భద్రాచలంను మూడు కొత్త గ్రామాలుగా వికేంద్రీకరణ చేస్తూ, ఆసిఫాబాద్ లో రాజంపేట నూతన గ్రామంగా ఏర్పాటు చేస్తూ శాసనసభ, శాసన మండలిలలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రవేశపెట్టిన పంచాయతీ రాజ్ సవరణ బిల్లును ఆమోదించారు. భద్రాచలంను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఏజెన్సీ ఏరియా కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు భద్రాచలంను మున్సిపాలిటీగా కాకుండా మూడు గ్రామ పంచాయతీలుగా వికేంద్రీకరణ చేయాల్సి వచ్చిందని మంత్రి తెలిపారు. ఈ బిల్లు భద్రాచలం, సారపాక, ఆసిఫాబాద్‌లను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి సంబంధించినది. తెలంగాణ మునిసిపాలిటీల చట్టం, 2019 లో ‘లేదా’ తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం, 2018 లో గానీ ప్రస్తుతం ఈ గ్రామాలలో ఎన్నుకోబడిన సంఘాలు లేవు. పైన పేర్కొన్న మూడు గ్రామాలను మున్సిపాలిటీలుగా నోటిఫై చేయాలని గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్…
Author: Editor's Desk, Tattva News
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులుకు ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించగా, ఆ పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ప్రకాశ్ ముదిరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. బండ ప్రకాశ్ ముదిరాజ్‌కు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్ ఆయన్ను స్వయంగా తీసుకెళ్లి ఛైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, కాంగ్రెస్ పక్ష నేత జీవన్ రెడ్డి తదితరులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం మండలిలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని బండ ప్రకాశ్‌ను కొనియాడారు. మలిదశ ఉద్యమంలోనూ చాలా చురుకైన పాత్ర పోషించారని, మంచి విద్యాధికులుగా పేరు తెచ్చుకున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తి మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికకావటం గర్వకారణంగా…
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన గవర్నర్లను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణన్ మాథుర్ రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. అదేవిధంగా మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లను ఇతర రాష్ట్రాలకు పంపించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను నియమించగా, ప్రస్తుత గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ కోశ్యారీని ఛత్తీస్‌గఢ్‌కు పంపించింది. మహారాష్ట్ర గవర్నర్‌గా రమేశ్ బైస్‌ను నియమించింది. వీరితోపాటు ఛత్తీస్‌గఢ్, బీహార్, హిమాచల్‌ప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్లకు స్థానచలనం కలిగింది. మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ప్రసాద్, అరుణాచల్‌ప్రదేశ్‌కు త్రివిక్రమ్ పర్నాయక్, జార్ఖండ్‌కు రాధాకృష్ణన్, అస్సాంకు గులాబ్‌చంద్ కటారియా, బీహార్‌కు రాజేంద్ర విశ్వనాథ్, హిమాచల్‌ప్రదేశ్‌కు శివప్రసాద్ శుక్లా, మణిపూర్‌కు అనసూయ, లడఖ్‌కు బీడీ మిశ్రా, నాగాలాండ్‌కు గణేషన్, మేఘాలయకు చౌహన్‌లను కేంద్రం నియమించింది.…
వామపక్షాలు, కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో త్రిపురలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉండేదని, సీపీఎం కార్యకర్తలు ఏకంగా పోలీస్ స్టేషన్లపైననే దాడులు చేసేవారని ప్రధాని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. పోలీస్ స్టేషన్లను చెర పట్టే పరిస్థితి నుంచి న్యాయబద్ధ పాలన కొనసాగే పరిస్థితికి రాష్ట్రాన్ని బీజేపీ తీసుకువచ్చిందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ శనివారం త్రిపురలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ సీపీఎం, కాంగ్రెస్ ల పాలన లో త్రిపురలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆరోపించారు. దశాబ్దాలుగా రాష్ట్రంలో అభివృద్ధిని కాంగ్రెస్, సీపీఎం అడ్డుకున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, వామపక్ష కూటమికి ఓటు వేస్తే, మళ్లీ త్రిపుర దశాబ్దాల వెనక్కు వెళ్తుందని ప్రధాని హెచ్చరించారు. ‘గతంలో త్రిపుర అంటే హింసకు పర్యాయపదంగా ఉండేది. గూండాయిజం, అవినీతి రాజ్యమేలేవి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాతనే ప్రగతి పట్టాలపైకి రాష్ట్రం చేరి, పరుగులు తీయడం ప్రారంభించింది’’ అని ప్రధాని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన…
దేశ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే పోలీసు వ్యవస్థ, ప్రజల నమ్మకం పొందిన పోలీసు వ్యవస్థ,సవాళ్ళను ఎదుర్కొనే సామర్థ్యం గల పోలీసు వ్యవస్థ కలిగి ఉన్న దేశం మాత్రమే అభివృద్ధి సాధిస్తుందని పేర్కొంటూ దేశాభివృద్ధికి పోలీసు వ్యవస్థ పునాదిగా పనిచేస్తుందని కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన 74 ఆర్ఆర్ ఐపీఎస్ బ్యాచ్ స్నాతకోత్సవంలో పాల్గొంటూ రాజ్యాంగ విలువలు గౌరవిస్తూ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని శిక్షణ పూర్తి చేసుకున్న అధికారాలకు సూచించారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా మూడు వ్యవస్థలు దేశానికి అవసరమని పేర్కొన్నారు. ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల్లో ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రజలు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, దేశానికి 30 నుంచి 35 సంవత్సరాల పటు సేవ చేసే అధికార యంత్రాంగం మూడు స్తంభాలుగా ఉంటాయని చెప్పారు. ‘ఐదు…
