బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన నాయకత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నుండి గట్టెక్కారు. పార్లమెంటులోని 211 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఆయన తమ నాయకుడిగా కొనసాగడానికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే, పార్లమెంటులోని 148 మంది టోరీ సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా ఓట్ వేశారు. అంటే 58.8 శాతం మంది ఆయనకు మద్దతు ఇవ్వగా, వ్యతిరేకంగా 41.2 శాతం మంది ఉన్నట్లు స్పష్టమైంది. ఆ సంఖ్య దీర్ఘకాలం పార్టీ నాయకుడిగా కొనసాగేందుకు అనుకూలంగా లేదని విమర్శకులు స్పష్టం చేస్తుండగా, ఆయన మద్దతుదారులు పార్టీలోని మెజారిటీ మద్దతు ఆయనకే ఉన్నదని గుర్తు చేస్తున్నారు. “ఇది రాజకీయాలకు, దేశానికి చాలా మంచి ఫలితం అని నేను భావిస్తున్నాను” అని జాన్సన్ సంతోషం వ్యక్తం చేశారు. డౌనింగ్ స్ట్రీట్‌లో కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో… నిబంధనలు ఉల్లంఘించి మరీ ప్రధాని బోరిస్ ఒక విందును ఏర్పాటు చేశారు. ఈ విందు పార్టీని పార్టీగేట్ కుంభకోణంగా పిలుస్తున్నారు. ఈ…
Author: Editor's Desk, Tattva News
కరోనా మహమ్మారి కాలంగా రెండేళ్లుగా విద్యాలయాలు సరిగ్గా పనిచేయక పోతూ ఉండడంతో పడవ తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎన్నడూ ఎరుగనంత తక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 2019లో జరిగిన పరీక్షల్లో 94.80శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇప్పుడు అది దాదాపు 17.5శాతం తగ్గిపోయి… 67.26 శాతంగా నమోదైంది. సోమవారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తూ కరోనా వల్లే ఉత్తీర్ణత శాతం తగ్గిందని చెప్పారు. 2021-22 విద్యా సంవత్సరానికి 6,20,788 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 6,15,908 మంది హాజరయ్యారు. వీరిలో 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించగా 2,01,62 మంది ఫెయిలయ్యారు. 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత పొందలేదు. ఇందులో 31 ప్రైవేట్, 18 ఎయిడెడ్ పాఠశాలలు ఉనాుయి. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపించడంతో 2020, 2021 సంవత్సరాల్లో పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పాస్ చేసిన…
రెండు తెలుగు రాష్ట్రాలలో కుటుంభం పార్టీలతోనే బిజెపి పోరాటం అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన బీజేపీ శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌ల సమావేశంలో మాట్లాడుతూ ఎపీలో వైసీపీ..టీడీపీ తో పాటుగా తెలంగాణలోని టీఆర్ఎస్ కుటుంబ పార్టీలని గుర్తు చేశారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ స్కీంను జగన్ బాబు ఆరోగ్యశ్రీ పేరుతో మార్చేసారని చెప్పుకొచ్చారు. ఆరోగ్య శ్రీ రాష్ట్రానికే పరిమితమని, ఆయుష్మాన్ భారత్ ఎక్కడైనా వినిగియోగించుకోవచ్చని తెలిపారు. ఇక, జాతీయ పార్టీగా దేశంలో ఉన్నది బీజేపీ ఒక్కటేనని చెబుతూ కాంగ్రెస్ పార్టీలో `జాతీయత’ లేదని, `జాతీయ’ అసలేదని..కాంగ్రెస్ వారికి వర్తించందంటూ ఎద్దేవా చేశారు. లండన్ లో కూర్చొని దేశానికి సంబంధించిన ప్రకటనలు ఇస్తారంటూ..అది అన్నా – చెల్లెల్ల పార్టీగా నడ్డా అభివర్ణించారు. బీజేపీ ఇప్పుడు పోరాటం చేస్తుంది ప్రాంతీయ పార్టీలతోనేనని పేర్కొంటూ మరోసారి కేంద్రంలో అధికారం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ రాజకీయాల్లో సంస్కరణలు తీసుకొచ్చారని చెబుతూ అవినీతి, వారసత్వ..కుటుంబ…
