హెచ్ 3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా వైరస్ దేశంలో క్రమంగా వ్యాప్తి చెందుతున్నది. దీని కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. హర్యానాలో ఒకరు, కర్ణాటకలో ఒకరు మరణించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. దేశంలో సుమారు 90 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదవగా, ఎనిమిది హెచ్1ఎన్1 కేసులను గుర్తించినట్లు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా దేశంలో ఫ్లూ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, వీటిలో అధికంగా హాంకాంగ్ ఫ్లూ (హెచ్3ఎన్2) వైరస్ కారణంగా వస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది. అధిక శాతం మంది ఆస్పత్రిలో చేరుతున్నారని, ప్రస్తుతం దేశంలో హెచ్3ఎన్2, హెచ్1ఎన్1 వైరస్‌లు విస్తృతి కొనసాగుతోందని పేర్కొంది.దగ్గు, చలి జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులు, శ్వాసలో గురక వంటి లక్షణాలతో పాటు వికారం, గొంతు నొప్పి, విరేచనాలు, వాంతులు, తీవ్రమైన అలసట ఈ వైరస్ లక్షణాలుగా పేర్కొంది. ఈ లక్షణాలు వారం రోజులు…
Author: Editor's Desk, Tattva News
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలకమైన అనుమానితుడిగా సిబిఐ భావిస్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం మూడోసారి విచారణకు సిబిఐ ముందు హాజరయ్యే సమయంలో తెలంగాణ హైకోర్టు నుండి భారీ ఊరట లభించింది. ఈ రోజు సిబిఐ అరెస్టు చేయవచ్చని భయపడుతున్న ఆయనకు సోమవారం వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు నుండి ఆదేశం పొందారు. సోమవారం వరకూ ఆయనను అరెస్ట్ చేయొద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సోమవారం విచారణ సమయంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని దర్యాప్తు సంస్థను న్యాయస్థానం ఆదేశించింది. సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. తీవ్రమైన చర్యలంటే ఏంటని న్యాయస్థానం ఆయన్ను ప్రశ్నించింది. అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని కోరుతున్నారా? అని అడిగింది. దీనికి అవినాష్ తరఫున న్యాయవాది స్పందిస్తూ.. సీబీఐ అధికారులు వాంగ్ములం నమోదు చేస్తున్న తీరు పట్ల అనుమానం వ్యక్తం చేశారు.…
లాకప్ డెత్ లు, హింసను అరికట్టేందుకు సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చింది. ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించింది. పోలీస్ స్టేషన్లలోని ఇంటరాగేషన్, లాకప్ రూముల్లో సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ ప్లేసులతో పాటు లాకప్ రూములు, కారిడార్, స్టేషన్ రిసెప్షన్ ఏరియా, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ రూమ్‌లు, వాష్ రూమ్ బయట సీసీ కెమెరాలను అమర్చాలంది. సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ వంటి విచారణ సంస్థల ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ కెమెరాలు పెట్టాలని సూచించింది. కస్టడీలో నిందితులపై హింసను అరికట్టేందుకు సీసీ కెమెరాలతో పాటు ఆడియో రికార్డింగ్ కూడా చేయాలని సూచించింది. కెమెరాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని, నిర్ణీత సమయంలోపల సీసీటీవీ కెమెరాలను అమర్చాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశించింది. ఈ ఏర్పాట్లకు…
తెలంగాణ ప్రభుత్వ హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిర్ణయించారు. దాంతో పాటు హుస్సేన్ సాగర్ పక్కనే స్మృతివనాన్ని జూన్ 2న ప్రారంభించేందుకు సీఎం పచ్చజెండా ఊపారు. అంతకుముందు కొత్త సచివాలయాన్ని సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న భవణ నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు సెక్రటెరీయట్ ప్రారంభతేదీపై అధికారులతో చర్చించారు. మరోవైపు సచివాలయం పక్కనే నిర్మిస్తున్న డా.అంబేడ్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత సచివాలయమంతా పరిశీలించిన సీఎం కేసీఆర్… త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిజానికి ఫిబ్రవరి 17వ తేదీన తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఎమ్యెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా… ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని ప్రకటించింది. తెలంగాణ సచివాలయ భవనాన్ని…
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆమె సోదరుడు, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు చెప్పేవన్నీ అబద్ధాలేనని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీకి వచ్చి మద్యం వ్యాపారం చేసి, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపులు ఇచ్చి, అక్రమంగా సొమ్ము చేసుకుని, ఆపై దర్యాప్తు మొదలుపెట్టగానే తెలంగాణ సమాజం పేరు చెప్పి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భారతీయ జనతా పార్టీ తమను టార్గెట్ చేసిందని చెబుతూ సానుభూతి పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. అన్నా చెల్లెలు మీడియా సమావేశాల్లో చెప్పినవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్న సామెతను తలపిస్తున్నదని విమర్శించారు. “ఢిల్లీకి వెళ్లండి.. అక్కడ మద్యం వ్యాపారం చేసి స్కాం చేయండి.. అక్రమంగా డబ్బులు పోగేసుకోండి అని తెలంగాణ ప్రజలు, ఆడబిడ్డలు మీకేమైనా చెప్పారా? మీ అక్రమ…
