Author: Editor's Desk, Tattva News

భారత గగనతలంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్ బిఎస్‌ఎఫ్ శుక్రవారం కూల్చివేసింది. అంతర్జాతీయ సరిహద్దు నుంచి పంజాబ్ సరిహద్దులోకి ప్రవేశించిన పాక్ డ్రోన్‌ను సరిహద్దు బలగాలు కూల్చేవేశాయని ప్రతినిధితెలిపారు. మానవ రహిత పాక్ డ్రోన్ అమృతసర్ సెక్టార్‌లోని సరిహద్దు పోస్టు వద్ద భద్రతా బలగాలు ఉదయం 7.45కు గుర్తించాయి. కాల్పులు జరిపి డ్రోన్‌ను కూల్చేసిన అనంతరం దాన్ని భద్రాత దళం స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టింది. పరిసర ప్రాంతాల్లో డ్రోన్ నుంచి ఏమైనా జారవిడిచారనేది పరిశీలిస్తున్నామని బిఎస్‌ఎఫ్ అధికారి ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఆరడుగుల పొడువు ఉన్న డ్రోన్ 25కేజీల పేలుడు సామగ్రిని తీసుకువెళ్లగల సామర్థం ఉంది. నిర్దేశించిన ప్రాంతంలో సామగ్రిని జారవిడిచే యంత్ర అమరిక ఉందని అధికారులు గుర్తించారు. పంజాబ్‌లో పాక్ డ్రోన్‌లను కూలేయడం వరుసగా మూడో రోజూ జరిగింది. డిసెంబర్ 21 పాక్ డ్రోన్‌ను భద్రతా బలగాలు కూల్చేవేయగా సరిహద్దు ఆవల పడటంతో పాక్ రేంజర్లు దాన్ని తెలిపింది. గురువారం…

Read More

జీడి పొట్టు ఆయిల్ ఉత్పత్తి, ఎగుమతులు పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ (ఉద్యానవన పంటల సమగ్ర అభివృద్ధి మిషన్), ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన’ పథకం కింద ఆంధ్రప్రదేశ్ లో 2005-06 నుండి 2021-22 వరకు 15006 హెక్టార్లలో జీడిమామిడి సాగును అభివృద్ధి చేసిందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో 12 ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా జీడి పొట్టు ఆయిల్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. జీడిపిక్కల సాగు విస్తరించడం ద్వారా మాత్రమే జీడి పొట్టు ఆయిల్ ఉత్పత్తి వృద్ధి చెందుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో 2016-17లో 111.4 మెట్రిక్ టన్నులు, 2017-18లో 116.9 మెట్రిక్ టన్నులు, 2018-19లో 109.9 మెట్రిక్ టన్నులు, 2019-20లో 115.4 మెట్రిక్ టన్నులు,…

Read More

ఉత్తర సిక్కింలో చైనా సరిహద్దులకు సమీపంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. వారిలో 13 మంది జవాన్లు కాగా, ముగ్గురు జూనియర్ కమిషన్డ్ అధికారులు ఉన్నారు. నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని హెలికాప్టర్ లో బెంగాల్ లోని ఆసుపత్రికి తరలించారు. ఉత్తర సిక్కింలోని జెమా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో మిలిటరీ ట్రక్కులో 20 మంది ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న వాహనం ఓ లోయలో పడిపోయింది. ఓ మలుపు వద్ద వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయినట్టు భావిస్తున్నారు. 100 అడుగుల ఎత్తు నుంచి వాహనం లోయలో పడిపోవడంతో నుజ్జునుజ్జయింది. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. ఈ విషాద ఘటనపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ…

