Author: Editor's Desk, Tattva News

విద్య, వైద్యం తదితర రంగాల్లో దేశంలో అగ్రగామిగా ఉన్న కేరళ రాష్ట్రం మరో అరుదైన రికార్డును నెలకొల్పింది. బాల్య వివాహాలేవీ కేరళలో జరగలేదని తమ తాజా సర్వేలో తేలినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో బాల్య వివాహాలు అధికంగా జరిగే ప్రాంతం జార్ఖండ్‌ అని, మైనర్లుగా వుంటుండగానే పెళ్లిళ్లు అయిపోతున్న బాలికల శాతం ఇక్కడ 5.8గా ఉందని ఆ సర్వే పేర్కొంది. 18 ఏళ్లు రాకముందే వివాహమవుతున్న ఆడపిల్లల శాతం జాతీయ స్థాయిలో 1.9శాతంగా వుండగా, జార్ఖండ్‌లో 5.8శాతంగా నమోదైంది. అదే సమయంలో కేరళలో ఇది సన్నగా ఉందని సర్వే పేర్కొంది. రిజిస్ట్రార్‌ జనరల్‌, జనాభా లెక్కల కమిషనర్‌ కార్యాలయం ఈ సర్వేను నిర్వహించాయి. జార్ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా వివాహాలు 7.3శాతంగా వుండగా, పట్టణ ప్రాంతాల్లో మూడు శాతంగా ఉన్నాయని సర్వే తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా…

Read More

భారత వైమానిక దళం రైజింగ్‌ డే సందర్భంగా శనివారం చండీగఢ్‌లో వైమానిక ప్రదర్శన కన్నుల పండువగా సాగింది. ఈ సందర్భంగా వైమానిక దళ సిబ్బంది ఆకాశంలో చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సులో చేపట్టిన ఎయిర్ షో చూసేందుకు వేలాదిగా స్థానికులు తరలివచ్చారు. రెండున్నర గంటల పాటు ఎయిర్ షో కొనసాగింది. ఈ ప్రదర్శనలో రాఫెల్, సుఖోయ్, మిగ్, ప్రచండ, మిరాజ్, చేతక్, చిరుత, చినూక్, రుద్ర వంటి 80కి పైగా విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేశాయి. వైమానిక దళానికి చెందిన శిక్షణ పొందిన జవాన్లు పారాచూట్ ద్వారా వేల అడుగుల ఎత్తులో చేసిన విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎయిర్‌ చీఫ్‌ వివేక్‌ రామ్‌ చౌదరి కొత్త యూనిట్‌ను ప్రారంభించారు. స్వాతంత్య్రానంతరం తొలిసారిగా వైమానిక దళానికి కొత్త కార్యాచరణ శాఖ.. వెపన్‌ సిస్టమ్‌ బ్రాంచ్‌ను కూడా ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. అలాగే, వైమానిక దళం కోసం…

Read More

భారత్‌లో నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల దృష్టా ఆ దేశంలో పర్యటించేటప్పుడు అత్యంత జాగరూకతతో ఉండాలని అమెరికా తమ దేశ పౌరులను హెచ్చరించింది. అంతేకాకుండా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ, కశ్మీర్‌లో పర్యటించవద్దని కూడా వారికి సలహా ఇచ్చింది. శుక్రవారం తాజాగా విడుదల చేసిన ట్రావెల్ అడ్వైజరీలో అమెరికా విదేశాంగ శాఖ భారత ట్రావెల్ అడ్వైజరీ స్థాయిని 2 నుంచి 4కు తగ్గించింది. ట్రావెల్ అడ్వైజరీ స్కేలుపై 4 అంటే అత్యధిక ప్రమాద స్థాయి అని అర్థం. కాగా అంతకు ముందు రోజు గురువారం విడుదల చేసిన మరో ట్రావెల్ అడ్వైజరీలో అమెరికా విదేశాంగ శాఖ పాకిస్థాన్‌ను మూడో స్థానంలో ఉంచుతూ, ఆ దేశంలో ముఖ్యంగా ఉగ్రవాదం, జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న రాష్ట్రాల్లో పర్యటించి వద్దని తమ పౌరులకు సలహా ఇచ్చింది.‘ నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల దృష్టా భారత్‌లో పర్యటించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండండి’ అని విదేశాంగ శాఖ ఆ అడ్వైజరీలో సూచించింది. ఉగ్రవాదం,…

