Author: Editor's Desk, Tattva News

ఉక్రెయిన్‌, రష్యాలు వివాదాన్ని పరస్పర చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలనేది తమ అభిమతమని పేర్కొంటూ శాంతి ప్రక్రియకు సహకారం అందించడానికి భారత్ సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సరల్ ఒలాఫ్ షోల్జ్‌ తో భేటీ అయినా సందర్భంగా ఉక్రెయిన్ -రష్యా యుద్ధం, ప్రపంచంపై దాని ప్రభావం గురించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం, దాని పర్యవసానంగా ఆహారం, ఇంధన భద్రతకు ఎదురవుతున్న సవాళ్లు, జర్మనీ-భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు, పర్యావరణ మార్పు, నూతన సాంకేతికతలు సహా పలు అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం ఒలాఫ్, మోదీలు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ఉగ్రవాదం, వేర్పాటువాదంపై పోరాటంలో భారత్‌, జర్మనీల మధ్య పరస్పర సహకారం ఉంది. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి గట్టి చర్యలు అవసరమని ఇరు దేశాలు నమ్ముతున్నాయి.. ఐరోపాల…

Read More

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం ప్రకటించారు. ఛత్తీస్ ఘడ్ రాయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభల్లో ఈ మేరకు ప్రకటన చేశారు. భారత్ జోడో యాత్ర తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషమని ఆమె చెప్పారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అన్న ఆమె ఈ యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం ఆనందం కలిగించిదని తెలిపారు. పేదల కోసం పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. దేశానికి, కాంగ్రెస్ కు 2024 ఎన్నికలు పరీక్షలాంటివని తెలిపారు. యూపీఏ పాలన తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, అన్ని మతాలు, కులాలు, జెండర్ ప్రజల వాణిని ప్రతిబింబిస్తుందని, అందరి కలలను సాకారం చేస్తుందని ఆమె చెప్పారు. ప్రధానమంత్రి మోదీ, బీజేపీ…

Read More

పశ్చిమబెంగాల్‭లోని కూచ్ బెహార్ పర్యటనకు వెళ్లిన కేంద్ర మంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఆయన పర్యటనను అడ్డుకున్న తృణమూల్ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. కారు అద్దాలు పగులగొట్టి.. మంత్రికి నల్లజెండాలతో నిరసన తెలిపారు. పోలీసులు తృణమూల్ కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నం చేసినా వారు తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు. ఇక ఈ దాడి పై నిళిత్ ప్రమాణిక్ మండిపడ్డారు. ఓ కేంద్ర మంత్రికే రక్షణ లేకపోతే.. సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్ లో ప్రజాస్వామ్యం ఏ స్థితిలో ఉందో అర్థం అవుతుందని ధ్వజమెత్తారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, హింసకు పాల్పడిన వారికి రక్షణ కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. తృణమూల్ కార్యకర్తలు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని కేంద్రమంత్రి నిశిత్ ప్రమాణిక్ హెచ్చరించారు. అక్రమార్కులకు టీఎంసీ ఆశ్రయం ఇస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ పశ్చిమ బెంగాల్ అధికార ప్రతినిధి షమిక్ భట్టాచార్య స్పందించారు.…

Read More

కరోనా విజృంభణ సమయంలో ఆరోగ్య రక్షణ కార్యకర్తల్లో ముందు వరుసలో ఉండి రోగులకు చికిత్స చేసి, వారు కోలుకోవడంలో సహాయం చేసిన నర్సులు ప్రస్తుతం అనేక మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఈ విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ సైకియాట్రిక్‌ నర్సింగ్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం ప్రకార కరోనా చికిత్సలో పాల్గొన్న నర్సులు ప్రస్తుతం అలసట, ఒత్తిడి, నిద్రలేమి, నిరాశతోపాటు భయం, కోపోద్రేకం, ఆందోళన వంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. కరోనా చికిత్స నిర్వహిస్తున్న సమయంలో ఎనలేని మానసిక సంఘర్షణకు గురికావడంతో నర్సులు ప్రస్తుతం వీటితో బాధపడుతున్నారని అధ్యయనం తెలిపింది. భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నర్సులు ఈ రుగ్మతలతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అధ్యయన నివేదికను జి బాలమురుగన్‌, జి రాధాకృష్ణన్‌, ఎం విజయరాణి రూపొందించారు. ఈ అధ్యయనంపై పనాజీలో తాజాగా ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ సైకియాట్రిక్‌ నర్సెస్‌ (ఐఎస్‌పిఎన్‌) ఒక…

