నాగార్జునసాగర్‌లో కనీస నీటి మట్టానికి ఎగువన లభ్యతగా ఉన్న నీటిలో ఏపీకి 13.5 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. తెలంగాణకు 13.25 టీఎంసీలు, శ్రీశైలంలో కల్వకుర్తి ఎత్తిపోతలకు 2.4 టీఎంసీలను, మొత్తం 15.65 టీఎంసీలను కేటాయించింది. త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే తెలిపారు. రాయ్‌పురే కన్వీనర్‌గా ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ వర్చువల్ విధానంలో సమావేశమైంది. గతేడాది తమ కోటాలోని 47.719 టీఎంసీలను శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు తరలించామని, వాటిని ఈ ఏడాది వాడుకొంటామని తెలంగాణ ఈఎన్‌సీ కోరారు. దీనిపై ఏపీ ఈఎన్‌సీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఏ నీటి సంవత్సరం లెక్కలు అదే ఏడాదితో ముగుస్తాయని, కోటాలో మిగిలిన నీటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కూడా బచావత్…
Author: Editor's Desk, Tattva News
పూరీ జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రారంభమైంది. దీంతో పూరీ నగరం భక్తులతో కిక్కిరిసి పోయింది. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా పూరీ జగన్నాథ రథయాత్ర చేపట్టలేదు. కరోనా తగ్గిన నేపథ్యంలో ఈసారి భక్తులకు యాత్రలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో నిన్నటి నుంచే పూరీ నగరంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ యాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.ఈసారి రథయాత్రకు దాదాపు పదిహేను లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు అధికారు. కాగా, పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి శ్రీ క్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏడాదిపాటు గర్భాలయంలో కొలువుదీరి ఉండే జగన్నాథుడు రథాయాత్ర జరిగే రోజున తన సోదరి సుభధ్ర, సోదరుడు…
ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే రాజీనామా చేసిన తర్వాత పలు నాటకీయ రాజకీయ పరిణామాల అనంతరం తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా, బిజెపి నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఉపముఖ్యమంత్రిగా గురువారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఆ వెంటనే సీఎం హోదాలో షిండే తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో జూలై 2, 3 తేదీల్లో అసెంబ్లీని సమావేశపరచాలని తీర్మానించారు. తొలిరోజు సభలో స్పీకర్ ఎన్నిక, బలపరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు. మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోల్ గత ఏడాది ఫిబ్రవరిలో స్పీకర్ పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది. ముఖ్యమంత్రి షిండే, ఉప ముఖ్యమంత్రి ఫడణవీ్‌సలను ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అభినందించారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, తాజా మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా…
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు పెట్టని కోటగా ఉంటూ, ఆయన వరుసగా 1989 నుండి గెలుస్తూ వస్తున్న కుప్పంలోనే ఆ పార్టీని కట్టడి చేయాలనీ అధికార వైసిపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా కుప్పం వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అక్కడ జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అక్కడ టిడిపిని మట్టి కురిపించారు. రానున్న ప్రమాద ఘడియలను పసిగట్టిన చంద్రబాబు నాయుడు ఈ మధ్య కుప్పంలో తరచుగా పర్యటిస్తూ ఉండడమే కాకుండా, అక్కడ ఓ సొంత ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుపై బలమైన అభ్యర్థిని నిలబెట్టితే, ఆయన దృష్టిని రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల నుండి మళ్లించవచ్చని వైసీపీ నాయకత్వం భావిస్తున్నది. ఇప్పటివరకు వైసీపీ తరుపున కుప్పంలో ఎన్నికల బరిలోకి దిగిన ప్రతి అభ్యర్థి చతికిలబడ్డారు. సరైన ప్రత్యర్థి కోసం వైసీపీ గాలిస్తూనే ఉంది. తొలుత రామచంద్రారెడ్డి తన సోదరుడి కుమారుడిని పోటీకి దింపాలని అనుకున్నాను. అయితే ఇప్పుడు సుప్రసిద్ధ నటుడు విశాల్…
