ప్రపంచ కుబేరుల జాబితాలో అదాని స్థానం తాజాగా 25కు పడిపోయిందని ఫోర్బ్స్ రియల్‌టైం బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది. గుజరాత్‌కు చెందిన ఈ పెట్టుబడిదారుడు నెల క్రితం 147 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12 లక్షల కోట్ల పైగా) సంపదతో ప్రపంచంలోనే రెండో స్థానంలో, ఆసియాలో అతిపెద్ద కుబేరుడిగా ఉన్నారు. అయితే, పలు ఆర్ధిక అవకతవకలకు పాల్పడిన్నల్టు హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెల్లడించినప్పటి నుండి అదాని కంపెనీలు స్టాక్ మార్కెట్‌లో రోజురోజుకు బొక్కబోర్ల పడుతున్నాయి. దీంతో వరుస పతనంతో అదాని సంపద తాజాగా 50 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.9 లక్షల కోట్లు)కు పడిపోయిందని ఫోర్బ్స్ సోమవారం వెల్లడించింది. కాగా, ముకేశ్ అంబానీ ప్రపంచంలో 85 బిలియన్ డాలర్ల సంపదతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. హిండెన్‌బర్గ్ తన రిపోర్ట్ కారణంగా జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని కోల్పోవడంతో అదాని గ్రూపు కంపెనీల్లోని షేర్లను కొనడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఈ ప్రభావంతో ఆ…
Author: Editor's Desk, Tattva News
గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతలు వంశీ ఫై విమర్శలు చేయడంతో వంశీ అనుచరులు టీడీపీ ఆఫీస్ ఫై దాడి చేసారు. కార్యాలయంలోని కంప్యూటర్లు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఆఫీస్ ఆవరణలో ఉన్న వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. కత్తులతో టీడీపీ ఫ్లెక్సీలను వైస్సార్సీపీ కార్యకర్తలు చించివేశారు. ఓ కారు అద్దాలను ఇటుకలతో బద్దలు కొట్టారు. పార్టీలో కార్యాలయంలో కలియతిరుగుతూ విధ్యంసం సృష్టించారు. సోమవారం జరిగిన ఈ ఘటన గన్నవరంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గన్నవరం ఎంఎల్‌ఎ వల్లభనేని వంశీమోహన్ అనుచరులు తనపై మారణాయుధాలతో దాడికి ప్రయత్నించారంటూ, తాను ఇంట్లోలేని సమయంలో తన కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేశారంటూ టిడిపి రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా సోమవారం ఉదయం గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని అడిగేందుకు టిడిపి…
ముంద్రా పోర్ట్ మాదకద్రవ్యాల వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) మరో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధాన చార్జిషీటుకు తోడు మొదటి సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలైంది. సోమవారం రెండవ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ఎన్ఐఏ మొత్తం 22 మందిని నిందితులుగా పేర్కొనగా, వారిలో తెలుగు వ్యక్తి మాచవరం సుధాకర్ కూడా ఉన్నారు. నిజానికి ముంద్రా పోర్టులో భారీ ఎత్తున హెరాయిన్ దొరికినప్పుడే మాచవరం సుధాకర్ పేరు బయటికొచ్చి, విజయవాడలో కలకలం రేపింది. ఆయన పేరు మీదున్న సంస్థ ఆఫ్ఘనిస్తాన్ నుంచి టాల్కమ్ పౌడర్ పేరుతో మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ మొదటి చార్జిషీట్లో 16 మంది, మొదటి సప్లిమెంటరీ చార్జిషీట్లో 9 మందిని నిందితులుగా పేర్కొంది. నకిలీ కంపెనీలు, షెల్ కంపెనీల పేరుతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుని దేశీయంగా పంపిణీ…
కర్ణాటకలో ఇద్దరు ఉన్నతాధికారిణులు తాము ఉన్నతాధికారులమని మరిచి సోషల్‌మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై అధికారులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరికి చెందిన ఏడు వ్యక్తిగత ఫొటోలను ఐపిఎస్ అధికారిణి డి. రూపా మౌద్గిల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోలనే గతంలో రోహిణి పురుష ఐఏఎస్ అధికారులకు షేర్ చేశారని రూపా ఆరోపించారు. ఈ ప్రవర్తనతో వృత్తి పరమైన నియమాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. దీనితో ఆగ్రహం చెందిన రోహిణి భర్త సుధీర్ రెడ్డి సోమవారం రూపాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫోటోలు 2013, 2014లకు సంభదించినవని, అవి వ్యక్తిగతమైనవని పేర్కొంటూ వాటిని ఆమె ఎవ్వరి ఫోన్ ద్వారా, ఏ విధంగా సేకరించారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. తన భార్య ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయలేదని స్పష్టం చేస్తూ ఎవ్వరిదైనా…
ఇంద్రప్రస్థ విశ్వహిందూ పరిషత్ (ఐవీహెచ్‌పీ), విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఢిల్లీ రాష్ట్ర విభాగం దేశ రాజధాని ఢిల్లీలోని వ్యూహాత్మక స్థానాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 123 ప్రధాన భూ ఆస్తులను కాపాడింది. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ (డిడబ్ల్యుబి) అక్రమ ఆక్రమణకు గురికాకుండా దాదాపు రూ. 20,000 కోట్ల విలువైన 123 ఆస్తులను కాపాడగలిగామని కేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ వెల్లడించారు. కేసు గురించి వివరంగా ఆయన మాట్లాడుతూ, 1910లో భారత ప్రభుత్వం భారతదేశం కొత్త రాజధాని కోసం ఢిల్లీలో విస్తారమైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. స్వాధీన ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వ ఆధీనంలో ఉంచారు. 70వ దశకం చివరిలో ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ స్వాధీనం చేసుకున్న ఆస్తులలో 123కి నోటీసులిచ్చింది. వాటిలో చాలా వ్యూహాత్మకంగా వక్ఫ్ ఆస్తులుగా ఉన్నాయి. మొత్తం 123 కేసుల్లో ప్రభుత్వం దావాను వ్యతిరేకించింది. విచిత్రమేమిటంటే, అప్పటి…
