Author: Editor's Desk, Tattva News

తాను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు `దత్త పుత్రుడను’ అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వాఖ్యాలను తిప్పికొడుతూ తాను ప్రజలకు దత్తపుత్రిడిని అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. అయితే సీఎం జగన్ మాత్రం ఖచ్చితంగా `సిబిఐకి దత్తపుత్రుడు’ అని తేల్చి చెప్పారు. భవిష్యత్లో జగన్ సీబీఐ కేసులు ఎదుర్కోక తప్పదని జోస్యం చెప్పారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ఏపీకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని పవన్‌ కల్యాణ్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా పర్చూరులో పవన్ పర్యటించి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పరామర్శించారు. పర్చూరు బహిరంగ సభలో బాధితులకు ప్రకాశం జిల్లాకు చెందిన 80 రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు.  ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం కూడా కౌలు రైతులను గుర్తించడం లేదని, కౌలు రైతులకు ఎటువంటి గుర్తింపు పత్రాలు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్కు తప్ప…

Read More

సైన్యంలో అగ్నిపథ్‌ నియామకాలకు సోమవారం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు లెఫ్టినెంట్‌ జనరల్‌ బన్సీ పొన్నప్ప చెప్పారు. మొదటి బ్యాచ్‌లో 25,000 మందికి డిసెంబర్‌ మొదటి, రెండో వారాల్లో శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు పొన్నప్ప తెలియజేశారు. రెండో బ్యాచ్‌ అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. దాదాపు 40,000 మందిని నియమించడానికి దేశవ్యాప్తంగా 83 రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. అగ్నిపథ్‌ కింద నావికా దళంలో త్వరలో చేపట్టనున్న నియామకాల ప్రణాళిక గురించి వైస్‌ అడ్మిరల్‌ (పర్సనల్‌) దినేష్‌ త్రిపాఠి ప్రకటించారు. ఈ నెల 25 నాటికి నేవీ ప్రధాన కార్యాలయం పూర్తి వివరాలు వెల్లడిస్తుందని తెలిపారు. అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన మొదటి బ్యాచ్‌కు ఈ ఏడాది నవంబర్‌ 21 నాటికి ఒడిశాలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో శిక్షణ ప్రారంభిస్తామని తెలియజేశారు. అగ్నివీరులుగా యువకులను, యువతులను ఎంపిక చేస్తామని దినేష్‌ త్రిపాఠి ఉద్ఘాటించారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)లో…

Read More

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ అల్లర్లలో40కి పైగా ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల నుంచి ఆర్మీ అభ్యర్థులు వచ్చినట్లు  పోలీసులు తేల్చారు. అకాడమీ నిర్వాహకుల అత్యుత్సాహం వల్లే అల్లర్లు జరిగినట్లు పోలీసులు కి నిర్ధారణకు వచ్చారు.  రైల్వేస్టేషన్ టార్గెట్‌గా 10 వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పడినట్లు గుర్తించారు.  వాట్సాప్ చాట్, వీడియోస్, సోషల్‌ మీడియా పోస్ట్‌ల ఆధారంగా ఆందోళనకారులను గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఇప్పటి వరకు 200 మందిని పోలీసులు గుర్తించారు. విధ్వంసానికి కారణమైన వారిలో 52 మందిని శనివారం పోలీసులు గుర్తించారు. వారిలో 19 మంది గోపాలపురం పోలీసుల అదుపులో ఉండగా, మిగిలిన వారిని సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారి సెల్‌ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాట్సాప్‌ గ్రూపుల ఏర్పాటుపై ఆరా తీసి నట్లు సమాచారం. విధ్వంసం వెనుక ఏపీలోని ప్రకాశం జిల్లా కంభం వాస్తవ్యుడు, తెలుగు రాష్ట్రాల్లో సాయి డిఫెన్స్‌ అకాడమీ పేరుతో శిక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్న ఆవుల సుబ్బారావు అని…