కేరళలో గురువారం రాత్రి తిరువనంతపురంలోని సిపిఎం ప్రధాన కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. ఎకె గోపాలన్ సెంటర్‌లో ఉన్న కార్యాలయంపై రాత్రి 11.30 గంటలకు ఈ దాడి జరిగింది. ఆ సమయంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పికె శ్రీమతి కార్యాలయంలోనే ఉన్నారు. బాంబు పార్టీ కార్యాలయం గేటు వద్ద పడటంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. సిసిటివి కెమెరాల్లో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి పేలుడు పదార్థాలను విసిరి పరారౌతున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న పార్టీ నేతలు రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ దాడి ఘటనను ఖండించిన సిపిఎం నేతలు నిరసనలు చేపట్టారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పనేనని నేతలు విమర్శించారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని ఎల్‌డిఎఫ్ కన్వీనర్, సిపిఎం నేత ఇపి జయరాజన్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఎకె గోపాలన్ సెంటర్ కార్యాలయంపై దాడి జరగడం ఇది మూడోసారి. ఇటీవల వయనాడ్‌లో కాంగ్రెస్ నేత…
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు వివిధ రాష్ట్రాల ర్యాంకులను విడుదల చేశారు. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక-2020 అమలు ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ర్యాంకింగ్‌లను కేంద్ర ప్రభుత్వం నాలుగు విభాగాల్లో ఇచ్చింది. టాప్ అచీవర్స్ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్ తరువాత స్థానంలో గుజరాత్ నిలిచింది. మూడవ స్థానంలో తమిళనాడు, నాల్గవ స్థానంలో తెలంగాణ నిలిచింది. ఆ తరువాత స్థానాల్లో హర్యానా, కర్ణాటక, పంజాబ్ ఉన్నాయి, అచీవర్స్ కేటగిరిలో హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రద్రేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఆశావహులు (అస్పిరెర్స్) కేటగిరిలో అస్సాం, ఛత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. మరోవైపు.. ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టమ్స్ కేటగిరిలో అండమాన్, నికోబార్, బీహార్, చండీగఢ్, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్,…
2035లో భారత్‌లో పట్టణ జనాభా 67.5 కోట్లు(675 మిలియన్లు)గా ఉంటుందని వంద కోట్ల జనాభాతో చైనా ప్రథమ స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంటుందని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికలో పేర్కొంది. అంతేకాదు కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా పట్టణ జనాభా తిరిగి మామూలు స్థాయిలో పెరుగుతోందని, 2050 నాటికి మరో 220కోట్లు (2.2 బిలియన్లు) పెరగనుందని కూడా ఆ నివేదిక అంచనా వేసింది. కరోనా మహమ్మారి కారణంగా శరవేగంగా పట్టణీకరణ తాత్కాలికంగా మాత్రమే ఆలస్యమైందని ‘ఐక్యరాజ్య సమితి హ్యాబిటట్స్’కు చెందిన ప్రపంచ నగరాల నివేదిక 2022 పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పట్టణ జనాభా పెరుగుదల తిరిగి గతంలోలాగే వేగంగా పెరుగుతోందని 2050 నాటికి మరో 220కోట్లు పెరుగుతుందని ఆ నివేదిక అంచనా వేసింది. 2035 నాటికి భారత పట్టణ జనాభా 67,54,56,000కు చేరుకోవచ్చని ఆ నివేదిక అంచనా వేసింది. 