శాసనసభ సమావేశాలను తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ వేదికగా మార్చుకుందని, తండ్రీ (సీఎం కేసీఆర్), కొడుకు (మంత్రి కేటీఆర్), అల్లుడు (మంత్రి హరీష్ రావు) పోటీపడి మరీ ప్రధాని మోదీని విమర్శించారని బీజేపీ ఎంపీ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా. కె. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. శాసనసభ, మండలిలో ప్రజలకు ఏం చెయ్యాలో అనే దానిపై చర్చించలేదని.. అవు కథలా సభ సాగిందని విమర్శించారు. ప్రభుత్వ వైపల్యాలను పక్క దారి పట్టించేలా.. సభ వ్యవహారాలను పక్కదారి పట్టించారని ఆరోపించారు. కేంద్ర మంత్రిగా కేసీఆర్ గతంలో ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. కరోనా సమయంలో పోరుగు దేశాలు ఆర్థికంగా చితికి పోతే.. భారత్‌లో ఆర్థిక సంక్షోభం లేకుండా ప్రధాని చేశారని ఆయన కొనియాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు పరస్పరం ప్రశంసించుకున్నారని, ప్రధాని మోదీని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటే బీఆర్ఎస్ నేతలు బల్లలు చరుస్తూ మద్ధతు పలికారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేరు కాదని తాము…
Author: Editor's Desk, Tattva News
అదానీ గ్రూపు షేర్ల పతనం వివాదంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, రెగ్యులేటరీ మెకానిజమ్‌లను బలోపేతం చేసేందుకు డొమైన్ నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనపై తమకు అభ్యంతరం లేదని కేంద్రం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ స్టాక్స్ పతనానికి సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది.అయితే కమిటీకి డొమైన్ నిపుణుల పేర్లను, దాని పరిధిని సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని కోరుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేసింది. హిండెన్‌బర్గ్ నివేదిక ఆధారంగా ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ, ఇతర చట్టబద్ధమైన సంస్థలు సన్నద్ధమయ్యాయని కేంద్రం, సెబీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. కమిటీ వేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని… కమిటీ యొక్క నిపుణుల పేర్లు, పరిధిని తాము సూచించవచ్చని, సీల్డ్ కవర్‌లో పేర్లను అందిస్తామని…
మరో ఎనిమిది నెలలో మీరు ఎలాగో రాజీనామా చేయాలి, ఇప్పుడు మరో రాజీనామా ఎందుకు? అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఎద్దేవా చేశారు. కెసిఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ మోదీ ఆర్ధిక విధానాలను ఎండగడుతూ ప్రధాని విధానాల వల్ల దేశం తిరుగమన దిశలో ఉందని విమర్శించారు. దీనిపై తాను బిజెపి నేతలతో చర్చకు సిద్దంగా ఉన్నానని చెబుతూ మోదీ అసమర్ధపాలన గురించి తాను ఆధారాలతో వెల్లడించనట్లయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ కేసీఆర్ సవాలు విసిరారు.. దీనిపై కేంద్రమంత్రి ఢిల్లీలో ఘాటుగా స్పందించారు. ”దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చకు మేం సిద్ధం. ప్రగతి భవన్ లేదంటే ఫామ్‌హౌజ్‌కు చర్చకు రమ్మంటారా?. అభివృద్ధిపై చర్చకు కేసీఆర్ ఎక్కడకు రమ్మన్నా వస్తాం. రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని వస్తే రండి. అసలు కేసీఆర్‌ను రాజీనామా ఎవరు అడిగారు?. వచ్చే ఎన్నికల తర్వాత ఎలాగు రాజీనామా చేయ్సాలిందే” అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రంపై…
తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్రం పార్లమెంటులో ప్రకటన చేసింది. 2022 అక్టోబరు నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ.4,33,817.6 కోట్లు అని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ప్రభుత్వ అప్పులే కాకుండా… రాష్ట్ర సర్కారు పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులను కూడా ఇందులో చేర్చారు. ఇక, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి ప్రభుత్వపరంగా రూ.75,577 కోట్ల అప్పులు ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. 2021-22 నాటికి ఆ అప్పుల విలువ రూ.2,83,452 కోట్లు అని తెలిపింది. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.2,07,881 కోట్ల అప్పులు చేసినట్టు తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అలాగే నాబార్డ్ నుండి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నాబార్డ్ నుండి తెలంగాణా ప్రభుత్వంకు ఇప్పటి వరకు రూ. 7144 కోట్ల రుణాలు అందాయని తెలిపింది.…
జమ్ము కాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. పూర్వపు జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో 370వ అధికరణను రద్దు చేసిన తర్వాత ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతంలో నియోజకవర్గాల సర్దుబాటును నిర్వహించేందుకు పునర్విభజన కమిషన్‌కు అధికారాన్ని కట్టబెట్టిన జమ్ము కాశ్మీర్ పునర్విభజన చట్టంలోని నిర్దిష్ట నిబంధన రాజ్యాంగ చెల్లుబాటును పిటిషనర్లు సవాలు చేయలేదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎ.ఎస్.ఓఖాలతో కూడిన బెంచ్ పేర్కొంది. శ్రీనగర్ వాసులు హజి అబ్దుల్ ఖాన్, డాక్టర్ మహ్మద్ అయూబ్ మట్టూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. జమ్ము కాశ్మీర్ పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ 2020 మార్చిలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను, అలాగే 2021 మార్చిలో కమిషన్ కాలపరిమితిని పొడిగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్లను మాత్రమే వారు సవాలు చేశారని తెలిపారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయడానికి మూలమైన సెక్షన్ 62(2)ను పిటిషనర్లు ఎందుకు సవాలు…
