తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 6 వ తేదీ ఉదయం 11.30 గం. లకు సమావేశాలు మొదలు కానున్నాయి. అటు శాసనమండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు. అదేరోజు తెలంగాణ బీఏసీ సమావేశం కూడా జరగనుంది. అసెంబ్లీ, మండలి సమావేశాలు మార్చి 7న ప్రారంభమై మార్చి 15న ముగిసిన బడ్జెట్ సమావేశాలకు కొనసాగింపుగా ఉండనున్నాయి. బడ్జెట్ సమావేశాల తర్వాత స్పీకర్ సభను వాయిదా వేశారు. సభను ప్రోరోగ్ చేయలేదు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ నెల మూడో తేదీన జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదే రోజు సాయంత్రం తెలంగాణ…
Author: Editor's Desk, Tattva News
గతేడాది స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లలో దాదాపు 60 శాతం రూ.2వేల నోట్లేనని జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) నివేదిక పేర్కొంది. నకిలీ నోట్లను రద్దు చేయడమే ప్రధాన లక్ష్యంగా 2016లో పెద్ద నోట్లను రద్దు చేశారు. నకిలీ నోట్లు బాగా చలామణిలో వుంటున్నందున వాటిని అణచివేయాలంటే పెద్ద నోట్ల రద్దు తప్పదని ప్రభుత్వం ఆనాడు పేర్కొంది. కానీ, ఆ తర్వాత నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడం బాగా పెరిగిందని ఆ నివేదిక పేర్కొంది. 2021లో భారత్‌లో నేరాలు శీర్షికతో ఈ నివేదికను వెలువరించారు. గత సంవత్సరం స్వాధీనం చేసుకున్న మొత్తంలో రూ.20.39కోట్ల మేరకు నకిలీ నోట్లే ఉన్నాయి. ఇవన్నీ కూడా రూ.2 వేల నోట్లే. పాత 500, వెయ్యి నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత 2 వేల సంవత్సరంలో కొత్త 2వేలు, 500 నోట్లు ప్రవేశపెట్టారు. 2016లో పట్టుకున్న నకిలీ కరెన్సీ రూ.15.92 కోట్లు వుండగా, 2017,…
దేశంలో మహిళలపై గృహ హింస కేసులు పెరుగుతున్నాయి. ప్రజా ప్రతినిధులైనప్పటికీ మహిళలు ఈ హింసను ఎదుర్కోవలసి వస్తున్నది. తాజాగా ఒక ఎమ్మెల్యేపై భర్త చేయిచేసుకున్న ఘటన పంజాబ్‌లో జరిగింది. అందరూ చూస్తుండగానే ఆప్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌పై ఆమె భర్త చెంపపై కొట్టారు. పంజాబ్‌లోని తన నివాసంలో జులై 10న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బ్రిందర్ ఈ వీడియో ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. వివరాల ప్రకారం, పంజాబ్‌లోని తాల్వండి సాబో నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్, ఆమె భర్త సుఖ్‌రాజ్ సింగ్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అతను కూడా స్థానిక ఆప్ నాయకుడు. దీంతో ఆగ్రహించిన సుఖ్‌రాజ్ అందరూ చూస్తుండగానే బల్జిందర్‌పై చేయిచేసుకున్నారు. పక్కనున్నవారు అతనిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై పంజాబ్ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలను లేవనెత్తే మహిళలు…
కేరళలో పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తొలి బాహుబలి నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వాహక నౌకను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ అమృతోత్సవ వేళ ఐఎన్‌ఎస్ నౌక ప్రారంభించడం శుభపరిణామమని తెలిపారు. భారత్‌కు సాధ్యం కానిది ఏదీ ఉండదని, ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌకను చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని ప్రధాని చెప్పారు. విక్రాంత్ నౌక 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది. ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌక గంటలకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించనుంది.దీని తయారీకి 13 ఏళ్ల సమయం పట్టగా.. రూ.20 వేల కోట్లు ఖర్చయియింది. 262 మీటర్ల పొడవు.. 62 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక బరువు 37,500 టన్నులు. ఇందులో మొత్తం 14 అంతస్తులు, 2300 కాంపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. విధుల్లో 1600 మంది సిబ్బంది ఉంటారు. ఇప్పటిదాకా భారత్ వద్ద…
