ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్ వాద్రా బుధవారంనాడు కాంగ్రెస్ పార్టీ ‘భారత్ జోడో యాత్ర’ పోస్టర్లతో కూడిన ఓ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ పోస్టర్లలో ఆయన కూడా ఉన్నారు. దీంతో వాద్రా ప్లాన్స్ ఏమిటంటూ బీజేపీ నుంచి మరికొందరిని నుంచి వరుస కామెంట్లు వచ్చాయి. ”భారత్ జోడా యాత్రలో వాద్రా కలవడం ఫన్నీగా ఉంది. ఇప్పుడు ఆయన అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడగలనని అనుకుంటున్నారా?” అని బీజేపీ మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. వాద్రా ట్వీట్‌కు జోడించిన పోస్టర్లలో ప్రియాంక, రాహుల్ గాంధీ, ఆ పక్కనే రాబర్ట్ వాద్రా ఉన్నారు. వారిపైన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో పాటు, స్పానర్స్ జేడీ అభిజిత్ ఫోటో కూడా ఉంది. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ విభాగం నేతగా అభిజిత్ ఉన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అవినీతి, ఆశ్రితపక్షపాతం…
Author: Editor's Desk, Tattva News
భారత్‌లో కరోనా మహమ్మారి ముందు, తర్వాత కూడా విచ్చలవిడిగా యాంటీ బయోటెక్స్‌ను వినియోగిస్తున్నారని దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. ఆగ్నేయాసియాలో ప్రాంతీయ ఆరోగ్యంపై లాన్సెట్ అధ్యయనం చేపట్టిన సందర్భంగా ఈ నివేదిక వెల్లడించింది. లాన్సెట్ చేపట్టిన ఈ పరిశోధన వివరాలు సెప్టెంబర్ 1న ప్రముఖ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. న్యూఢిల్లీకి చెందిన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నుండి ఆష్నా మెహతా ఈ అధ్యయనానికి సహకరించారని తెలిపింది. దేశవ్యాప్తంగా ఫార్మా ట్రాక్ డేటా అధ్యయం ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది. ఈ యాంటిబయోటెక్స్‌లో చాలా వరకు సెంట్రల్ డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదం పొందలేదని, వీటిని వెంటనే నియంత్రించాలని పిలుపునిచ్చింది. భారత్‌లో యాంటిబయోటెక్స్‌ను అధికంగా వినియోగిస్తున్నందున… వాటిపై నియంత్రణ విధించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపింది. జాతీయ, రాష్ట్ర స్థాయి ఏజన్సీల మధ్య భేదాలుండటం వలన పరిమితుల కారణంగా ఈ యాంటిబయోటిక్స్ లభ్యత, వినియోగం, విక్రయాన్ని నియంత్రిచడం…
తనను శాసనసభలో ఉండకుండా చేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నాడని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు. తాను స్పీకర్ పై చేసిన వాఖ్యలసాకుతో తనపై అనర్హత అస్త్రం ప్రయోగించే ప్రయత్నం గురించి ప్రస్తావించగా ఇప్పటివరకు తనకు ఎటువంటి నోటీసులు అందలేదని చెప్పారు. నోటీసులు ఇస్తే ఇవ్వోచ్చేమో అని చెప్పారు. మంగళవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జరిపిన బిఎసి సమావేశంపై తమలో ఎవ్వరిని ఆహ్వానించక పోవడంపై బిజెపి ఎమ్యెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పర్యాయం కూడా బిజెపి ఎమ్యెల్యేలను ఆహ్వానించక పోవడమే కాకుండా, ముగ్గురిని కూడా మొదటి రోజునే సమావేశాల చివరి వరకు సభ నుండి బహిష్కరించారు. స్పీకర్ ఒక మర మనిషి లాగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు.సీఎం చెప్పింది చేయడం తప్పా.. స్పీకర్ పోచారానికి వేరే పని లేదని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఏపీలో ఒక్క ఎమ్మేల్యే ఉన్నా బీఏసీ సమావేశానికి పిలిచేవారని చెబుతూ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం సభ సంప్రదాయాలను…