Read More

కొత్త సైనిక రిక్రూట్‌మెంట్‌ స్కీమ్‌ పథకంపై ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ..వెనక్కు తగ్గేదీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకంపై సందేహాలను నివృత్తి చేసింది. పోలీసు కేసులను ఎదుర్కొనే అభ్యర్థులెవరూ అగ్నిపథ్‌ కోసం దరఖాస్తు చేసుకోలేరని సైనిక వ్యవహారాల అదనపు కార్యదర్శి  లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పూరీ స్పష్టం చేశారు.   అగ్నిపథ్‌ పథకాన్ని వెనక్కు తీసుకునేది లేదని తేల్చి చెబుతూ ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. సాయుధ బలగాల్లోకి నియామకాల కోసం దేశానికి ఈ విధానం ఎందుకు అవసరమో తెలిపారు.  1999 కార్గిల్‌ యుద్ధంపై ఓ కమిటీ నివేదికను ఉటంకిస్తూ.. ఆ సమయంలో ఆ యుద్ధంలో పాల్గన్న సైనికులు 30 ఏళ్లలో ఉన్నారని, ఆ వయస్సు అంశం ఆందోళనకరంగా మారిందని అనిల్‌ పూరీ పేర్కొన్నారు.  నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయని అగ్నిపథ్‌ పథకంలో రాయితీ ఇవ్వలేదని, ఇప్పటికే ఆ పనిని పూర్తి చేసినట్లు చెప్పారు. సాయుధ బలగాలు క్రమశిక్షణ కలిగి ఉంటాయని, అగ్నిపథ్‌ తీసుకు రాగా,…

Read More

ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఓ చోట స్వయంగా చెత్త ఎత్తి, స్వచ్ఛ భారత్ సందేశాన్ని వినిపించారు. ఢిల్లీలో నిర్మించిన ప్రగతి మైదాన్ సమీకృత రవాణా నడవను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు.  అనంతరం ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఐటీపీఓ టన్నెల్‌ను పరిశీలించారు. ఈ క్రమంలోనే అక్కడ కనిపించిన చిన్నపాటి వ్యర్థాలను ప్రధాని స్వయంగా తన చేతులతో ఎత్తారు. ఓ ప్లాస్టిక్ సీసాను సేకరించారు. సంబంధిత వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ప్రగతి మైదాన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అంతర్భాగమే ఈ ప్రగతి మైదాన్ సమీకృత రవాణా కారిడార్. సెంట్రల్ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ ప్రాంతంలో కేంద్రం కొత్తగా ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తోంది.  ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీఓ ) తదితర ఏజెన్సీల ముఖ్య కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో…

Read More

ఈ నెల 23న సర్వసభ్య సమావేశం జరగవలసి ఉండగా, అన్నాడీఎంకేలో నాయకత్వ సంక్షోభం పతాకస్థాయికి చేరుకుంటుంది. ‘ఏకనాయకత్వ’ పేరుతో మొత్తం సంస్థాగత వ్యవహారాలను హస్తగతం చేసుకొనేందుకు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) వర్గం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా, వారి ఎత్తుగడలను అడ్డుకొనేందుకు మరో మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) ప్రస్తుతం అమలులో ఉన్న `ద్వంద నాయకత్వం’ కొనసాగ వలసిందే అంటూ పట్టుబడుతున్నారు. స్థానిక అడయార్‌ గ్రీన్‌వేస్ రోడ్డులో వున్న తన నివాసంలో ఈపీఎస్‌ మద్దతుదారులతో రహస్య మంతనాలు సాగించగా, స్థానిక రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఓపీఎస్‌.. అక్కడికొచ్చిన తన మద్దతుదారులతో చర్చలు జరిపారు. శనివారం ఉదయం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సర్వసభ్య మండలి తీర్మానాల ఎంపిక కమిటీ సమావేశం జరుగుతుండగా ఓపీఎస్‌ హఠాత్తుగా అక్కడికి చేరుకున్నారు. ఈ సమాచారం అందుకున్న ఆయన మద్దతుదారులంతా పెద్ద సంఖ్యలో గుమికూడి ఓపీఎస్ కు జేజేలు పలికారు. అదే సమయంలో పార్టీ కార్యాలయానికి వెళ్ళిన…

