2022 లో దేశం మొత్తం మీద మహిళలపై నమోదైన నేరాల సంఖ్య 4.45 లక్షలకు చేరిందని, 2020 లో ఈ సంఖ్య 3,71,503 కాగా, 2021లో 4,28,278 వరకు ఉందని,దీన్ని బట్టి నేరాల సంఖ్య పెరిగినట్లు స్పష్టమవుతోందని నేషనల్ క్రైమ్ రిపోర్టు బ్యూరో ( ఎన్‌సిబి )తాజా నివేదిక వెల్లడించింది. దాదాపు ప్రతిగంటకు 51 కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. లక్ష జనాభాకు 66.4 శాతం వంతున ఈ క్రైమ్ రేటు ఉంటోందని, అలాంటి కేసుల్లో నమోదు 75.8 శాతం వరకు ఉందని నివేదిక పేర్కొంది. భర్త, అతని తాలూకు కుటుంబ సభ్యుల వల్లనే నేరాలు 31.4 శాతం వరకు ఉంటున్నాయి. కిడ్నాపింగ్, నిర్బంధించడం కేసులు 19.2 శాతం, దౌర్జన్యాలు 18.7 శాతం, అత్యాచారాలు 7.1 శాతం వరకు నేరాల రేటు ఉంటోందని నివేదిక వివరించింది. గత ఏడాది దేశంలో 28,522 హత్య కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ప్రతిరోజు సగటున 78…
Author: Editor's Desk, Tattva News
ఆప్ ఎంపి రాఘవ్ ఛద్దా సస్పెన్షన్‌ను రాజ్యసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ద్వారా ఎత్తివేశారు. తర్వాత సోమవారం నుంచి ఆరంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతించారు. సభాహక్కుల కమిటీ సమావేశం అయ్యింది. ఇందులో రాఘవ్‌ను తప్పుచేసిన వాడిగానే నిర్థారించారు. ఆయన మీడియాకు తప్పుడు సమాచారం, గణాంకాలు అందించారని ఇది తమ పరిశీలనలో రుజువు అయింని తెలిపారు. ఇతరత్రా కూడా రాజ్యసభ కమిటీ ఆయన తప్పిదాలను పేర్కొంది. సోమవారం సభలో ఆయన సెస్పెన్షన్ ముగింపు తీర్మానాన్ని బిజెపి సభ్యులు జివిఎల్ నరసింహరావు ప్రతిపాదించారు. దానిని సభ మూజువాణితో ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఆయన సస్పెన్షన్‌కు గురై ఉన్నందున దీనినే ఆయన అనుచిత వ్యవహారానికి శిక్షగా భావించి వదిలివేయాలని సభ్యులు తీర్మానంలో సూచించారు. తీర్మానానికి ముందు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ మాట్లాడుతూ రాఘవ్ ఛద్దా రెండు అభియోగాలతో దోషి అని తేలిందని, దీనికి ముందు పూర్తి స్థాయి విశ్లేషణాత్మక పరిశీలన జరిగిందని తెలిపారు. …
మూడు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇది కాంగ్రెస్ పార్టీ ఓటమేనని, ప్రజలది కాదన్నాని స్పష్టం చేశారు. ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, ఇండియా ప్రతిపక్ష కూటమిలో గుబులు రేపింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సొంతంగా ఎన్నికల్లో పోరాడాలన్న నిర్ణయం ఓట్ల విభజనకు ఎలా దారితీసిందో మిత్రపక్షాలు గుర్తుచేస్తున్నాయి. ఇండియా కూటమిలో ఇతర పార్టీలతో సీట్ల పంపకం లేకపోవడం వల్లే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విశ్లేషించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ ఓటమిపై స్పందిస్త ప్రాంతీయ పార్టీలు తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీపై పోరాటానికి నాయకత్వం వహించాలని సూచించారు. మూడు రాష్ట్రాల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య పొత్తు లేకపోవడం వల్లే నష్టపోయినట్లు తెలిపారు. తెలంగాణను కాంగ్రెస్ గెలుచుకుందని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్,…
