Author: Editor's Desk, Tattva News

ఎమ్మెల్యే కవిత ఫై బిజెపి ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం బంజారాహిల్స్ లోని అరవింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఇంట్లో అరవింద్ లేని సమయంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున అరవింద్ ఇంటికి చేరుకొని , ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పార్కింగ్ లో ఉన్న కార్ అద్దాలు ధ్వంసం చేశారు. అర్వింద్ నివాసంలోకి చొరబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ  దహనం చేశారు. ఈ దాడి పట్ల అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ   కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. టీఆర్ఎస్ గూండాలు ఇంట్లో వస్తువులు పగులకొట్టి బీభత్సం సృష్టించారని అంటూ ఇంట్లో ఎవరూ లేనప్పుడు చూసి దాడి చేయడం తప్పు అని ధ్వజమెత్తారు. కవితకు ఇంత కుల అహంకారం ఎందుకు? అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల దాడులకు తామ అస్సలు భయపడబోమని స్పష్టం చేశారు.…

Read More

అద్భుతమైన  బీచ్‌లతో పాటు అనేక అంశాల్లో స్పెయిన్, గోవాల మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి.  ఈ నవంబర్‌లో ఈ రెండు ప్రదేశాలు పరస్పరం వేడుకలు జరుపుకునేందుకు మరో  సందర్భాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్ 20 నుండి 28 వరకూ గోవాలో జరిగే 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) స్పానిష్ చిత్ర దర్శకుడు కార్లోస్ సౌరాను సత్యజిత్ రే లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించనుంది.  ఈ ఫెస్టివల్‌లో ‘రెట్రోస్పెక్టివ్స్’ అనే విభాగంలో కొంతమంది దర్శకుల ఉత్తమ చిత్రాలను కూడా ప్రదర్శిస్తారు. మానవ భావోద్వేగాలను వ్యక్తీకరించే అత్యంత శక్తివంతమైన మాధ్యమాలలో సినిమా ఒకటి. దేశం నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యానికి మారినక్రమంలో స్పానిష్ సమాజం చేసిన పోరాటాల నేపథ్యంలో ఈ భావోద్వేగాలను చిత్రీకరించిన కార్లోస్ సౌరా యొక్క చలనచిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.  సౌరా ఫోటోగ్రఫీలో తన వృత్తిని ప్రారంభించారు. అలాగే పారిశ్రామిక ఇంజనీరింగ్ చదివారు. అయినప్పటికీ ఆయన…

Read More

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏర్పడబోయేది డబుల్ ఇంజన్ సర్కారేనని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే భరోసా వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షులు రాజవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ‘నాగర్ కర్నూల్ లోక్ సభ ప్రవాస్ యోజన’ కోర్ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడారు. గతంలో దేశంలో మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, అస్సాం, త్రిపుర తదితర రాష్ట్రాలలో ప్రతి ఎన్నికల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడేవని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ  సారథ్యంలో అత్యధిక మెజార్టీతో రెండు, మూడవ పర్యాయాలు కూడా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్‌తో అత్యధిక ప్రయోజనం పొందుతున్నారని ఆయన తెలిపారు.  రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. ఇక్కడి ఎమ్మెల్యేలు మాఫియా డాన్ లలా మారి ప్రకృతినీ, ప్రజలనూ దోచుకుంటున్నారని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.    కేంద్రం ఆధ్వర్యంలోని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని పక్కన…

Read More

రాబోయే ఏడాది కాలంలో భారతదేశంలో గేమింగ్‌ పరిశ్రమ 20-30 శాతం వృద్ధి చెందుతుందని, 2023 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక లక్ష కొత్త ఉద్యోగాలు లభించనున్నాయని అంచనా వేస్తున్నారు.  టీమ్‌లీజ్‌ డిజిటల్‌ తాజాగా విడుదల చేసిన “గేమింగ్: రేపటి ప్రభంజనం”  పేరుతో విడుదల చేసిన నివేదికలో  ప్రస్తుతం ఈ రంగం దాదాపు 50,000 మంది వ్యక్తులకు నేరుగా ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారు. వీరిలో 30శాతం మంది వర్క్‌ఫోర్స్‌ ప్రోగ్రామర్లు, డెవలపర్లుగా సేవలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈరంగంలో ప్రోగ్రామింగ్‌ (గేమ్‌ డెవలపర్‌లు, యూనిటీ డెవలపర్‌లు), టెస్టింగ్‌ (గేమ్స్‌ టెస్ట్‌ ఇంజనీరింగ్‌, క్వాలిటీ అండ్‌ అస్యూరెన్స్‌ లేదా క్యూఏ లీడ్‌), యానిమేషన్‌ (యానిమేటర్లు), డిజైన్‌ (మోషన్‌ గ్రాఫిక్‌ డిజైనర్లు, వర్చువల్‌ రియాలిటీ) వంటి డొమైన్‌లలో కొత్త ఉద్యోగాలను అందిస్తుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ లేదా వీఎఫ్‌ఎక్స్‌, కాన్సెప్ట్‌ ఆర్టిస్టులు, కంటెంట్‌ రైటర్‌లు, గేమింగ్‌ జర్నలిస్టులు, వెబ్‌ అనలిస్ట్‌ల రూపంలో వేలాది కొలువులు రానున్నాయి.వేతనాల కోణంలోనూ…

