Author: Editor's Desk, Tattva News

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దాదాపు రూ. 2.23 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇవన్నీ చాలా మటుకు బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నాయి. కానీ, గాంధీనగర్‌లోని కొంత భూమిలో తన వాటాను విరాళంగా ఇచ్చినందున స్థిరాస్తులు లేవని ఆయన తాజా ఆస్తుల గురించి వెల్లడించారు.  మార్చి 31 వరకు అప్‌డేట్ చేసిన అతని డిక్లరేషన్ ప్రకారం ఆయనకు ఎటువంటి బాండ్, షేర్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి లేదు. ఏ వాహనం సొంతంగా లేదు. అయితే రూ. 1.73 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలున్నట్టు తన డిక్లరేషన్లో మోదీ పేర్కొన్నారు. మోదీ చరాస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ. 26.13 లక్షలు పెరిగాయి. అయితే మార్చి 31, 2021 నాటికి రూ. 1.1 కోట్ల విలువైన స్థిరాస్తులు ఆయన వద్ద లేవు. ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఓ) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన వివరాల ప్రకారం మార్చి 31, 2022 నాటికి ప్రధాని మోదీ…

Read More

భారత్‌ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తున్నా సరిహద్దులో చైనా తన కవ్వింపు చర్యలను మానుకోవటం లేదు. సరిహద్దుల్లో ఏదోరకంగా తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పాకిస్థాన్‌ ఆర్మీ కోసం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే), బలోచిస్థాన్‌, సింధ్ ప్రాంతాల్లోకి ప్రవేశించింది.  చైనా పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (సీపీఆసీ) నిర్మాణంలో మాత్రమే కాకుండా చైనా ఇంజనీర్లు పీఓకేలోనూ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ)కు చెందిన 10-12 మంది వ్యక్తులు పీఓకేలోని శార్దా ప్రాంతంలో కనిపించారు. వారు పాకిస్థాన్‌ ఆర్మీ కోసం భూగర్భ బంకర్లు నిర్మించటంలో నిమగ్నమయ్యారు. పాక్‌ సైన్యం ఆ ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తోంది. నియంత్రణ రేఖకు సమీపంలోని నీలం లోయలో 10-15 మంది చైనా ఇంజనీర్లు బంకర్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఫుల్లవాయ్‌గా పిలుస్తారు. కశ్మీర్‌లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు.  మరోవైపు.. సింధ్‌, బలోచిస్థాన్‌ ప్రాంతాల్లోనూ చైనా సైనికులు…

Read More

వీఆర్వోలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర సర్కార్ జారీ చేసిన జీవో నంబర్ 121 అమలును తెలంగాణ హైకోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్దుబాటు జీవో చట్ట వ్యతిరేకంగా ఉందని అభిప్రాయపడింది. జీవోలోని మూడో పేరాలోని విషయాలు యాక్ట్‌‌‌‌లోని 4(1)కి వ్యతిరేకంగా ఉన్నాయని, అందుకే జీవో అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.  ఇప్పటి వరకు వేరే శాఖల్లోని ఉద్యోగాల్లో చేరని వాళ్లను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. జీవో 121పై స్టే విధిస్తూ చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌రెడ్డిలతో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ మధ్యంతర ఆదేశాలిచ్చింది.  రూల్స్‌‌‌‌ రూపొందించకుండానే ఫైనాన్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇచ్చిన జీవో ద్వారా వీఆర్వో పోస్టులు రద్దు చేశారని, జీవో 121 చట్ట విరుద్ధంగా ఉందని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. జీవోను సవాల్‌‌‌‌ చేస్తూ వీఆర్వో రెవెన్యూ ఆఫీసర్స్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌…

