వచ్చే నెల మొదటి వారంలో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వమించనున్నారు. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ ని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తొలి విడత పోలింగ్ కోసం ఈ నెల 5న, రెండో విడత కోసం ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతల్లో.. డిసెంబర్ 1, 5 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించారు.ఓట్ల లెక్కింపును డిసెంబర్ 8న చేపడతామని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. గుజరాత్ లో ఫిబ్రవరి 18, 2023 తో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం 51,000 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గుజరాత్ లో 4.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, అందులో 4.61 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు పొందారని మీడియా సమావేశంలో సీఈసీ…
Author: Editor's Desk, Tattva News
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ని అనుమానాస్పద వ్యక్తులు ఈ మధ్య ఎక్కువగా అనుసరిస్తున్నారని జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా విశాఖ సంఘటన తరువాత పవన్ కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు తచ్చాడుతున్నారని తెలిపింది. పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నారని వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కారులో వెంబడిస్తున్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని, అనుసరిస్తున్న వారు అభిమానులు ఎంత మాత్రం కాదని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది చెబుతున్నారని తెలిపారు. వారి కదలికలు అనుమానించే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కారులోనూ, మంగళవారం నాడు ద్విచక్ర వాహనాలపై అనుసరించారని చెప్పారు. కాగా సోమవారం అర్ధరాత్రి ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి…
గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో 135 మంది చనిపోవడానికి దారితీసిన తీగల వంతెన తెగిపోయిన ప్రమాదం ఘటనకు కాంట్రాక్టర్ల తప్పిదమే కారణమని వెల్లడవుతుంది. నిందితులను పోలీస్ కస్టడీకి కోరుతూ స్థానిక కోర్టుకు ప్రాసిక్యూషన్ లాయర్ తెలిపిన అంశాలు ఈ విషయాన్నీ స్పష్టం చేశాయి. ఆదివారం వంతున కూలిపోయిన న కేసులో బుధవారం మోర్బీ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎంజే ఖాన్ విచారణ జరిపారు. వంతెన రిపేర్ పనులను అర్హత లేని కాంట్రాక్టర్ (అజంతా గోడ గడియారాలు తయారు చేసే ఒరెవా కంపెనీ)కు అప్పగించగా, ఆ కంపెనీ మరో ఇద్దరు సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిందని కోర్టుకు ప్రాసిక్యూటర్ హెచ్ఎస్ పాంచాల్ తెలిపారు. ‘‘బ్రిడ్జికి ఉన్న పాత ఫ్లోరింగ్ ను తొలగించి, కొత్తగా 4 లేయర్లతో అల్యూమినియం ఫ్లోరింగ్ వేశారు. కానీ పాత కేబుల్స్ స్థానంలో కొత్తవి వేయకుండా అలానే వదిలేశారు. దీంతో కొత్త అల్యూమినియం ఫ్లోరింగ్ బరువును ఆపలేక పాత మెయిన్ కేబుల్ తెగిపోయింది. ఫోరెన్సిక్ ల్యాబ్…
తన బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పలు కొత్త మలుపులు తీసుకొంటూ ఉండడంతో ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసహనంకు గురవుతున్నట్లు చెబుతున్నారు. తనకు సన్నిహితుడైన, మరో బాబాయి కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంభం పాత్రపై ఈ కేసుపై దర్యాప్తు జరుపుతున్న సిబిఐ అనుమానిస్తుండగా, సొంత సోదరి వై ఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లి సిబిఐ ముందు అవినాష్ రెడ్డిపై అనుమానం మరింతగా బలపడే విధంగా వాంగ్మూలం ఇచ్చి రావడంతో తీవ్ర ఆగ్రవేశాలకు గురవుతున్నట్లు తెలుస్తున్నది. గత నెలలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి ఈ విషయమై సిబిఐ అధికారులను షర్మిల ఈ కేసు విషయమై కలసి వచ్చిన్నట్లు ఇప్పుడు వెలుగులోకి రావడంతో జగన్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్లు చెబుతున్నారు. దీనిపై తల్లి విజయమ్మకు ఫోన్ చేసి ఇప్పటి దాకా ఓపికతో ఉన్నానని.. షర్మిల తన పరువును బజారుకు ఈడుస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై…
సంప్రదాయం, సాంకేతికత రెండూ ఉన్న ప్రదేశం బెంగళూరు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఇన్వెస్ట్ కర్ణాటక 2022 సమ్మిట్లో ప్రధానివీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటూ భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్లోబల్ క్రైసెస్ సమయంలో కూడా ఆర్థిక వేత్తలు, నిపుణులు భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రశంసిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. పెట్టుబడి దారులను రెడ్ టాపిజం నుంచి విముక్తి చేశామని చెప్పారు. అలాగే వారికి రెడ్ కార్పెట్ అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. తంలో మూసివేయబడిన ప్రైవేటు పెట్టుబడులను కూడా ప్రోత్సహించామని పేర్కొంటూ స్పేస్, డిఫెన్స్, డ్రోన్స్ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించామని చెప్పారు. కరోనా తర్వాత ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రాథమిక అంశాలపై పనిచేస్తున్నామని తెలిపారు. అయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు, నిపుణులు భారతదేశాన్ని మాత్రం ఆర్థిక సంక్షోభం నుంచి శరవేగంగా బయటపడుతుందని చెప్పినట్లు గుర్తు…
