కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. లోక్‌సభలో ఆయన ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. అయితే ఆ కిస్ ఎవరికి ఇచ్చారన్నది స్పష్టంగా తెలియదు. కానీ అవిశ్వాస తీర్మానంపై ప్రసంగం ముగించే సమయంలో ఆయన ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఇక రాహుల్ తర్వాత అవిశ్వాస తీర్మానంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడారు. రాహుల్ గాంధీ ప్రవర్తన సరిగా లేదని ఆమె ఆరోపించారు. బీజేపీ మహిళా ఎంపీలపై రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బహుశా మంత్రి స్మృతి ఇరానీని టార్గెట్ చేస్తూ రాహుల్ ఆ కిస్సింగ్ సంకేతాలు ఇచ్చి ఉంటాడేమో అని భావిస్తున్నారు. రాహుల్‌పై తీవ్ర చర్యలు చేపట్టాలని బీజేపీ మహిళా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. మోదీ పేరుతో ఉన్న వారంతా దొంగలే అని వ్యాఖ్యలు చేసిన కేసు వల్ల ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన రాహుల్.. సుప్రీం ఆదేశాల తర్వాత సోమవారమే సభలో అడుగుపెట్టారు.…
Author: Editor's Desk, Tattva News
అవిశ్వాస తీర్మానం పై లోక్‌సభలో చర్చ మంగళవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు చర్చ కొనసాగనున్నది. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ మౌనం వహించారని విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఈరోజు చర్చ మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ నేత గౌరవ్ గగోయ్ ఆ చర్చను ప్రారంభించారు. నిజానికి ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ చర్చను ఆరంభిస్తారని ఆశించినా ఆయన ముందుగా ఆ అంశంపై మాట్లాడలేదు. గౌరవ్ గగోయ్ మాట్లాడుతూ బలవంతంగా అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురావాల్సి వచ్చిందని, ఇది సంఖ్యా బలానికి చెందిన విషయం కాదు అని, మణిపూర్‌కు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేయడం కోసమే తాము తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మణిపూర్ కోసం ఈ తీర్మానం తెచ్చామని చెబుతూ మణిపూర్‌కు న్యాయం జరగాలని కోరారు. పార్లమెంట్‌లో మాట్లాడరాదు అని ప్రధాని మోదీ మౌనవ్రతం చేపట్టారని, పేర్కొంటూఆయన…
ప్రతిష్ఠాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత బృందానికి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా నాయకత్వం వహించనున్నాడు. ఆగస్టు 19 నుంచి హంగేరిలోని బుడాపెస్ట్ వేదికగా ప్రారంభం కానున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షి కోసం భారత అథ్లెటిక్స్ సమఖ్య 28 మందితో కూడిన జట్టును ప్రకటించింది. భారత అథ్లెట్ల బృంధాన్ని మరోసారి స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ముందుండి నడిపించనున్నాడు. ఇక మహిళల 100 మీ. హర్డిల్స్‌లో తెలుగు అథ్లెట్ జ్యోతి యర్రాజి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మహిళల విభాగం: జ్యోతి యర్రాజీ (100మీ హార్డల్స్, పారుల్ చౌదరీ (3000మీ స్టీప్లే చేస్), షైలీ సింగ్ (లాంగ్ జంప్), అన్నురాణి (జావెలిన్ త్రో), భావన జట్ (20కీ.మీ. వాక్). పురుషుల విభాగం: క్రిష్ణకుమార్ (800మీ), అజయ్ కుమార్ సరూజ్ (1500మీ), సంతోష్ కుమార్ తమిళశరణ్ (400మీ హార్డల్స్), అవినాష్ ముకుంద్ సబ్లే (3000మీ స్టీప్లే చేస్), సర్వేశ్ అనీల్ కుశరే (హై…
కార్మికుల సంక్షేమానికి జాతీయ భవన, నిర్మాణ కార్మికుల నిధిని ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావనలో ఆయన మాట్లాడుతూ భవన, ఇతర నిర్మాణ కార్మికుల చట్టం 1996లోని నిబంధనల ప్రకారం నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో ఒక శాతం సెస్‌గా సేకరిస్తాయని చెప్పారు. అలా సేకరించిన డబ్బు కేంద్ర చట్టాల ప్రకారం కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర నిర్మాణ కార్మికుల బోర్డులకు బదిలీ చేయట్లేదని ఆరోపించారు. 5 కోట్ల మంది భవన, ఇతర నిర్మాణ కార్మికులు వివిధ రాష్ట్ర నిర్మాణ కార్మికుల బోర్డులలో పేర్లు నమోదు చేసుకున్నారని, అయితే విద్యా సహాయం, వివాహం, ప్రసూతి ప్రయోజనాలు, వైద్య సహాయం కోసం అర్హులైన వారి సంక్షేమ ప్రయోజనాల కోసం లక్షల క్లెయిమ్‌లు రాష్ట్ర కార్మికుల బోర్డులలో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల నుంచి…
రెండో విడత ‘భారత్ జోడో యాత్ర’ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి విడతలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కొనసాగిన విషయం తెలిసిందే. రెండో విడతలో ఈ భారత్ జోడో యాత్ర గుజరాత్ నుంచి ప్రారంభమై మేఘాలయ వరకు కొనసాగనుంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నానా పటోలే వెల్లడించారు. రెండో విడత భారత్ జోడో యాత్రకు సమాంతరంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పాద యాత్ర నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్రను చేపట్టనున్నారన్న విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జై రామ్ రమేశ్ వెల్లడించారు. ఈ యాత్ర గుజరాత్ లో మహాత్మా గాంధీ జన్మస్థలమైన పోర్ బందర్ నుంచి ప్రారంభమవుతుందని, అరుణాచల్ ప్రదేశ్ లోని పాసిఘాట్ వరకు ఈ యాత్ర కొనసాగుతుందని ఆయన గతంలో…