Read More

ఇంగ్లండ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ముగిశాయి. ఈ క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలు సాధించింది. మొత్తం 12 పతకాలతో భారత రెజ్లర్లు మెరిశారు.  రెజ్లింగ్ లో భారత్ కు 6 స్వర్ణాలు, ఒక రజతం, 5 కాంస్యాల పతకాలు లభించాయి. భారత వెయిట్ లిఫ్టర్లు మొత్తంగా 10 పతకాలు సాధించారు. అందులో 3 పసిడి, 3 రజతం, 4 కాంస్యాలున్నాయి. టేబుల్ టెన్నిస్ లో భారత్ కు 4 స్వర్ణాలు సహా 7 పతకాలు వచ్చాయి.  బాక్సింగ్ లో 3 స్వర్ణాలు, ఒక రజతం, 3 కాంస్యాలు వచ్చాయి. బ్యాడ్మింటన్ లో 3 స్వర్ణాలు సహా 6 పతకాలు సాధించింది భారత్. షట్లర్ల ఖాతాలో 3 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యా పతకాలు ఉన్నాయి. అథ్లెంటిక్స్ విభాగంలో భారత్ కు మొత్తం…

Read More

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారంనాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌కు నాలుగు రోజుల ముందే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడటం విశేషం. వరుసగా ఏడోసారి పార్లమెంట్‌ సమావేశాలు నిర్ణీత షెడ్యూల్‌ కంటే ముందుగానే ముగిశాయి.  లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటిస్తూనే, 16 రోజుల పాటు సభ సమావేశమయిందని, ఏడు చట్టాలను ఆమోదించామని చెప్పారు. ఈనెల 10న పదవీ విరమణ చేయనున్న రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు సైతం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.  సభ 38 గంటలు పని చేసిందని.. 47 గంటల కంటే ఎక్కువ వాయిదాలతోనే వృథా అయ్యిందని ప్రకటించారాయన. ఇక పార్లమెంట్‌ సమావేశాల పేరిట చేసిన పద్దుల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.  షెడ్యూల్ ప్రకారం జూలై 18న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12వ తేదీతో ముగియాల్సి ఉన్నాయి. మిగిలిన ఐదు రోజుల్లో రెండు రోజులు సెలవులే ఉన్నాయి. ఒకటి ఆగష్టు 9వ…

Read More

ఉత్తర ప్రదేశ్ లో అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిందితుల అక్రమ కట్టడాల కూల్చివేతకు ఇప్పటివరకు మతం రంగు పూస్తున్నవారికి ఇప్పుడు స్వయంగా బిజెపి కార్యకర్త ఇంటిని కూల్చివేయడం జరిగింది. పైగా, స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం కలకలం రేపుతున్నది.  నొయిడా అధికారులు బీజేపీ యువనేత శ్రీకాంత్‌ త్యాగికి వ్యతిరేకంగా రంగంలోకి దిగారు. ఓ మహిళను దుర్బాషలాడి, దాడి చేసిన ఘటన, ఆపై అనుచరులతో బెదిరింపులకు దిగినందుకు ఆదివారం అతనిపై గ్యాంగ్‌స్టర్‌ యాక్ట్‌ కింద నేరారోపణలు నమోదు చేశారు. సోమవారం నొయిడా సెక్టార్‌-93లోని గ్రాండ్‌ ఒమాక్సే హౌజింగ్‌ సొసైటీ వద్ద అతని ఇంటి ఆవరణలోని అక్రమ కట్టడాలను  సంబంధిత అధికారులు కూల్చివేశారు. ఈ కట్టడాలకు సంబంధించే స్థానిక ఇంటి ఓనర్లకు, శ్రీకాంత్‌ మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ మహిళతో శ్రీకాంత్‌ దారుణంగా వ్యవహరించాడు. ఆమెను దుర్భాషలాడడంతో పాటు దాడి యత్నానికి దిగాడు. ఆ వీడియో…

Read More

మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను సోమవారం శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి సమర్పించారు. తన రాజీనామాను స్పీకర్ పోచారం ఆమోదించారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అంతకుముందు గన్పార్కుకు చేరుకున్న రాజగోపాల్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాడుతూ రాజీనామా లేఖను స్పీకర్‌కు అందించానని, తన రాజీనామాను ఆమోదించారని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌ తెలంగాణ ద్రోహుల పార్టీ అయిందని ఈ సందర్భంగా రాజగోపాలరెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్‌ , కాంగ్రెస్‌ పార్టీల్లో ఉన్న చాలా మంది నేతలు తనతో మాట్లాడుతున్నారని చెప్పారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రకటించానని, దీనిలో తెలంగాణ, మనుగోడు ప్రజలు గెలుస్తారని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. చండూరు సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆయన మనుషులు మాట్లాడిన భాష విన్న తర్వాత తెలంగాణ సమాజం తల దించుకుంటోందని విమర్శించారు. డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్నవాళ్లు.. తప్పుడు పనులతో జైలుకెళ్లి వచ్చినవారు మాట్లాడుతున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఏ త్యాగం…