కేసీఆర్ సర్కారు, ఆయన కుటుంబం సంపాదించిన అక్రమ సంపాదన కూడా ప్రజలకే చెందాలని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ డా. కె. లక్ష్మణ్ డిమాండ్ చేశారు. యూపీలో అక్రమంగా సంపాదించినోళ్ల నుంచి రూ.12 వేల కోట్లను యోగి సర్కారు స్వాధీనం చేసుకుందని ఆయన గుర్తుచేశారు. ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ సంపాదన ఎంత, ఇప్పుడు ఎంతనేది అందరికీ తెలుసని పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ది ప్రెస్లో మాట్లాడుతూ ఎమ్మెల్యేల కొనుగోలులో రాష్ట్ర బీజేపీ నేతల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించిన స్క్రిప్ట్ అంతా ప్రగతి భవన్ లోనే తయారయిందని ఆరోపించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు వేరే పార్టీ నుంచి గెలిచిన వారేనని, వాళ్లను ఏమిచ్చి టీఆర్ఎస్లో చేర్చుకున్నారో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. ఏ తప్పు చేయకపోతే వాళ్లను ప్రగతి భవన్లో 4 రోజులు ఎందుకు దాచినవని మండిపడ్డారు.టీఆర్ ఎస్ నుంచి 85 మంది…
ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవిఎం)లపై పార్టీ గుర్తులను ముద్రించకుండా నిలిపివేసేలా దాఖలు అయిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఎన్నికల్లో ఈవిఎం, బ్యాలెట్ పేపర్‌పై పార్టీ గుర్తులు ముద్రించకుండా, దానికి బదులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నఅభ్యర్థుల పేరు, వయస్సు, విద్యార్హత, ఫోటోతో ముద్రించేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ బిజెపి నేత అశ్విని కుమార్ ఉపాధ్యారు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్)ను మంగళవారం సిజెఐ జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసును రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ రాజకీయ పార్టీలు, శాసన సభా పక్షాలను గుర్తిస్తుందని తెలిపారు. ”అభ్యర్థికి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీతో ఎన్నికలు సమగ్రంగా అనుసంధానించబడి ఉంటాయి. అలా కాకపోతే ఎన్నికైన…
దేశ చరిత్రలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి అరుదైన నేతగా నిలిచారని ఏపీ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కొనియాడారు. వైఎస్‌ఆర్ లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్, వైఎస్‌ఆర్ అచీవ్‌మెంట్ -2022 అవార్డుల ప్రధానోత్సవం విజయవాడ ఎవన్ కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం జరిగింది.ఈ కార్యక్రమానికి ఐఅండ్ పిఆర్ కమిషనర్ తుమ్మా విజరుకుమార్‌రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించగా, ఆత్మీయ అతిధిగా. వైఎస్ విజయమ్మ వేదికపై ఆశీనులయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన 30 సంస్థలు, 35మంది వ్యక్తులకు గవర్నర్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్నారని, ముఖ్యమంత్రి కాగానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో సేవ చేసిన వ్యక్తులకు ఆయన పేరుతో అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ సామాన్యుల్లో ఉన్న అసమాన్యులకు, అసమాన్య సేవలందిస్తున్న మానవతా మూర్తులకు వరుసగా రెండో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం…
రాజధానిగా అమరావతి అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్ తప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదని, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి తమ రాజధాని నిర్ణయించుకునే సంపూర్ణ అధికారం ఉందని పేర్కొంది. అమరావతిగా రాజధాని ఉండాలంటూ రైతులు, రాజధాని పరిరక్షణ సమితి మరోవైపు ఏపీ ప్రభుత్వం వేర్వేరుగా వేసిన పిటిషన్లపై మంగళవారం సీజేఐ యు.యు.లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు కేసు విచారణ జరగాల్సి ఉంది. అయితే నాట్ బిఫోర్ మీ అంటూ సీజేఐ లలిత్ విచారణ నుంచి తప్పుకున్నారు. తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. వీలైనంత త్వరగా విచారణకు అనుమతినివ్వాలని సూచించారు. ఏపీ విభజన చట్టం అంశంపై గతంలో తాను అభిప్రాయాన్ని వెల్లడించానని గుర్తు…
బీహార్‌లో కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసిన ఆర్జేడీ, జేడీయూ త్వరలో విలీనం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రెండు పార్టీలను ఒక్కటి చేసిన తర్వాత ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్‌కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టి తాను జాతీయ రాజకీయాల పట్ల దృష్టి సారించేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సన్నాహాలు చేస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను కూడగట్టి ప్రధాని నరేంద్రమోదీని ఢీకొట్టబోయేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాను బిజెపి ఏజెంట్ అని చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంతో పాటు బీహార్ లో ఈ తమ కూటమి తిరిగి విడిపోయే అవకాశం లేదని స్పష్టమైన సంకేతం ఇవ్వడం కోసం రెండు పార్టీల విలీనం అత్యవసరం అని భావిస్తున్నట్లు చెబుతున్నారు. నితీష్ కుమార్ కుటుంభంలో రాజకీయాలలో వారసత్వంగా మరెవ్వరు లేకపోవడం, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సహితం వృద్ధాప్య సమస్యలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండడంతో తేజస్వి యాదవ్ కు రాష్ట్రంలో మార్గం సుగమం చేసేందుకు కూడా ఆ…