Author: Editor's Desk, Tattva News

దేశాన్ని దివాలా తీయించి, ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేసిన ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయడంతో దేశం వీడి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. మూల్దీవుల్లో తొలి మజిలీ, సింగపూర్‌లో మలి మజిలీ వేసిన ఆయన గురువారం అక్కడి నుంచే తన రాజీనామా లేఖను పంపారు. అక్కడకు చేరుకున్న వెంటనే ఇ మెయిల్‌ ద్వారా తన రాజీనామా లేఖను స్పీకర్‌ అబె వర్దనెకు పంపారు. రాజీనామా విషయం తెలియగానే శ్రీలంకలో పెద్ద ఎత్తున ప్రజలు సంబరాలు చేసుకోవడం కనిపించింది. అధ్యక్ష భవనం, ప్రధాన మంత్రి నివాసాలలో విన్యాసాలు చేస్తూ వచ్చిన ప్రదర్శకులు బైటకు వచ్చి వెళ్లిపోయారు. ఇదిలా వుండగా, ప్రశాంతంగా వుండాల్సిందిగా సైన్యం ప్రజలను కోరుతోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినా తగు చర్యలు తీసుకునే అధికారం తమకు ఉందని ఆర్మీ తెలిపింది. స్వదేశంలో ప్రజల తిరుగుబాటును తప్పించుకుని మాల్దీవులకు…

Read More

అన్నాడీఎంకేపై ఆధిపత్యం కోసం కొంతకాలంగా ఎవ్వరికీ వారుగా విఫల ప్రయత్నాలు చేస్తూ వస్తున్న జయలలిత సన్నిహితురాలు వికె శశికళ, మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం ఉమ్మడిగా వ్యూహరచనకు సిద్దపడుతున్నారా? పార్టీ నుండి తనను గెంటివేసి, మొత్తం పార్టీని ఆధీనంలోకి తెచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామిపై ఒక వంక కోర్టులలో పోరాటం చేస్తూనే, మరోవంక రాజకీయంగా పావులు కదుపుతున్నారు. పన్నీరుసెల్వంను పార్టీ నుండి బహిష్కరించడాన్ని ఖండిస్తూ, సానుభూతి వ్యక్తం చేసిన శశికళ ఇటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నట్లయింది. తానుండగా ఆ పార్టీని ముక్కలు కనివ్వను అంటూ ఘాటుగా ప్రకటన కూడా చేశారు. ఈ తరుణంలో ఈ ఇద్దరు నేతల భేటీకి రంగం సిద్దమైన్నట్లు తెలుస్తున్నది. అందుకు, జయలలిత మేనకోడలు దీప చొరవ తీసుకున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరిని ఆమె తన ఇంటికి విందుకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తున్నది. ఈ ముగ్గురూ ప్రస్తుతం దీప సొంతమైన పోయె్‌సగార్డెన్‌లోని జయ నివాసంలో కలవనున్నట్లు తెలుస్తున్నది. నిజానికి గత ఏడాది ఓపీఎస్‌ సతీమణి మరణించినప్పుడు శశికళ వెళ్లి పరామర్శించారు. ఆమెను చూడగానే ఓపీఎస్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.…

Read More

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ రోడ్ల ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో గోతుల మధ్య రోడ్డును వెతుక్కోవల్సి వస్తోందని, రోడ్లు ఈత కొలనులను తలపిస్తున్నాయని ఎద్దేవా చేసారు. రోడ్ల అభివృద్ధి చేతకాకపోతే కనీసం మరమ్మతులు చేయాలనే బాధ్యతను సైతం వైస్సార్సీపీ ప్రభుత్వం గాలి కొదిలేసిందని దుయ్యబట్టారు.  వారికి బాధ్యత గుర్తు చేయాలనే #GoodMorningCMSir అనే హాష్ ట్యాగ్తో ఈ నెల 15, 16, 17 తేదీల్లో జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు.  జులై నెల 15 నాటికల్లా దెబ్బ తిన్న రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేసి.. ప్రతిపక్షాల నోరు మూయిస్తామని ముఖ్యమంత్రి సవాల్‌ చేశారని.. ఆ ఛాలెంజ్ను స్వీకరించి రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి కళ్లు తెరిపించాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు.  ఆర్ అండ్ బీ పరిధిలో స్టేట్ హైవేలు 14,722 కి.మీ, మేజర్ డిస్ట్రిక్ట్…