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్ చానెల్స్ నడపరాదని జీవో జారీ చేసింది. ఈ జీవో ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ప్రస్తుతం యూట్యూబ్ వాడకం విపరీతంగా పెరిగింది. యూట్యూబ్ ద్వారా భారీగా ఆదాయం సంపాదించే అవకాశం ఉండడంతో ఇంట్లోనే ఉండి యూట్యూబ్ చానెల్స్ రన్ చేస్తూ సంపాదిస్తున్నారు. దీంతో మాములుగా నిరుద్యోగుల నుండి ప్రభుత్వ ఉద్యోగుల వరకు యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిగత యూట్యూబ్ ఛానెల్‌లను ప్రారంభించరాదని కేరళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారనే కారణంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. యూట్యూబ్ ఛానెల్‌ల ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం రాకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 3న రాష్ట్ర హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వు ప్రకారం, యూట్యూబ్ ఛానెల్‌ని…
ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీలోని తన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని, ఈ దాడిలో ఇంటి కిటికీలు దెబ్బతిన్నాయని అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 వ సంవత్సరం నుంచి తన ఇంటిపై ఆగంతకులు రాళ్ల దాడి చేస్తున్నారని, ఆదివారం రాత్రి జరిగిన ఈ రాళ్ల దాడి నాల్గవ ఘటన అని అసద్ ట్వీట్ చేశారు.ఆదివారం రాత్రి తాను జైపూర్ నుంచి ఢిల్లీ ఇంటికి 11.30 గంటలకు తిరిగి రాగా రాళ్ల దాడి జరిగినట్లు పనివాళ్లు చెప్పారని, ఈ దాడిలో పలు కిటికీలు పగిలిపోయాయని ఎంపీ అసద్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఎంపీ ఫిర్యాదుతో ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న అసద్ ఇంటిని ఢిల్లీ డీసీపీ సందర్శించి రాళ్ల దాడి ఆధారాలు సేకరించారు. తన ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ…
కంటోన్మెంట్ ఎంఎల్‌ఎ సాయన్న (72) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా షుగర్, బిపి, గుండె, మూత్రపిండాల వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 16వ తేదీన సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చేరిన ఆ యనకు వైద్యులు ఐసియూలో ఉంచి సేవలం దించారు. సాయన్నకు షుగర్ లెవల్స్ పూర్తిగా పడిపోయి ఆదివారం మధ్యాహ్నం 1.50 గం టలకు తుదిశ్వాస విడిచారు. సాయన్న మృతిపై రాష్ట్ర ముఖ్యమం త్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్య క్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే కెసిఆర్ అశోక్‌నగర్ చౌరస్తాలో ఉన్న సాయన్న ఇంటికి చేరుకొని ఆయన పార్థీవ దేహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబీకులను సి ఎం పరామర్శించారు. ఐదుసార్లు శాసనసభ్యుడిగా, వివిధ పదవుల ద్వారా సాయన్న చేసిన ప్రజాసేవ చిరస్మరణీయమమని కొనియాడారు. ఇదిలాఉండగా సాయ న్న అంత్యక్రియలు సోమవారం బన్సీలాల్‌పే ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కు టుంబసభ్యులు తెలిపారు.…
శివరాత్రి సందర్భంగా వైసీపీ విడుదల చేసిన పోస్టర్ పై బీజేపీ నేతలు రగిలిపోతున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొంటూ అందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పేరుతో వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన పోస్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. హిందువులకు క్షమాపణలు చెప్పడంతో పాటు, ఆ ట్వీట్ ను వెంటనే డిలీట్ చేయాలనే డిమాండ్ తో ఏపీ బీజేపీకి ఆందోళనలు చేపడుతోంది. ఈ వ్యహారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహా శివరాత్రి రోజున శివ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసిపి అఫీషియల్ ట్విట్టర్ లో జగన్ అభ్యంతరకర దుస్తులు ధరించి శివతత్వం గురించి ట్విట్ చేసి…
కృష్ణా జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన మచిలీపట్నం పోర్టు నిర్మాణం పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పోర్టు నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న మెఘా ఇంజనీరింగ్ సంస్థ సర్వే పనులు ప్రారంభించింది. సముద్ర తీర ప్రాంతంలో భూ నాణ్యత ప్రమాణాల పరీక్షలు నిర్వహిస్తోంది. బెర్తులు ఎంత లోతులో నిర్మిస్తే పటిష్టంగా ఉంటాయో గుర్తించేందుకు మట్టి శాంపిల్స్ తీసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పోర్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు అన్ని తొలగిపోయాయి. త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పనులు ప్రారంభించేందుకు కసరత్తులు తుది దశకు చేరాయి. మొదటి దశలో మూడు కార్గో, ఒకటి సాధారణ బెర్త్‌లను నిర్మించనున్నారు. బొగ్గు, ఇనుప ఖనిజం రవాణాకు ప్రత్యేకంగా ఒక బెర్త్ ను కేటాయిస్తున్నారు. ఈ నాలుగు బెర్తుల నిర్మాణానికి మొత్తం రూ.5,253.89 కోట్ల అంచనాతో టెండర్లను ఆహ్వానించారు. రూ.3,683.83 కోట్లకు మెఘా సంస్థ టెండర్ తగ్గించుకుంది. పనులు ప్రారంభమైన తర్వాత 30 నెలల్లో…