Author: Editor's Desk, Tattva News

బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు నితీష్‌కుమార్‌ చేస్తున్న ప్రయత్నాలను ప్రశాంత్‌ కిషోర్‌ ఎద్దేవా చేశారు. గతంలో నితీష్‌కుమార్‌ ప్రధాని మోదీతో ఉన్న నాలుగు ఫోటోలపై ‘డిలీటెడ్‌’ అనే స్టాంప్‌తో ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  నితీష్‌ కుమార్‌ నెల క్రితం కేంద్రంలోని అధికార పార్టీతో ఉన్నారని, కానీ ప్రస్తుతం ప్రతిపక్షాలతో జత కట్టారని ప్రశాంత్‌ కిషోర్‌ పేర్కొన్నారు. ఇది ఎంతవరకు నమ్మదగినదో అనేది ప్రజలే నిర్ణయిస్తారని అంటూ తెలిపారు. బీహార్‌లో కొత్త ప్రభుత్వం దేశంపై పెద్దగా ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదని, ఇది రాష్ట్ర ప్రత్యేక అభివృద్ధిగా కనిపిస్తోందని పెదవి విరిచారు.  బీహార్ కూటమి జాతీయ రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపుతుందని తాను అనుకోవడం లేదని తేల్చి చెప్పారు. అయితే జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ఎవరైనా ప్రయత్నించడానికి స్వేచ్ఛ ఉందని తెలిపారు.…

Read More

నేతాజీ సుభాష్ చంద్రబోస్ చూపిన బాటలో నడిచి ఉంటే.. దేశం ఉన్నత శిఖరాలను చేరి ఉండేదని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.  దురదృష్టవశాత్తు ఆయనను మరిచిపోయారని విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు అనేక సౌలతులతో తీర్చిదిద్దిన ‘కర్తవ్యపథ్’ రోడ్డును, సెంట్రల్ విస్టా లాన్స్​ను గురువారం సాయంత్రం ప్రధాని ప్రారంభించారు. ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేసిన 28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని కూడా మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్తవ్యపథ్​కు ఇంతకుముందున్న రాజ్ పథ్ అనే పేరు బ్రిటీష్ కాలం నాటి బానిసత్వానికి సంకేతంగా ఉండేదని పేర్కొన్నారు. రాజ్ పథ్ పేరును కర్తవ్యపథ్​గా మార్చడంతో దేశానికి కొత్త శక్తి, స్ఫూర్తి వచ్చాయని చెప్పారు. ‘‘ఇయ్యాల్టి నుంచి రాజ్ పథ్ అనే పేరు చరిత్రగా మారింది. కర్తవ్యపథ్​తో కొత్త చరిత్ర మొదలైంది. ఇయ్యాల కర్తవ్యపథ్ ఆర్కిటెక్చర్, స్ఫూర్తి మారిపోయాయి.  ఈ…

Read More

కొద్దికాలం క్రితమే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ప్రముఖ సినీనటి దివ్యవాణి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేఎల్పీ నేత, తెలంగాణ  పార్టీలో చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌ తో ఆమె భేటీ కావడంతో ఇటువంటి కధనాలు వెలువడ్డాయి.  గురువారం ఉదయం హైద‌రాబాద్ శామీర్‌పేట‌లో ఉన్న ఈట‌ల రాజేందర్ నివాసానికి వెళ్లి ఆయనతో ఆమె భేటీ అయ్యారు. త్వరలోనే బిజెపిలో చేరడానికి అంగీకరించినట్లు సమాచారం.  దివ్యవాణి ముఖ్యంగా తెలంగాణలో క్రియాశీలకంగా ఉండేందుకు నిర్ణయించుకున్నట్లు తెలియవచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆమె టీడీపీలో చేరారు. అధికార ప్రతినిధిగా ఆమెను నియమించారు.  ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె పాల్గొన్నారు. అయితే మే నెలలో జరిగిన మహానాడులో తనకు ప్రసంగించే అవకాశం ఈయలేదని, పార్టీలో కొందరు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ  దివ్యవాణి టీడీపీకి దూరమయ్యారు.