Read More

శివసేన ఎంపి సంజయ్ రౌత్‌కి ముంబయిలోని ప్రత్యేక కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించింది. భూకుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఆగస్ట్‌ 1న అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ప్రత్యేక కోర్టు ఈ నెల 4 వరకు ఇడి కస్టడీకి అనుమతించగా.. ఆ తర్వాత దాన్ని 8వ తేదీ వరకు పొడగించింది. ఆ కస్టడీ ముగియడంతో మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగిస్తున్నట్లు ముంబయిలోని ప్రత్యేక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే కస్టడీ సమయంలో ఇంటి భోజనం, మందులు తీసుకునేందుకు కోర్టు అంగీకరించింది. అయితే ప్రత్యేక బెడ్డును కేటాయించే విషయంలో ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. జైలు నియమాల ప్రకారం అధికారులు తగిన బెడ్ ఏర్పాటు చేస్తారని కోర్టు స్పష్టం చేసింది.  సోమవారంతో ఈడీ కస్టడీ ముగియటంతో ప్రత్యేక పీఎంఎల్‌ఏ జడ్జీ ఎంజీ దేశ్‌పాండే ముందు హాజరుపరిచింది. అయితే..…

Read More

రాజ్యసభ చైర్మన్ గా సభ నిర్వహణలో తనదైన ముద్రవేసిన ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు  ఈ నెల 10న వెంకయ్య పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో.. పార్లమెంట్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ సభకు ఇది అత్యంత భావోద్వేగపరమైన క్షణం అని పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు సమక్షంలో సభలో అనేక చారిత్రక ఘటనలు జరిగాయని గుర్తు చేసుకున్నారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కార్యాదక్షత అందరికీ మార్గదర్శనమని కొనియాడుతూ వెంకయ్య పదవీకాలంలో రాజ్యసభ పనితీరు గణనీయంగా మెరుగుపడిందని గుర్తు చేశారు.  అయితే, దేశ ప్రజలకు వెంకయ్య నాయుడు అనుభవాల నుంచి నేర్చుకునే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. వెంకయ్య హయాంలో రాజ్యసభ పనితీరు మెరుగుపడిందని ప్రధాని  గుర్తు చేశారు. రాజ్యసభ ఉత్పాదకత 70 శాతం పెరిగిందని చెప్పారు. ఎంపీల హాజరు సైతం భారీగా పెరిగిందని వెల్లడించారు.  వెంకయ్యతో కలిసి పనిచేసే అదృష్టం లభించడం గొప్ప విషయమని చెబుతూ ‘మీ పని విధానం ఎంతో స్ఫూర్తిదాయకం.…

Read More

వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలని, ఈ రంగంలో సాంకేతికత వినియోగం పెరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంకు అధ్యక్షత వహిస్తూ అన్ని రాష్ట్రాలు పంటల వైవిధ్యంపై దృష్టిపెట్టాలని సూచించారు. సాగు రంగంలో ప్రపంచ అగ్రగామిగా భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. శరవేగంగా పెరుగుతున్న పట్టణీకరణను శక్తిగా మలుచుకోవాలని సూచించారు. వంటనూనెల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి సాధించాలని తెలిపారు. 2023లో భారత్ జి20 కూటమి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న విషయాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. దీని ద్వారా వీలయినంత ఎక్కువ లబ్ధి పొందడం కోసం ప్రతి రాష్ట్రం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రతి రాష్ట్రం కూడా తన శక్తి మేరకు తన వంతు పాత్రను నిర్వహించాయని ప్రధాని ప్రశంసించారు. దీనివల్లనే భారత్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఒక రోల్‌మోడల్‌గా నిలవగలిగిందని ఆయన చెప్పారు. ‘భారత దేశ 75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా దేశంలోని…

Read More