Read More

ఉక్రెయిన్‌పై అణ్వాయుధ దాడి చేయకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌ను చైనా, భారత్‌లు ఆపి ఉండొచ్చునని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ భారత్, చైనాలు అడ్డుపడి ఉండకపోతే బహుశా యుద్ధాన్ని ముగించేయడానికి రష్యా అణ్వాయుధాలు ప్రయోగించి ఉండేదని పేర్కొన్నారు. ఆయన ‘ది అట్లాంటిక్’కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయం చెప్పారు. ‘భారత్, చైనాలు అడ్డుపడి ఉండకపోతే వ్లాదిమీర్ పుతిన్ మరింత రెచ్చిపోయి ఉండేవాడు, మాస్కో నుంచి వెలువడిన హెచ్చరికల తీవ్రత అలా ఉండింది…పుతిన్ అణ్వాయుధాలు వాడి ఉండేవాడు’ అని ఆయన చెప్పారు. ‘రష్యాను నివారించమని మేము కోరాము. ఆ విషయంలో కొంత విజయం సాధించామనే అనుకుంటున్నాము. భారత్, చైనాలు రష్యాను నివారించాయి. భారత్, చైనాల ప్రభావం కొంత మేరకు పనిచేసిందనే అనుకుంటున్నాము’ అని ఆయన వివరించారు. భారత్‌తో రష్యాకు దశాబ్దాలుగా స్నేహ సంబంధాలున్నాయి, అయితే ఇప్పుడు అమెరికాతో, ఫ్రాన్స్‌తో కూడా భారత్ స్నేహసంబంధాలను వృద్ధి చేసుకుందని ఆయన…

Read More

లైఫ్‌సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ అగ్రగామిగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఔషధ ఉత్పత్తిలో ఆసియాలోనే హైదరాబాద్‌ అతిపెద్ద నగరమని చెప్పారు. ఈ రంగంలో హైదరాబాద్‌కు 7 ఏళ్లలో రూ.25 వేల కోట్లు వచ్చాయని, ఇక్కడ 800కు పైగా ఫార్మా, బయోటెక్‌ కంపెనీలున్నాయని కేటీ ఆర్‌ తెలిపారు.  హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ లో మూడు రోజుల పాటు జరుగనున్న బయో ఆసియా-2023 సదస్సును శుక్రవారం ఫార్మారంగ దిగ్గజ కంపెనీల సీఈవోలతో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ప్రపంచంలోని టాప్‌-10 ఫార్మా కంపెనీల్లో నాలుగు తెలంగా ణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొ న్నారు. 2030నాటికి లైఫ్‌సైన్సెస్‌ రంగం విలువ రెట్టింపు చేసి 100బిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అయితే 2022లోనే 80బిలియన్‌ డాలర్ల విలు వకు చేరుకున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దీంతో లక్ష్యాన్ని సవరించి 2030 నాటికి 250 బిలియన్‌ డాలర్ల…

Read More

ప్రపంచంలోని బలహీనవర్గాలకు జీ20 దేశాలు బాసటగా నిలవాలని, పేరుకుపోతున్న అప్పులను తగ్గించడంపై ఫోకస్​ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇంటర్నేషనల్​ ఫైనాన్షియల్​ సంస్థలు పరిస్థితులకు తగ్గట్టు తమను తాము మార్చుకోకపోవడం వల్ల వాటిపై నమ్మకం కాస్త తగ్గిందని హెచ్చరించారు. రెండు రోజుల పాటు బెంగుళూరులో జరుగుతున్న జీ20 ఆర్ధిక మంత్రులు, సెంట్రల్​ బ్యాంక్స్​ గవర్నర్ ల సమావేశాన్ని (ఎఫ్​ఎంసీబీజీ) ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడుతూ ప్రపంచంలో కొన్ని చోట్ల యుద్ధాలు జరగడంపై విచారం ప్రకటించారు. అయితే రష్యా–ఉక్రెయిన్​ దేశాల పేర్లను ప్రస్తావించలేదు. విచ్చలవిడిగా అప్పులు చేసుకుంటూ పోవడం వల్ల చాలా దేశాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో పాటు అప్పుల కారణంగా భారత్ చాలా ఇబ్బందుల పాలైందని, శ్రీలంక, పాకిస్తాన్ ​దివాలా తీశాయని చెప్పారు. సాయం కోసం ఐఎంఎఫ్​ వంటి సంస్థలను ప్రాధేయపడుతున్నాయని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి సంస్థలపై నమ్మకం కొద్దిగా పోయింది. ఇవి కాలానుగుణంగా…

