Author: Editor's Desk, Tattva News

ఎల్‌ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ చేసిన విధంగానే బ్యాంక్‌ల విషయంలోనూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌ స్పష్టం చేశారు. ప్రయివేటీకరణకు, సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులు, క్రూడాయిల్‌పై విండ్‌పాల్‌ ట్యాక్స్‌ పరిశ్రమ వర్గాలతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని ఆమె చెప్పారు. విండ్‌పాల్‌ ట్యాక్స్‌ విధించాలని ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుందని అనడం సరికాదని అంటూ ప్రతి 15 రోజులకు ఒకసారి పన్ను రేట్లను సమీక్షించాలన్న పరిశ్రమ వర్గాల సూచన మేరకే ముందుకుకెళుతున్నామని ఆమె తెలిపారు. పరిశ్రమ వర్గాలను పూర్తిగా విశ్వాసంలోకి తీసుకున్న తరువాతే దీనిపై నిర్ణయం తీసుకున్నామని ఆమె చెప్పారు. అదనపు పెట్టుబడులు లేకుండానే చమురు సంస్థలకు లభిస్తున్న ఆయాచిత లద్దిపై ఈ సంవత్సరం జులై 1 నుంచి సుంకాన్ని విధించారు. కరోనా తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని నిర్మలాసీతారామన్‌ చెప్పారు. ప్రభుత్వానికి నిధుల ప్రవాహం అనుకున్న స్థాయిలో ఉండటంలేదని పేర్కొంటూ ప్రస్తుతం ట్యాక్స్‌-జీడీపీ నిష్పత్తి 10 శాతంగా ఉందని, దీన్ని పెంచాలని భావిస్తున్నట్లు…

Read More

రాజకీయ పార్టీలు తమ పేరు, గుర్తులలో మతంను వాడుకొంటే అటువంటి రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు చేయమని ఎన్నికల కమీషన్ ను ఆదేశింపమని దాఖలైన పిటీషన్ పై విచారించిన సుప్రీంకోర్టు, దీనిపై అభిప్రాయం తెలియజేయాలంటూ భారత ఎన్నికల కమిషన్ కు నోటీసులు ఇచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 కింద మతాన్ని వాడుకుంటూ ఓటర్లను ఆకర్షించడంపై కఠిన నిషేధం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదన వినిపించారు. సైయద్ వసీస్ రిజ్వి అనే వ్యక్తి తన న్యాయవాది అభికల్ప్ ప్రతాప్ సింగ్ ద్వారా ఈ పిటిషన్ వేశారు. రాజ్యాంగం, రాజ్యాంగ విలువల పరిరక్షణలో భాగం ఆర్‌పీఏ అని పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వకేట్ గౌరవ్ భాటియా న్యాయమూర్తులు ఎం.ఆర్ షా, కృష్ణ మురారితో కూడిన డివిజన్ బెంచ్ ముందు తన వాదన వినిపించారు.. రెండు రాష్ట్ర పార్టీలను భాటియా ఉదహరిస్తూ, ఆ రెండు పార్టీలు తమ పేరులో ముస్లిం అనే పదం వాడుతున్నాయని, కొన్ని…

Read More

కరోనా నేపథ్యంలో ఏపీ ఈఏపీ సెట్ అర్హత పరీక్ష కనీస మార్కుల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సడలింపునిచ్చింది. ఈ మేరకు నోటీసు జారీ చేసింది. ఇంజినీరింగ్‌, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈఏపీసెట్‌ ద్వారా కౌన్సెలింగ్ జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కారణంగా ఇంటర్‌ చదువులు అంత‌గా జ‌ర‌గ‌లేదు. దీంతో ఇంజినీరింగ్‌, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత పరీక్షలో కనీస మార్కులను ప్రభుత్వం సడలిస్తున్నట్టుగా పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే ఇది అమలులో ఉంటుందని ప్ర‌భుత్వం తెలిపింది. దీని ఆధారంగానే జనరల్ క్యాటగిరీలోని అభ్యర్థులు ఇంజినీరింగ్ లేదా ఫార్మసీ ప్రోగ్రామ్స్ లో ప్రవేశాలకు అర్హులుగా పరిగణిస్తారు. అందుకోసమే.. ఇంటర్ 1, 2 వ సంవత్సరం పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులను పొందాల్సి ఉంటుంది. రిజర్వ్‌డ్ క్యాటగిరీల్లోని విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం 40 శాతంగా నిర్ణయించారు. ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం అన్ని…