16 ఏళ్ల తరువాత వారణాసి వరుస బాంబు పేలుళ్లు కేసులో దోషిగా నిర్ధారణ అయిన వలీవుల్లా ఖాన్‌కు ఘజియాబాద్ కోర్టు మరణశిక్ష విధించింది. 2006 మార్చి 7న వారణాసిలోని సంకట్‌మోచన్ ఆలయం, వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో 28 మంది చనిపోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. గోడౌలియా వద్ద పెట్టిన మూడో బాంబు పేలలేదు. ఈ రెండు కేసుల్లో వలీవుల్లా ఖాన్‌ను దోషిగా ఘజియాబాద్ కోర్టు నిర్ధారించింది. ఐపిసి సెక్షన్లు హత్య, హత్యాయత్నం, పేలుడు పదార్థాల చట్టం కింద నమోదైన రెండు కేసుల్లోనూ వలీవుల్లా ఖాన్‌ను జిల్లా సెషన్స్ జడ్జి జితేంద్ర కుమార్ సిన్హా దోషిగా తేల్చారని జిల్లా ప్రభుత్వ న్యాయవాది రాజేశ్ శర్మ మీడియాకు తెలిపారు. మరొక కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో అతడిని నిర్దోషిగా కోర్టు విడిచిపెట్టిందని చెప్పారు. 2006 మార్చి 7న ముందుగా లంక పోలీస్ స్టేషన్ పరిధిలోని…
ఆంధ్ర ప్రదేశ్ లో పాలనే కాదు అభివృద్ధి కూడా రివర్స్‌లోనే వెళుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం స్కీములతో అన్ని రంగాల్లో ముందుకెళుతుంటే..ఏపీ ప్రభుత్వం మాత్రం మాఫియాలో ముందుకు సాగుతోందని విమర్శించారు. విజయవాడలో జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పర్యటన సందర్భంగా సోమవారం జరిగిన బీజేపీ శక్తి కేంద్రాల ప్రముఖుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే ఏపీని పరిపుష్టం చేస్తానని చెప్పిన జగన్మోహన రెడ్డి అందుకు విరుద్ధంగా చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఏపీ అంటే ఉన్నతంగా ఉండేదని చెపుతూ ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా కూడా ఏపీ అప్పులపై చర్చలు పెడుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రూ.7లక్షల కోట్లు అప్పులు చేసి కూడా కనీసం పరిశ్రమలు తీసుకు రాలేదని, ప్రభుత్వపరంగా ఆస్తులు కూడబెట్టలేదని ఆమె దయ్యబట్టారు. ఇటీవల ఒక పారిశ్రామిక వేత్త పెట్టుబడులను తమిళనాడుకు తరలిస్తున్నట్లు చెప్పడం…
ఆడబిడ్డలపై అత్యాచారాలను నిరోధించడానికి ప్రస్తుతం అమలు చేస్తున్న శిక్షలే కాకుండా అటువంటి ఆలోచనలే మృగాళ్లకు రాకుండా సంస్కరణలు తీసుకురావలసిన బాధ్యత చట్టసభ సభ్యులు, మేధావులు, సంఘ సంస్కర్తలపై ఎంతగానో ఉందని కొద్దిరోజులుగా చోటు చేసుకుంటున్న అమానుష సంఘటనలు మరోసారి హెచ్చరిస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో తరచూ అత్యాచార ఘోరాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల శంషాబాద్ పరిసరాల్లో జరిగిన ‘దిశ’ హత్యాచార ఘటన మరువక ముందే, ఈ వారంలో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన పదిహేడేళ్ల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం తీవ్రంగా మనసును కలచివేసిందని పేర్కొన్నారు. కొందరు మైనర్ బాలురు వారు ప్రయాణిస్తున్న కారులోనే అత్యాచారానికి పాల్పడటం మాటలకందని దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లారుముద్దుగా పెంచుకునే బిడ్డలపై పరులెవ్వరైనా ఒక దెబ్బ వేస్తేనే తల్లిదండ్రులు అల్లాడిపోతారని, ఆవేదనకు గురవుతారని, అటువంటిది ఒక సమూహమే ఆ బాలికను చెరపడితే ఆ బాలికతో…
