Author: Editor's Desk, Tattva News

అన్నాడీఎంకే నుండి  బహిష్కరణకు గురవడం, ఉన్నత న్యాయస్థానాలలో, ఎన్నికల కమీషన్ వద్ద కూడా వెంటనే సానుకూల స్పందన లభించక పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ఇక మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలైన శశికళతో కలసి రాజకీయ ప్రయాణం సాగించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.  ‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అన్న చందాన అన్నాడీఎంకే తాజా బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం  మరో బహిష్కృత నాయకురాలు వీకే శశికళతో కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన తన అనుచరులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది.  ప్రస్తుతం తనకు పక్కకు నెట్టివేసి అన్నాడీఎంకేపై సంపూర్ణ ఆధిపత్యం సంపాదించిన  తన ప్రత్యర్థి ఎడప్పాడి పళనిస్వామి పని పట్టాలంటే ఇంతకు మించిన మార్గం మరొకటి లేదని గట్టిగా భావిస్తున్న ఓపీఎస్‌.. ఆ మేరకు ఇప్పటికే శశికళతో మంతనాలు జరిపినట్లు తెలిసింది.  అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న ఓపీఎస్‌  తన మద్దతుదారులతో పోటీ సర్వసభ్య…

Read More

ధరలు, నిరుద్యోగం, నిత్యావసరాలపై జిఎస్‌టి పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం దేశవ్యాపిత ఆందోళనలకు దిగింది. దేశ రాజధానిలో జరిగిన నిరసనలకు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా నేతృత్వం వహించారు. వారిద్దరితో పాటు వందలాదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ప్రియాంక గాంధీ ఏఐసీసీ కార్యాలయం వద్ద పోలీస్ బ్యారికేట్లను దాటుకొంటూ, పోలీస్ వలయాన్ని చేధించుకొంటూ, అరెస్ట్ చేయబోతే రోడ్డుపైననే భైఠాయించి చాలాసేపు నాటకీయ దృశ్యాన్ని తలపించారు. పెద్దసంఖ్యలో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల నుండి అంతటి ప్రతిఘటన ఎదురవుతుందని ఊహించని ఢిల్లీ పొలుసులు ప్రదర్శనకారులను అదుపులోకి తీసుకోవడం కోసం చాల శ్రమ పడవలసి వచ్చింది.  అయితే, అయోధ్యలో రామమందిరంకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేసిన రోజుననే నల్ల దుస్తువులతో కాంగ్రెస్ నేతలు ప్రదర్శనలు చేయడాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తీవ్రంగా దుయ్యబట్టారు. రామమందిర నిర్మాణంకు వ్యతిరేకంగా, తమ సంతుష్టీకరణ రాజకీయాలకు పతాక సన్నివేశంగా ఈ ప్రదర్శనలు చేశారని ఆరోపించారు.  రాష్ట్రపతి భవన్‌ వైపు ప్రదర్శనగా వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడానికి యత్నించడంతో వాతావరణం…

Read More

కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎమ్యెల్యే కోటమిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్  ఈనెల‌ 21న మునుగోడులో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరతారని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. రాజగోపాలరెడ్డి శుక్రవారమే ఢిల్లీలో హోమ్ మంత్రి అమిత్ షాను కలసి ఈ నెల 21న  బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.   అదేవిధంగా, ఇటీవల టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన  సిద్దిపేట మురళీయాదవ్, రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావులు కాషాయ కండువా కప్పుకుంటారని చెప్పారు.  దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగవుతోందని పేర్కొంటూ, త్వరలోనే టీఆర్ఎస్ కూడా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. రెండు  క్రితమే కనీసం 12 మంది టిఆర్ఎస్ ఎమ్యెల్యేలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని, మునుగోడు తర్వాత వారి నియోజకవర్గాలలో సహితం ఉపఎన్నికలు వస్తాయని బిజెపి రాష్ట్ర బండి సంజయ్ ప్రకటించారు.  ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఇనుప కంచె వేశాడని ఈటెల  ఆరోపించారు. పెన్షన్ కూడా ఇప్పించలేని పరిస్థితుల్లో…