Read More

తెలంగాణలో రైతుల జీవితాలు చీద్రం అవుతుంటే ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం తెలంగాణ రైతు వెలిగి పోతున్నాడంటూ బూటకపు ప్రచారం చేసుకుంటున్నాడని రైతు సంఘాల ఐక్య వేదిక నిర్వహించిన రౌండ్ కు రాష్ట్రం నలుమూలల నుండి హాజరైన  రైతు ప్రతినిధులు ధ్వజమెత్తారు.  వేదిక సమన్వయకర్త ఎస్ జైపాల్ రెడ్డి అధ్యక్షతన హాజరైన సమావేశంలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి రైతు ప్రతి నిధులు హాజరై కెసిఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు, జైపాల్ రెడ్డి మాట్లాడుతూ 26 రాష్ట్రాల నుండి వచ్చిన రైతు ప్రతి నిధులు క్షేత్ర స్థాయి లో పర్యటన చేసారా? రైతుల గోడు విన్నారా?  అని ప్రశ్నించారు.  ఫైవ్ స్టార్ హోటల్ నుండి కెసిఆర్ కు ఎలా సర్టిఫికెట్ ఇస్తారు? అని నిలదీశారు, నల్గొండ జిల్లా కు చెందిన రైతు ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు సమస్యలపై రైతు సంఘాలకు ఏనాడైనా కెసిఆర్ అనుమతి ఇచ్చాడా? అని ప్రశ్నించారు, లక్ష రూపాయల రుణ…

Read More

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల మహారాష్ట్ర పర్యటనలో పెద్ద భద్రతా ఉల్లంఘన జరిగింది. మంత్రి రెండు రోజుల ముంబై పర్యటన సందర్భంగా హోంమంత్రి అమిత్ షా భద్రతను ఉల్లంఘించారనే ఆరోపణలపై మహారాష్ట్రలోని ధూలేకు చెందిన వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. హేమంత్ బన్సీలాల్ పవార్(32 ) అనే ఆ నిందితుడు షాతో పాటు ఇతర రాజకీయ నాయకులతో కలిసిమెలిసి పోయిన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు హేమంత్ పవార్‌ను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ముఖ్యమంత్రి ఎకనాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ లను కలసినప్పుడు, బిజెపి నాయకుల సమావేశంలో పాల్గొన్నప్పుడు సహితం అమిత్ షాకు సమీపంలోనే అతను ఉన్నట్లు వెల్లడైనది.  “పవార్‌పై పబ్లిక్ సర్వెంట్‌గా వ్యవహరించినందుకు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సెక్షన్ 170 మరియు ఐపిసి సెక్షన్ 171 కింద కేసు నమోదు చేయబడింది” అని విచారణ అధికారి తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పక్షం వైసీపీకి చెందిన…

Read More

బ్రిటన్‌ కొత్త ప్రధాని లిజ్‌ ట్రస్‌ మంత్రివర్గంలో భారత సంతతికి చెందిన ఇద్దరికి స్థానం లభించింది. ఇప్పటివరకు అటార్నీ జనరల్‌గా వున్న సుయెల్లా బ్రావర్‌మన్‌ (47) కొత్తగా మంత్రివర్గంలోకి అడుగిడి, హోం మంత్రి అయ్యారు. ఇదివరకు బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో సహితం ఇద్దరు భారత సంతతికి చెందినవారు ఉండేవారు. రిషి సునాక్ (ఆర్ధికం), ప్రీతి పాటిల్ (హోమ్) కీలక శాఖలను నిర్వహించేవారు. భారత సంతతికి చెందిన అలోక్‌ శర్మ (55) వాతావరణ కార్యాచరణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. తమిళ, గోవా వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బ్రావర్‌మన్‌ లండన్‌లో జన్మించారు. బారిస్టర్‌ చదివారు. ఆగేయ ఇంగ్లండ్‌లోని ఫరేహమ్‌ ఎంపిగా ఉన్నారు. అందరూ ఉహించినట్లుగానే ప్రధాని పదవికి పోటీపడిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ కు మంత్రివర్గంలో చోటు దక్కక పోవడమే కాక, ఆయన మద్దతుదారులుకు సహితం చాలావరకు దక్కలేదు. బోరిస్‌ జాన్సన్‌ వారసురాలిగా ట్రస్‌ ఎన్నికవగానే హోం మంత్రి ప్రీతి పటేల్‌ రాజీనామా చేశారు. ఆ బాధ్యతలను సుయెల్లా బ్రావర్‌మన్‌ చేపడుతున్నారు. దేశంలో నేరాల…