మిజోరాం లో మాజీ ఐపీఎస్ అధికారి 74 ఏళ్ల లాల్ దహోమా జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎమ్) మొత్తం 40 సీట్లలో 27 సీట్లను గెల్చుకొని అధికారం చేబట్టనుంది. అధికార మిజో నేషనల్ ఫ్రెంట్ (ఎమ్ఎన్ఎఫ్) అత్యంత దారుణంగా ఓటమి పాలైంది. మరీ ముఖ్యంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జోరంథంగ తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. ఎమ్ఎన్ఎఫ్లో చాలా మంది అభ్యర్థులు తమ డిపాజిట్లను కూడా కోల్పోయారు. మెజారిటీకి కావాల్సిన సీట్లు 21. మ్యాజిక్ ఫిగర్‌ని ఆరు పార్టీల విపక్ష కూటమి జెడ్పీఎం (జోరం పీపుల్స్ మూవ్‌మెంట్) సునాయాసంగా అందుకుంది. అధికార పక్షం ఎమ్ఎన్ఎఫ్ 10 సీట్లకు పరిమితమైంది. జాతీయ పార్టీలైన బిజెపి 2, కాంగ్రెస్ 1 సీట్లకు పరిమితమయ్యాయి. ఈ దఫా ఎన్నికల్లో ఎమ్ఎన్ఎఫ్, జెడ్పీఎంలు, కాంగ్రెస్ పార్టీలు 40 సీట్లల్లో పోటీ చేశాయి. బీజేపీ కేవలం 13 చోట్ల బరిలో దిగింది. జాతీయ పార్టీగా శక్తివంతంగా ఎదగాలని…
తెలంగాణ 119 నియోజకవర్గాల కు సంబదించిన పోలింగ్ నవంబర్ 30 న జరుగగా ఆదివారం ఫలితాలు వెల్లడయ్యాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేసిన అధికారులు, ఆ తర్వాత ఈవీఎం లెక్కింపు మొదలుపెట్టారు. ఈ లెక్కింపు లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించగా, బిఆర్ఎస్ 39 , బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 7, సిపిఐ 1 స్థానాల్లో విజయం సాధించారు. ఈ 119 నియోజకవర్గాల్లో ఏ పార్టీ వారు ఏ ఏ నియోజకవర్గం నుండి విజయం సాధించారో చూద్దాం: బిఆర్ఎస్ విజేతల లిస్ట్ : గజ్వేల్ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ముషీరాబాద్ ముఠా గోపాల్‌కరీంనగర్ గంగుల కమలాకర్శేరిలింగపల్లి అరికెపూడి గాంధీకూకట్‌పల్లి మాధవరం కృష్ణారావుబోథ్ అనిల్ జాదవ్‌సిరిసిల్ల కేటీఆర్సిద్దిపేట – హరీష్ రావుజనగాం – పల్లా రాజేశ్వర్సూర్యాపేట జగదీష్ రెడ్డిమహేశ్వరం సబితా ఇంద్రారెడ్డిమేడ్చల్ మల్లారెడ్డినర్సాపూర్ సునీతా లక్ష్మారెడ్డిబాన్సువాడ పోచారం శ్రీనివాస్ రెడ్డిభద్రాచలం తెల్లం వెంకట్రావ్‌సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌అంబర్‌పేట కాలేరు…
మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అంతేగాక, కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. అవినీతి, కుటుంబ రాజకీయాలను ప్రజలు సహించరని పేర్కొంటూ వారి ఆగ్రహం ఈ ఎన్నికలలో బైటపడిన్నట్లు ప్రధాని విపక్షాలపై విరుచుకుపడ్డారు. 60 ఏళ్ల పాలనలో ఆదివాసీలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన విజయోత్సవ సభకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. మూడు రాష్ట్రాల గెలుపు గ్యారంటీతో 2024 సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అన్ని కులాలు, ప్రాంతాలు,…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ తప్ప మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరాభవం ఎదురయ్యింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవ్వాలని భావిస్తోన్న కాంగ్రెస్ ఆశలకు గండిపడినట్లయింది. మూడు రాష్ట్రాల విషయానికి వస్తే మధ్యప్రదేశ్‌లో అధికారం తమదేనని నమ్మకంతో ఉన్న కాంగ్రెస్‌కు అక్కడ ఫలితాలు ఆ పార్టీకి మింగుడపడటం లేదు. గత ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్‌కు జ్యోతిరాదిత్య సింధియా ఝలక్ ఇచ్చారు. తన వర్గానికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేశారు. దీంతో 14 నెలల్లోనే కమల్‌నాథ్ సర్కారు కూలిపోగా.. మళ్లీ అక్కడ బీజేపీ అధికారం చేపట్టింది. బీజేపీ కుట్రలతోనే తమ ప్రభుత్వం కూలిపోయిందని, ఈసారి స్పష్టమైన మెజార్టీతో అధికారం చేపడతామని కాంగ్రెస్ నాయకులు అతివిశ్వాసం ప్రదర్శించారు. కానీ, బీజేపీ వ్యూహాలకు హస్తం నేతలు చిత్తయ్యారు. అనూహ్యంగా కేంద్ర మంత్రులను, ఎంపీలను పోటీకి నిలిపి స్థానిక…
మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక వెల్లువ తీవ్ర ఉత్కంఠ మధ్య ఆదివారం వెల్లడైన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, రాజస్థాన్, మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బిజెపి గెలిచింది. వీటిలో రాజస్థాన్; ఛత్తీస్‌గఢ్‌లను ఆ పార్టీ కాంగ్రెస్ నుండి కైవసం చేసుకుంది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు గానూ 64 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కసరత్తు ప్రారంభించింది. వరుసగా రెండు ఎన్నికల్లో గెలుపొందిన బిఆర్‌ఎస్ తాజా ఎన్నికల్లో 39 సీట్లకే పరిమితమైంది. దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్ తన పదవికి రాజీనామా చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యేంతవరకు ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ తమిళిసై ఆయన్ను కోరారు. మరోవైపు గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ అగ్రనేతలు ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలియచేస్తూ లేఖను అందచేశారు. సోమవారం ఉదయం కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. తెలంగాణలో బిజెపికి 8స్థానాలు దక్కాయి. ఎంఐఎం ఏడు…
తెలంగాణ ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్‌ను తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడంతో ఈసీ సీరియస్ అయింది. పూర్తి స్థాయి ఫలితాలు రాకముందే రేవంత్ రెడ్డిని కలిసినందుకు ఆయనపై చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అంజనీ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై అదనపు డీజీలు సందీప్ కుమార్ జైన్, మహేశ్ భగవత్‌కు కూడా ఈసీ నోటీసులు జారీ చేసింది. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్న క్రమంలో డీజీపీ అంజనీకుమార్, ఇద్దరు అదనపు డీజీలు రేవంత్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. ఇది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమేనని ఈసీ చర్యలు తీసుకుంది. ఆయన నుంచి వివరణ కూడా కోరింది. అంజనీ కుమార్‌ను డీజీపీగా…
* తెలంగాణాలో కాంగ్రెస్ విజయంనాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో భాగంగా ఉత్తరాదిన ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ లలో కాంగ్రెస్ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. సాయంత్రం 5 గంటలకు వెలువడ్డ ఫలితాల ప్రకారం ఈ మూడు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ వ్యతిరేక ఫవనాలు వీస్తున్నాయి. బిజెపి ఘనవిజయాలు సాధించి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నది. మధ్యప్రదేశ్ లోని 230 సీట్లలో బిజెపి 167 సీట్ల వరకు గెల్చుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ 67 సీట్లకే పరిమితం కానుంది. బిజెపికి ఆ ఇన్ని సీట్లు రావడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ లో సహితం ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 200 సీట్లలో 101 సీట్లకు మించి 121 సీట్ల మేరకు బిజెపి గెల్చుకొంటున్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ 64 సీట్లకు పరిమితం అవుతుంది. కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలను తలకిందులు చేస్తూ 90 సీట్లలో…