శ్రీలంక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న తరుణంలో ఆందోళనకారులు ఆయనకు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీని పొడిగించింది. ప్రస్తుతం నిరసనలతో అట్టుడుకుపోతున్న శ్రీలంకను సరైన గాడీలో పెట్టేందుకు అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘే నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతుంది. అంతేకాదు ప్రతిపక్షాలతో చర్చలు జరిపి అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తోంది. అందులో భాగంగా మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు చెందిన శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)తో విక్రమసింఘే చర్చలు జరిపారు. కానీ ప్రధాన ప్రతిపక్షం సామగి జన బలవేగయ (ఎస్‌జేబీ) పార్టీ ప్రభుత్వం మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పింది. అయితే, ఆ పార్టీకి చెందిన కొందరు ఎంపీలు అధికార పక్షంలోకి చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా, ఎంపీ విమల్ వీరవన్స నేతృత్వంలోని నేషనల్ ఫ్రీడమ్ ఫ్రంట్ (ఎస్‌ఎఫ్‌ఎఫ్) విక్రమసింఘేకు మద్దతు ప్రకటించింది. వీరవన్స మాట్లాడుతూ తమ ముందు రెండే రెండు ఆప్షన్‌లు ఉన్నాయని చెప్పారు. దేశాన్ని ఆరాచక పరిస్థితి…
Author: Editor's Desk, Tattva News
ఉమ్మడి రాష్ట్ర రాష్ట్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు జువ్వికుంట రత్న పుష్పరాజ్(66) అనారోగ్యంతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎన్నో ఉన్నత పదవులు అలంకరించారు. పుష్పరాజ్ తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ఏడుగురు సంతానం ఉన్న పెద్ద కుటుంబంలో పుష్పరాజ్ రెండోవారు. ఆయన అన్నయ్య ఐఏఎస్ అధికారిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉద్యోగ విరమణ చేశారు. ఒక తమ్ముడు డాక్టరుగా, మరొకరు ఇంజనీరుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. ఆయన భార్య ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయిని. పుష్పరాజ్ విద్యార్థి నుంచే రాజకీయాలపై ఆసక్తితో ఉండేవారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమంలో రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీతో కలసి ప్రజాజీవనంలోకి వచ్చిన ఆయన తొలుత స్వతంత్ర పార్టీ, తర్వాత లోక్ దళ్, జనతా…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆగస్టు 4వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించనున్నారు. దేశంలో మరెక్కడాలేని విధంగా చేపట్టిన ఈ కేంద్రం ప్రారంభం కోసం పోలీస్ శాఖ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నగర సిపి సివి ఆనంద్ పలువురు సీనియర్ ఐపిఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసుల చరిత్ర తెలియజెప్పేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. నగరంలోని బంజారాహిల్స్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రూ.585 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టుతో అనుబంధం ఉన్న అన్ని శాఖలకు నగర పోలీసు కమీషనర్ సివి ఆనంద్ ఓ మెమోను రిలీజ్ చేశారు. ప్రారంభోత్సవానికి ముందే పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని సిపి కోరారు. కాగా రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్న వివిధ రకాల యూనిట్లు అన్నీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో…
రాష్ట్రపతి పదవిని అగౌరవపరిచేలా కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌధరి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి సభ్యులు లోక్‌సభలోపెద్ద ఎత్తున నిరసనకు దిగి నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని అవమానపరిచిందని, ఆ పార్టీ లోక్‌సభా పక్షనేత అధిర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధ్యక్షురాలు వెంటనే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళకు జరిగిన అవమానాన్ని సోనియాగాంధీ ఆమోదించారని స్మృతిఇరానీ విరుచుకుపడ్డారు. ఆమె బలహీన వర్గాలకు వ్యతిరేకమంటూ దుయ్యబట్టారు. అధికార, విపక్షాల నినాదాలతో సభ దద్దరిల్లింది. దీంతో గురువారం పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగింది. మరో పక్క కరోనా నుంచి కోలుకుని సభకు వచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తీవ్రంగా స్పందించారు. దీనిపై పార్లమెంట్ ప్రాంగణంలో ధర్నా చేస్తున్న బిజెపి సభ్యులకు ఆమె మద్దతు…
ఆగష్టు 2 నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర పోస్టర్ ను పార్టీ నేతలు ఆవిష్కరించారు. ఆగస్టు 2 నుంచి 26 వ తేదీ వరకు యాత్ర సాగనుందని తెలిపారు. ఆగస్టు 2న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ను ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని , వచ్చే నెల 26న జరిగే ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆహ్వానించామని చెప్పారు. మొత్తం 24 రోజుల పాటు యాదాద్రి, నల్గొండ, జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాల మీదుగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాల్లో సాగనుంది. మొత్తం 328 కిలోమీటర్ల మేర మూడవ విడత పాదయాత్ర కొనసాగుందని పార్టీ వర్గాలు తెలిపారు. ఆలేరు,…