దేశంలో ఖనిజ అన్వేషణను మరింత ప్రోత్సహించడానికి, మైనింగ్ రంగంలో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన విధాన సంస్కరణల ప్రభావాన్ని అంచనా వేయడానికి నూతన, సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో హైదరాబాద్ లో రెండు రోజుల పాటు గనుల మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనున్నాయి. కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, గనులు, బొగ్గు, రైల్వే శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ దాన్వే, బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు (గనులు), డిజిఎంలు/డిఎమ్ జిలతో పాటు ఇతర సీనియర్ అధికారులు ఈ కీలకమైన సదస్సుకు హాజరుకానున్నారు. రాబోయే 25 సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖనిజాలకు ఉన్న డిమాండ్ ప్రస్తుత ఉత్పత్తిని మించిన విషయం దృష్ట్యా, మన మొత్తం పురోగతిలో ఖనిజ రంగం కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల, ఖనిజ…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిజామాబాద్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణల పట్ల బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్ ఛార్జ్ తరుణ్ ఛుగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అవి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. జాతీయ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకునే హక్కు కేసీఆర్ కు ఉందని, కానీ దానిని అడ్డం పెట్టుకొని ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధాలు ప్రచారం చేయడం సరైంది కాదని హితవు చెప్పారు. కేసీఆర్ అసంబద్ధ విధానాలతో ఇప్పటికే తెలంగాణ డిస్కమ్‌లను అప్పుల ఊబిలో కూరుకుపోయాయని ఆయన పేర్కొన్నారు. అది చాలదన్నట్టు జాతీయ స్థాయిలోని సంస్థలను దివాళా తీయించాలని కేసీఆర్ చూస్తున్నాడని ధ్వజమెత్తారు. వ్యవసాయ పంపులకు మీటర్లు పెడుతారన్న దాని గురించి కేసీఆర్ తప్పితే ఎవరూ మాట్లాడడం లేదని అంటూ కేసీఆర్ మాత్రం ప్రతి మీటింగులో మోటార్లకు మీటర్ల పెడుతారంటూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పదేపదే…
వివాహాన్ని చట్టబద్ధత కల్పించేందుకు ఆర్యసమాజ్ సంస్థలు ఇచ్చే సర్టిఫికేట్ ఒక్కటే సరిపోదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాల్సిందేనని పేర్కొంది. వివిధ ఆర్యసమాజ్ సంస్థలు జారీ చేసిన వివాహ ధృవీకరణ పత్రాలను ఈ కోర్టుతో పాటు ఇతర హైకోర్టులు వేర్వేరు విచారణల సమయంలో తీవ్రంగా ప్రశ్నించాయని హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణలో భాగంగా జస్టిస్ సౌరభ్ శ్యామ్ సమాశ్రయ్ పేర్కొన్నారు. ఆర్యసమాజ్‌లో వివాహం చేసుకున్నా దాన్ని రిజిస్టర్ చేయకపోతే గుర్తించలేమని పేర్కొన్నారు. పత్రాల వాస్తవికతను పరిగణనలోకి తీసుకోకుండా ఆ సంస్థ వివాహాలను జరిపించడం వారి నమ్మకాలను దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేశారు. భోలా సింగ్ అనే వ్యక్తి ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అయితే తన భార్య మేజర్ అని, వివాహం చేసుకున్నప్పటికీ తనపై ఫిర్యాదు చేశారని, భార్యను అక్రమంగా నిర్భందించారంటూ భోలాసింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. వారు వివాహం చేసుకున్నారని నిరూపించేందుకు…
స్నేహం ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుందని, భారత్ తో తమ స్నేహం అలాంటిదేనని బంగ్లా ప్రధాని షేక్ హసీనా స్పష్టం చేశారు. నాలుగు రోజుల భారత్ పర్యటనలో భాగంగా మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్య రంగాలతో పాటు నదీ జలాల పంపిణీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత్-బంగ్లా సంబంధాలు రానున్న రోజుల్లో కొత్త శిఖరాలకు చేరుతాయని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యం వేగంగా పెరుగుతుందని చెబుతూ ఐటీ, అంతరిక్షం, అణు రంగాల్లో సహకారం అందించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. విద్యుత్ ప్రసార మార్గాలపై భారత్, బంగ్లాదేశ్ లో కూడా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. 54 నదులు భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా ప్రవహిస్తాయని, ఇవి ఇరు దేశాల ప్రజల జీవనోపాధికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. కుషియారా నది నీటిభాగస్వామ్యానికి ముఖ్య ఒప్పందం చేసుకున్నామని ప్రకటించారు…