Read More

గో సంరక్షకులను, కశ్మీర్‌ పండిట్లను ఊచకోత కోసిన ఉగ్రవాదులను ఒకే గాటిన కట్టారంటూ తనపై వస్తున్న విమర్శలపై సినీనటి సాయి పల్లవి వివరణ ఇచ్చుకున్నారు. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఓ వీడియో సందేశాన్ని ఉంచుతూ తన మాటల్లో అసలు ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వక్రీకరణలు చేసి కొంతమంది తనను దోషిగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటల వల్ల ఎవరైనా బాధపడివుంటే క్షమించాలని ఆమె కోరారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెబుతూ తాను ఎవ‌రినీ కించ‌ప‌రిచేలా మాట్లాడ‌లేద‌ని ఆమె స్పష్టం చేశారు. ‘గత కొన్నిరోజులుగా నా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ జరుగుతున్న ప్రచారానికి సంబంధించి స్పష్టత ఇచ్చేందుకే మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు కూడా నా అభిప్రాయాన్ని చెప్పాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. మళ్లీ నా మాటలు వర్గీకరించవచ్చు. ఇంటర్వ్యూలో నన్ను మీరు లెఫ్ట్‌ వింగ్‌కి మద్దతిస్తారా? రైట్‌ వింగ్‌కా? అని అడిగారు” అని ఆమె పేర్కొన్నారు. “నేను దేనికి…

Read More

అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలలో పాల్గొని విధ్వంసక చర్యలలో పాల్గొంటున్న యువత భవిష్యత్ లో సైన్యంలోనే కాకుండా సాయుధ దళాలు వీటిలో కూడా చేరలేరని స్పష్టం అవుతున్నది. విధ్వంసానికి సంబంధించి ఒకసారి కేసు నమోదైతే, ఇక ఉపసంహరణ ప్రక్రియ ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తీవ్రమైన రైల్వే యాక్ట్‌లోని సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో నేరం నిరూపణ అయితే గరిష్టంగా మరణశిక్ష విధించే ఆస్కారమూ ఉంది. సికింద్రాబాద్‌ ఘటనలో కొందరే విధ్వంసానికి పాల్పడినప్పటికీ ఆ సమయంలో అక్కడున్న అందరూ నిందితులుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఐపీసీ, రైల్వే యాక్ట్, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం(పీడీపీపీఏ)లోని సెక్షన్లలో నమోదైన ఈ కేసు కారణంగా నిందితులకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావు. హత్యాయత్నం, విధ్వంసం, దాడులుసహా మూడు చట్టాల్లోని 15 సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఏపీలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం తదితరాల్లోనూ విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. అయితే రాష్ట్రం ఏర్పడిన…

Read More

అగ్నిపథ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లను ప్రోత్సాహించారనే అభియోగాలపై ఆవుల సుబ్బారావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా కంభంలో సుబ్బారావును పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. సుబ్బారావు నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. అల్లర్లలో సుబ్బారాపు పాత్ర ఉందన్న అనుమానంతో ముందస్తు చర్యల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ అల్లర్ల కేసులో పోలీసులు ఇప్పటివరకు 52 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి 12 మంది యువకులు ప్రధాన కారకులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్మీ ఉద్యోగాల ఆశావహులను కొందరు రెచ్చగొట్టినట్లు పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. వాట్సాప్ గ్రూపుల్లో యువతను రెచ్చగొట్టినట్లు ప్రాథమికంగా తేల్చారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బ్లాక్స్, 17/6 గ్రూప్‌తో పాటు పలు పేర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అల్లర్లకు సంబంధించి ఆందోళనకారుల వాట్సప్ సందేశాలు ఇప్పటికే వైరల్…

Read More

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం పక్కా పథకం ప్రకారం జరిగినదేనని స్పష్టం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుండే విధ్వంస కుట్ర జరిగిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఈ విధ్వంసం వెనుక సీఎం స్ట్రాటజిస్టు పథక రచన ఉందని ధ్వజమెత్తారు.  ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శక్తి కేంద్ర ఇంఛార్జీల  సమావేశంలో మాట్లాడుతూ   సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రాష్ట్ర పోలీసులే కాల్పులు జరిపారని, అయినా కేంద్రాన్ని బదనాం చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. పోలీసుల కాల్పుల్లో మంత్రి చెందిన రాకేశ్ అంతిమ యాత్ర పేరుతో  వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ నేతలు విధ్వంసం స్రుష్టించి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేస్తుండటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మీ అభ్యర్థులతో పాటు ప్రజలంతా వాస్తవాలు గమనించి కుట్రలను చేధించాలని  ఆయన కోరారు.  తెలంగాణలో విచిత్రమైన పరిస్థతి నెలకొన్నదని చెబుతూ బీజేపీ వారిని పదేపదే అరెస్ట్ చేస్తారని,  కాంగ్రెస్ ను మాత్రం…

Read More