Read More

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారత్ బయోటెక్ కంపెనీ రూపొందించిన ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌కు ఆమోదం తెలిపింది. 18 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దీనిని చేర్చినట్లు గురువారం అధికార వర్గాలు తెలిపాయి. సూది లేకుండా ఇచ్చే ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ సెంటర్లలో కూడా అందుబాటులో ఉండనుంది. కాగా దీనిని శుక్రవారం సాయంత్రం కో-విన్ ప్లాట్‌ఫారమ్‌పై పెట్టనున్నట్లు వారు తెలిపారు. ముక్కు ద్వారా ఇచ్చే ఈ నాసల్ వ్యాక్సిన్ బిబివి154కు నవంబర్‌లోనే భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆమోదం తెలిపింది. అయితే అప్పట్లో దీనిని అత్యవసర పరిస్థితిలో, 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే ఓ వైవిధ్య బూస్టర్ మోతాదు (హెటెరోలోగూస్ బూస్టర్ డోస్)గా ఉపయోగించేందుకు పరిమితి చేశారు. చైనా తదితర దేశాలలో ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతుండడం వల్ల ఈ వ్యాక్సిన్‌కు ఇప్పుడు అందరికీ ఇచ్చేందుకు ఆమోదం ఇచ్చారు. ఇదిలావుండగా ప్రజలంతా మాస్కులు తప్పనిసరి…

Read More

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటివద్దే చికిత్స పొందుతున్నారు. చికిత్సకు అవయవాలు సహకరించకపోవడంతో ఆయన తుది శ్వాస విడిచారు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన కన్నుమూశారు. నాయకుడిగా, ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన అన్ని రోల్స్ చేసి ప్రేక్షకులకు వినోదం పంచారు. తెలుగు సినిమాల్లో కైకాల చేయని క్యారెక్టర్ లేదని చెప్పుకోవచ్చు. ఆరు దశాబ్దాల పాటు సినిమాల్లోనే జీవించి చిత్రసీమకు ఆయన అందించిన విజయాలు మరపురానివి. తెలుగు ఆడియెన్స్ చేత ఎస్వీఆర్ వారసుడిగా పిలిపించుకున్న కైకాల మరణం టాలీవుడ్‌కి తీరని లోటు అని చెప్పుకోవాలి. కైకాల మరణవార్తతో టాలీవుడ్ లోకంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జులై 25న కైకాల సత్యనారాయణ జన్మించారు. గుడివాడ, విజయవాడలో…

Read More

దేశంలో వంటనూనెల ఉత్పత్తిని పెంచుతూ దిగుమతి భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ – ఆయిల్ పామ్’ పథకం తెలంగాణ రైతులకు ఎంతో ప్రయోజనకరమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు దేశంలో అనుకూలంగా భూమిలో 15 శాతం తెలంగాణలోనే ఉందని వెల్లడించారు. 2021-22 నుంచి 2025-26 వరకు మొత్తం ఐదేళ్ల కాలపరిమితితో ఈ పథకానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో వంటనూనెల అవసరాలు తీర్చేందుకు ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చి దేశీయంగా సాగు విస్తీర్ణాన్ని పెంచాలని చూస్తోంది. ఈ క్రమంలో 2019-20 నాటికి 3.5 లక్షల హెక్టార్లలో ఉన్న పామాయిల్ సాగును 2025-26 నాటికి 10 లక్షల హెక్టార్లకు పెంచాలని, అలాగే మరో…

Read More

‘ఆస్కార్‌’లో సత్తా చాటేందుకు నాలుగు భారతీయ చిత్రాలు తొలి అడుగు వేశాయి. ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’, ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటునాటు’, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్‌’ ఈ జాబితాలో చోటు సొంతం చేసుకున్నాయి. ఆస్కార్‌ అవార్డుల నామినేషన్స్‌లో పోటీ పడనున్న చిత్రాల షార్ట్‌లిస్ట్‌ను తాజాగా అకాడమీ ప్రకటించింది. సుమారు 10 విభాగాలకు సంబంధించిన ఈ నాలుగు విభాగాల్లో భారతీయ చిత్రాలు స్థానాలను దక్కించుకున్నాయి. షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకూ ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఆ ఓటింగ్‌ను ఆధారంగా చేసుకుని జనవరి 24న ఆస్కార్‌ నామినేషన్‌లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు. అనంతరం మార్చి 12న విజేతలకు ఆస్కార్‌ అవార్డులు అందించనున్నారు. ‘నాటు నాటు’ పాట ఎంపిక వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా…