Read More

బ్రిటన్‌ ప్రధాన మంత్రి రేసులో లిజ్‌ ట్రస్‌ (47) విజయం సాధించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తూ ట్రస్‌ గెలిచినట్లు ప్రకటించారు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సర్‌ గ్రాహం బ్రాడీ. ట్రస్‌ విజయంతో బ్రిటన్‌కు మూడవ మహిళ ప్రధాని ఘనత దక్కినట్లయ్యింది. ఆరు వారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారం, ఆపై పోలింగ్‌తో బ్రిటన్‌ తదుపరి ప్రధాని ఎవరనే ఉత్కంఠ నెలకొంది. అయితే పోటీలో నిలిచిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ రిషి సునాక్‌కు నిరాశే ఎదురైంది. బోరిస్‌ జాన్సన్‌ వారసురాలిగా ట్రస్‌ ఎన్నికైంది. ఈ విషయాన్ని కన్జర్వేటివ్‌ పార్టీ సైతం అధికారికంగా ప్రకటించింది.లీజ్‌ ట్రస్‌కు వచ్చిన ఓట్లు 81,326 పోలుకాగా, రిషి సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి. దీంతో 21 వేల ఓట్ల తేడాతో ట్రస్‌ నెగ్గినట్లయ్యింది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ (42), మంత్రి లిజ్‌ ట్రస్‌ ఎన్నికల…

Read More

కేసీఆర్ పై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పోయిందని, ఆయన్ను సాగనంపడానికి ప్రజలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ కేంద్ర సహాయ మంత్రి బీఎల్‌ వర్మ విశ్వాసం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వీఆర్ఎన్ గార్డెన్స్ లో జరిగిన బీజేపీ లోక్ సభ ప్రవాస్ యోజన కోర్ కమిటీ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తోందని, కేసీఆర్ కుటుంబం చేతిలో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడి, బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని ఆయన పిలుపిచ్చారు. నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇండ్లు అంటూ కేసీఆర్ ఎన్నో హామీలిచ్చారని, కానీ ఇప్పటివరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. పంట నష్టపోవడం వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్న మంత్రి ఫసల్ బీమాను అమలు చేయకుండా కేసీఆర్ రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కిసాన్…

Read More

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర..ఇప్పుడు నాల్గో విడతకు సిద్ధమైంది. ఇప్పటికే మూడు విడతలుగా యాత్ర చేపట్టి విజయం సాధించిన సంజయ్ ఇక నాలుగో విడతకు సిద్ధమయ్యారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను ఖరారు చేసారు. ఈ నెల 12న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్న సంజయ్ 22న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ముగించనున్నట్లు పార్టీ తెలిపింది. మొత్తం 10 రోజుల పాటు 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 కిలోమీటర్ల మేర సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నందున ఆ రోజు పాదయాత్ర ఉండదు. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, సికింద్రాబాద్–కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. ఖైరతాబాద్…

Read More

గ్రూప్‌ దశలో పాకిస్తాన్‌ను చిత్తుచేసిన భారత్‌ సూపర్‌-4లోచివరి ఓవర్‌ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాక్‌ జట్టు ఆరు వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. భారతజట్టు నిర్దేశించిన 182పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాక్‌ జట్టు చివరి 12 బంతుల్లో 26పరుగులు చేయాల్సి వచ్చింది. ఆ దశలో భువనేశ్వర్‌ వేసిన 19వ ఓవర్లో ఏకంగా 19 పరుగులు రాబట్టడంతో ఫలితం తారుమారైంది.ఇక చివరి 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సి రాగా ఆర్ష్‌దీప్‌ వేసిన తొలి బంతికి సింగిల్‌, రెండో బంతికి ఫోర్‌ కొట్టాడు. ఆ తర్వాత బంతి డాట్‌ కాగా.. నాల్గో బంతికి ఆసిఫ్‌ అలీ ఔటయ్యాడు. ఈ క్రమంలో చివరి 2బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన పాక్‌ జట్టును కొత్త బ్యాటర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ 2పరుగులు చేయడంతో పాక్‌జట్టు విజయం సాధించింది. దీంతో పాక్‌ జట్టు 19.5ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182పరుగులు చేసి విజయం సాధించింది. పాకిస్తాన్‌…