Read More

ఉత్తరప్రదేశ్‌కు ఆరవ ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రాబోతోంది. 296 కిలోమీటర్ల పొడవైన బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 16వ తేదీన ప్రారంభించనున్నారు. చిత్రకూట్-ఇటావా మధ్య నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్దేశిత గడువు కంటే 8 నెలల ముందు పూర్తయింది. 2020 ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుతో వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రధాని భరోసా ఇచ్చారు. నగరాలలో ఉండే సౌకర్యాలు సామాన్య ప్రజానీకానికి సైతం అందుబాటులోకి వస్తాయని చెప్పారు. చిత్రకూట్ జిల్లాలోని భరత్‌కూప్ నుంచి ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమై ఇటావా జిల్లాలోని కుడ్రయిల్ గ్రామం సమీపంలోని ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌తో కలుస్తుంది. ఏడు జిల్లాలను కలుపుతూ వెళ్తుంది. చిత్రకూట్, బాండ, మహోబ, హమిర్‌పూర్, జలౌన్, అవురియా, ఇటావా జిల్లాను కలుపుతుంది. బగన్, కెన్, శ్యామ, చందావల్, బిర్మా, యమున, బెట్వా, సెంగర్ వంటి పలు నదులను దాటుతూ వెళ్తుంది. నాలుగు లేన్ల ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ఉత్తరప్రదేశ్…

Read More

ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు పన్నిన కుట్రను బిహార్‌ పోలీసులు భగ్నం చేశారు. పాట్నాలో మోదీని లక్ష్యంగా చేసుకొని కుట్ర పన్నిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2047 నాటికి భారత్‌ను ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. అంతేగాక జూలై 12న మోదీ బిహార్‌ పర్యటన సందర్భంగా ఆయన్ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కుట్ర జరిగినట్లు వెల్లడించారు. అరెస్ట్‌ చేసిన వారిని జార్ఖండ్ రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ జల్లావుద్దీన్, అథర్‌ పర్వేజ్‌గా పోలీసులు పేర్కొన్నారు. వీరికి పీఎఫ్‌ఐతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. అనుమానిత ఉగ్రవాదులు ప్రధాని పర్యటనకు 15 రోజుల ముందు పుల్వారీ షరీఫ్‌లో శిక్షణ పొందినట్లు పోలీసులు కనుగొన్నారు. జూలై 6,7 తేదీల్లో మోదీ టార్గెట్‌గా వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. దీంతో ఉగ్రవాదుల ఫుల్వారీ షరీఫ్ కార్యాలయంలో బీహార్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు పలు నేరారోపణ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని ఒక దాంట్లో ‘2047 వరకు ఇండియాను ఇస్లామిక్‌ ఇండియాగా…

Read More

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కరోనాతో చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో గురువారం ఉదయం చేరారు. కరోనా సంబంధిత లక్షణాలపై పరీక్షల కోసమే ఆయన చేరినట్లు ఆస్పత్రి వర్గాలు ఓ బులిటెన్‌ విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు, కాస్త అలసట, జ్వరంతో బాధపడుతున్నట్లు బులిటెన్‌లో తెలిపాయి ఆస్పత్రి వర్గాలు. 69 ఏళ్ల వయసున్న ఎంకే స్టాలిన్‌ కరోనా నిర్ధారణ కావడంతో మంగళవారం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. తీవ్ర అలసట, జ్వరం లక్షణాలు ఉన్నట్లు ట్విటర్‌ ద్వారా ఆయన సైతం ప్రకటించారు. తమిళనాడులో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్‌, సబ్‌ వేరియెంట్స్ కారణంగానే కేసులు పెరిగిపోతున్నాయని తమిళనాడు వైద్య శాఖ చెబుతోంది. అయితే ఆస్పత్రిలో చేరికలు తక్కువగానే నమోదు అవుతున్నాయని, త్వరగా కోలుకుంటున్నారని వెల్లడించింది. మళ్లీ 20వేలు దాటిన కరోనా కేసులు కాగా, దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంపై తీవ్ర…

Read More

ఐఎస్‌ఐ తరఫున గూఢచర్యం చేసిన పాకిస్తాన్‌ జర్నలిస్టు ఒకరితో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ దేశ రహస్యాలను పంచుకున్నారంటూ బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. సదరు జర్నలిస్టును అన్సారీ స్వయంగా భారత్‌కు ఆహ్వానించారంటూ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను అన్సారీ తోసిపుచ్చారు. సదరు జర్నలిస్టును తానెన్నడూ కలవడం గానీ, భారత్‌కు ఆహ్వానించడం గానీ చేయలేదని పేర్కొన్నారు. నుస్రత్‌ మీర్జా అనే పాకిస్తాన్‌ జర్నలిస్టు తాను పలుమార్లు భారత్‌లో పర్యటించి అత్యంత రహస్యమైన సున్నిత సమాచారాన్ని సేకరించి పాక్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకి అందించానంటూ చేసిన వ్యాఖ్యలు కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఉగ్రవాదంపై భారత్‌లో జరిగిన ఓ సెమినార్‌లో కూడా తాను పాల్గొన్నానని, అన్సారీ అందులో ప్రసంగించారని మీర్జా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మీర్జా వ్యాఖ్యలను ఉటంకిస్తూ అన్సారీపై భాటియా తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘2005–11 మధ్య అన్సారీ తనను కనీసం…

