Author: Editor's Desk, Tattva News

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. తనపై ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్‌ను క్వాష్ చేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరారు.  సోమవారం ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రత్యేకంగా మెన్షన్ చేసి, వెంటనే విచారణ చేపట్టాలని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. దర్యాప్తు తుది దశలో ఉన్నందున కేసులో జోక్యం చేసుకోలేమంటూ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌‌ను శుక్రవారం ఏపీ హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. చంద్రబాబు సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, విజయవాడ ఏసీబీ కోర్టు తనకు జ్యుడిషియల్‌ రిమాండు విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. భజన్‌లాల్‌ కేసు మొదలు నిహారిక ఇన్‌ఫ్రా…

Read More

ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్ఎఫ్‌జే) సంస్థ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌కు చెందిన ఆస్తులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) జప్తు చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద పంజాబ్‌లోని చండీగఢ్, అమృత్‌సర్‌లో  ఆయనకు చెందిన ఆస్తుల వద్ద జప్తు నోటీసులు ఉంచింది.  చండీగఢ్‌లోని నివాసంతోపాటు అమృత్‌సర్‌లోని పూర్వీకుల గ్రామమైన ఖాన్‌కోట్‌లో గురుపత్వంత్ సింగ్‌కు చెందిన వ్యవసాయ భూమిని కూడా ఎన్‌ఐఏ జప్తు చేసింది. పన్నూన్‌ తండ్రి మొహిందర్ సింగ్ గతంలో తరన్ తరణ్‌లోని పట్టి సబ్ డివిజన్‌లోని నాథూ చక్ గ్రామంలో నివసించాడు. దేశ విభజన తర్వాత అమృత్‌సర్‌లోని ఖాన్‌కోట్ గ్రామానికి ఆ కుటుంబం మారింది. కాగా, గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌, సిక్కులకు ప్రత్యేక ఖలిస్థాన్‌ కోసం వేర్పాటువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారాలు చేయడంతోపాటు పంజాబ్‌లోని సిక్కు యువకులను మిలిటెన్సీలో చేరడానికి ప్రేరేపిస్తున్నాడు.  ఈ నేపథ్యంలో 2020 జూలైలో గురుపత్వంత్ సింగ్‌ను…

Read More

కెనడా-భారత్‌ వివాదంలో అగ్రరాజ్యం అమెరికా నెమ్మదిగా స్వరం మారుస్తున్నది. ఇరుదేశాల మధ్య పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు ఇటీవల పేర్కొన్న అమెరికా తాజాగా కెనడా వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తున్నది. విచారణలో భారత్‌కు ఎటువంటి మినహాయింపులు ఉండవని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సలివాన్‌ తెలిపడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం నిజ్జర్‌ హత్య అంశాన్ని ప్రధాని మోదీ వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తున్నది. దీంతో అమెరికా స్వరం మారుస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. కెనడా-భారత్‌ మధ్య నెలకొన్న వివాదంపై సలివాన్‌ స్పందించారు. ‘భారత దౌత్యవేత్తలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. భారత్‌కు ప్రత్యేకమైన మినహాంపులు ఏం ఉండవు. కెనడాతో మాకు విభేదాలు లేవు. కెనడాతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉంటాం’ అని ఆయన పేర్కొన్నారు. జీ20 సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిజ్జర్‌ హత్య అంశాన్ని ప్రధాని మోదీతో భేటీలో ప్రస్తావిచించినట్టు బ్రిటన్…

Read More

కర్ణాటకలో గత కొన్ని రోజులుగా తలెత్తిన సస్పెన్స్‌కు ఎట్టకేలకు ముగింపు లభించింది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న జనతాదళ్ సెక్యులర్ -జేడీఎస్ పార్ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో చేరింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఎన్డీఏలో చేరుతున్నట్లు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రకటించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా పాల్గొన్నారు. కేంద్రమంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లి సమావేశమైన హెచ్‌డీ కుమారస్వామి ఆయనకు శాలువా కప్పారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా, అమిత్ షా, కుమారస్వామి కలిసి కొద్దిసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పొత్తులు, లోక్‌సభ ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య కర్ణాటకలో సీట్ల పంపిణీ విషయంలో వీరు ముగ్గురు చర్చించినట్లు విశ్వసనీయ…