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. భక్తుల దైవదర్శనంతో పాటు నిత్య, వార, మాస, వార్షికోత్సవాల్లో భక్తులు సులభంగా పాల్గొనేందుకు యాదాద్రి దేవస్థానం ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలతో దూర ప్రాంతాల భక్తులకు స్వామి వారి దర్శనం చాలా సులభంగా దొరుకుతోంది. బ్రహ్మోత్సవాల టికెట్లను సైతం ఇబ్బందులు కలగకుండా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలను పొందాలనుకునే వారు yadadritemple.telangana. gov.in వైబ్‌సైట్‌లో సంప్రదించాలని ఆలయ అధికారులు సూచించారు. తిరుమల తరహాలోనే యాదాద్రిలో బ్రేక్ దర్శనం టికెట్లను విక్రయిస్తున్నారు. ఒక్కోక్కరికీ టికెట్ ధర రూ.300, రూ.150 శీఘ్రదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో పొందొచ్చని ఆలయ అధికారులు తెలిపారు. దీంతోపాటు ఆలయంలో జరిపే వివిధ ఏర్పాట్లకు విరాళాలిచ్చే వారి కోసం ఈ డొనేషన్ సదుపాయాన్ని (ఈ- హుండీ) కల్పించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో తిరుకల్యాణ మహోత్సవం- 2023 టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ధర…
కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తోన్న కాంగ్రెస్ సభ్యులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో విరుచుకుపడ్డారు. తమపై విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ నాయకులు తమ ముఖాలను కాస్త డెటాల్ తో కడుక్కోవాలని సూచించారు. అవినీతి గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని నిర్మలా సీతారామన్ ఎద్దేవా చేశారు. అవినీతికి ఆద్యులు కాంగ్రెస్ నాయకులేనన్న ఆమె.. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనలపై సమాధానాలను ఇచ్చారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఇంధన ధరలను తాము రెండు సార్లు తగ్గించామని ఆమె గుర్తు చేశారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే పెట్రోల్ ధరలపై వ్యాట్ పెంచిందని నిర్మలా సీతారామన్ ఆరోపించారు. దీంతో అక్కడ ఇంధన ధరలు పెరిగాయన్న ఆమె… కాంగ్రెస్ సంప్రదాయం ఇదేనని ధ్వజమెత్తారు. ఆరోపణలు చేస్తారు. సభ నుంచి వాకౌట్ చేస్తారు. అంతేగానీ ఎవరి మాటా…
అనుమానిత ఉగ్రవాదిని బెంగళూరులో జాతీయ దర్యాప్తు సంస్థ శనివారం అరెస్ట్ చేసింది. అరెస్టయిన ఉగ్రవాది పేరు ఆరిఫ్. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసేవాడు. ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) లో చేరేందుకు విదేశాలకు వెళ్లేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈయనను విచారిస్తున్న పోలీసులు.. ఉగ్రవాద దేశాల ఉద్దేశాలను మరింత రాబట్టేందుకు చూస్తున్నారు. ఆరిఫ్ గత రెండేండ్లుగా అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తున్నది. అతను ఐఎస్‌ఐఎస్‌లో చేరాలనుకున్నాడని, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ మీదుగా సిరియాకు పారిపోయే పనిలో ఉన్నాడని సమాచారం. ఆరిఫ్ ఒక రాడికల్. అయినప్పటికీ ఇంతవరకు ఆయన ఎలాంటి ఘటనలో ప్రమేయం లేదని ఎన్‌ఐఏ వర్గాలు చెప్తున్నాయి. ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఇతగాడు ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేస్తున్నాట్లు గుర్తించారు. విచారణ నిమిత్తం అతని ల్యాప్‌టాప్‌తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది. నిందితుడి కదలికలను పర్యవేక్షిస్తున్న ఎన్‌ఐఏ.. స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్…
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి కొడుకు రాఘవరెడ్డిని అరెస్టు చేశారు. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న సౌత్ గ్రూప్.. మాగుంట రాఘవరెడ్డి పేరును ప్రస్తావించినట్లు తెలిసింది. రాఘవరెడ్డిని అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఆయన్ని మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిసింది. ఈ కేసులో వైసిపి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డిని గతేడాది అక్టోబర్‌లో సీబీఐ ప్రశ్నించింది. ఆ సమయంలో ఆయనతోపాటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా సీబీఐ ప్రశ్నించింది. ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగి ఆయన్ని అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. లిక్కర్ కార్టెల్ కోసం.. మధ్యవర్తుల ద్వారా.. రాఘవ రెడ్ ఆప్ ప్రభుత్వానికి లంచాలు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. రెండ్రోజులుగా రాఘవరెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు.. ఆయన సరిగా సహకరించట్లేదనే ఉద్దేశంతో.. ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలిసింది. 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తున్న…
శ్రీహరికోట నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వి-డి2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రయోగంలో మూడు ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. వీటిలో దేశీయ ఉపగ్రహాలు రెండు, అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం ఒకటి ఉన్నాయి. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ శుక్రవారం ఉదయం 9.18 గంటలకు నింగిలోకి ఈ రాకెట్ దూసుకెళ్లింది. ఈ రాకెట్ 34 మీటర్లు పొడవు, రెండు మీటర్లు వెడల్పు, 119 టన్నుల బరువు కలిగి ఉంది. దీనిని నాలుగు దశల్లో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించి 124 సెకన్లలో, రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లలో, నాలుగో దశలో 0.05 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 7851 సెకన్లలో పూర్తి…