అనుచితంగా ప్రవర్తిస్తూ, సభాధిపతి సూచనలను పాటించని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ను పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మిగిలిన కాలమంతా రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన మంగళవారం పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తి మాట్లాడటానికి ప్రయత్నించినపుడు రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ స్పందిస్తూ, ఏ నిబంధన ప్రకారం మాట్లాడాలనుకుంటున్నదీ చెప్పాలని కోరారు. అందుకు ఒబ్రెయిన్ బదులిస్తూ, రూల్ 267 అని చెప్పారు. ఒబ్రెయిన్, ధన్‌కర్ మధ్య సోమవారం కూడా వాగ్వాదం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీ సర్వీసెస్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వెంటనే టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. దేశ రాజధాని ఢిల్లీ నగర ప్రాంత ప్రభుత్వ సవరణ బిల్లు, 2023పై చర్చ సందర్భంగా సభా మర్యాదలను తలక్రిందులు చేస్తున్నారని డెరెక్‌పై ధన్‌కర్ మండిపడ్డారు. ఒబ్రెయిన్ మంగళవారం పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను…
పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కొద్దిసేపటి ముందు జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. ఈ విషయంలో చివరి బంతికి సిక్స్ కొడతామని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ప్రవేశపెట్టిన తీర్మానం.. వారికి ఓ కార్యక్రమం మాత్రమే. కానీ ఇది మనకు మంచి అవకాశం. అవినీతి, కుటుంబ రాజకీయాలకు అతీతంగా భారతదేశాన్నిఉంచాలన్న ఎన్‌డీఏ నినాదం అలానే ఉంది”అని ప్రధాని పేర్కొన్నారు. అది అహంకారుల కూటమి అని, అహంకారులను ఐక్యంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. అది 2024 ఎన్నికలకు సెమీ ఫైనల్స్ వంటిదని వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఇండియా కూటమి పరాజయం పాలైందని మోదీ…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి రాజకీయ పునరావాసం కాకూడదని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ (ఎక్స్)లో ట్వీట్ చేశారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరని ఆమె స్పష్టం చేశారు. ఇంతకుముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని నియమించిందని, ఈ విషయంపై గళం విప్పిన తర్వాత 52 మంది నియామకం నిలిపి వేశారని ఆమె గుర్తు చేశారు. అంటే ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తోందని అర్థమవుతోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మంపై నమ్మకం ఉన్న వారిని, హిందూధర్మం అనుసరించే వాళ్ళని నియమించాలని ఆమె స్పష్టం చేశారు. కాగా, టీటీడీ చైర్మన్‌గా వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన…
కాంగ్రెస్ పార్టీ చైనా ఇతర జాతి వ్యతిరేక శక్తులతో కుమ్మక్కు అయిందని, న్యూయార్క్‌టైమ్స్ వార్తాకథనంలో ఈ విషయం వెల్లడించారని బిజెపి విమర్శించింది. చైనా, ఇక్కడి కాంగ్రెస్, భారతీయ న్యూస్ వెబ్‌సైట్ న్యూస్‌క్లిక్ ఈ మూడు భారత వ్యతిరేకత, విద్వేషాల పేగుబంధం సంతరించుకున్నాయని స్పష్టం అయిందని బిజెపి సోమవారం పేర్కొంది. లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణ తరువాత రాహుల్ గాంధీ లోక్‌సభలోకి రాగానే బిజెపి ఎంపి నిశికాంత్ దూబే లేచి న్యూయార్క్ టైమ్స్ కథనం గురించి ప్రస్తావించారు. తుక్డే తుక్డే గ్యాంగ్, మీడియాలోని కొన్ని వర్గాలు కలిసి భారత వ్యతిరేక విదేశీ శక్తులతో కలిసి పనిచేస్తున్నాయని పేర్కొంటూ ఇది ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు తరచూ విదేశీ ప్రతినిధులతో మాట్లాడుతున్నారని, ప్రత్యేకించి భారత్‌పై విద్వేషం పెంచుకున్న చైనా ఇతర దేశాలతో వారి లింక్‌లు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. సభ్యుడి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఇతర విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. ఆయన వ్యాఖ్యలను…
కీలకమైన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సోమవారం తీవ్రస్థాయి చర్చ అనంతరం రాజ్యసభలో ఓటింగ్‌లో నెగ్గింది. బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 102 ఓట్లు వచ్చాయి. దీనితో ఎగువ సభలో కూడా బిల్లు ఆమోదం దక్కినందున దీనికి పార్లమెంట్ సమ్మతి లభించింది. చట్టం కానుంది. బిల్లుకు నవీన్ పట్నాయక్‌కు చెందిన బిజెడి, జగన్మోహన రెడ్డి సారధ్యపు వైఎస్‌ఆర్‌సిపి మద్దతు తెలిపాయి. మొదటి సారి ఓటింగ్ దశలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రతిపక్షాలు తిరిగి డివిజన్‌కు పట్టుపట్టాయి. తిరిగి ఓటింగ్ జరగగా బిల్లు నెగ్గింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం సాయంత్రం ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాజ్యాంగబద్దమని,ఏ విధంగా కూడా సుప్రీంకోర్టు సంబంధిత విషయంపై వెలువరించిన తీర్పునకు భంగకరం కాదని అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల అధికారాలను కేంద్రం గుప్పిట్లోకి తీసుకువస్తూ కేంద్రం ఇంతకు ముందు తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఇప్పుడు బిల్లు తెచ్చారు. బిల్లు వల్ల…