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. మాస్టర్ ప్లాన్ నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టినట్లు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్లాన్ ను పక్కన పెట్టినట్లు వివరించింది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, అవసరమైతే ముందుగా కోర్టుకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టుకు తెలియకుండా మాస్టర్ ప్లాన్ విషయంలో ముందుకెళ్లొద్దని సూచించింది. అదేవిధంగా సింగిల్ బెంచ్ లో ఉన్న మరో పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఇంప్లీడ్ చేసింది. మాస్టర్ ప్లాన్ పై దాఖలైన పిటిషన్ లో ఇంప్లీడ్ పర్సన్ గా డివిజన్ బెంచ్ ముందు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాదనలు వినిపించారు. కాగా, కామారెడ్డి మునిసిపాలిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను రూపొందించింది. అయితే, పంట భూములను ఇండస్ట్రియల్,…
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటక వేదికయింది. బెంగళూరులోని యలహంక వైమానిక స్థావరంలో జరగనున్న 14వ ఎయిర్ ఇండియా షోను సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఐదురోజులపాటు (ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు) జరిగే ఈ ఎయిర్ షోలో 98 దేశాలకు చెందిన 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా భారత్ వివిధ దేశాల రక్షణ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఈ షోలో చివరి రెండు రోజులైన 16,17 తేదీల్లో సామాన్యులు తిలకించేందుకు కర్నాటక ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. నిర్వాహకులు ఎంట్రీ టికెట్‌ను రూ.1000గా నిర్ణయించారు. ‘రక్షణ రంగంలో భారత్ బలోపేతమైంది. తక్కువ ఖర్చుతోనే రక్షణ పరికరాలను భారత్ తయారుచేస్తోంది. రక్షణరంగ సామాగ్రిని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి మనం చేరుకున్నాం. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఇక్కడే విమానాలు తయారుచేసుకుంటున్నాం’ అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. అలాగే విదేశాలకు…
సందు దొరికితే తన ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సందించుకునే మాజీ సహచరుడు, ప్రస్తుతం బిజెపి ఎమ్యెల్యే ఈటెల రాజేందర్ పేరును ముఖ్యమంత్రి శాసనసభలో పదే పదే ప్రస్తావించడం కలకలం రేపింది. చివరి రోజైన అసెంబ్లీ సమావేశాలలో లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఈటెల రాజేందర్ పేరును పదే పదే కనీసం డోజన్ సార్లు పైగా పేరును ప్రస్తావించారు. ముందుగా ఈటల మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలలో డైట్ చార్జీల కోటా పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఈటెల రాజేందర్ సూచనలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అంతేకాదు, ఈటెలది న్యాయమైన కోరిక గనుక జీవోను జారీ చేయాలని సహచర మంత్రులకు అక్కడే సూచించారు. ఈటల రాజేందర్ అడిగారని చేయకుండా ఉండొద్దని పేర్కొంటూ కావాలంటే ఈటెలను కూడా పిలిచి సలహా తీసుకోవాలని మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలను ఆదేశించారు. తమకు ఎలాంటి భేషజాలు లేవని, మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు. “మా రాజేందర్…
ఢిల్లీ-ముంబాయి ఎక్స్‌ప్రెస్‌వే దేశాభివృద్ధిలో బలమైన స్తంభంగా నిలవనుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోను ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా ఢిల్లీ-దౌసా-లాల్‌సోట్‌ల మధ్య పూర్తయిన తొలిదశ రహదారిని ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. రాజస్థాన్‌లోని దౌసాలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీంతోపాటు రూ.18,100 కోట్లతో చేపట్టనున్న నాలుగు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గనాురు. తొలిదశలో మొత్తం 247 కిలోమీటర్ల మేర ఈ రహదారిని ఎనిమిది లేన్లుగా రూ.10,400 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీనివల్ల ఇక మీదట మూడున్నర గంట్లలోనే ఢిల్లీ నుంచి జైపూర్‌కు చేరుకోవచ్చు. ప్రస్తుతం 5 గంటల సమయం పడుతోంది. 2019 మార్చి 9న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. ఢిల్లీతోపాటు మధ్యలో అయిదు రాష్ట్రాలను (హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర) కలుపుతూ 1386 కిలోమీటర్ల మేర…
: ప్రపంచ చాంపియన్‌గా నిలువాలనే సంకల్పంతో దక్షిణాప్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టు.. టీ20 ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. మెగాటోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తమ తొలి పోరులో హర్మన్‌ప్రీత్‌కౌర్ బృందం 7 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో విశ్వరూపం చూపింది. రికార్డు ఛేదనతో టీ20 వరల్డ్‌కప్‌ను భారత మహిళలు గ్రాండ్‌గా ఆరంభించారు. దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్ లో దాయాది దేశం పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది..150 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మూడు వికెట్లు నష్టపోయి 151 పరుగులు చేసింది. జెమియా రోడ్రిగ్స్ 53 , రిచా శర్మ 31 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఒక ఓవర్ మిగిలి ఉండగానే భారత్ టార్గెట్ ను చ్చేధించింది.. ఓపెనర్ షఫాలీ…