Read More

లోక్‌స‌భ‌లో చంద్ర‌యాన్‌-3 మిష‌న్ స‌క్సెస్‌పై చ‌ర్చ సంద‌ర్బంగా బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు పార్టీ ఎంపీ ర‌మేష్ బిధురికి బీజేపీ శుక్ర‌వారం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అభ్యంత‌ర‌కర వ్యాఖ్య‌లు చేసినందుకు 25 రోజుల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆయ‌నను పార్టీ కోరింది.  ముస్లిం ఎంపీపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ర‌మేష్ బిధురిని స్పీక‌ర్ ఓంబిర్లా తీవ్రంగా మంద‌లించారు. మ‌రోసారి ఇలా జ‌రిగితే క‌ఠిన చర్య‌లు చేప‌డ‌తామ‌ని ఆయ‌నను హెచ్చ‌రించారు.  తమ ఎంపీ ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ సభాపక్ష ఉపనాయకుడిగా రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ లోక్ సభకు క్షమాపణలు కూడా చెప్పిన్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించారు.  కాగా, బీజేపీ ఎంపీ ర‌మేష్ బిధురి త‌న‌పై చేసిన అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల ప‌ట్ల బీఎస్పీ నేత‌, లోక్‌స‌భ ఎంపీ డానిష్ అలీ మ‌న‌స్తాపానికి లోన‌య్యారు.బీజేపీ ఎంపీపై చ‌ర్య‌లు చేప‌ట్టని ప‌క్షంలో తాను లోక్‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తాన‌ని స్ప‌ష్టం…

Read More

ఆసియా క్రీడల ఆరంభం సందర్భంగా  ఆతిథ్య చైనా, భారత్ దేశల మధ్య పెను వివాదం నెలకొంది. ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు వుషు క్రీడాకారులకు చైనా ప్రభుత్వం వీసాను నిరాకరించింది. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వుషు అథ్లెట్లను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా చైనా ప్రభుత్వం అడ్డుకుంది.  ఇక చైనా వెఖరీని నిరసిస్తూ కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసియా క్రీడల ఆరంభోత్సవ వేడుకల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరింధమ్ బాగ్చి శుక్రవారం అధికారికంగా వెల్లడించారు.  చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో వుషు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులను ఆతిథ్య దేశం చైనా వీసాను నిరాకరించడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన అరుణాచల్‌ ప్రదేశ్‌ క్రీడాకారులకు వీసాను చైనా నిరాకరించి, ఆసియా క్రీడల్లో వారు పాల్గొనకుండా అడ్డుకున్నది.  దానితో నిరసనగా,…

Read More

దేశంలో ఏ రాష్ట్రాని లేనంతగా తెలంగాణ నుంచి మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించబోతోంది. ఇప్పటికే సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్- విశాఖపట్టణం వందేభారత్ రైలును, ఉగాది కానుకగా సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలును కేంద్రం ప్రారంభించగా, ఇప్పుడు వినాయక నవరాత్రుల కానుకగా కాచిగూడ- బెంగళూరు మధ్య మూడవ వందేభారత్ రైలును ప్రారంభిచనుంది. 24 తేదీనుంచి కాచిగూడ (హైదరాబాద్)- యశ్వంత్‌పూర్ (బెంగళూరు) మధ్య వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. మొదటిరోజు ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు కాచిగూడలో ఈ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు వర్చువల్‌గా ప్రారంభిస్తారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రతిరోజూ (బుధవారం మినహా) కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు రైలు బయలుదేరుతుంది. మహబూబ్‌నగర్ (6.59), కర్నూల్ సిటీ (8.39), అనంతపూర్ (10.54) స్టేషన్లలో ఆగుతూ…

Read More

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.  ఈనెల 19న ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. మరోవంక, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టిడిపి అధినేత చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజమహేంద్రవరం జైలులోనే విచారణ చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. కాగా, బుధవారం మధ్యాహ్నం వరకూ వాదలు జరిగాయి.…

Read More

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సవాళ్లు, సస్పెన్షన్లతో ప్రారంభమైనాయి. తొలిరోజైన గురువారం నాడే టిడిపి సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడింది. చంద్రబాబు అరెస్టుపై ఉభయ సభల్లోనూ టిడిపి సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలు తిరస్కరణకు గురైనాయి. దీంతో వాటిపై చర్చకు టిడిపి సభ్యులు పట్టుబట్టారు. శాసనసభలో స్పీకర్‌ పోడియం చుట్టుముట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైసిపి రెబల్‌ సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, టిడిపి సభ్యులు అనగాని సత్యప్రసాదు స్పీకర్‌పోడియంపైకి వెళ్లారు. స్పీకర్‌ మైక్‌ను పీకేశారు. టేబుల్‌పై ఉన్న గ్లాసు కూడా పలిగింది. వారిద్దరినీ సెషన్‌ మొత్తం సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ రూలింగు ఇచ్చారు. ఆ సమయంలోనే వైసిపి సభ్యులకు, బాలకృష్ణకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాలకృష్ణ చూస్తుండగా వైసిపి సభ్యులు తొడకొట్టారు. దీనికి స్పందించిన బాలకృష్ణ మీసం తిప్పారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ‘రా.. చూసుకుందాం’ అనడం వినిపించింది. ఈ దశలోసభలో ఉన్న…

Read More

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సీఐడీ నమోదు చేసిన స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ స్కాంపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సీఐడీ, ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్‌, డిజైన్‌టెక్‌ సంస్థ, ఆ సంస్థ ఎండీ వికాస్‌ ఖన్వేల్కర్‌, స్కిల్లర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌, సీమెన్స్‌ మాజీ ఎండీ సుమన్‌ బోస్‌, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా 44మందిని తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో…

Read More