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచారని దీంతో అడ్డగోలుగా అవినీతి జరిగిందనికేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. ప్రాజెక్టు అంచనా రూ. 38 వేల 500 కోట్ల నుంచి లక్షా 20 వేల కోట్లకు పెరిగిందని ఆమె గుర్తు చేశారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రవాసీ యోజన్‌లో భాగంగా జిల్లాలో 3 రోజుల పర్యటనను ఆమె గురువారం కామారెడ్డి నుండి ప్రారంభిస్తూ కాళేశ్వరం సహా మిడ్‌మానేరు, మల్లన్నసాగర్, సీతారామసాగర్, పాలమూరు–రంగారెడ్డి, కిష్టంపల్లి, నక్కలగూడెం వంటి ప్రాజెక్టులకు సంబంధించి భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు ఎందుకు పరిహారం చెల్లించలేదని ఆమె ప్రశ్నించారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.38,500 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం, దాన్ని రూ.లక్షా 20 వేల కోట్లకు ఎందుకు పెంచిందో సమాధానం ఇవ్వాలి. సాధారణంగా ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం అవుతుంది. అయితే కాళేశ్వరం త్వరగా పూర్తి చేశామని ప్రభుత్వం చెబుతోంది. మరి త్వరగా పూర్తయినపుడు…
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోపిడీ చేసిందని ఆరోపిస్తూ మూడు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు జైలుకు వెళ్లడం ఖాయమని బిజెపి ఎంపీ డి. అరవింద్ స్పష్టం చేశారు. ఈ నెల 5న నిజామాబాదు కు వస్తున్న సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాకు గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా నూతన కలెక్టరేట్ వరదల్లో మునిగిపోయిందని, ఇప్పుడు కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఎందుకని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఈ నెల 3న తాము ఇందూరులో ‘జన్ కో జవాబ్ దో కేసీఆర్’ పేరుతో సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలపై లేఖలు రాసి ఇందూరులో ఇంటింటికి పంపిణీ చేస్తామని చెప్పారు. ఎన్నికల హామీలు ఎందుకు అమలు చేయలేదో ఇందూరు ప్రజలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నూతన కలెక్టరేట్…
గర్భాశయ క్యాన్సర్ నివారణకు దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి వ్యాక్సిన్ “సెర్వావ్యాక్” ను శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. క్వాడ్రి వాలెంట్ హ్యూమన్ పాపిలోమా వైరస్ (క్యూ హెచ్ పివి) వ్యాక్సిన్ ను పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ సి పూనావాలా, ఇతర ప్రముఖ శాస్త్రవేత్తలు, ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సరసమైన, చౌకైన వ్యాక్సిన్ డిబిటి, బిఆర్ ఎసిలు ఒక ముఖ్యమైన రోజును సూచిస్తుందని, ఎందుకంటే ఇది ప్రధాని మోదీ విజన్ ఆత్మనిర్భర్ భారత్ కు ఒక అడుగు దగ్గరగా తీసుకు వెళుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. సర్వైకల్ క్యాన్సర్ భారతదేశంలో 2 వ అత్యంత ప్రబలమైన క్యాన్సర్లలో రెండవ స్థానంలో ఉందని, ప్రపంచంలోని గర్భాశయ క్యాన్సర్ మరణాలలో నాలుగింట ఒక వంతు వరకు నిరోధించదగినప్పటికీ ఇది సంభవిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రతి సంవత్సరం సుమారు 1.25 లక్షల మంది…
