Author: Editor's Desk, Tattva News

యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం టీటీడీ ఉద్యోగులు అంకితభావంతో పని చేయాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. తిరుమల గోకులం విశ్రాంతి గృహం ఆవరణలో మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఈవో జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు.  ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనానికి విచ్చేసే యాత్రికులకు టీటీడీ ఉద్యోగులు అంకితభావంతో మరింత మెరుగైన సేవలందించాలని, ప్రతి ఒక్కరు మధుర స్మృతులతో తిరిగి వెళ్లేలా చూడాలని పిలుపునిచ్చారు. శ్రీవారికి యాత్రికులు సమర్పించిన హుండీ కానుకలను లెక్కించేందుకు ఆలయం వెలుపల నూతన పరకామణి భవనాన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాట్ను చేసినట్లు చెప్పారు. శ్రీవారి అనుగ్రహంతో హుండీలను సులభంగా పరకామణి భవనంలోనికి తరలిస్తున్నట్లు తెలిపారు.  పరకామణిని మరింత సులభతరం చేసేందుకు కాయిన్స్‌ వేరుచేసే మిషన్‌, కరెన్సీ కౌంటింగ్‌, ప్యాకింగ్‌ మిషన్లు త్వరలోనే వస్తాయని ధర్మారెడ్డి వెల్లడించారు. టీటీడీ అన్నదానం ట్రస్టు ద్వారా ప్రతి రోజు 2…

Read More

బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్‌కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘నా హృదయం.. పౌరసత్వం.. రెండూ భారతీయమే.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు’ అని ఆయన పేర్కొన్నారు. తనకు కెనడా పౌరసత్వం ఉందన్న విషయాన్ని అక్షయ్ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.  తాను కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాన్ని అక్షయ్ కుమార్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘1990లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నా. వరుసగా 15 సినిమాలు పరాజయం పాలయ్యాయి. కెనడాలో ఉన్న స్నేహితుడి సలహా మేరకు అక్కడికి వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు.  `అందుకోసమే పాస్‌పోర్ట్‌కు అప్లరు చేశా. అప్పుడే కెనడా పాస్‌పోర్ట్‌ వచ్చింది. అంతలోనే అప్పటికే నటించిన రెండు సినిమాలు భారత్‌లో ఘన విజయం సాధించడంతో అక్కడికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఈ క్రమంలోనే పాస్‌పోర్ట్‌ విషయం మరిచిపోయా. అందుకే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నా’ అని…

Read More

వివాదాస్పద ‘సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం’ను ఈ ఏడాది చివర్లోగా సంపూర్ణంగా ఉపసంహరిస్తామని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ప్రస్తుతం అస్సాంలోని 8 జిల్లాల్లో మాత్రమే ఆ చట్టం అమల్లో ఉందని చెప్పారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జండా వందనం చేసిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా జిల్లాల్లో ఈ చట్టాన్ని ఉపసంహరించామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ చట్టాన్ని కొనసాగించాలని గత ప్రభుత్వాలు దాదాపు 62 సార్లు కేంద్రాన్ని కోరాయని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు చాలా మెరుగయ్యాయని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 8 వేల మంది జనజీవన స్రవంతిలోకి, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొరవతో మొత్తం ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు…

Read More

రష్యా దక్షిణ ప్రాంతంలోని డాగేస్తాన్‌లోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో  మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల్లో కొందరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్ప‌టి వరకు మొత్తం మృతుల సంఖ్య 35కు పెరిగింది. మరో 102 మంది గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. మంగళవారం ఉదయం 6.00 గంటల సమయంలో లోని మఖచ్‌కాలాలో పేలుడు సంభవించిందని డగెస్టాన్‌ రీజియన్‌ హెడ్‌ సెర్గీ మెలికోవ్‌ తెలిపారు.  గ్యాస్‌ స్టేషన్‌ పేలుడుకు ముందే దానికి ఎదురుగా ఉన్న కార్ల సర్వీసింగ్‌ సెంటర్‌లో పేలుడు సంభవించిందని, ఆ మంటలు చుట్టూ 600 మీటర్ల పరిధి వరకు విస్తరించాయని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే గ్యాస్‌ స్టేషన్‌కు మంటలు అంటుకుని ఇంధన ట్యాంకులు పేలిపోయాయని మెలికోవ్‌ చెప్పారు. గ్యాస్‌ స్టేషన్‌లోని మొత్తం 8 ఇంధన ట్యాంకుల్లో 2 ట్యాంకులు పేలిపోయాయన్నారు.…