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.8గా నమోదైందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 46 మంది చనిపోయారని వెల్లడించారు. సిచువాన్ రాజధాని చెంగ్డూకు నైరుతి దిక్కున రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8 గా నమోదైందని 16 కిమీ లోతున ప్రకంపన కేంద్రీకృతమైందని చైనా భూకంప నెట్‌వర్క్ సెంటర్ వెల్లడించింది. లూడింగ్ కౌంటీకి 39 కిమీ దూరంలో భూకంప ప్రకంపన కేంద్రీకృతమైందని, 5 కిమీ పరిధిలో అనేక గ్రామాలు ఉన్నాయని పేర్కొంది. ప్రకంపనల ధాటికి చెంగ్డూలో బిల్డింగ్లు ఊగిపోయాయని చైనా డైలీ తెలిపింది. దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రావిన్స్‌లోని పలు పట్టణాల్లో బిల్డింగ్లు కూలిపోయాయని, కొండచరియలు విరిగిపడ్డాయని వార్తా సంస్థలు తెలిపాయి. కాగా, 2008లో 8.2 తీవ్రతతో వచ్చిన భూకంపానికి 69,000 మందికి పైగా మరణించారు. 2013లో తీవ్రత 7 తో సంభవించిన భూకంపం 200 మందిని బలిగొంది. మరోవంక కరోనా నిబంధనల ప్రకారం…
నేటి విద్యార్థులపైనే 2047 నాటి భారతదేశ స్థాయి, భవిష్యత్తు ఆధారపడి ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీరు. తదనుగుణంగా విద్యార్థుల భవిష్యత్తును నేటి ఉపాధ్యాయులు రూపొందిస్తున్నారని ఆయన చెప్పారు. “ఆ విధంగా మీరు విద్యార్థుల జీవితాలను ఉజ్వలం చేయడంతోపాటు దేశ భవితకు ఒక రూపాన్నివ్వడంలో మీ వంతు పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు” అని ప్రధానమంత్రి కొనియాడారు. ఉపాధ్యాయ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో సంభాషిస్తూ విద్యార్థి కలలతో ఉపాధ్యాయుడికి అనుబంధం ఏర్పడినప్పుడు, వారినుంచి గౌరవాదరణలు పొందడంలో విజయవంతం కాగలడని చెప్పారు. విద్యార్థులు ముందంజ వేసేదిశగా వారితో కలసి అవిశ్రాంతంగా పనిచేయగల సానుకూల దృక్పథమే వారి విశిష్ట లక్షణమని పేర్కొన్నారు. “ఒక వ్యక్తికి వెలుగుబాట చూపడం ఉపాధ్యాయుని కర్తవ్యం.. అలాగే విద్యార్థుల కలలకు రూపమిచ్చి వాటిని సంకల్పంగా మార్చుకోవడం నేర్పేదీ వారే” అని ఆయన తెలిపారు. వివిధ అంశాలకు సంబంధించి విద్యార్థుల జీవితంలోని సంఘర్షణలు-వైరుధ్యాలను తొలగించాల్సిన…
కుండపోత వర్షం భారతదేశంలోని సిలికాన్‌వ్యాలీ అయిన బెంగళూరుని సరస్సుగా మార్చివేసింది. భారీ వర్షం అలా కురుస్తూనే ఉంది. వరదలాంటి పరిస్థితుల మధ్య చాలా ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి. పలు నివాస ప్రాంతాలు నీట మునిగి ఉండడంతో బెంగళూరు వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే బెంగళూరు నగరంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ముఖ్యంగా బెల్లందూర్, సర్జాపురా రోడ్, వైట్‌ఫీల్డ్, ఔటర్ రింగ్‌రోడ్డు, బిఇఎంఎల్ లే అవుట్ వంటి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. దీంతో అధికారులు అక్కడ ప్రజలను ఖాళీ చేయించేందుకు తెప్పలను పంపారు. ట్విటర్‌లో, నెటిజన్లు జలమయమైన రోడ్ల చిత్రాలను, వీడియోలను పంచుకుంటున్నారు. బెల్లందూర్ సమీపంలోని ఎకోస్పేస్ వద్ద పరిస్థితి భయానకరంగా ఉంది. వాహనాలు పూర్తిగా మునిగిపోతున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడంలేదని ఆందోళనచెందుతున్నారు. గంటల తరబడి వర్షం అనేక ప్రాంతాలను…