మహమ్మద్ ప్రవక్తపై, ముస్లిం సమాజంపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌లను వరుసగా పార్టీ నుండి బహిష్కరించడంపై ఢిల్లీ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది నాయకులు సోషల్ మీడియాలో నేరుగా అసంతృప్తి వ్యక్తం చేయకుండా మౌనం వహిస్తున్నప్పటికీ చాలామంది అంతర్గత వాట్సాప్ గ్రూపులు, వ్యక్తిగత సంభాషణలలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బిజెపి నాయకుడు కపిల్ మిశ్రా తన ఆలోచనలతో ప్రజల్లోకి తీసుకు వెడుతూ ఇలా ట్వీట్ చేశారు: “వారి దేశం ఇస్లామిక్ దేశం. ముస్లింల హక్కుల గురించి మాట్లాడటం, ఆర్థిక బహిష్కరణ, ఉద్యోగాల తొలగింపు… మతం పేరుతో బహిరంగంగా మాట్లాడటం. హిందువు ఈ ప్రపంచంలో రెండవ తరగతి పౌరుడు. కేవలం హిందూ మతం మాత్రమే దానిని అవహేళన చేసినందుకు లేదా దుర్వినియోగం చేసినందుకు శిక్ష ఉండదు, బదులుగా ప్రతిఫలం ఇవ్వబడుతుంది” అంటూ అవహేళన చేశారు. ఢిల్లీలోని ఝరోడా ప్రాంతానికి చెందిన మండలాధ్యక్షుడు ఫేస్‌బుక్‌లో హిందీలో ఇలా వ్రాశాడు:…
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన ఆమ్నీషియా పబ్ సామూహిక అత్యాచార కేసులో నిందితుల దురాగతాలు ఒకటొక్కటి బైటకు వస్తున్నాయి. పోలీసులు కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టు ప్రకారం ఈ ఘటనలోని నిందితులు బాధితురాలితో పాటు మరోక అమ్మాయినికూడా వేధించినట్లు తేలింది. ఈ వ్యవహరానికి కార్పొరేటర్ కుమారుడే కీలక సూత్రధారిగా నిర్ధారించారు పోలీసులు. అంతేకాదు సాదుద్దీన్ మాలిక్‌తో కలిసి పబ్‌లో అరాచకాలకు పాల్పడినట్లు తేలింది. సాదుద్దీన్ మాలిక్ కార్పొరేటర్ కొడుకు కలిసి ఇద్దరు మైనర్లను వేధించారు. ఆ వేధింపులు భరించలేకనే వారిద్దరూ మధ్యలో పబ్ నుంచి బయటకు వచ్చారు. అయితే ఆ ఇద్దరిలో ఒకరు బయటకు వచ్చి నేరుగా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయారు. మిగిలిన మైనర్‌పైనే దుండగులు దాష్టికానికి సాదుద్దీన్ గ్యాంగ్ దిగింది. పబ్ ముందే నిలబడ్డ బాధిత మైనర్‌ను మాటల్లో పెట్టి, ట్రాప్ చేశాడు కార్పొరేటర్ కొడుకు. ఆపై ఇంటి వద్ద దించుతామని నమ్మబలికాడు. మాజీ ఎమ్మెల్యే మనవడు ఉమేర్‌ఖాన్‌కు చెందిన బెంజ్ కారులో ఆ అమ్మాయితో నలుగురు ప్రయాణించారు. పబ్ నుంచి నేరుగా కాన్సూ బేకరి…
2022 ఐఫా వేడుకలు అబుదాబిలో అట్టహాసంగా జరిగాయి. బాలీవుడ్తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు స్టార్స్ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. జూన్ 2, 3 , 4 తేదీల్లో ఈవెంట్స్ జరుగగా, ఈ వేడుకకు సల్మాన్ ఖాన్, రితీష్ దేశ్ముఖ్ , మనీష్ పాల్ హోస్టింగ్ చేయడం విశేషం. సర్దార్ ఉదమ్ – మిమీ సినిమాలకు గాను విక్కీ కౌశల్ – కృతి సనన్ ఉత్తమ నటుడు, ఉత్తమ నటిగా అవార్డులను అందుకున్నారు. మొత్తం విజేతల జాబితా: ఉత్తమ చిత్రం – షేర్షా ఉత్తమ దర్శకుడు – విష్ణు వరదన్- షేర్షా ఉత్తమ నటుడు – విక్కీ కౌశల్- సర్ధార్ ఉధమ్ఉత్తమ నటి – కృతి సనన్- మిమీఉత్తమ సహాయ నటుడు – పంకజ్ త్రిపాఠి- లూడోఉత్తమ సహాయ నటి – సాయి తంహంకర్- మిమీఉత్తమ తొలి పురుషుడు – అహన్ శెట్టి- తడప్బెస్ట్ డెబ్యూ ఫిమేల్…
నైజీరియాలోని ఓండోలోని కాథలిక్ చిర్చి రక్తసిక్తమైంది. ఉన్మాదులు తుపాకీతో రెచ్చిపోయారు. ఆదివారం చర్చిలోకి చొరబడి ప్రార్థనలు చేస్తున్న భక్తులపై తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం బాంబులు విసిరినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటనలో దాదాపు 50 మంది వరకు మృతి చెందగా.. చాలా మంది గాయపడినట్లు తెలిపారు. అయితే ఇందులో అధికంగా చిన్నపిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. చరిత్రలో ఇలాంటి ఘటన ఇప్పటివరకు జరగలేదని అక్కడి ప్రజా ప్రతినిధి ఒలువోల్ చెప్పారు. క్రైస్తవులకు ఆదివారం ప్రత్యేక దినం కావడంతో ప్రార్థనలు నిర్వహించడానికి అధిక సంఖ్యలో భక్తులు రాగా… ఉగ్రవాదులు తుపాకులతో రెచ్చిపోయారు. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్ర దాడిలో ఎంతమంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనప్పటికీ 50 మందికిపైనే చనిపోయారని ఆ…