భూములను అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని, రాజధానిలో ఒక్క ఎకరం అమ్మినా ఊరుకునేది లేదని అంటూ అమరావతి ప్రాంత రైతులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని నిర్మాణం, అభివృద్ధికి మాత్రమే భూములను వినియోగించాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు రాజధాని ప్రాంతం తుళ్లూరులోని రైతు దీక్షా శిబిరంలో రాజధాని మహిళా రైతులు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని ప్రభుత్వంపై నిరసన తెలిపారు. రాజధానిని విశాఖకు మార్చుతున్నామని పదే పదే ప్రకటించడం, రైతులిచ్చిన భూములను అమ్మకానికి పెట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతేనని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు, వ్యవసాయ కార్మికులు చేస్తున్న దీక్షలు బుధవారంతో 1177వ రోజుకు చేరాయి. సిఆర్‌డిఎ పరిధిలోని నవులూరు సమీపంలోని బైపాస్ రోడ్డు పక్కన పదెకరాలు, దొండపాడు దగ్గర పిచికలపాలెం వద్ద నాలుగెకరాలను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం పట్ల ఆగ్రహం…
ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ గురువారం ఉదయం ఢిల్లీలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. జానే భీ దో యారో, మిస్టర్ ఇండియా చిత్రాలలో పోషించిన హాస్య పాత్రలు సతీష్ కౌశిక్‌కు మంచి పేరు తచ్చాయి. ఢిల్లీలోని ఒక మిత్రుడి ఇంట్లో ఉన్న సమయంలో కౌశిక్ ఛాతీలో నొప్పితో బాధపడినట్ల్లు ఆయన మిత్రుడు అనుపమ్ ఖేర్ తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లాలని తన డ్రైవర్‌ను కౌశిక్ కోరాడని, మార్గమధ్యంలో ఆయనకు గుండెపోటు వచ్చిందని ఖేర్ తెలిపారు. కౌశిక్ హఠాన్మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసినట్లు ఖేర్ ట్వీట్ చేశారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూర్వ విద్యార్థి అయిన కౌశిక్ బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు సంపాదించారు. రాంలఖన్, జమాయ్ రాజా, అందాజ్, ఘర్వాలీ మాహర్‌వాలీ, హద్ కర్దీ ఆప్‌నే తదితర పలు చిత్రాలలో ఆయన నటించారు. రూప్ కీ రాణి…
మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఆంధ్ర ప్రదేశ్ లో తన ఎన్నికల వ్యూహంపై పదునుపెట్టేందుకై జనసేన 10వ ఆవిర్భావ సదస్సును ఈ నెల మచిలీపట్నంలో పెద్ద ఎత్తున జరిపేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నారు. సుమారు ఐదు లక్షల మంది హాజరు కాగలరని భావిస్తున్న ఈ సదస్సులో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ విధానంపై కీలకమైన ప్రకటనలు చేయగలరని భావిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు పై పాలకులు ఏం చేయాలో దిశ నిర్దేశం చేసేలా జనసేన పదవ ఆవిర్భావ సభ ఏర్పాటు చేశామని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మచిలీపట్నంలోసదస్సు ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల ఉమ్మడి కృష్ణాజిల్లా విస్తృస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరం ప్రజల పక్షాన నిలబడి పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా జనసేన ముందు వరుసలో నిలబడి పోరాడింది…
కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా వ్యక్తిగత సహాయకుడు సందీప్ సింగ్‌పై వేధింపుల కేసు నమోదయ్యింది. తన కుమార్తెను చంపుతానని సందీప్ బెదిరించినట్టు బిగ్‌బాస్ ఫేమ్, కాంగ్రెస్ నేత అర్చనా గౌతమ్ తండ్రి ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి తనకు ఎదురైన ఘటనను వివరిస్తూ అర్చన కూడా ఫేస్‌బుక్‌లో వీడియో పోస్టు చేశారు. దీంతో ప్రియాంకా గాంధీ పీఏపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. “ప్రియాంకా గాంధీ అర్చనాను కలవాలని అనుకుంటున్నారని, ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్‌లో జరిగే పార్టీ ప్లీనరీకి రావాలని ఆమెకు సందీప్ సింగ్ చెప్పారు. అక్కడికి వెళ్లిన అర్చనతో సందీప్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతోపాటు ఆమెను చంపేస్తానని బెదిరించాడు” అని మేరఠ్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో అర్చనా గౌతమ్ తండ్రి గౌతమ్ బుద్ధా పేర్కొన్నారు. అంతేకాకుండా తన కుమార్తెను కులం పేరుతో దూషించాడని ఆరోపించారు. ప్రియాంకా గాంధీ వద్ద పనిచేసే సందీప్‌సింగ్, అర్చనా…
తైవాన్ అంశాన్ని ముందుకు తేవడం ద్వారా ఆసియాలో ఉక్రెయిన్ తరహా సంక్ష్షోభాన్ని పునరావృతం చేయాలని చూస్తే సహించేది లేదని చైనా హెచ్చరించింది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పిసి) సమావేశాలు జరుగుతున్న సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ మీడియాతో మాట్లాడుతూ కీలకమైన అంతర్జాతీయ సమస్యలపై చైనా వైఖరిని పునరుద్ఘాటించారు. చైనా-రష్యా బంధం వల్ల ఏ దేశానికి ఎలాంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేశారు. మూడవ పక్షంగా ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, అసమ్మతిని ఎగదోయడం వంటి చర్యలకు తాము పూర్తి వ్యతిరేకమని తెలిపారు. ప్రపంచానికి ద్రవ్యోల్బణం ఇప్పుడొక పెను ముప్పుగా పరిణమించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు తమ ప్రచ్ఛన్న యుద్ధ మనస్తత్వాన్ని వీడాలని, ఈ విషయంలో ప్రజల వాణిని అవి చెవికెక్కించుకోవాలని అయన హితవు పలికారు. తైవాన్ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు ఏ దేశానికి లేదని ఆయన మరోసారి తేల్చి చెప్పారు. తైవాన్…