ఉపాధ్యాయుల కుంభకోణంలో ఈడీ అరెస్ట్ నేపథ్యంలో పార్థా ఛటర్జీని ఎట్టకేలకు మంత్రి పదవి నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉద్వాసన పలికారు. పార్థా ఛటర్జీపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి తప్పించాలని బెంగాల్ వ్యాప్తంగా డిమాండ్ వినిపించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన దీదీ పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బెంగాల్ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. పార్థా ఛటర్జీ మమతా ప్రభుత్వంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఎంటర్‌ప్రైజెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా ఉన్నారు. ‘పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నా. తప్పు చేసినవారిపై టీఎంసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అధికారాన్ని దుర్వినియోగం చేసేవారి పని పట్టడానికి మా వద్ద చాలా ప్లాన్స్ ఉంటాయి.. అవన్నీ చెప్పలేం’ అని మమత పేర్కొన్నారు. పార్థాను మంత్రి పదవి నుంచి తప్పించడంతో అతని శాఖను మమతా బెనర్జీయే చూసుకోనున్నారు. ఆయనను తృణమూల్ కాంగ్రెస్…
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారంతో విచారణను ముగించారు. మొత్తం మూడు రోజులలో 12 గంటల పాటు ఆమెను విచారించారు. బుధవారం మధ్యాహ్నానికే ఆమె విచారణను ముగించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులకు సంబంధించిన కేసులో సోనియాతో పాటు రాహుల్ గాంధీని కూడా ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాహుల్ గాంధీని ఐదు రోజులపాటు సుమారు 50 గంటల మేరకు విచారించారు. అయితే, ఏ ప్రశ్న అడిగినా దిగవంత కాంగ్రెస్ నేత మోతిలాల్ ఓరా అన్ని వ్యవహారాలు చూసువుకునేవారంటూ ఆయనపై సోనియా గాంధీ నెట్టివేసిన్నట్లు తెలుస్తున్నది. దానితో విచారణను అర్ధాంతరంగా ముగించినట్లు భావిస్తున్నారు. ఆయన గతంలో మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా, కాంగ్రెస్ కోశాధికారిగా పనిచేశారు. డిసెంబర్, 2020లో మృతి చెందారు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారాలు సహితం ఆయనే చూస్తుందనేవారని ఆమె చెప్పడంతో విచారణ ముందుకు సాగలేని పరిష్టితులు ఎదురయ్యాయని చెబుతున్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక, యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్…
దేశంలో మంకీపాక్స్ వైరస్ క్రమంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే కేరళలో ముగ్గురు, ఢిల్లీలో ఒకరి ఈ వైరస్ బారిన పడగా, తాజాగా ఢిల్లీలో మరో కేసు నమోదయింది. మంకీపాక్స్ లక్షణాలతో బాధితుడు మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ వైరస్ మాదిరిగానే చర్మంపై బొబ్బలు, తీవ్ర జ్వరం వంటివి కనిపించాయని పేర్కొన్నారు. నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించామని చెప్పారు. 34 ఏళ్ల బాధితుడు ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో నిర్వహించిన ఓ పార్టీకి హాజరయ్యాడు. ఆ తర్వాత జ్వరం, చర‍్మంపై దద్దుర్ల వంటి లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. మూడు రోజుల క్రింత జులై 24న ఢిల్లో తొలి కేసు నమోదైంది. ఆ వ్యక్తి సైతం ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిని నోడల్ సెంటర్‌గా ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. వైద్యులకు శిక్షణ ప్రారంభించింది. దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు…
పాకిస్థాన్ మహిళలు విసిరిన వలపు వల (హనీట్రాప్)లో పడి సైన్యానికి సంబంధించిన కీలక సమాచారం లీక్ చేస్తున్న భారత జవాన్ల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా ఇటువంటి ఆరోపణలో మరో జవాన్ శాంతిమే రాణా(24)ను అరెస్ట్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అధికారిక రహస్యాల చట్టం 1923 కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని బగుండా జిల్లా కంచన్‌పుర్ గ్రామానికి చెందిన శాంతిమే రాణా ప్రస్తుతం జైపూర్‌లోని ఆర్టెరీ యూనిట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా పాకిస్థాన్ ఏజెంట్లు గుర్నౌర్ కౌర్ అలియాస్ అంకిత, నిషాలు రాణాకు పరిచయమయ్యారు. రాణా ఫోన్ నంబర్ తీసుకున్నారు. వాట్సాప్ ద్వారా ఇద్దరు జవాన్‌తో మాట్లాడేవారు. వారిని పూర్తిగా నమ్మినట్లు గుర్తించిన తర్వాత నిఘా సమాచారం సేకరించటం మొదలు పెట్టారు. అందుకు బదులుగా రాణా ఖాతాలో కొంత డబ్బు సైతం జమ చేశారని రాజస్థాన్ పోలీస్ నిఘా విభాగం డీజీ ఉమేష్ మిశ్రా తెలిపారు. 2018, మార్చిలో…
భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ముందుగా దేశీయ పర్యాటకానికి ప్రాధాన్యతనివ్వాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విదేశాల్లో పర్యటించటం కంటే ముందు మన దేశంలో ఉన్న అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్ళి, అక్కడి జీవన విధానాన్ని, గొప్పతనాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఇలాంటి పర్యాటకాల వల్ల ప్రజల మధ్య సంస్కృతి, అభిప్రాయాల మార్పిడి జరిగి జాతి ఐక్యత, సమగ్రత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. “నార్త్ ఈస్ట్ ఆన్ వీల్స్” పేరిట ఈశాన్య భారతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో పర్యటించిన 18 రాష్ట్రాలకు చెందిన ఐదుగురు మహిళలు సహా 75 మంది బైకర్లతో న్యూఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వెంకయ్యనాయుడు మంగళవారం సంభాషించారు. ఇటీవలి తన ఈశాన్య రాష్ట్రాల పర్యటనను గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, అందమైన ప్రకృతి దృశ్యాలు, గొప్ప సంస్కృతి ఈశాన్య రాష్ట్రాలు పర్యాటక స్వర్గధామం అని ఆయన తెలిపారు. సేంద్రీయ వ్యవసాయ రంగంలో భారతదేశానికి మార్గనిర్దేశం చేస్తున్న ఈశాన్య రాష్ట్రాలను ఆయన అభినందించారు. వారు…