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్ర, వినయ్ బాబులకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరో 4 రోజుల కస్టడీని పెంచుతూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లైలను కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈనెల 10వ తేదీన శరత్ చంద్ర, వినయ్ బాబులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు కోర్టు అనుమతితో వారం రోజులు కస్టడీకి తీసుకున్నారు. కాగా ఆ కస్టడీ గురువారంతో ముగిసింది. ఈ క్రమంలో ఈడీ అధికారులు శరత్ చంద్రా, వినయ్ బాబులను సిబిఐ కోర్టులో హాజరుపరిచారు. వారు విచారణకు సహకరించడం లేదని ఈడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకోసం మరో వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. అలాగే మరో ఇద్దరు చార్టర్ అకౌంటెంట్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై లను విచారణకు అనుమతించాలని ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో…

Read More

ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మంది యువకులు వినికిడి ప్రమాదానికి దగ్గరగా ఉన్నారని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. హెడ్‌ఫోన్‌లు వినడం లేదా లౌడ్‌స్పీకర్లున్న సంగీత కచేరీలకు వెళ్లడం వంటి పరిణామాలతో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని ఈ అధ్యయనం యువకులు తమ శ్రవణ అలవాట్ల గురించి మరింత జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది. భవిష్యత్తులో వినికిడి ముప్పు నుంచి యువతను రక్షించడానికి ప్రభుత్వాలు, తయారీదారులు మరింత కృషి చేయాలని కోరింది. డబ్ల్యుహెచ్‌ఒ గ్లోబల్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురించబడిన విశ్లేషణ గత రెండు దశాబ్దాలుగా ఇంగ్లీష్‌, స్పానిష్‌, ఫ్రెంచ్‌, రష్యన్‌ భాషలలో ప్రచురించబడిన 33 అధ్యయనాల నుండి 12-34 సంవత్సరాల మధ్య వయస్సు గల 19,000 మంది డేటాను పరిశీలించింది. స్మార్ట్‌ఫోన్‌ల వంటి పరికరాలతో హెడ్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు 24 శాతం మంది యువకులు అసురక్షిత శ్రవణ పద్ధతులను కలిగి ఉన్నారని తేలింది. 48 శాతం…

Read More

దేశవ్యాప్తంగా గగుర్పాటు కలిగించిన దేశ రాజధాని ఢిల్లీలో ఆప్తాబ్ అనే వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న శ్రద్దా వాకర్ ను దారుణంగా చంపి, మృతదేహాన్ని 35 భాగాలుగా కోసి, వివిధ ప్రాంతాలలో వీటిని పారేస్తూ వాస్తు సాక్ష్యాలు మాయం చేసి, ఐదారు నెలలపాటు ఎవ్వరికీ అనుమానం రాకుండా వ్యవహరించిన కేసులో లవ్ జిహాద్ కోణం వెలుగులోకి వస్తున్నది. తన కూతురు శ్రద్ధా వాకర్ దారుణ హత్య వెనుక లవ్ జిహాద్ కోణం ఉండి ఉంటుందని ఈ యువతి తండ్రి వికాస్ వాకర్ తెలిపారు. ఈ దిశలో వెంటనే దర్యాప్తు చేపట్టాలని, హంతకుడిని కఠినాతి కఠినంగా శిక్షించాలని, తన దృష్టిలో ఉరితీయడం సబబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ఆమె వేరే ప్రాంతంలో ఉంటోందని తెలియచేసేలా ఆమె ఫోన్‌లో వాట్సాప్ సందేశాలను స్నేహితులకు పంపించడం, పైగా ఆమె దగ్గరి స్నేహితురాళ్లతో పరిచయాలు పెంచుకుని వారిని అపార్ట్‌మెంట్‌కు రప్పించుకోవడం వంటి చర్యలు చేస్తూ…