2020లో దేశంలో పట్టణ జనాభా 48,30,99,000 ఉండగా, 2025 నాటికి అది 54,27,43,000కు,…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ తాను అనుకోకుండా ముఖ్యమంత్రి అయ్యానని, అనుకోకుండానే రాజీనామా చేస్తున్నానని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. వాస్తవానికి తండ్రి బాల్ ఠాక్రే మొదటి నుండి క్రియాశీల రాజకీయాలలో ఉన్నప్పటికీ ఆయన ఎన్నడూ రాజకీయాల పట్ల ఆసక్తి చూపలేదు. బాల్ ఠాక్రేకు సోదరుని కుమారుడు రాజ్ ఠాక్రే రాజకీయ వారసుడు కాగలరని చాలా మంది భావించారు. ఆయనే మొదటి నుండి రాజకీయాల పట్ల ఆసక్తి కనబరుస్తూ ఉండేవారు. ఫోటోగ్రఫీ పట్ల అమితమైన ఆసక్తి పెంచుకున్న ఆయన ఎప్పుడు మరో ప్రపంచంలో ఉండేవారు. తండ్రి వలే ఎప్పుడు ప్రత్యర్థుల పట్ల పరుషమైన పదజాలం ఉపయోగించారు. సౌమ్యుడిగా పేరొందారు. ఆయనపై తిరుగుబాటు చేసిన ఎమ్యెల్యేలు సహితం ఆయన రాజీనామా పట్ల విచారం వ్యక్తం చేయడం, ఆయన పట్ల తమకు వ్యతిరేకత లేదనడం గమనార్హం. 2002లో ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ జీవితం ప్రారంభమయ్యింది. 2002లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన ప్రచార బాధ్యుడిగా అనుకోకుండా రాజకీయ ప్రవేశం చేశారు. ఈ…
మహారాష్ట్రలో దాదాపు తొమ్మిది రోజుల రాజకీయ సంక్షోభం తర్వాత, మహా వికాస్ అఘడి ప్రభుత్వం తుదకు బుధవారం రాత్రి పడిపోయింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. ఆయన శివసేన-నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) కాంగ్రెస్ పార్టీల సంకీర్ణం ఎంవిఏ ప్రభుత్వంకు అధినేతగా కొనసాగారు. సుప్రీంకోర్టు గురువారం బలపరీక్ష(ఫ్లోర్ టెస్ట్)కు ఆదేశించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఠాక్రే రాజీనామాను గవర్నర్ భగత్ సింగ్ కోశియారి ఆమోదించడమే కాక, తదుపరి ఏర్పాటు జరిగే వరకు ఆయనను కొనసాగాల్సిందిగా కోరారు. బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ 31 నెలల తర్వాత తిరిగి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానున్నారని భావిస్తున్నారు. బలపరీక్షకు గవర్నర్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా చుక్కెదురైంది. దానితో రాజీనామా తప్పలేదు. ఆయన ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా గురువారం విశ్వాస పరీక్షకు నిలవాల్సిందేనని బుధవారం తీవ్రవాదోపవాదాలు తరువాత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిని…
బీహార్ లోని అసదుద్దీన్ ఒవైసి నాయకత్వంలోని ఏఐఎంఐఎం పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్యెల్యేలో నలుగురు తేజస్వి యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)లో బుధవారం చేరారు. దానితో బీహార్ అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యుల శాఖ 80కు పెరగడంతో అతిపెద్ద పార్టీగా మారింది. అంతకు ముందు 76 మంది ఎమ్యెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉన్న ఆర్జేడీని దాటుకొని వికాశీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి)కి చెందిన ఎమ్మెల్యేలు చేరడంతో బిజెపి సభ్యుల సంఖ్య 77కు పెరిగి, అతిపడ్డ పార్టీగా మారిందితాజా పరిణామంతో తిరిగి అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ ఆవిర్భవించింది. ఈ విలీనం గురించి తెలియజేసేందుకు తేజస్వి యాదవ్ తన సొంత కారులో నలుగురు ఎమ్మెల్యేలను తీసుకుని స్పీకర్‌ను కలిసేందుకు వెళ్లారు. ఆర్జేడీలో చేరిన ఏఐఎంఐఎం ఎమ్మెల్యేల్లో మహ్మద్ ఇజార్ అర్ఫీ, షానవాజ్ ఆలం, రుకానుద్దీన్ అహ్మద్, అంజార్ నైమి ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీకి బిహార్లో ఒకే ఒక ఎమ్మెల్యే అయిన అక్తరుల్ ఇమాన్ మిగిలారు. అతను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.ఏఐఎంఐఎం ఎమ్యెల్యేలు…