరి, మానుషి చిల్లర్ 67వ ప్రపంచ సుందరి, స్టెఫానీ డెల్ వల్లే 66వ ప్రపంచ సుందరి ఈ సందర్భంగా ఢిల్లీకి వచ్చారు. ఇక మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్మన్, సీఈవో అయిన జూలియా మోర్లీ సీబీఈ మాట్లాడుతూ భారతదేశం పట్ల తనకున్న ప్రేమ ఎనలేనిదని,…

Read More

తిరుపతిలోని 25 ఎకరాల హథీరాంబాబా మఠం భూముల విక్రయంపై సుప్రీంకోర్టు స్టేటస్‌కో విధించింది. ఈ మేరకు జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మఠం భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడలేమని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం వాటిని విక్రయించాలని గతంలో నిర్ణయించింది.  లీజుకు తీసుకున్నవారే కొనుగోలు చేయడానికి వీలు కల్పించింది. దానిపై మఠం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. దాన్ని సవాల్‌ చేస్తూ మఠం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భూములను ఆక్రమణదారుల నుంచి కాపాడటం కష్టమన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో సుప్రీంకోర్టు విభేదించింది.  ఢిల్లీ నుంచి తిరుపతి వరకు ఉన్న రూ.కోట్ల విలువ చేసే మఠం భూములు అన్యాక్రాంతం అవుతుండటంపై విచారం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఈ కేసు విచారణ పూర్తయ్యేంత…

Read More

పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఇంకా పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడి కాలేదు. ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాలు కన్పిస్తున్నాయి. పిటిఐ పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక సీట్లు సొంతం చేసుకున్నారు.  పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లు ఉన్నాయి. 336 సీట్లలో నేరుగా 266 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. మిగితా 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయించారు. పాకిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటుకు 133 సీట్లు కావాల్సిఉంది. ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు 98 చోట్ల సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 69 సీట్లతో నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌)- పీఎంఎల్‌-ఎన్‌ రెండో స్థానంలో, 51 సీట్లతో బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నిలిచింది.…

Read More

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం తోటి ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో భోజనం చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్రం విడుదల చేసిన శ్వేతపత్రంపై పార్లమెంట్‌లో శుక్రవారం చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. అనంతరం పార్లమెంట్‌ ప్రాంగణంలో ఓ అనూహ్య దృశ్యం ఆశ్చర్యానికి గురి చేసింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌ క్యాంటీన్‌లో భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యపర్చారు. బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన ఎనిమిది మంది ఎంపీలను ప్రధాని విందుకు ఆహ్వానించారు. దీనిగురించి మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఎంపీలకు ప్రధాని నుంచి ఫోన్‌ వచ్చింది. ‘పదండి.. ఈ రోజు మీకో పనిష్మెంట్‌ ఇస్తాను’ అని మోదీ వారితో నవ్వుతూ సరదాగా అన్నట్లు సమాచారం. అనంతరం ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ పార్లమెంట్‌ క్యాంటీన్‌కు వెళ్లారు. …

Read More

కేంద్రం దివంగత చౌదరి చరణ్ సింగ్ కు భారత రత్న అవార్డు ప్రకటించగానే యూపీలో ఉన్న ఆయన మనవడు జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ ప్రస్తుతం ఉన్న ఇండియా కూటమికి గుడ్ బై చెప్పేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయ కూటమిలో చేరేందుకు సిద్ధమైపోయింది.  ఇప్పటికే ప్రతీ ఎన్నికల సమయంలో కూటముల్ని, మిత్రపక్షాల్ని మార్చేసే అలవాటు ఉన్న ఆర్ఎల్డీ మరోసారి ఎన్డీయే పంచన చేరబోతోంది. చరణ్ సింగ్ కు భారత రత్న ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ  ఎక్స్ లో చేసిన పోస్టును సమాధానంగా ఆఫర్ ను ఎలా తిరస్కరించగలనంటూ ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి పెట్టిన పోస్టు ఏం జరగబోతోందో చెప్పకనే చెప్పేసింది.  ప్రధాని మోదీ చరణ్ సింగ్ కు భారత రత్న ప్రకటిస్తూ తనను అభినందిస్తూ పోస్టు పెట్టినప్పుడు సీట్లు, ఓట్ల గురించి మాట్లాడటం దాని విలువను తగ్గించినట్లవుతుందని జయంత్ తెలిపారు. ప్రధానమంత్రి మోదీ దేశపు…

Read More

భారతదేశ మాజీ ప్రధానులు పీవీ.నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌లతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. భారతదేశ ఐదో ప్రధానిగా పనిచేసిన దివంగత చౌదరి చరణ్ సింగ్ రైతుల సంక్షేమం కోసం చేసిన అచంచలమైన అంకితభావానికి మరణానంతరం భారతరత్నతో సత్కరించుకున్నామని తెలిపారు.  ఇప్పటికే బీజేపీ దిగ్గజ నేత ఎల్ కే అద్వానీ, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌లకు ఈ ఏడాది భారతరత్నను ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ ఏడాది భారతరత్న అవార్డులను ప్రకటించిన ఐదుగురిలో నలుగురికి మరణానంతరం అవార్డు వరించింది. ప్రస్తుతం అవార్డుకు ఎంపికైన వారిలో ఎల్ కే అద్వాణీ మాత్రమే జీవించి ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారత హోం మంత్రిగా పని చేసిన చరణ్ సింగ్ రైతుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసిన ప్రతిఘటన,…

Read More

* నిర్మలా సీతారామన్ లోక్‌సభలో శ్వేతపత్రం  కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని, విచక్షణారహితంగా రెవిన్యూ వ్యయం, భారీ ఎత్తున బడ్జెట్‌కు వెలుపల అప్పులు చేయడం, బ్యాంకుల్లో మొండి బకాయిలు పెద్ద ఎత్తున పేరుకు పోవడం లాంటి చర్యల ద్వారా తమ పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను నిస్తేజంగా మార్చిందని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పేర్కొంది. యుపిఎ ప్రభుత్వంతో పోలిస్తే రాజకీయంగా, విధానపరంగా ఎన్‌డిఎ ప్రభుత్వం స్థిరంగా ఉందని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కఠినమైన నిర్ణయాలను తీసుకుందని కేంద్రం వెల్లడించింది. దేశ ఆర్థిక పరిస్థితులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టారు. గత యుపిఎ ప్రభుత్వంతో పోలిస్తే తమ పదేళ్ల పాలనలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో 54 పేజీల ఆ పత్రంలో వివరించారు. దీనిపై శుక్రవారం సభలో చర్చించనున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు జరగనున్న…

Read More