Author: Editor's Desk, Tattva News

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1) ప్రయోగం విఫలమయ్యింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1 రాకెట్‌ను ఆదివారం ఉదయం 9.18 గంటలకు ప్రయోగించారు. మైక్రోశాట్‌–2ఏ (ఈఓఎస్‌శాట్‌)తోపాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు రూపొందించిన ఆజాదీశాట్‌ను నిర్దేశిత సమయంలోనే కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినప్పటికీ ప్రయోగం సఫలం కాలేదు. మొదటి మూడు దశలు ముందస్తు ప్రణాళిక ప్రకారం సక్రమంగానే పూర్తయ్యాయి. నాలుగో దశ నుంచి మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌కు ఎలాంటి సిగ్నల్స్‌ అందలేదు. రెండు ఉపగ్రహాల నుంచి కూడా గ్రౌండ్‌స్టేషన్‌కు సంకేతాలు అందకపోవడం ఉత్కంఠకు గురిచేసింది. ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1 ప్రయోగానికి ఆదివారం తెల్లవారుజామున 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు. ఏడు గంటల పాటు కౌంట్‌డౌన్‌ కొనసాగింది. సరిగ్గా ఉదయం 9.18 గంటలకు ప్రయోగ వేదిక నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ–డీ1 రాకెట్‌ ఎరుపు, నారింజ రంగుల్లో నిప్పులు చిమ్ముతూ…

Read More

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవేనని, వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై తన వంతు ఒత్తిడి తీసుకొస్తానని గవర్నర్‌ డా. తమిళి సై సౌందరరాజన్ స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం పిల్లలు ఎండలో, వానలో నిరసన తెలపడం ఒక తల్లిగా తనను కలిచి వేసిందని ఆమె చెప్పారు.   అందువల్లే ఓ అమ్మగా వచ్చి ఇక్కడి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు. ఆదివారం నిర్మల్‌ జిల్లా ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్‌ ఐటీతో పాటు నిజామాబాద్‌ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని గవర్నర్‌ సందర్శించారు. మొదటగా గవర్నర్‌ నిర్మల్‌ జిల్లా ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్‌ ఐటీని గవర్నర్‌ సందర్శించారు.   ఉదయం వేళ విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. విద్యార్థి వసతి గృహలు, తరగతి గదులు, భోజన శాలలన్నింటినీ పరిశీలించారు. సుమారు నాలుగు గంటల పాటు గవర్నర్‌ ట్రిపుల్‌ ఐటీలో గడిపారు. ఆ తర్వాత విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.   విద్యార్థుల డిమాండ్లు చాలా సింపుల్…

Read More

చైనా-తైవాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్‌పై తమకు సర్వ హక్కులు ఉన్నాయని భావిస్తున్న చైనా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించి వెళ్లాక కోపంతో రగిలిపోతోంది. పెలోసీకి ఆతిథ్యమిచ్చిన తైవాన్‌ను శిక్షించాలని బలంగా కోరుకుంటోంది. అదే సమయంలో అమెరికాకు కూడా బుద్ధి చెప్పాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే తేపే చుట్టూ మిలటరీ విన్యాసాలు ప్రారంభించింది. అది చూసిన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లు వెంటనే ఆ విన్యాసాలు కట్టిపెట్టాలని చైనాను కోరాయి. అయితే, బీజింగ్ మాత్రం ‘తగ్గేదే లే’ అన్నట్టు తన సైనిక పరాక్రమాన్ని ట్విట్టర్‌ ద్వారా ప్రపంచానికి చూపించింది. ఈ మేరకు ఓ వీడియోను షేర్ చేసింది. చైనా ప్రభుత్వం మౌత్ పీస్ అయిన ‘గ్లోబల్ టైమ్స్’ ఈ వీడియోను షేర్ చేసింది. ‘‘తైవాన్ ద్వీపం చుట్టూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ  చేస్తున్న సైనిక విన్యాలకు సంబంధించిన వీడియో ఇది. 100కు పైగా యుద్ధ విమానాలను…

