Author: Editor's Desk, Tattva News

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అప్పులు ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో వెల్లడించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో పథకాలను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి అవన్నీ తన ఘనతగా చెప్పుకొంటున్నారని ఆయన దుయ్యబట్టారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రాగానే మూడేండ్లలో రాజధానిని నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజాపోరులో భాగంగా ఆయన గుంటూరు నగరంలోని లాడ్జ్‌ సెంటర్‌లో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగీస్తూ రాష్ట్రంలో ల్యాండ్‌, శాండ్‌, లిక్కర్‌, రైస్‌, మైన్స్‌ మాఫియా రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. మద్యం అమ్మనివ్వనని కోతలు కోసిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మరిచి మద్యం ఏరులైపారేలా చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వమే బ్రాందీ తయారు చేసి అమ్ముతున్నారని ఆరోపించారు. 50 రూపాయల విలువ చేసే మద్యాన్ని 200 రూపాయలకు అమ్ముతూ దోపిడీకి తెరలేపారని దుయ్యబట్టారు. బటన్‌ నొక్కి జగనన్న డబ్బులిస్తున్నాడని అనుకుంటున్న జనం.. ఆ డబ్బంతా చెమటోడ్చి సంపాదించిన కార్మిక…

Read More

సెప్టెంబర్ 29, 30 తేదీలలో గుజరాత్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. సూరత్ లో రూ. 3,400 కోట్కు పైగా విలువైన వివిధ ప్రాజెక్టుల కు సెప్టెంబర్ 29న ఉదయం 11 గంటలకు ప్రధాని శంకుస్థాపన చేయడంతో పాటు వాటిని ప్రజల అంకితం కూడా చేస్తారు. ఆ తరువాత భావ్ నగర్ లో మధ్యాహ్నం పూట 2 గంటలకు రూ. 5,200 కోట్లకు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు కొన్ని కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ముప్ఫై ఆరో జాతీయ క్రీడలను రాత్రి దాదాపు 7 గంటలకు అహమదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియమ్ లో ప్రారంభించనున్నారు. రాత్రి 9 గంటలకు అహమదాబాద్ లోని జిఎండిసి మైదానం లో నవరాత్రి ఉత్సవాలలో ప్రధాన మంత్రి పాలుపంచుకోనున్నారు. గాంధీనగర్-ముంబయి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు సెప్టెంబర్ 30న సుమారు 10:30 గంటలకు గాంధీ నగర్…

Read More

మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు దేశంలో ఈతరం మహిళల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గడిచిన పదేళ్ల కాలంలో దేశంలో సాధారణ సంతానోత్పత్తి రేటు 20 శాతం పడిపోయిందని శాంపిల్ రిజిస్ట్రేషన్ డేటా 2020 రిపోర్టు వెల్లడించింది. దేశంలోని ప్రతి వెయ్యి మంది మహిళలకు ఒక ఏడాదిలో జన్మించిన చిన్నారుల సంఖ్యను జనరల్ ఫర్టిలిటీ రేట్ (జీఎఫ్ఆర్)గా చెబుతారు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లో జీఎఫ్ఆర్ 29 శాతం తగ్గిపోయిందని రిపోర్టు తెలిపింది. పలు సమస్యల కారణంగా పిల్లలను కనేందుకు మహిళలు వాయిదా వేస్తుండడం కూడా కొంతమేరకు కారణం అవుతున్నట్లు భావిస్తున్నారు 2008 -2010లో సగటు జీఎఫ్ఆర్ 86.1గా ఉంటే, 2018-20 మధ్య కాలంలో ఇది 68.7కు తగ్గింది. చిత్రమేమిటంటే పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పరిస్థితి దారుణంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి క్షీణత 15.6 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 20.2 శాతంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి…