Read More

శివసేన పార్టీ గుర్తు వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎకనాథ్ షిండే వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరిస్తూ ఓ నిర్ణయం తీసుకొనేందుకు ఎన్నికల కమీషన్ కసరత్తు చేస్తోంది. మరోవంక, ఏ వర్గానికి కేటాయించకుండా పార్టీ గుర్తును ఈసీ స్తంభింపజేస్తే అనుసరింప వలసిన మార్గాల గురించి రెండు శిబిరాలు సంసిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది. శివసేన గుర్తు తమదంటే తమదని ఇప్పటికే ఉద్ధవ్ థాకరే, ఏక్‌నాథ్ షిండే వర్గాలు సుప్రీంకోర్టులో సవాలు చేయడం, నిర్ణయం తీసుకోకుండా ఈసీఐని అడ్డుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తీర్పుచెప్పడంతో ఈసీఐ కసరత్తు ముమ్మరం చేసింది. తాజాగా శివసేన గుర్తును ఏక్‌నాథ్ షిండే వర్గం క్లెయిమ్ చేయడంతో దీనిపై సమాధానం ఇవ్వాలని ఉద్ధవ్ థాకరే వర్గాన్ని ఈసీఐ శుక్రవారంనాడు ఆదేశించింది. ఈ మేరకు ఒక లేఖ రాసింది. తగిన డాక్యుమెంట్లతో అవసరమైన సమాచారాన్ని శనివారం మధ్యాహ్నం 2 గంటల లోపు తమకు సమర్పించాలని ఉద్ధవ్ థాకరే వర్గానికి ఆ లేఖలో ఈసీఐ తెలియజేసింది. …

Read More

కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు జరిపించాలని సిబిఐని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల కేసీఆర్ అవినీతి దాహానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ సజీవ సాక్ష్యమని తీవ్ర విమర్శలు చేశారు. డీఐజీ లెవల్ అధికారితో కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని సీబీఐని కోరినట్లు షర్మిల చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆమె మండిపడ్డారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూ.38 వేల కోట్లు ఉండగా, కేసీఆర్ సీఎం అయ్యాక ఆ వ్యయం రూ. 1.20 లక్షల కోట్లకు చేరుకుందని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. చిన్న పని మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ పథకం వరకు ప్రతి కాంట్రాక్ట్ ను మేఘా సంస్థకే అప్పజెప్పుతున్నారని పేరొక్నటు కేసీఆర్ కు మేఘా సంస్థకు మధ్య అవినీతి ఒప్పందం ఉందని షర్మిల ఆరోపించారు. మేఘా సంస్థకు టెండర్లు అప్పగించే క్రమంలో నియమ, నిబంధనలను తుంగలో తొక్కారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. …

Read More

బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా మార్చి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ కంపెనీ యజమాని, మాజీ ఎమ్యెల్యే, టిడిపి నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని ఈడీ 9 గంటల పాటు ప్రశ్నించింది. కొనుగోలు అంశంపై తనను ప్రశ్నించారని, తాను మనీలాండరింగ్‌కు పాల్పడలేదని చెప్పారు. తమ కంపెనీ తరపున ఎలాంటి అవకతవకలూ జరగలేదని పేర్కొన్నారు. ఈడీ అధికారుల ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పానని, తనను మరోసారి విచారణకు రమ్మన్నారని చెప్పారు. ఈడీ ఎప్పుడు పిలిచినా వెళ్తానని తెలిపారు. ఈడీ అధికారులు గౌరవంగా చూసుకున్నారని జేసీ చెప్పారు. ఈడీ అంటేనే అందరూ భయపడతారని, తనలాంటి వారికి నిజాయితీని నిరూపించుకోవడానికి ఈడీ సరైన చోటని జేసీ చెప్పారు. వాహనాలు కొనుగోలు చేసిన వ్యక్తిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. అశోక్ లైలాండ్ వాహనాల వ్యవహారం అయినప్పుడు వారినే అడగాలని పేర్కొన్నారు. ఇది కోట్ల రూపాయల స్కామ్ ఏమి కాదని అంటూ ఈ కేసుతో తనకు ఎలాంటి…

Read More

ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం పాటుపడే వ్యక్తులు, సంస్థలకు ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతిని అందజేస్తారు. ఈ ఏడాది కూడా నోబెల్ శాంతిని బెలారస్ దేశానికి చెందిన ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బైలియాట్ స్కీ, రష్యాకు చెందిన మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్’, ఉక్రెయిన్ మానవ హక్కుల సంస్థ ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ లను 2022 సంవత్సరానికి గాను నోబెల్ పీస్ ప్రైజ్ కు ఎంపిక చేశారు. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. తమ దేశాల్లో ప్రజలకు ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు పట్ల అవగాహన కల్పించడం, ప్రోత్సహించడం, పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం వంటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులకు, సంస్థలకు శాంతి బహుమతి ఇస్తామని ఈ సందర్భంగా కమిటీ వివరించింది. ఈ ఏడాది శాంతి బహుమతి విజేతలు యుద్ధ నేరాలను నమోదు చేయడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వ అరాచకాలను…