Read More

తెలంగాణ రాష్ట్రంలో ఏ హిందువుకు ఆపద వచ్చినా ఆదుకునేందుకు బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సిద్ధంగా ఉందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ భరోసా ఇచ్చారు. తెలంగాణలోని ఏ హిందువుకు ఆపద వచ్చినా వీహెచ్‌పీ హెల్ప్‌లైన్‌ నంబర్‌  91107 65545కు ఫోన్‌ చేయాలని సూచించారు.  ఆదుకునేందుకు బజరంగ్‌దళ్‌, వీహెచ్‌పీ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ధర్మ రక్షణ కోసం నిరంతరం ( అర్ధరాత్రి అపరాత్రి) అన్నివేళలా హిందువులకు అండగా ఉంటామని చెబుతూ బుధవారం పౌర్ణమి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో హిందూ హెల్ప్ లైన్ ప్రారంభించారు.  ఇతర మతస్తుల దుర్మార్గాల నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. గోరక్ష, లవ్ జిహాద్, మత మార్పిడి, దేవాలయాల భూముల కబ్జా, హిందూ జీవన విధానంపై సాంస్కృతిక దాడులు..  ఇలా అనేక రంగాలపై ఇతర మతస్థులు చేస్తున్న హింస నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. అక్రమంగా…

Read More

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ప్రకటిస్తూ శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే ప్రకటన చేయడంతో మహావికాస్‌ అఘాఢీలో లుకలుకలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే సంకీర్ణ కూటమి నుంచి తప్పుకునేందుకు సిద్ధమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. త్వరలో బృహణ్‌ ముంబై కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తూ శివసేన తన వైఖరిని మార్చుకుంటోందంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మిలింద్‌ దేవర ఆరోపించారు. ఉద్ధవ్‌ సారథ్యంలోని శివసేన సంకీర్ణ ధర్మం పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన సారథ్యంలోని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా శివసేనపై కఠిన వ్యాఖ్యలు చేసే మిలింద్‌ దేవర ఇప్పడు మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బలం లేకపోయినా కుయుక్తలతో అధికారంలోకి వచ్చేందుకు ఉద్ధవ్‌ సారథ్యంలోని శివసేన ప్రయత్నిస్తోందని, వార్డుల పునర్విభజన ద్వారా కుయుక్తులు పన్నుతోందని ఆరోపిస్తూ ఇటీవల కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం…

Read More

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో భారత్‌కు భారీగా దిగుమతి సుంకాలు ఎగ్గొట్టింది. ఒప్పో ఇండియా రూ.4389 కోట్ల పైగా కస్టమ్స్‌ డ్యూటీని చెల్లించలేదని తమ తనిఖీల్లో తేలిందని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజన్స్‌ (డిఆర్‌ఐ) వెల్లడించింది. ఈ అంశంలో షోకాజ్‌ నోటీసులను జారీ చేసినట్లు సమాచారం. మనీలాండరింగ్‌ ఆరోపణలపై ఇటీవల ఒప్పో ఇండియా కార్యాలయాలు, కీలక మేనేజ్‌మెంట్‌ ఉద్యోగుల కార్యాలయాలు, నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి), డిఆర్‌ఐ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో కంపెనీ పలు అక్రమాలకు పాల్పడటం ద్వారా పన్ను ఎగవేతలకు పాల్పడినట్టు డిఆర్‌ఐ అధికారులు గుర్తించారు. 1962లోని నిబంధనల ప్రకారం ఒప్పో ఇండియా, దాని ఉద్యోగులు ఒప్పో చైనాపై సంబంధిత జరిమానాలను కూడా ప్రతిపాదిస్తున్నట్లు డిఆర్‌ఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సంస్థ మొబైల్‌ ఫోన్ల తయారీ, అసెంబ్లింగ్‌, హోల్‌సేల్‌ ట్రేడింగ్‌, మొబైల్‌ ఫోన్ల పంపిణీ, యాక్సెసరీస్‌ల వంటి వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఒప్పో, వివోతో పాటు…

Read More