Read More

తెలంగాణ సమాజాన్ని మద్యానికి బానిసలుగా చేసిన ఘనత సిఎం కేసీఆర్‌కు దక్కుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆరోపించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ తెలంగాణలో ఒకే కుటుంబానికి మెజార్టీ మంత్రిత్వ శాఖలు దక్కాయని, ఒక కుటుంబం చేతిలో తెలంగాణ రాష్ట్రం బందీగా మారిందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ దోపిడికి గురవుతోందని మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా అవినీతికి పాల్పడుతున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. వేల కోట్ల రుపాయలు అప్పుగా తెచ్చి వాటిలో కమిషన్ల రూపంలో దోచుకుంటోందని, దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఫైనాన్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని వేల కోట్ల రుపాయలు అక్రమంగా సంపాదించుకున్నారో తెలంగాణ ప్రజానీకం అంతా చూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం 30 పర్సెంట్ వాటాలు కుటుంబానికి వెళుతున్నాయని, ప్రశ్నించే గొంతుల్ని నొక్కి, పౌర హక్కుల్ని కాలరాస్తున్నాయని ఆరోపించారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు తెలిపే…

Read More

ప్రపంచ దేశాలన్నీ భారత్‌ వైపు చూస్తున్నాయని, గత పదేళ్లలో భారత్‌ ఎంతో వేగంగా అభివఅద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ … వరుసగా పదోసారి ప్రధాని మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రసంగిస్తూ గత పదేళ్లుగా భారత్‌ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోందని చెప్పారు. శాటిలైట్‌ రంగంలో మనమే ముందున్నామన్నామని చెబుతూ రాబోయే కాలాన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాసిస్తుందని చెప్పారు. 30 ఏళ్ల లోపు యువత భారత్‌కు ఆశాకిరణం అని, వ్యవసాయ రంగంలోనూ దేశం చాలా అభివఅద్ధి చెందిందని ప్రధాని తెలిపారు. డెమోగ్రఫీ, డెమోక్రసీ, బయోడైవర్సిటీ ఈ మూడు భారత్‌కు ఎంతో ముఖ్యమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. నారీ శక్తి, యువశక్తి భారత్‌కు బలం అని, భారత్‌లో యువశక్తి ఎంతో అద్భుతంగా ఉందని చెప్పారు. టెక్నాలజీ విషయంలో భారత్‌ ఎంతో మెరుగుపడిందని, డిజిటల్‌ ఇండియా దిశగా భారత్‌ దూసుకెళుతోందని తెలిపారు. …

Read More

దేశ పౌరులంతా సమానులే అని, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, హక్కులు ఇదే దశలో ఈ దేశం పట్ల బాధ్యతలు అందరికీ సమానంగా ఉన్నాయని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ చెప్పారు. దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో రాష్ట్రపతి సోమవారం రాత్రి జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. ప్రజాస్వామ్య ప్రక్రియతో, సంతరించుకున్న సమాన హక్కులతో విశిష్టలతో మనం 2047 టార్గెట్‌ను నిర్ధేశించుకోవల్సి ఉందని రాష్ట్రపతి పిలుపు నిచ్చారు. 2047లోగానే భారత్ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో విశిష్ట స్థానానికి చేరుకోవాలని, ఇదే మన లక్ష్యం కావాలని పేర్కొన్నారు. దేశ పుత్రికలు మరింత పురోగమించాలనేదే దేశ ప్రధమ పౌరురాలిగా తన ఆకాంక్ష అని ఆమె తెలిపారు.  ప్రతి సవాలును వారు అధిగమించే శక్తిని సంతరించుకోవల్సి ఉంటుంది. మన ఆడబిడ్డలు మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే దేశం నిర్ధేశించుకునే ప్రగతి లక్ష్యం మరింత చేరువ అవుతుందని  ముర్ము  స్పష్టం చేశారు. మన ఘనమైన రాజ్యాంగం…