Read More

కర్ణాటక హిజాబ్‌ నిషేధం కేసు కేవలం పాఠశాలల్లో నిబంధనల గురించి మాత్రమేనని సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఎక్కడా, ఏ ప్రాంతంలోనూ హిజాబ్‌పై నిషేధం విధించలేదని తెలిపింది. కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్‌ ధరించడాన్ని నిషేధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల విచారణలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 19, 21, 25 ప్రకారం ఒక బాలికకు హిజాబ్‌ ధరించే హక్కు ఉందని పిటీషనర్లు వాదించారు. దీనికి స్పందిస్తూ జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుధాన్షు దులియా ధర్మాసనం ‘హిజాబ్‌ ధరించకుండా మిమ్మల్ని ఎవ్వరూ నిషేధించలేదు. మీరు కోరుకుంటే ఎప్పుడైనా ధరించవచ్చు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే పాఠశాలల్లో నిబంధనల గురించి. దాని గురించే మేం ఆందోళన చెందుతున్నాం’ అని తెలిపింది. దీనికి సమాధానంగా పిటీషనర్ల తరపున న్యాయవాది ‘పాఠశాలల్లో యూనిఫాం నిబంధనలను…

Read More

సరకు రవాణాలో రైల్వే వాటాను మరింత పెంచడంతో పాటు రైల్వే ఆదాయాన్ని మరింత పెంచడానికి దోహదపడేలా కేంద్ర మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు రైల్వే భూ విధానాన్ని మార్చాలన్న ఆ శాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాన మంత్రి గతి శక్తి ఫ్రేమ్‌వర్క్ అమలు కోసం రైల్వే భూమిని దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే విధానాన్ని క్యాబినెట్ ఆమోదించింది. తద్వారా రైల్వేకు మరింత రాబడితో పాటు దాదాపు 1.2 లక్షల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా 300 చోట్ల పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లను ఈ ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా నిర్మించనున్నారు. ఫలితంగా రైల్వే మరింత కార్గోను ఆకర్షించడంలో, సరకు రవాణాలో రైల్వే వాటాను మరింత పెంచడంలో ఈ టెర్మినళ్లు దోహదపడతాయి. తక్కువ ఖర్చుతో కూడుతున్న రైల్వే సరకు రవాణా ద్వారా దేశంలో వివిధ వస్తువుల ధరలు సైతం తగ్గే అవకాశం…

Read More

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం కన్యాకుమారిలో ప్రారంభమైంది. ఈ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అంతకుముందు ఇవాళ మధ్యాహ్నం 3.05 గంటలకు తీరువల్లూర్ మెమోరియల్ ను, 3.25గంటలకు కామరాజ్ మెమోరియల్‌ను రాహుల్ సందర్శించారు. సాయంత్రం 4.10గంటలకు మహాత్మాగాంధీ మండపం వద్ద ప్రార్థనలో పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంటలకు మహాత్మాగాంధీ మండపంలో జాతీయ జెండా అందజేత కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీకి తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ జాతీయ జెండాను అందించారు. మధ్యాహ్నం 4.40 గంటలకు భారత్ జోడో యాత్రికులతో కలిసి మహాత్మా గాంధీ మండపం నుంచి బీచ్ రోడ్ వరకు జరిగే మార్చ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ‘మనమందరం భారత్ ను ఏకం చేద్దాం’ అనే నినాదంతో భారత్ జోడో యాత్ర ముందుకు సాగుతుందని రాహుల్ తెలిపారు. భారత్ జోడో యాత్ర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సభలో కాంగ్రెస్ సీనియర్…

Read More

2025 నాటికి భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగం 50 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో “సీజింగ్ ది గ్లోబల్ ఆపర్చునిటీ” పై జరిగిన 14వ సిఐఐ గ్లోబల్ మెడ్ టెక్ సమ్మిట్ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో గత రెండేళ్లలో ఆరోగ్య సంరక్షణ రంగం ఇన్నోవేషన్, టెక్నాలజీపై మరింత దృష్టి సారించిందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో డిజిటల్ హెల్త్ కేర్ టూల్స్ లో తమ పెట్టుబడులను పెంచుకోవాలని 80 శాతం హెల్త్ కేర్ సిస్టమ్స్ లక్ష్యంగా పెట్టుకున్నాయని ఆయన వెల్లడించారు. 2025 నాటికి టెలిమెడిసిన్ కూడా 5.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని భావిస్తున్నట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సాంకేతిక జోక్యం తో రూపొందించిన ఈ సంజీవని, వర్చువల్ డాక్టర్ కన్సల్టేషన్లకు అవకాశం కల్పించిందని, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలను…

Read More