Read More

కామన్వెల్త్ గేమ్స్ తెలంగాణ ముద్దుబిడ్డ, భారత బాక్సర్ నిఖత్ జరీన్ తో పాటు టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్‌ కమల్‌ (భారత్‌) స్వర్ణ పతాకాలు గెలుపొందారు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ లో బాక్సింగ్ విభాగంలో ఆదివారం భారత్ సాధించిన గోల్డ్ మెడల్స్ సంఖ్య ఇందుకు పెరిగింది.మొత్తంగా భారత్ 18 స్వర్ణాలు, 53 పతాకాలు సాధించింది. ఉత్తర ఐర్లాండ్ కు చెందిన కార్లీ ఎంసీ నౌల్ ను ఓడించి గోల్డ్ మెడల్ ను నిఖత్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఇవాళ ఒక్కరోజే భారత్ సాధించిన పతకాల సంఖ్య 6కు పెరిగింది. బాక్సర్లు అమిత్ పంఘాల్, నీతు ఘన్ ఘాస్ రెండు బంగారు పతకాలు సాధించగా, పురుషుల ట్రిపుల్ జంప్ విభాగంలో ఎల్డ్ హోస్ పాల్ స్వర్ణం సాధించాడు. ట్రిపుల్ జంప్ లో అబ్దుల్లా అబూబకర్ కు రజతం, రేస్ వాక్ విభాగంలో సందీప్ కుమార్ కు కాంస్యం దక్కాయి. కామన్వెల్త్ గేమ్స్…

Read More

వాతావరణ మార్పు వాతావరణం అంచనావేసే సామర్థాన్ని దెబ్బతీస్తున్నది. వాతావరణ సంస్థలు ముందస్తుగా, ఖచ్చితంగా అంచనా వేయడంలో వెనుకబడుతున్నాయని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఇటీవలి కాలంలో దేశంలోని కొన్ని ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం, విడవకుండా ఒకేచోట మబ్బులు దట్టంగా అలుముకుని రోజుల తరబడి వర్షాలు కురియడం వంటి పరిణామాలు అంచనాలకు అందనివి అని తెలిపారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు వాతావరణ సంస్థల అంచనాల పరిధికి అందని విధంగా వాతావరణంలో మార్పులు నెలకొంటున్నాయని భావించాల్సి వస్తోందని తెలిపారు. దేశంలో ఈసారి రుతుపవనాలు ఆగమనం, వర్షాలు కురిసే తేదీల విషయంలో ఐఎండి అంచనాలు విశ్లేషణలు దాదాపుగా సరయ్యాయి. అయితే భారీ వర్షాల విషయంలో ముందస్తు అంచనాలు కుదరలేదని పేర్కొన్నారు. ఇది వాతావరణంలో అంతర్గతంగా నెలకొంటున్న మౌలికమైన మార్పుల ప్రక్రియ ఫలితం అని చెప్పారు.  ఇప్పటి పరిణామంతో పలు దేశాల వాతావరణ కేంద్రాలు తమ పరిశీలనా వ్యవస్థలను…

Read More

భారత ఉప రాష్ట్రపతి గా జగ్‌దీప్‌ ధన్కర్‌ విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్కరెట్‌ అల్వాపై 346 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి తరఫున ఎన్నికల బరిలో నిలిచిన జగదీప్‌ ధన్కర్‌కు 528 ఓట్లు, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు 182 ఓట్లు పోలయ్యాయి.  15 ఓట్లు చెల్లకుండా పోయాయి. ధన్‌కర్‌ గెలుపును లోక్‌‌సభ సెక్రటరీ జనరల్‌ ఉత్పల్‌ కుమార్‌ సింగ్ అధికారికంగా ప్రకటించారు‌. ఈ ఎన్నికలో పార్లమెంట్‍‌కు చెందిన 725 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. మరో ఎనిమిది ఎంపీ స్థానాలు ఖాళీగా ఉండటంతో ఓటింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. విపక్షంలో ప్రధాన పార్టీఅయిన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఓటింగ్‌కు గైర్హాజరు అయింది. దీనితో ఆది నుంచి విజేత ఎవరనేది ఏకపక్షంగా సాగింది. మొత్తం పోలయిన ఓట్లతో పోల్చుకుంటే ధన్‌కర్‌కు 70 శాతానికి పైగా ఓట్లు పడ్డాయి. వెంకయ్యనాయుడు ఎన్నిక దశలో ఆయన…

Read More

ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా చేసిన ఆరోపణలను నీతి ఆయోగ్ తోసిపుచ్చింది. బలమైన రాష్ట్రాలతో పటిష్టమైన దేశాన్ని తయారు చేయగలమన్న ఉద్దేశ్యంతో సహకార సమాఖ్య స్ఫూర్తితో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పింది. రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు నీతి ఆయోగ్ అనేక చర్యలు తీసుకుందని స్పష్టం చేసింది. గత ఏడాది నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్/ సభ్యులు వివిధ రాష్ట్రాల సీఎంలతో 30కి పైగా సమావేశాలు నిర్వహించి, రాష్ట్రాలకు సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారం చూపిందని చెప్పింది. తమ అభ్యర్థనలు పెడచెవిన పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నీతి ఆయోగ్‌తో సమావేశం నిర్వహించలేదని తెలిపింది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన అన్ని సమస్యలపై కేంద్ర ప్రభుత్వం, మంత్రిత్వ శాఖలు, ప్రధాన మంత్రి కార్యాలయం ,రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చిస్తోందని నీతి ఆయోగ్ తెలిపింది. ఆగస్ట్ 7వ తేదీ 2022 పాలక మండలి సమావేశానికి సన్నాహకంగా, తెలంగాణతో…