Read More

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు విభేదాలతో రోడ్ న పడడంతో, వారిని సరిదిద్దటం కోసం వచ్చిన సీనియర్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ ఉండగానే గాంధీ భవన్‌లో హస్తం నేతల కొట్లాటలను తలబడ్డారు. లోపల సీనియర్లతో దిగ్విజయ్ సింగ్ సఖ్యత గురించి చర్చలు జరుపుతుంటే, మరోవైపు జూనియర్లు బయట గల్లాలు పట్టుకున్నారు. దిగ్విజయ్ సమక్షంలోనే గల్లాలు పట్టుకుని బూతులతో హోరెత్తించే స్థాయిలో కొట్లాటలు దిగారు. ఓయూ నేతలతో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ వాగ్వాదానికి దిగటంతో ఘర్షణ తలెత్తింది. చూస్తున్నంత సేపట్లో గాంధీ భవన్ పరిసరాలు జై కాంగ్రెస్, సేవ్ కాంగ్రెస్‌ నినాదాలతో పాటు బూతులతో దద్దరిల్లాయి. తమకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ అనిల్ కూమార్‌ను ఓయూ నేతలు చుట్టుముట్టారు. ఈ గొడవ జరుగుతున్న సమయంలో.. ఇరు వర్గాలకు సర్ధిచెప్పేందుకు మల్లు రవి ప్రయత్నించారు. కానీ సర్ధి చెప్పటం ఆయన వల్ల కాలేదు. తమకు పదవులు రాలేదని అయిన తాము సర్ధుకున్నామని చెబుతూ సీనియర్లపై అనిల్ కుమార్ ఎలా ఆరోపణలు చేస్తారంటూ…

Read More

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కానందుకు మాజీ ఎంపీ జయప్రదపై రాంపూర్ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రెండు కేసుల విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు వారెంట్‌ జారీ చేసింది. మాజీ ఎంపీని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. 2019లో మాజీ ఎంపీ జయప్రదపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. మొదటి కేసు ఏప్రిల్ 18, 2019 న, రాంపూర్‌లోని కామ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపారియా మిశ్రా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో వీడియో నిఘా బృందం ఇన్‌ఛార్జ్ కుల్దీప్ భట్నాగర్ నమోదు చేశారు. స్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్‌పూర్ గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ మేజిస్ట్రేట్ నీరజ్ కుమార్ 2019 ఏప్రిల్ 19న…

Read More

కరోనా వైరస్ చైనాలో మరోసారి వేగంగా విజృంభిస్తోంది. ఓమిక్రాన్ ఉపరకమైన బీఎఫ్.7 వేరియంట్ కు చెందిన నాలుగు కేసులు తాజాగా నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తొలి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ అక్టోబర్ నెలలోనే గుర్తించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుజరాత్‭లో రెండు కేసులు, ఒడిశాలో రెండు కేసులు నమోదయ్యాయి. భారత్ లో బీఎఫ్.7 వెలుగు చూసినప్పటికీ.. కేసుల్లో పెరుగుదల లేదని కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో నిపుణులు వెల్లడించారు. అయినప్పటికీ.. వ్యాప్తిలో ఉన్న వాటితో పాటు కొత్తగా బయటపడుతోన్న వేరియంట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలోనే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పై దృష్టి పెట్టాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ప్రస్తుతం చైనాలో ఒమిక్రాన్‌ వేరియంట్, దాని ఉపరకాల విజృంభణ కొనసాగుతోంది. బీజింగ్‌ వంటి నగరాల్లో బీఎఫ్‌.7 వేరియంట్‌…

Read More