Read More

లండన్‌లో మాయమైన రూ.2.30 కోట్లు విలువ చేసే బెంట్లీ కారు పాకిస్థాన్ లో ప్రత్యక్షమవడం సంచలనంగా మారింది. కొన్నివారాల క్రితం బెంట్లీ కారుని లండన్‌ నుండి కొందరు దుండగులు అపహరించారు. చివరకు ఆ కారు పాకిస్థాన్‌లోని ఓ సంపన్నుడి నివాసంలో కనిపించింది. కారుని దొంగిలించిన దుండగులు దాన్ని ట్రాక్‌ చేసే వ్యవస్థను గుర్తించడంలో మాత్రం విఫలమయ్యారు. బెంట్లీ కారులో ఉండే అత్యాధునిక ట్రాకింగ్‌ వ్యవస్థను ఆఫ్‌ చేయకపోవడంతో లండన్‌లోని నేర విభాగం వాహనం ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించగలిగింది. కరాచీలోని ‘కలెక్టరేట్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌’కు సమాచారమిచ్చింది. లండన్‌ నుండి వచ్చిన వివరాలతో పాక్‌ అధికారులు కరాచీలో సంపన్నులు నివాసం ఉండే డిహెచ్‌ఎ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. చివరకు ఓ ఇంట్లో కారుని గుర్తించారు. అప్పటికే దాన్ని పాకిస్థాన్‌ రిజిస్ట్రేషన్‌ నెంబరును కూడా అమర్చారు. తర్వాత అది నకిలీదని తేలింది. ఛాసిస్‌ నెంబరు మాత్రం లండన్‌ అధికారులు ఇచ్చిన సంఖ్యతో పోలి ఉండడం…

Read More

ప్రతిష్టాత్మక ‘రామన్‌ మెగసెసె’ అవార్డును కేరళ మాజీ ఆరోగ్య మంత్రి కేకే శైలజ తిరస్కరించారు. అవార్డు అందుకోవటంపై పార్టీతో విస్తృతంగా చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. అవార్డు కమిటీ నుంచి తనకు లేఖ అందిందని, ఆ గౌరవాన్ని వదులుకోవాలని పార్టీ సమష్టిగా నిర్ణయించినట్లు సీపీఎం నేత తెలిపారు. కేరళ ఆరోగ్య శాఖ మంత్రిగా అందించిన సేవలకుగానూ, ముఖ్యంగా రాష్ట్రంలో నిఫా వైరస్‌, కరోనా వైరస్‌ విజృంభించిన సమయంలో ఆమె కృషికి గానూ.. 64వ మెగసెసె అవార్డుకు ఎంపిక చేసింది కమిటీ. ‘నేను సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యురాలిని. దీనిపై మా పార్టీ నాయకత్వంతో చర్చించాను. అవార్డును తీసుకోకూడదని అంతా కలిసి సమష్టిగా నిర్ణయం తీసుకున్నాం. అది పెద్ద అవార్డు. అయితే, అది ఒక ఎన్‌జీఓ అందిస్తోంది. సాధారణంగా వారు కమ్యూనిస్టుల ప్రిన్సిపుల్స్‌ను వ్యతిరేకిస్తారు. నా పేరును పరిగణనలోకి తీసుకున్నందుకు నేను ఆ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపాను. నా నిర్ణయాన్ని…

Read More

టాటా గ్రూప్ మాజీ చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ ఆదివారం ముంబై సమీపంలోని పాల్ఘర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. అహ్మదాబాద్ నుండి ముంబై వస్తుండగా ఆయన కారు డివైడర్ ను ఢీకొట్టింది. పాల్ఘర్‌లోని సూర్య నదిపై ఉన్న వంతెనపై ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఈ ప్రమాదంలో సైరస్ మిస్త్రీ అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. సైరస్ మిస్త్రీతో పాటు ముగ్గురు వ్యక్తులు ఆ కారులో ప్రయాణిస్తున్నారు. మిస్త్రీతో పాటు మరో వ్యక్తి కూడా మరణించినట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు గాయాలకు గురికాగా వారిని వెంటనే గుజరాత్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. 1968 జులై 4న ముంబైలో పల్లోంజి మిస్త్రీ, పాట్ పెరిన్ దుబాష్ దంపతులకు సైరస్‌ మిస్త్రీ జన్మించారు. లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌లో బిజినెస్‌ స్కూల్‌ మేనేజ్మెంట్‌లో ఎంఎంసీ చేసిన ఆయన 1991లో తన ఫ్యామిలికి చెందిన ప్రముఖ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా…

Read More