Read More

మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్‌ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌)ను కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ హెచ్చరించారు. 62 వేల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులను ఉద్దేశించి బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేంద్రం ఈమధ్యే రూ 1.64 కోట్ల ప్యాకేజీ ప్రకటించిందని గుర్తు చేశారు. ఇకపై బీఎస్‌ఎన్‌ఎల్‌ మెరుగైన ప్రదర్శన కనబర్చాలని, ఒకవేళ పని చేతకాకుంటే ఇళ్లకు వెళ్లిపోవాలని, లేకుంటే పంపించేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదేం చిన్న కేటాయింపు కాదని, పునరుద్ధరణ ప్యాకేజీని రూపొందించిన విధానం.. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నంత భారీ రిస్క్ ప్రపంచంలో మరే ప్రభుత్వం చేపట్టలేదని ఆయన పేర్కొన్నారు. “ప్రతీ నెలా పనికి సంబంధించి నేనే సమీక్ష నిర్వహిస్తా. పని చేయనివాళ్లు, చేతకానీ వాళ్లు స్వచ్చందంగా విరమణ తీసుకుని ఇళ్లకు వెళ్లిపోండి. లేదంటే.. రైల్వేలో జరిగినట్లుగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందేలా చేస్తాం” అంటూ కేంద్ర మంత్రి ఉద్యోగులను హెచ్చరించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికే కేంద్ర కేబినెట్‌ భారీ…

Read More

హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) తయారు చేసిన తేజస్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్‌ అసక్తి చూపిస్తున్నాయని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ చెప్పారు. తేజస్‌ను త్వరలో మలేషియా కొనుగోలు చేయనుందని తెలిపారు. 2019 ఫిబ్రవరిలో రాయల్‌ మలేషియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ నుంచి ప్రాథమిక టెండర్‌ను హెచ్‌ఏఎల్‌ స్వీకరించిందని చెప్పారు. ట్విన్‌–సీటర్‌ వేరియంట్‌ తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనాలని మలేషియా నిర్ణయించుకుందని ఆ వెల్లడించారు. కాలంచెల్లిన రష్యన్‌ మిగ్‌–29 ఫైటర్‌ విమానాల స్థానంలో తేజస్‌ను ప్రవేశపెట్టాలని భావిస్తోందని పేర్కొన్నారు.  లోక్‌సభలో ఓ ప్రశ్నకు అజయ్‌ భట్‌ సమాధానమిస్తూ స్టీల్త్‌ ఫైటర్‌ జెట్ల తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు వివరించారు.  ‘అటనామస్‌ ఫ్లైయింగ్‌ వింగ్‌ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్‌’ను డీఆర్‌డీఓ విజయవంతంగా పరీక్షించిందని, దీనిపై ఇంతకంటే ఎక్కువ సమాచారం బహిర్గతం చేయలేమని చెప్పారు. భారత వైమానిక దళ (ఐఏఎఫ్‌) అవసరాల కోసం రూ.48,000 కోట్లతో 83 తేలికపాటి…

Read More

మరోసారి దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణలో కేసుల నమోదు ఎక్కువగా ఉంది. ఈ ఏడు రాష్ట్రాల్లో వారాంత కరోనా పాజిటివిటీ రేటు పది శాతానికి పైగా ఉన్నది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఈ ఏడు రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కరోనా నియంత్రణకు ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని, కరోనా ప్రవర్తనా నియమావళిని పాటించాలని తెలిపారు. అలాగే అర్హులకు కరోనా టీకా డ్రైవ్‌ను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. మరోవైపు రానున్న నెలల్లో పలు పండుగలు ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో జన రద్దీ, సామూహిక కార్యక్రమాలు మరింతగా పెరుగుతాయి. దీంతో కరోనా వైరస్‌ మరింతగా వ్యాపించే అవకాశమున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ ఏడు రాష్ట్రాలను హెచ్చరించింది. ఆయన అప్రమత్తం చేసిన రాష్ట్రాల్లో కర్ణాటక, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర,…

Read More