Read More

పాఠశాల నియామకాల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్‌ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీలకు ఊహించని షాక్‌ ఇచ్చింది కోర్టు. ఈడీ కస్టడీ శుక్రవారంతో ముగియనుండంతో 14 రోజులు జుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో వారు మరో 14 రోజులు జైలులో ఉండనున్నారు. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. పాఠశాల నియామకాల స్కామ్‌లో నటి అర్పితా ముఖర్జీ నివాసాల్లో సోదాని నిర్వహించిన ఈడీ రూ 50 కోట్లకు పైగా విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. జులై 23న పార్థ ఛటర్జీ, నటి అర్పితా ముఖర్జీలని అరెస్ట్ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. అప్పటి నుంచి వారు ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ క్రమంలో పార్థ ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించారు సీఎం మమతా బెనర్జీ. అలాగే.. పార్టీ పదవుల నుంచి సైతం తొలగించారు. మరోవైపు.. తన నివాసంలో దొరికిన డబ్బులు పార్థ ఛటర్జీవేనని…

Read More

గడిచిన రెండున్నరేళ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం 28 లక్షల మందికి పైగా భారతీయులు విదేశాలకు వెళ్లి పోయినట్లు తాజాగా కేంద్రం వెల్లడించిన డేటా ద్వారా తెలిసింది. ఇలా ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారిలో 4.16లక్షల మంది ఈసిఆర్ దేశాలకు వెళ్లిన్నట్లు కేంద్రం తెలిపింది. లోక్‌సభలో విదేశాంగ మంత్రిత్వశాఖ లిఖితపూర్వకంగా 2020 జనవరి నుంచి 2022 జూలై వరకు- రెండున్నరేళ్లలో విదేశాలకు వెళ్లిపోయిన భారతీయ పౌరుల వివరాలను వెల్లడించింది. కేంద్రం వెల్లడించిన డేటా ప్రకారం 2020లో 7.15 లక్షల మంది, 2012లో 8.33 లక్షల మంది, 2022 జూలై వరకు 13.02 లక్షల మంది విదేశాలకు వెళ్లిపోయారు. ఇలా ఈ రెండున్నరేళ్లలో మొత్తం 28.51 లక్షల మంది విదేశాలకు వెళ్లిపోయారు. విదేశాలకు వెళ్లేవారి వీసాలు, వారు చెప్పిన వివరాల ఆధారంగా ఈ డేటాను సేకరించినట్లు సమాచారం. వీరిలో అత్యధికంగా 1.31లక్షల (32 శాతం) మంది యూపీ నుంచే వెళ్లారు.  ఆ తర్వాత స్థానాల్లో…

Read More

అనుకున్నట్లుగానే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ ) మరోసారి వడ్డీ రేట్లు పెంచేసింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో వడ్డీ రేటు 5.40 శాతానికి పెరిగింది. మూడు రోజులపాటు ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమీక్ష గవర్నర్‌ శక్తికాంత దాస్‌  అధ్యక్షతన సమావేశమై, అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.  35 నుంచి 50 బేసిస్‌ పాయింట్ల వరకు రెపో రేటును పెంపుదల చేస్తారని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఆర్‌బీఐ వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. 100 బేసిస్ పాయింట్లు ఒక శాతం లేదా ఒక రూపాయికి సమానం. అంటే ఇప్పుడు వడ్డీ రేటు 50 పైసలు పెరిగింది. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే మే-జూన్‌ నెలల్లో రెండు విడతలుగా రెపో రేటును 90 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతానికి సమానం) పెంచింది.…

Read More

’’మూసీ నదిని రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రక్షాళన చేస్తానని, హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లలా మారుస్తానని హామీలిచ్చిన మాటలు ఏమయ్యాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్  ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు.  మూసీ ప్రక్షాళన కోసం కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయని నిలదీశారు.  ప్రజా సంగ్రామ యాత్ర నాలుగోరోజున,  మూసీ బాధిత ప్రాంతమైన భువనగిరి నియోజకవర్గం పెద్ద రావులపల్లి గ్రామస్తులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో స్థానిక ప్రజలు మూసీ నీటితో పడుతున్న కష్టాలను ఏకరవు పెడుతూ మూసీ నీళ్ల వల్ల తినే తిండి కూడా కలుషితమైపోయిందని వాపోయారు. తమ ప్రాంతాల్లో పెళ్లి చేసుకుందామంటే పిల్లను కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  మూసీ నీళ్లతో పంటలన్నీ నాశనమవుతున్నాయని, అరోగ్యం దెబ్బతిని చావు బతుకుల మధ్య బతుకు వెళ్లదీయాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. వారి బాధలు విని చలించిన  సంజయ్ మూసీ నీళ్ల వల్ల ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నా కేసీఆర్ లో…

