చెనైలోని ప్రతిష్టాత్మక సంస్థ కళాక్షేత్రంలోని విద్యార్థినీలు అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా నిరసనలు చేస్తున్నారు. కళాక్షేత్రంలోని ఓ అసిస్టెంట్ ప్రొఫెర్, మరో ముగ్గురు ఆర్టిస్టులు లైంగిక వేధింపులకు, బాడీ షేమింగ్, వర్ణ వివక్షకు గురిచేస్తున్నారని పూర్వ విద్యార్థి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ వెలుపుల దాదాపు 200 మంది విద్యార్థినీలు గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో లైంగిక వేధింపులకు గురిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ హరిపద్మన్‌పై ఓ మాజీ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. హరి పద్మన్‌కు వ్యతిరేకంగా ఇవాళ సుమారు రెండు వందల మంది స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. ఆ ప్రొఫెసర్‌ను తమను లైంగికంగా వేధిస్తన్నారని, దుర్భాషలాడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు.కాగా, శుక్రవారం 90 మంది విద్యార్థులు రాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్‌కు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌కు లేఖ రాశారు. ఈ విషయంపై స్టాలిన్ స్పందిస్తూ…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందేందుకు పోరాటం సాగిస్తున్న కీలక రాజకీయ ప్రత్యర్థులుగా భావించే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ , టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లకు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది. పైగా, నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని, ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని ఆమె ప్రతిపాదించారు. ప్రగతి భవన్ మార్చ్ పిలుపు నిద్ధామని పేర్కొంటూ కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆమె స్పష్టం చేశారు. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను రాష్ట్రంలో కేసీఆర్ బతకనియ్యడని షర్మిల హెచ్చరించారు. ఇక షర్మిలకు మద్దతు తెలిపిన బండి సంజయ్ త్వరలో సమావేశమవుదామని తెలిపారు. అటు రేవంత్ కూడా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు. అయితే, జాతీయ స్థాయిలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి కార్యాచరణకు కలసి రావడం రాజకకీయంగా సాధ్యమయ్యే విషయం…
భారత స్టార్ బాక్సర్, రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ శనివారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో నిఖత్ జరీన్ పసిడి పతకం సాధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు వరల్డ్‌కప్ టోర్నీల్లో స్వర్ణాలు సాధించి తెలంగాణ ఆణిముత్యం నిఖత జరీన్ చరిత్ర సృష్టించింది. వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత తొలిసారి సొంత గడ్డపై అడుగు పెట్టిన నిఖత్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. నిఖత్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ చైర్మన్ వేణుగోపాలాచారి, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు చాముండేశ్వరి నాథ్, వివిధ క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. మార్చి 26వ తేదీన ఢిల్లీ…
కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఏప్రిల్ ఒకటో తేదీన జైలు నుంచి విడుదల కాగలరని భావిస్తున్నారు. 1988లో జరిగిన రోడ్డు ఘటనకు చెందిన కేసులో అతను ప్రస్తుతం పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సిద్దూ ట్విట్టర్ అకౌంట్‌లో ఆయన టీమ్ ఈ విషయాన్ని పోస్టు చేసింది. శనివారం సిద్ధూ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు జైలు అధికారులు వెల్లడించినట్లు పేర్కొన్నారు. జైళ్ల అదనపు డిజిపి ఎ చంద్రశేఖ జైలు నుండి విడుదల చేస్తున్నట్లు శుక్రవారం రాత్రి నిర్ధారించారు. వాస్తవానికి రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనను విడుదల చేయాల్సి ఉంది. కానీ ఆయనకు అప్పుడు క్షమాభిక్ష లభించలేదు. రోడ్డుపై దాడి చేసిన కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది. జనవరిలో విడుదల అవుతాడని భావించారు. కానీ సిద్దూ విడుదల ఆలస్యమైంది. జైలు ఫ్యాక్టరీలో పనిచేసినందుకు 60 రోజులు, సత్ప్రవర్తన కలిగి ఉన్నందుకు 30 రోజుల జైలు జీవితాన్ని తగ్గించనున్నారు.…
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు వైసీపీనే కారణమంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.ఈ సందర్భంగా అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా మందడంలో సభను నిర్వహించారు. రైతులకు మద్దతు తెలిపేందుకు సత్యకుమార్ , ఇతర నేతల వాహనాలు సీడ్ యాక్సిస్ రోడ్డు వద్దకు రాగానే అక్కడ ఉన్న 3 రాజధానుల శిబిరం నుంచి పలువురు ఒక్కసారిగా అడ్డుతగిలారు. వాహనాలకు అడ్డంగా నిలబడి 3 రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఈ క్రమంలో బీజేపీ నేతల కార్లపై దాడికి దిగారు. ఈ ఘటనలో సత్య కుమార్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసుల ప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.…