Read More

బాలీవుడ్ ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ కు అరుదైన గౌరవం దక్కింది. 2020 సంవత్సరానికి గాను ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆమె చేసిన విశేష సేవలకు గాను ఆమెకు ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. బాలనటిగా సినీరంగానికి ఎంట్రీ ఇచ్చిన ఆశా పరేఖ్ తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నారు. తీస్రీ మంజిల్, కటి పతంగ్, ప్యార్ కా మౌసమ్, దో బదన్, చిరాగ్ వంటి చిత్రాలతో నటిగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా.. మాతృభాష అయిన గుజరాతీతోపాటు పంజాబీ, కన్నడ చిత్రాలలో కూడా నటించింది. అనంతరం 1992లో ఈ నటిని భారత ప్రభుత్వం పద్మ శ్రీతో సత్కరించింది. కాగా.. 79 ఏళ్ల ఈ నటి పెళ్లి చేసుకోకుండా అవివాహితగానే మిగిలిపోయింది. ఈ అవార్డు ప్రకటించిన తర్వాత కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘ఆశా…

Read More

వెనుకబడిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కేంద్రం విశేష కృషి చేస్తోందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి ఎ.నారాయణ స్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ఎస్.సి.ల అభివృద్ది కార్యాచరణ ప్రణాళిక అమలుకై కేంద్ర ప్రభుత్వం 2021-22వ ఆర్థిక సంవత్సరంలో 18 శాఖలకు కేటాయించిన రూ.2,837 కోట్ల నిధుల వెచ్చింపు, అభివృద్ది కార్యాచరణ ప్రణాళిక అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం అమరావతిలోని సచివాలయం ఐదో బ్లాక్ లో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై శాఖల వారీగా అమలు చేస్తున్న ఎస్.సి.కార్యాచరణ ప్రణాళికల అమలు తీరును సమీక్షించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన కేంద్ర సహాయ శాఖ మంత్రి, దేశంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని కాంక్షిస్తూ వారి సంక్షేమం, అభివృద్దికై పలు కేంద్ర్ర పథకాలను అమలు పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయల నిధులను పలు రాష్ట్రాలకు కేటాయిస్తోందని పేర్కొన్నారు. ఇందు కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో…

Read More

సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) మధ్యప్రదేశ్‌లోని నీముచ్ అధికారులు మధ్యప్రదేశ్ నీముచ్ జిల్లా సింగోలి తెహసిల్ రతన్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిథిలో హతిపురా గ్రామ శివార్లలోని ప్రీకాస్ట్ వాల్ & టిన్ షెడ్‌లో నిర్మించిన అనుమానిత ఇల్లు, తాత్కాలిక గోడౌన్ (బాదా)లో సోమవారం సోదాలు చేశారు. మొత్తం 1083.150 కిలోల గసగసాల గడ్డిని (దోడా చురా) స్వాధీనం చేసుకున్నారు. హతీపురా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి గసగసాల అక్రమ రవాణా- స్మగ్లింగ్లో పాల్పడుతున్నాడని, అతని నివాసం, శివార్లలోని ప్రీకాస్ట్ వాల్, టిన్ షెడ్ నిర్మించిన తాత్కాలిక గోడౌన్ (బాడ)లో అక్రమ గసగసాల గడ్డిని (దోడా చురా) దాచిపెట్టినట్టు సమాచారం అందింది. దీనితో ఆ గ్రామంలోని అధికారుల బృందంగా ఏర్పడి సోదాలు చేశారు. ఆపరేషన్ సమయంలో డ్రగ్ ట్రాఫికర్లలో ఒకరు లోడ్ చేసి ఉన్న 12 బోర్ గన్‌తో అధికార బృందంపై గురిపెట్టాడు, కానీ సిబిఎన్ అధికారులు గొప్ప ధైర్యం, తెలివితేటలను ప్రదర్శించి, చాకచక్యంగా ఎదుర్కొంటు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సిబిఎన్ అధికారులకు సహాయం చేయడానికి సమీపంలోని పోలీసు స్టేషన్ల నుండి అదనపు బలగాలను కూడా పిలిపించారు. తాత్కాలిక…