ఇబ్రహీంపట్నం ఘటనపై గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె సూచించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించిన నలుగురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరికొంతమంది నిమ్స్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన ఫై ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని హెచ్చరించారు. అందుకు బాధ్యత వహిస్తూ ఆరోగ్య మంత్రి టి హరీష్ రావును మంత్రివర్గం నుండి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని గవర్నర్ మండిపడ్డారు. శస్త్ర చికిత్స అనంతరం చనిపోయిన బాధితు కుటుంబాలకు అండగా ఉండాలని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. చికిత్స పొందుతున్న మహిళలకు మెరుగైన వైద్యం అందించాలని ఆమె ఆదేశించారు. ఆపరేషన్ వికటించడంతో ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్న మహిళల్ని త్వరలోనే పరామర్శించనున్నట్లు తమిళిసై ప్రకటించారు. ఇబ్రహీంపట్నం…
ఆగస్టు 2022 నెలలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారీగా వసూళ్లయ్యాయి. ఆగస్టు నెలలో వసూలైన స్థూల జీఎస్టీ రాబడి రూ. 1,43,612 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ. 24,710 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ. 30,951 కోట్లుగా ఉంది. అలాగే ఐజీఎస్టీ రూ. 77,782 కోట్లుగా ఉంది. ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి సెంట్రల్ జీఎస్టీకి రూ.29,524 కోట్లు, స్టేట్ జీఎస్టీకి రూ.25,119 కోట్లు సెటిల్ చేసింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత ఆగస్టు 2022 నెలలో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీ రూ. 54,234 కోట్లు, ఎస్టీఎస్టీ రూ. 56,070 కోట్లుగా ఉంది. గత ఏడాది ఆగస్టు నెలలో రూ.1,12,020 కోట్ల మేర జీఎస్టీ వసూలైంది. ఇప్పుడు వరుసగా ఆరు నెలలుగా నెలవారీ జీఎస్టీ ఆదాయాలు రూ. 1.4 లక్షల కోట్ల మార్కు కంటే ఎక్కువగా ఉన్నాయి. జూలై 2022 నెలలో 7.6 కోట్ల ఇ-వే బిల్లులు జనరేట్…
విద్యుత్ ప్రసార & పంపిణీ (టి&డి- ట్రాన్స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్) వ్యవస్థ, ఉక్కు వ్యవస్థలు, ఉక్కు ఇఆర్‌డబ్ల్యు పైపులు, పాలిమర్ ఉత్పత్తులు తదితరాల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న కొలకతాలోని ప్రముఖ గ్రూప్‌పై ఆదాయ పన్ను శాఖ సోదాలు, స్వాధీనం ఆపరేషన్‌ను నిర్వహించారు. సోదాలు భాగంగా పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్‌లలో విస్తరించి ఉన్న 28 ఆవరణలలో జరిగాయి. ఇప్పటివరకూ మొత్తం రూ. 250 కోట్లకు పైగా లెక్కల్లోకి ఆదాయాన్ని కనుగొన్నారు. సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో గ్రూపు చేపట్టిన వివిధ పన్ను ఎగవేత పద్ధతులను కనుగొన్నారు. నకిలీ ఖర్చును బయిటపెట్టే పత్రాలు, డిజిటల్ డాటా, వెల్లడించని నగదు అమ్మకాల వంటి నేరారోపణ సాక్ష్యాలు పెద్ద ఎత్తున వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా, స్తిరాస్తుల కొనుగోలు, లెక్కలో చూపని నగదు రుణాల కోసం లెక్కల్లో చూపని నగదును ఉపయోగించిన సాక్ష్యాలను కనుగొని, స్వాధీనం చేసుకున్నారు. తన ప్రధాన పనులకు అకామడేషన్ ఎంట్రీలను అందించేందుకు అనేక షెల్ కంపెనీలను గ్రూప్ ఉపయోగించుకున్నట్టు స్వాధీనం…