Read More

భారీ వర్షాలు, వరదలు హిమాచల్‌ ప్రదేశ్‌లో బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండ చరియలు ఎక్కడివక్కడ కూలుతున్నాయి. నదులు, వాగులు పొంగుతుండటంతో పలు ప్రాంతాల్లో రైల్వే లైన్లు కొట్టుకుపోయాయి. అధికారిక సమాచారం ప్రకారం సోమవారం సాయంత్రానికి వర్షాలు, వరదలు బారిన పడి 50 మంది మరణించారు. ఇరవై మంది ఆచూకీ తెలియలేదు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.  వర్ష బీభత్సం నేపథ్యంలో స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా మంగళవారం నాడు ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని నగరం సిమ్లాలోని సమ్మర్‌హిల్‌ వద్ద సోమవారం ఉదయం శివాలయం ఒకటి కూలిపోయింది. ఈ ఆలయ శిధిలాల్లోంచి సాయంత్రానికి తొమ్మిది మంది మృతదేహాలను వెలికి తీశారు. మరికొందరు శిధిలాల కింద ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.  ఫాగ్లి ప్రాంతంలోని రబల్‌ వద్ద మరో ఆలయం కూడా కూలిపోయింది. ఈ శిధిలాల కింద చిక్కుకుని ఐదుగురు మరణించారు. రెండు చోట్ల పెద్ద ఎత్తున సహాయ…

Read More

చంద్రుడి అధ్య‌య‌నం కోసం చంద్ర‌యాన్ ప్రాజెక్టును ఇస్రో చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. దానిలో భాగంగానే ఇటీవ‌లే చంద్ర‌యాన్‌-3 స్పేస్‌క్రాఫ్ట్‌ను కూడా ప్ర‌యోగించింది. ప్ర‌స్తుతం ఆ స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి క‌క్ష్య‌లో ఉంది. ఇక ఇప్పుడు భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ మ‌రో చ‌రిత్ర‌కు శ్రీకారం చుడుతోంది.  త్వ‌ర‌లో సూర్యుడి అధ్య‌య‌నం కోసం ఆదిత్య ఎల్‌-1 మిష‌న్‌ను చేప‌ట్ట‌నున్న‌ది. అయితే ఆదిత్య ఎల్‌-1 మిష‌న్‌కు చెందిన ఫోటోల‌ను సోమ‌వారం ఇస్రో అప్‌డేట్ చేసింది. బెంగుళూరులో త‌యారైన ఆ శాటిలైట్ ఇప్పుడు శ్రీహ‌రికోటకు చేరుకున్న‌ది. తొట్ట‌తొటి సారి సూర్యుడిని అధ్య‌య‌నం చేసేందుకు ఇస్రో స‌మాయాత్త‌మైంది. సెప్టెంబ‌ర్ మొద‌టి వారంలో ఆదిత్య ఎల్‌-1ను ప్ర‌యోగించే అవ‌కాశాలు ఉన్నాయి.  ఈ మిష‌న్‌లో భాగంగా కేవ‌లం సూర్య‌డిపైనే ఫోక‌స్ పెట్ట‌నున్నారు. సౌర తుఫాన్ల స‌మ‌యంలో జ‌రిగే మార్పుల‌పై స్ట‌డీ చేయ‌నున్నది. ఆ శాటిలైట్ సుమారు 1500 కేజీల బ‌రువు ఉంటుంది.  ఏపీలోని శ్రీహ‌రికోట నుంచి పీఎస్ఎల్వీ ద్వారా ప్ర‌యోగించ‌నున్నారు. సూర్యుడి-భూమి…

Read More

సీఎం కేసీఆర్ భూముల అమ్మకం.ఇళ్ళు కూల్చి పందిరి వేసినట్లు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ధనిక రాష్ట్రం అని చెప్పి పదేపదే బీఆర్ఎస్ నేతలు చెపుతుంటారని, భూముల అమ్మకం అంటే ప్రజలను మోసం చేయడమేనని ధ్వజమెత్తారు.  తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారని, ప్రభుత్వ సొమ్మును ఆగంట్లో అమ్మడం అనేది దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. సంపద సృటించాలి కానీ  అమ్ముకుంటే పోతే వ్యవస్థలు కుప్ప కులుతాయని కేంద్ర మంత్రి హెచ్చరించారు. భూములు అమ్ముకుంటే పోతే వ్యస్థ పతనానికి నాంది అని పేర్కొంటూ సీఎం కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివింది దీనికోసమేనా? అని ప్రశ్నించారు. భవిష్యత్తుకు, భావితరాలకు ఉపయోగపడాల్సిన భూములను అమ్మడం సరైన నిర్ణయం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కార్యాలయానికి 10 ఎకరాలు భూమిని ఇచ్చిందని, ప్రజలకు…

Read More