Read More

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీతోపాటు ఇతర సాగునీటి వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్‌ వేయాలన్న డిమాండ్‌ను మరోసారి కేంద్రం ముందు తెలంగాణ ప్రభుత్వం బలంగా వినిపించనుంది. విభజన సమస్యల పరిష్కారంలో భాగంగా బుధ, గురు, శుక్రవారాల్లో కృష్ణా జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌-2 (కేడబ్ల్యూడీటీ-2) ముందు వాదనలు జరగనున్నాయి. కేడబ్ల్యూడీటీ-2 ముందు తెలంగాణ రాష్ట్ర వాదనలను వినిపించేందుకు ఇప్పటికే ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఢిల్లి వెళ్లింది రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ ఈ విషయమై జలసౌధలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. కృష్ణా జలాల పంపిణీ తో పాటు ఇతర సాగునీటి వివాదాల పరిష్కారానికి విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు, సెక్షన్‌ -3 ప్రకారం ట్రిబ్యునల్‌ వేయటమే పరిష్కారమని కేడబ్ల్యూడీటీ ముందు బలంగా వాదనలు వినిపించాలని ఆయన ఉన్నతాధికారులకు మార్గనిర్దేశనం చేసినట్లు తెలిసింది. దక్షిణ తెలంగాణ వరప్రదాయిని అయిన పాలమూరు-రంగారెడ్డితోపాటు కృష్ణా నది…

Read More

దేశంలో విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ దందాపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న విధానం, లోకల్ గ్యాంగుల నిర్వాకంపై సుప్రీంకోర్టు ఆరా తీసింది. దీన్ని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. అయితే ఇదంతా మాజీ సీజేఐ ఎన్వీ రమణ లేఖ ఆధారంగానే జరిగిందని తెలుస్తోంది. ఇక, కోర్టు విచారణలో సహకారిగా షోయబ్ ఆలం నియామకమయ్యారు. ఈ క్రమంలో సోమవారం కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. కాగా, అక్టోబర్ 18వ తేదీ నుంచి డ్రగ్స్ కేసు విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో డ్రగ్స్‌ మాఫియా రెచ్చిపోతోంది. దీనికి అడ్డాగా గుజరాత్, ముంబయి రాష్ట్రాలే అడ్డగా మారాయి. దీనికి అక్కడ పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడడమే సాక్ష్యం. ముఖ్యంగా యువతను టార్గెట్‌ చేసుకుంటున్న డ్రగ్స్ మాఫియా ఆ మేరకు మత్తు పదార్థాలను సప్లయ్ చేస్తోంది. దీనికోసం సరికొత్త మార్గాలను కూడా అన్వేషిస్తోంది. తాజాగా ముంబై…

Read More

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బెయిల్‌ మంజూరుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారి నేతృత్వంలోని ధర్మాసనం శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ ఇచ్చేందుకు తిరస్కరించింది. బెయిల్‌ ఇచ్చేందుకు తమకు ఎలాంటి కారణాలు కనిపించడంలేదని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేవిరెడ్డి తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. వివేకానందరెడ్డి హత్యకేసులో తొలుత దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ లో శివశంకర్ రెడ్డి పేరు లేదని ఆయన వాదించారు. అప్రూవర్‌గా మారిన వాచ్‌మెన్ స్టేట్ మెంట్‌లో కూడా శివశంకరరెడ్డి పేరు లేదని పేర్కొన్నారు. ఏ1…

Read More

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ జ‌మ్ము క‌శ్మీర్‌లో డెమొక్ర‌టిక్ ఆజాద్ పార్టీ పేరుతో సోమ‌వారం నూత‌న పార్టీని ప్ర‌క‌టించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన నెలరోజుల అనంతరం ఈ పరిణామం జరగడం గమనార్హం. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన గులాం నబీ ఆజాద్‌ గత నెల 26న ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాహుల్‌ రాకతో పార్టీ పతనం ప్రారంభమైందంటూ అధిష్టానంపై మండిపడ్డారు. జమ్మూలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆజాద్‌ .. పార్టీ పేరుతో పాటు జెండాను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా పసుపు, తెలుపు, నీలం రంగుల్లో ఉన్న పార్టీ జెండాను ఆయన మీడియాకు విడుదల చేశారు. ”పసుపు సృజనాత్మకత, ఏకత్వానికి.. తెలుపు శాంతికి.. నీలం స్వేచ్చ, పరిమితుల్లేని పయనానికి ప్రతీక” అని ఆజాద్‌ పేర్కొన్నారు. తమ పార్టీ లౌకిక, ప్రజాస్వామ్యయుతంగా, ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా స్వతంత్రంగా ఉంటుందని…

Read More