Read More

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులకు ఉచ్చు బిగుస్తోంది. దర్యాప్తులో భాగంగా అధికారులకు కీలక సమాచారం, ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు లింక్, ప్రైవేట్ చార్టెర్డ్ విమానాల ద్వారా పెద్ద ఎత్తున నగదు ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు తరలించారని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. దీనికి సంబంధించి కనికారెడ్డికి చెందిన జెట్ సెట్ గో చార్టెడ్ విమానాల ద్వారా నగదు తరలించినట్లు భావిస్తున్నారు. జెట్ సెట్ గో సంస్థపై ఈడీ ఆరా తీస్తోంది. జెట్ సెట్ గో కార్యకలాపాలపై వివరాలు ఇవ్వాలంటూ ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లేఖలు రాసింది. ఇండో పసిఫిక్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌ను జెట్‌ సెట్‌ గో సంస్థ టేకోవర్ చేయగా, జెట్‌ సెట్‌ గో ద్వారా ప్రైవేట్ విమాన కార్యకలాపాలను అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి సతీమణి కనికారెడ్డి నిర్వహిస్తున్నారు.కనికారెడ్డి కంపెనీకి చెందిన విమానాల…

Read More

ఇండోనేషియా తమ రాజధాని నగరం బాలిలో జరిగిన  శిఖరాగ్ర సమావేశంలో రాబోయే సంవత్సరానికి జి20 అధ్యక్ష పదవిని భారత్‌కు బుధవారం అప్పగించింది. రెండు రోజుల సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ప్రధాని నరేంద్ర మోదీకి అధ్యక్ష పదవిని అందజేశారు.  భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు, మహమ్మారి యొక్క దీర్ఘకాలిక దుష్ప్రభావాలతో ప్రపంచం ఏకకాలంలో పోరాడుతున్న సమయంలో భారతదేశం జి 20 బాధ్యతలను తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో, ప్రపంచం జి-20 వైపు ఆశతో చూస్తోందని… ఈ రోజు భారతదేశం జి-20 అధ్యక్ష పదవి అందరినీ కలుపుకొని, ప్రతిష్టాత్మకంగా, నిర్ణయాత్మకంగా, కార్యాచరణ-ఆధారితంగా ఉంటుందని తాను హామీ ఇస్తున్నానని ప్రధాని మోదీ చెప్పారు. దేశాధినేతలు, ప్రభుత్వాల స్థాయిలో తదుపరి జి 20 సమ్మిట్ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జి-20కి భారతదేశం అధ్యక్షత వహించడం దేశానికి…

Read More

అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా మూన్ మిషన్ ‘ఆర్టెమిస్-1’ ను బుధవారం ప్రయోగించారు. ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.17 గంటలకు రాకెట్ జాబిల్లి వైపు దూసుకెళ్లింది. ప్రయోగించిన కొన్ని నిమిషాల అనంతరం చంద్రుని వైపు ఓరియన్ అంతరిక్ష నౌకను రాకెట్‌ విడిచిపెట్టింది. సోమవారం నాటికి ఓరియన్ చంద్రుడి ఉపరితలం నుంచి 96.5 కిలోమీటర్లు దాటిపోతుంది. దాదాపు 25 రోజులపాటు అంతరిక్షంలో గడిపిన అనంతరం డిసెంబర్ 11న పసిఫిక్ మహాసముద్రంలో పడనున్నది. ఆర్టెమిస్‌-1 ప్రయోగం సాంకేతిక లోపాలు, వాతావరణ ప్రతికూలత కారణంగా గతంలో రెండు సార్లు ఆగస్ట్‌ 29, సెప్టెంబర్‌ 3న వాయిదా పడింది. మూడోసారి ప్రయోగం సందర్భంగా కూడా కొన్ని అవాంతరాలు తప్పలేదు. అయితే, వాటిని అధిగమించి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు నాసా తెలిపింది. రాకెట్‌లో హైడ్రోజన్‌ గ్యాస్‌ లీక్‌ అవుతుండగా శాస్త్రవేత్తలు సకాలంలో దాన్ని సరిచేశారు. కోర్‌ స్టేజ్‌లోని లిక్విడ్ హైడ్రోజన్‌,…

Read More