Read More

వీధి కుక్కలను కట్టడి చేసేందుకు తెలంగాణ సర్కార్ రంగం సిద్ధం చేసింది. నేపాల్ నుండి క్యాచింగ్ బృందాలను తీసుకొచ్చింది. రాష్ట్రంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని కొన్ని నెలలుగా పిర్యాదులు వస్తున్న పెద్దగా పట్టించుకోని సర్కార్ తాజాగా పెద్ద అంబర్ పేట్ లో చోటుచేసుకున్న ఘటనతో చలనం వచ్చింది. నాలుగేళ్ల బాలుడిని అతి కిరాతకంగా వీధి కుక్కలు కొరికి కొరికి చంపేశాయి. ఈ ఘటన ఫై యావత్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి కుక్కలను కట్టడి చేయాలనీ కోరారు. దీంతో సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే వీధికుక్కల స్వైరవిహారం.. దాడులను అరికట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం టోల్​ఫ్రీ నంబర్​ను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే జీహెచ్​ఎంసీ అధికారులు హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వీధికుక్కలను పట్టుకుని తీసుకువెళ్తున్నారు. అయినా రోజూ ఏదో ఓ చోట ప్రజలపై కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అందుకే దీనికి శాశ్వతంగా ముగింపు పలకాలని…

Read More

హనీ ట్రాప్‌లో చిక్కుకుని పాక్‌ మహిళా ఏజెంట్‌కు సమాచారాన్ని లీక్‌ చేసినందుకుగాను టెస్ట్‌ రేంజ్‌ అధికారిని ఒడిశాలో అరెస్టు చేశారు. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలోని చాందీపూర్‌లోని డిఫెన్స్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డిఆర్‌డిఓ)కి చెందిన సువిశాల క్షిపణి పరీక్ష- మూల్యాంకన కేంద్రం ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటిఆర్‌) సీనియర్‌ ఉద్యోగిని శుక్రవారం అరెస్టు చేశారు. హనీ ట్రాప్‌ అయిన ఆ ఉద్యోగి బాలాసోర్‌ జిల్లా జలేశ్వర్‌ ప్రాంతానికి చెందిన బాబూరామ్‌డే (51)గా పోలీసులు గుర్తించారు. ఐటీఆర్‌ టెలిమెట్రీ విభాగంలో టెక్నికల్‌ ఆఫీసర్‌గా డే పనిచేస్తున్నారు. ”లైంగిక తృప్, ద్రవ్యానికి ఆశపడిన డే పాకిస్తాన్‌ ఏజెంట్‌కు క్షిపణి పరీక్షకు సంబంధించిన రహస్య, అత్యంత సున్నితమైన సమాచారాన్ని అందించినట్లుగా మేము సాక్ష్యాలు సంపాదించాము” అని ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (తూర్పు శ్రేణి) హిమాన్షులాల్‌ తెలిపారు. ఐటిఆర్‌ ఉద్యోగి దేశ వ్యతిరేకిగా గూఢచర్యానికి పాల్పడుతున్నారనే సమాచారం అందుకున్న జిల్లా పోలీసులు అతనిపై నిఘా…

Read More

విశాఖపట్నం తాజాగా రెండు అంతర్జాతీయ సమావేశాలకు సిద్ధమవుతోంది. మార్చి 3, 4 తేదీల్లో విశాఖ ఆంధ్రవిశ్వకళాపరిషత్‌ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ నిర్వహిస్తున్నారు. ఇక అదే నెల 28, 29 తేదీల్లో ప్రతిష్టాత్మకమైన జీ-20 సమావేశాలు రెండు రోజుల పాటు ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఒకే నెలలో రెండు ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్థాయి సమావేశాలు విశాఖలో జరగనుండడంతో విశాఖ నగరపోలీస్‌ కమిషనర్‌ సిహెచ్‌ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 3, 4 తేదీల్లో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుండడంతో పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులంతా నగరానికి తరలి రానున్నారు. ఇప్పటి వరకు 6100 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆరుగురు కేంద్రమంత్రులు, మరో ఆరుగురు రాష్ట్ర మంత్రులు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్తలు హాజరు కానున్నారు. వీరితో పాటు మరో 282 మంది…

Read More