Author: Editor's Desk, Tattva News

పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాబన్న చలో.. సచివాలయ ముట్టడి పేరుతో బీజేపీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తకు దారితీసాయి. దీంతో పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు కోల్‍కతా, హౌరా రైల్వే స్టేషన్లకు వెళ్లారు. అక్కడ వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి నిలువరించారు. దీం తో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ కార్యకర్తలు పోలీసులతో బాహాబాహీకి దిగారు. దీంతో రాణిగంజ్ రైల్వే స్టేషన్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య ఘర్షణ తలెత్తింది. పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ఉపపయోగించారు. దీంతో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో రాణిగంజ్ రైల్వే స్టేషన్ ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దుర్గాపూర్ రైల్వే స్టేషన్ లో 20 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని…

Read More

కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ఎంతో అర్భాటంగా చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కేరళలో ప్రవేశించడం, తమ పార్టీ అధికారంలో ఉన్న ఆ రాష్ట్రంలో ఏకంగా 18 రోజుల పాటు సాగబోవడం పట్ల సిపిఎం మండిపడుతున్నది.  మరోవంక, దేశంలో అతిపెద్ద రాష్ట్రమే  కాకుండా, బిజెపి అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ లో కేవలం రెండు రోజులు మాత్రమే సాగేటట్లు షెడ్యూల్ ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.  దేశాన్ని సమైక్యపరిచేందుకు ఉద్దేశించినదా లేక కేరళలో కాంగ్రెస సీట్ల కోసం చేపట్టిన యాత్రా ? అని సిపిఎం సోమవారం ప్రశ్నించింది. ఈ మేరకు కమ్యూనిస్టు పార్టీ అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌ ఒక పోస్టర్‌ను ట్వీట్‌ చేసింది. కేరళ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల సైజుల్లో గల తేడాను పోలుస్తూ , వామపక్షం పాలించే కేరళలో ఏకంగా 18 రోజులు గడిపే కాంగ్రెస్‌, బిజెపి అధికారంలో వున్న యుపిలో కేవలం రెండు రోజులు కేటాయించడం విడ్డూరంగా వుందని పేర్కొంది.…

Read More

వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టకపోతే కరెంట్ కట్ చేసేలా కేంద్రం విద్యుత్ బిల్లును రూపొందించిందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్కడివో పాత పేపర్లను, చిత్తు కాగితాలను పట్టుకుని పవిత్రమైన అసెంబ్లీని కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర నాల్గవ దశను సోమవారం ప్రారంభిస్తూ అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిందంతా అబద్దమని నిరూపించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. ‘‘కేసీఆర్… ఇదిగో కేంద్ర విద్యుత్ బిల్లు… నీకు పంపిస్తున్నా. చదువుకో… నీకే గనక సిగ్గు, లజ్జ ఉంటే తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయ్. పవిత్రమైన అసెంబ్లీనే తప్పుదోవ పట్టించిన నువ్వు వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే. ఒకవేళ నేను చెప్పేది తప్పయితే రాజీనామాకు సిద్ధం’’అని సవాల్ విసిరారు. బీజేపీ పేరుతో మోటార్లకు మీటర్లు పెట్టేందుకు, కరెంట్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజలపై మరో…