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అందించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. మోదీ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ డిగ్రీలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని ప్రధాన సమాచార కమిషన్ (సీఐసీ) పీఎమ్‌ఓ, గుజరాత్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ యూనివర్శిటీ పీఐఓలకు ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి బీరెన్ వైష్ణవ్‌తో కూడిన ఒక న్యాయమూర్తి ప్యానెల్ తోసిపుచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి డిగ్రీ సర్టిఫికెట్ కు చెందిన వివరాలను, వాటి ప్రత్యేకతలను అందజేయాలని చేసిన అభ్యర్థన గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చడమే కాకుండా, అతనిపై 25 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నిర్ణయాన్ని గుజరాత్ యూనివర్సిటీ అప్పీల్ చేయగా, హైకోర్టు ఇప్పుడు దానిని విచారిస్తోంది. అంతేకాకుండా “ప్రజాస్వామ్యంలో, పదవిలో ఉన్న వ్యక్తి డాక్టరేట్ లేదా నిరక్షరాస్యుడు అనే తేడా ఉండదు. అలాగే, ఈ అంశంలో ప్రజాప్రయోజనాల ప్రమేయం…
రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్పే పర్ లీక్ వ్యవహారంలో లక్షల రుపాయలు చేతులు మారడంతో డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాయనే అంశంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. పేపర్ లీక్ వ్యవహారంపై ఇప్పటికే విపక్షాలు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు లక్షల రుపాయల నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించడంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై ఈడీ దృష్టి సారించింది. టిఎస్‌పిఎస్సీ వ్యవహారంలో నగదు లావాదేవీలు జరిగినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడి కావడంతోఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగబోతోంది.అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించడంతో ఈడీ కేసులు నమోదు చేసేందుకు సిద్దమవుతోంది. కేసు నమోదుకు ఈడీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ వ్యవహారంపై మొదట బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత దాన్ని సీసీఎస్‌కు బదిలీ…
క్రేజ్ ఉన్న సినీ స్టార్స్ చేత పలు సంస్థలు తమ ఉత్పత్తులను ప్రచారం చేయిస్తుంటారు. ఆ ప్రచారం చూసి చాలామంది వాటిని కొనుగోలు చేయడం..వాడడం చేస్తుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆమ్ వే అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. దీన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తప్పుబట్టారు. గొలుసుకట్టు సంస్థలకు ప్రముఖులు ఎవరూ ప్రచారం చేయొద్దంటూ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. సజ్జనార్ తన వృత్తితో పాటు సామాజిక అంశాలపై స్పందిస్తుంటారు..ఈ మేరకు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. ట్విట్టర్ ద్వారా ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. దేశ ఆర్ధిక వ్యవస్థను, సమాజంలోని సామాజిక వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి ఫేక్ సంస్ధలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండొద్దని అభ్యర్ధించారు. సెలబ్రెటీలు ఎవరూ ఇలా చేయవద్దని…
ఏప్రిల్ 8 నుండి అందుబాటులోకి రానున్న సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందేభారత్ రైలు షెడ్యూల్ ను రైల్వే అధికారులు ప్రకటించారు.ఈ రైలు 662 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8.30 గంటల్లోనే చేరుకుంటుంది. ఏప్రిల్ 9న తిరుపతి నుంచి, 10న సికింద్రాబాద్ నుంచి రైలు బయలుదేరనుంది. నిజానికీ రైలును ఏప్రిల్ 8న సికింద్రాబాద్‌లో ప్రారంభిస్తున్నారు. అయితే, ఆ రోజున ప్రయాణికులను అనుమతించరు. ఉదయం 11.30 గంటలకు రైలు సికింద్రాబాద్‌లో బయలుదేరి, అదే రోజు రాత్రి 9 గంటలకు తిరుపతి చేరుకుటుంది. ఒక్క మంగళవారం మాత్రం ఈ రైలు సేవలు అందుబాటులో ఉండవు. టికెట్ చార్జీలను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. సికింద్రాబాద్‌లో ఉదయం 6 గంటలకు రైలు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మధ్యలో నల్గొండ (7.19), గుంటూరు జంక్షన్ (9.45), ఒంగోలు (11.09), నెల్లూరు (12.29) స్టేషన్లలో ఆగుతుంది.తిరుగు ప్రయాణంలో ఈ రైలు మధ్యాహ్నం 3.15…
గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్‌పై ఇప్పటికే చాలా కేసులు నమోదై ఉండగా తాజాగా ముంబై పోలీసులు మరో కేసును నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 29న ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యల చేశారంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆయనపై ముంబై పోలీసులు ఐపీసీ 153 ఏ 1 (ఏ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సకల్ హిందూ సమాజ్ జనవరి 29న ఒక సామాజిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతిని కోరింది. శివాజీ పార్క్ నుంచి దాదర్‌లోని మహారాష్ట్ర స్టేట్ లేబర్ వెల్ఫేర్ బోర్డు వరకు సకల్ హిందూ సమాజ్ ఆధ్వర్యంలో మార్చ్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. మహిళలను దుర్వినియోగం చేయడం, వారి భద్రత, గౌరవానికి ఆటంకం కలిగించడాన్ని నిరసిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. దాదర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. మార్చ్‌కు పోలీసులు…