Read More

ముంబైలోని వేర్‌హౌజ్ నుంచి సుమారు రూ. 120 కోట్ల విలువైన 60 కేజీల మెఫిడ్రోన్ డ్ర‌గ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకున్న‌ది. ఈ కేసులో మాజీ ఎయిర్ ఇండియా పైలెట్ సోహెల్ గ‌ఫార్‌ను అరెస్టు చేశారు. ఇటీవ‌ల గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లోనూ భారీ స్థాయిలో డ్ర‌గ్స్‌ను ప‌ట్టుకున్న కేసుతో దీనికి లింకు ఉన్న‌ట్లు పోలీసులు చెబుతున్నారు. జామ్‌న‌గ‌ర్ కేసులో ఇప్ప‌టికే న‌లుగుర్ని అరెస్టు చేశారు. అమెరికాలో శిక్ష‌ణ పొందిన గ‌ఫార్ గ‌తంలో ఎయిర్ ఇండియాలో పైలెట్‌గా ప‌నిచేశారు. అయితే మెడిక‌ల్ కార‌ణాల‌ను చూపుతూ అత‌ను కొన్నాళ్ల క్రితం జాబ్ మానేశారు. విదేశీ డ్ర‌గ్ కార్టెల్ ఇప్ప‌టి వ‌ర‌కు 225 కేజీల మెఫిడ్రోన్ డ్ర‌గ్‌ను మార్కెట్‌లో అమ్మింది. దాంట్లో 60 కేజీల డ్ర‌గ్‌ను గురువారం సీజ్ చేశారు. జామ్‌న‌గ‌ర్‌కు చెందిన నేవీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు ముంబైలో నార్కోటిక్స్ శాఖ దాడులు చేసింది. గ‌త కొన్నాళ్ల నుంచి గుజ‌రాత్‌లో భారీ స్థాయిలో డ్ర‌గ్స్‌ను సీజ్…

Read More

హైదరాబాద్ నాంపల్లిలో అలయ్‌బలయ్ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం సందడిగా నిర్వహించారు. ఏటా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని గుర్తు చేస్తూ కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతో పాటు కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి భగవంత్ కూబా, మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి నరసింహారావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, టిఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, సిపిఐ నేత నారాయణ ప్రభూతులు హాజరయ్యారు. అయితే అలయ్‌బలయ్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కళాకారులతో కలిసి ఆయన డప్పు వాయించారు. పోతురాజులతో కలిసి చిరు డ్యాన్స్ చేశారు. చిరంజీవికి బండారు దత్తాత్రేయ ఆదరంగా స్వాగతం పలికారు. అలయ్ బలయ్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సందడి చేశారు. డప్పు…

Read More

‘‘బర్రెకు సున్నం పూస్తే ఆవు అవుతుందా? టీఆర్ఎస్ పరిస్థితి కూడా అట్లనే ఉంది. బీఆర్ఎస్ గా మార్చినంత మాత్రాన జాతీయ పార్టీ అవుతుందా? బ్యాంకుల నుండి కోట్లు కొల్లగొట్టి దివాళా తీసిన కంపెనీలు కొత్త బోర్డు తగలించినట్లుగా ఉంది బీఆర్ఎస్ తీరు” అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల ద్రుష్టిలో కేసీఆర్ ఇప్పుడు చెల్లని రూపాయి అని, ఆయన ఎన్ని డ్రామాలేసినా… బీఆర్ఎస్సే కాదు.. పీఆర్ఎస్ (ప్రపంచ రాజ్య సమితి) అని పేరు పెట్టుకున్నా ఆయన ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అయినట్లే అంటూ స్పష్టం చేశారు. కేసీఆర్ నిన్న టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పెడితే… మంత్రులకు, టీఆర్ఎస్ నేతలకే ఆ కొత్త పార్టీ సంగతి తెల్వట్లేదు. ఇయాళ ఒకాయనేమో బీఎస్పీ అంటున్నడు. ఇంకోకాయనేమో ఇంకో పేరు చెబుతున్నడు అని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్త విమానం కొనుక్కుని జాతీయ…

Read More