Read More

దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో సైనిక్ స్కూళ్లను ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేందుకు భారత రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుతో పాటు బిహార్, గుజరాత్, హర్యానా, కర్నాటక, కేరళ, మహారాష్ట్రలో ప్రైవేట్ భాగస్వామ్యంతో సైనిక్ స్కూళ్లు మంజూరయ్యాయి.  దేశవ్యాప్తంగా 100 సైనిక్ స్కూళ్లను ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా మొదటి విడతలో 12 సైనిక్ స్కూళ్లకు రక్షణ శాఖ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో 9 స్కూళ్లలో ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. కర్నాటకలోని మరొక పాఠశాలలో సెప్టెంబర్ 6 నుంచి తరగతులు మొదలవుతాయి. మిగిలిన 2 గ్రీన్‌ఫీల్డ్ పాఠశాలల నిర్మాణ పనులు జరుగుతున్నందున, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయని రక్షణ శాఖ ప్రకటనలో పేర్కొంది.2వ విడతలో భాగంగా మరొక 7 పాఠశాలలకు రక్షణ శాఖలోని సైనిక్ స్కూల్స్ సొసైటీ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా మంజూరైన…

Read More

జైలు పాలైన వ్యక్తి ఆధ్వర్యంలో తాను కలిసి పనిచేయలేనని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపిణి రాజీనామా లేఖలో స్పష్టం చేశారు.  కాంగ్రెస్ పార్టీని కొందరు నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తుతూ ఎంఎల్‌ఎలను గెలిపించలేని వ్యక్తులు, గెలిచిన ఎంఎల్‌ఎలలో మనోధైర్యం నింపలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. అనేక పార్టీలు మారి స్వలాభం కోసం ఓ ప్రజాప్రతినిధి చేయకూడని పనులు చేశారని అంటూ పరోక్షంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కారణంగా పార్టీని  వీడుతున్నట్లు తెలిపారు.  మీపైనే వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారని, ఇది తనను తీవ్రంగా బాధించిందని అంటూ ఆమె సోనియా వ్యవహారంపై సహితం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి విధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తున్నారని స్పష్టం చేశారు. మీ నాయకత్వంలో ఏ పని అప్పగించినా రాజీ లేకుండా కష్టపడ్డానని ఈ సందర్భంగా  ఆమెకు  గుర్తుచేశారు. కన్నీళ్లు, కష్టాలు దిగమింగుకుంటూ పార్టీలో పనిచేశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.…

Read More

భారత దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ యూ లలిత్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయనను తన వారసునిగా ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ సిఫారసు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం తర్వాత ఆయన ఆగస్టు 27న సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు.  తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలో సిఫారసు చేయాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ బుధవారం కోరింది. దీనిపై జస్టిస్ ఎన్‌వీ రమణ స్పందిస్తూ జస్టిస్ యూయూ లలిత్‌ను గురువారం సిఫారసు చేశారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాన న్యాయమూర్తిగా లలిత్‌ను నియమిస్తారు. సీజేఐగా లలిత్ పదవీ కాలం సుమారు మూడు నెలలు ఉంటుంది.  బార్ నుంచి సీజేఐగా ఎదిగిన మొదటి  న్యాయ కోవిదుడు జస్టిస్ ఎస్ఎం సిక్రి, ఆయన తర్వాత ఆ ఘనతను దక్కించుకోబోతున్నవారు జస్టిస్ లలిత్. 1971 నుంచి 1973 వరకు జస్టిస్ సిక్రి సీజేఐగా చేశారు. లలిత్ సుప్రీంకోర్టు…

Read More