Read More

పాడి పశువులన్నింటికీ ఆధార్ కార్డు తయారు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. దేశంలో డెయిరీ రంగాన్ని సైన్స్‌తో ముడిపెట్టి విస్తరిస్తున్నట్లు అంతర్జాతీయ పాడిపరిశ్రమ సదస్సును ప్రారంభిస్తూ తెలిపారు. పాడి జంతువులకు సంబంధించిన అతిపెద్ద డేటాబేస్‌ను భారత్ రూపొందిస్తోందని ఆయన చెప్పారు. డెయిరీ రంగానికి సంబంధించిన ప్రతి జంతువును ట్యాగ్ చేస్తున్నట్లు తెలిపారు. కిసాన్ యోజన లేదా మరేదైనా ప్రభుత్వ సహాయం నేరుగా రైతు, పౌరుల ఖాతాకు వచ్చేందుకు ఆధార్ సహకరిస్తోంది. ఇప్పుడు ఆధార్ కార్డును గేదెలకు సైతం అందించాలని భావిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఆధార్ కార్డును రూపొందించడానికి బయోమెట్రిక్ సమాచారం అవసరం. అంటే వేలిముద్రలు, కళ్లు తదితర సమాచారం తీసుకుంటారు. ఈ విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జంతువుల బయోమెట్రిక్ సమాచారాన్ని తీసుకుంటామని మోదీ తెలిపారు. ఈ ప్రచారానికి పశు ఆధార్ అని పేరు పెట్టారు. జంతువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు, పాల ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్‌ను విస్తరించేందుకు ఇది దోహదపడుతుందని…

Read More

దాదాపు ప్రతి 150 మందిలో ఒకరు అంటే ప్రపంచవ్యాప్తంగా ఐదు కోట్ల మంది ప్రజలు ఆధునిక బానిసత్వంలో మగ్గుతున్నారని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ  (ఐఎల్‌ఒ) అంచనా వేసింది.  వీరు బలవంతంగా పనిలోకి లేదా బలవంతపు వివాహ బంధంలోకి అడుగిడుతున్నారని తెలిపింది. ఇటీవలి సంవత్సరాల్లో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని రూపాల్లోని ఆధునిక బానిసత్వాన్ని 2030 కల్లా తుడిచిపెట్టాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకుంది. 2016-2021 మధ్య కాలంలో ఇలా బలవంతపు పని లేదా బలవంతపు వివాహంలోకి అడుగిడేవారి సంఖ్య ఏకంగా కోటి పెరిగిందని ఐక్యరాజ్య సమితి సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఐక్యరాజ్య సమితి కార్మిక, మైగ్రేషన్‌ సంస్థలు వాక్‌ ఫ్రీ ఫౌండేషన్‌తో కలిసి ఈ సర్వే నిర్వహించాయి. గత ఏడాది చివరిలో 2.8కోట్ల మంది కట్టు బానిసలుగా మారగా, 2.2 కోట్ల మంది బలవంతపు వివాహ బంధంలోకి అడుగిడారని వెల్లడైంది. 2017లో ప్రచురించిన నివేదికతో…

Read More

హర్యానా  బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగాట్ (42) మృతి కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ షిపార్సు మేరకు కేంద్ర హోంశాఖ సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఫోగాట్ కుటుంబ సభ్యులు స్వాగతించారు.  గోవా పర్యటనకు వెళ్లిన నటి సోనాలి ఫోగాట్ ఆగస్టు నెలలో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆమె మొదట గుండెపోటుతో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం ఫొటాట్ శరీరంపై పలుచోట్ల గాయాలున్నట్లు తేలింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు హత్యగా నిర్ధారించారు.  సోనాలి ఫోగాట్ సహాయకులైన సుధీర్ సంగ్వాన్, సుఖ్వీందర్ తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు.   ఈ క్రమంలోనే ఫోగాట్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. పనాజీ పోలీసులు అన్ని…

Read More

తెలంగాణ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్‌పై అవినీతి ఆరోపణలపై డివోపీటీ వైఖరిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రజత్ కుమార్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని డీఓపీటీని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. రజత్ కుమార్ కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లులను మేఘా సంస్థ చెల్లించిందని డీఓపీటీకి గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.  ఆ పిటిషన్ ను తెలంగాణకు బదిలీ చేయడంపై ఢిల్లీ హైకోర్టును ఆయన ఆశ్రయించాడు. స్పెషల్ సీఎస్ స్థాయి అధికారిపై సీఎస్ ఎలా చర్యలు తీసుకుంటారని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని డీఓపీటీని ఆదేశించింది.  తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి హైకోర్టు వాయిదా వేసింది. రజత్ కుమార్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కూడా పిటిషన్‌లో గవినోళ్ల శ్రీనివాస్ కోరారు.  హైదరాబాద్లోని పేరొందిన స్టార్ హోటళ్ల  వేదికగా ఐదు రోజులపాటు రజత్ కుమార్ తన కూతురు పెండ్లి  వేడుక నిర్వహించారు.  డిసెంబర్ 17 నుంచి 21 మధ్య జరిగిన ఈ వేడుకకు ఈవెంట్లు,…

Read More

జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సోమవారం కీలక ఆదేశాలను వెలువరించింది. మసీదులోని దేవతా విగ్రహాలకు పూజలు నిర్వహించేలా ఆదేశించాలన్న హిందూ పక్షం పిటిషన్ ను సమర్ధించింది. దీంతో సెప్టెంబరు 22 నుంచి ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. ఇదే సమయంలో జ్ఞానవాపి మసీదుకు చెందిన అంజుమన్ ఇంతెజామియా కమిటీ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. హిందూ పక్షాల తరఫున లాయర్ విష్ణుశంకర్ జైన్ మాట్లాడుతూ.. ముస్లిం పక్షం పిటిషన్ ను కోర్టు తిరస్కరించిందని తెలిపారు. దేవతా విగ్రహాల నిత్య పూజలకు అనుమతించాలన్న దావా నిర్వహించదగినదని సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే విశ్వేశ్ పేర్కొన్నారని చెప్పారు. మసీదు ప్రాంగణంలో విగ్రహాల విషయమై విచారణే అవసరం లేదని, దీనిపై కొంతమంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని అంజుమన్ ఇంతెజామియా కమిటీ అఫిడవిట్ దాఖలు చేసింది. మసీదుకు సంబంధించిన స్థలం సహా మిగిలిన ఆస్తులు పూర్తిగా వక్ఫ్ బోర్డుకు చెందుతాయని పేర్కొంది.…

Read More

రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నేటితో వెయ్యి రోజులకు చేరింది. మరోవైపు వారు రెండో విడత మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. కాసేపటి క్రితం పాదయాత్ర ప్రారంభమయింది. వెంకటపాలెం గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి, స్వామివారి రథాన్ని ముందుకు నడిపి పాదయాత్రను ప్రారంభించారు. తొలిరోజు మంగళగిరి వరకు పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో పార్టీలకతీతంగా పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా వెంకటేశ్వరస్వామి రథం నిలిచింది. రైతుల మహాపాదయాత్రకు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు దాదాపు 1,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. నవంబర్ 11న అరసవల్లిలో పాదయాత్ర ముగుస్తుంది. రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాల రైతులు, మహిళలు, రైతు కూలీలు విడతల వారీగా పాదయాత్రలో పాల్గొంటున్నారు. 60 రోజుల పాటు 12 పార్లమెంటు, 45 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. తొలి…

Read More

సూపర్‌ఫామ్‌లో ఉన్న శ్రీలంక ఆసియా కప్ 2022 విజేతగా అవతరించింది. ఫైనల్లో పాక్‌పై శ్రీలంక 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. శ్రీలంక బ్యాటర్ భానుక రాజపక్స 6 ఫోర్లు, ౩ సిక్స్‌లతో 71పరుగులు చేసి హాఫ్‌సెంచరీతో ఆకట్టుకోగా బౌలింగ్‌లో మధుషన్ 4 వికెట్లు, హసరంగా 3 వికెట్లుతో పాక్‌ను కుప్పకూల్చారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 147 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో శ్రీలంక 23 పరుగుల తేడాతో గెలిచి ఆసియాకప్‌ను కైవ సం చేసుకుంది. పాక్ వికెట్ కీపర్ రిజ్వాన్ (55) హాఫ్‌సెంచరీ సాధించి ఒంటరి పోరాటం చేసినా పాకిస్థాన్ ఓటమిని తప్పించుకోలేక పోయింది. ఆసియా కప్ 2022 తుదిపోరులో పాక్, శ్రీలంక జట్లు దుబాయ్ వేదికగా తలపడ్డాయి. టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుని లంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో నిసాంక, కుశాల్…

Read More