Author: Editor's Desk, Tattva News

24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్రాన్ని పూర్తిగా దివాళా తీయించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కేసీఆర్ ఫాంహౌజ్ లోనే ప్రత్యేకంగా సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకుని 40 గ్రామాలకు సరిపడా విద్యుత్ ను ఉచితంగా వినియోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు.  బహిరంగ మార్కెట్ లో యూనిట్ కరెంట్ ధర 3 రూపాయలకు దొరుకుతుండగా కేసీఆర్ మాత్రం కమీషన్లకు కక్కుర్తి పడి యూనిట్ కు రూ.6 చొప్పున విద్యుత్ కొంటూ ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డాయిరు. రాష్ట్రంలోని అన్ని సబ్ స్టేషన్లను తనఖా పెట్టి అప్పు తీసుకున్న కేసీఆర్ రాష్ట్రానికి అప్పు పుట్టకుండా చేశారని దయ్యబట్టారు.  అదానీ కంపెనీకి కట్టబెట్టేందుకే బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్దాలేనని స్పష్టం చేశారు. కాలుష్యం పేరుతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కేసీఆర్ ప్రభుత్వం…

Read More

2014కు ముందు దేశం అవినీతి, కుంభకోణాలు, ఆశ్రిత పక్షపాతం, దేశమంతటా విస్తరించిన ఉగ్రవాద సంస్థలు, ప్రాంతీయ వివక్షతో కూడిన విషవలయంలో చిక్కుకు పోయి ఉండిందని, అయితే ఇప్పుడు దేశం ఈ విష వలయం నుంచి బైట పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పేదల సంక్షేమానికే అంకితమైందని చెబుతూ కరోనా మహమ్మారితో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారుల కోసం కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ‘పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్’ పథకం ప్రయోజనాలను ప్రధాని సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. ఈ పథకం కింద పాఠశాలలకు వెళ్లే చిన్నారులకు ఉపకార వేతనాలతో పాటుగా పిఎం కేర్స్ పాస్‌బుక్, ఆయుష్మాన్ భారత్, జన్‌ఆరోగ్య యోజన హెల్త్ కార్డులను పంపిణీ చేస్తారు. లబ్ధిదారులకు అయిదు లక్షల రూపాయల దాకా అవసరమయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ తన ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి…

Read More

మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అరెస్టు చేసింది. 2015-16లో కోల్‌కతాకు చెందిన ఓ సంస్థతో జరిగిన హవాలా లావాదేవీల్లో మంత్రి ప్రమేయం ఉందని ఇడి ఆరోపిస్తోంది.  ఈ హవాలా ప్రక్రియ అనేది రెండు పార్టీలు తమ తరుపున స్థానిక ఏజెంట్లతో డబ్బు లావాదేవీలు జరపడంతో పాటు అధికారిక బ్యాంకింగ్‌ మార్గాల ద్వారా నిధులు మళ్లకుండా ఉంటాయి. 2017 ఆగస్టులో రూ. 1.62 కోట్ల మనీలాండరింగ్‌ పాల్పడ్డారన్న ఆరోపణలపై సత్యేంద్ర జైన్‌తో ఆయన కుటుంబ సభ్యులిపై సిబిఐ కేసు నమోదు చేసింది.  సత్యేంద్ర ఆయన కుటుంబ సభ్యులు.. నాలుగు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి.. 2011-12లో 11.78 కోట్లతో పాటు 2015-16లో రూ. 4.63 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడ్డారు. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఇడి విచారణ ప్రారంభించింది. కేంద్రం  దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ.. తమను వేధిస్తోందంటూ తెలంగాణ, బెంగాల్‌ ముఖ్యమంత్రులు కెసిఆర్‌, మమతా…

Read More

తెలంగాణలో బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె. లక్ష్మణ్ ను రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆయన రాజ్యసభ ఎన్నికల బరిలో నిలుస్తారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. మున్నూరు కాపు (బీసీ) కులానికి చెందిన లక్ష్మణ్ గతంలో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా, బీజేపీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. తెలంగాణ మీద ఫోకస్ పెంచిన బిజెపి నాయకత్వం ఆ పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ నేతకు అవకాశం కల్పించాలని మొదటి నుంచి భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రం నుంచి పార్టీ సీనియర్ నేత కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తుండడంతో బీసీ కులానికి చెందిన నేతను ఎంపిక చేయాలని భావించారు. అందులో భాగంగానే లక్ష్మణ్ పేరును పార్టీ నాయకత్వం రాజ్యసభకు ఖరారు చేసింది. …

Read More

తమ పార్టీలో ఉంటూ బిజెపితో సన్నిహితంగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రి ఆర్‌సిపి సింగ్‌ను మూడోసారి రాజ్యసభకు పంపకుండా బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అధికార మిత్రపక్షం బిజెపికి ఝలక్‌ ఇచ్చారు. బిజెపి ధోరణితో విసుగు చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జెడియు పార్టీ నుండి ఆర్ సిపి సింగ్‌ ఒక్కరే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. అదే పార్టీ తరపున రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం జూన్‌తో ముగియనుంది. మూడోసారి ఆయన నామినేషన్‌ను తిరస్కరించడంతో ఆర్‌సిపి సింగ్‌ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే తనకు జులై వరకు పదవీకాలం ఉన్నదని, మంత్రి పదవికి రాజీనామా చేసే విషయంలో ప్రధానిని కలసి, ఆయన సలహాను పాటిస్తానని చెప్పడం ద్వారా ఇక పార్టీతో తనకు సంబంధం లేదన్న సంకేతం సింగ్ ఇచ్చారు. సింగ్ ను మంత్రివర్గంలో కొనసాగించేటట్లు చూడడం కోసం బిజెపి శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చింది. అతనికి తిరిగి రాజ్యసభ సీట్ ఇవ్వమని నితీష్…

Read More

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యానికి సంబంధించి కొంతకాలంగా విదేశీ మీడియా పలు రకాల కథనాలను వ్యాప్తిలోకి తెస్తున్నది. తాజాగా, బ్రిటన్ కు చెందిన మీడియా సంస్థ ‘ఇండిపెండెంట్’సంచలన కథనాన్ని ప్రచురించింది. ‘పుతిన్ కు ఉన్న క్యాన్సర్ వ్యాధి బాగా ముదిరిపోయింది. మహా అయితే.. మరో మూడేళ్లకు మించి ఆయన బతకడం కష్టమే’ అని కథనంలో పేర్కొంది.  69 ఏళ్ల వయసుకు చేరిన పుతిన్ కంటి చూపు కూడా క్రమంగా మందగిస్తోందని తెలిపింది. వైద్యులు ఈవిషయాన్ని పుతిన్ కు కూడా చెప్పేశారని కథనంలో ప్రస్తావించింది. ప్రస్తుతం బ్రిటన్ లో తలదాచుకుంటున్న రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) మాజీ  అధికారి బోరిస్ కార్పిచ్కోవ్ ఈ విషయాన్ని వెల్లడించారని ‘ఇండిపెండెంట్’ స్పష్టం చేసింది.  అయితే ఈ వార్తలను రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ కొట్టిపారవేసారు.  పుతిన్ కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశారు. అంతగా సందేహం ఉంటే పుతిన్ ప్రసంగాల…

Read More

కర్ణాటకలో మళ్లీ హిజాబ్ వివాదం రాజుకుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో హిజాబ్ ధరించడానికి అనుమతించాలని కోరుతూ మంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు ముస్లిం విద్యార్థినులు దక్షిణ కన్నడ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ను సోమవారం కలుసుకోవడంతో ఇస్లాం సాంప్రదాయక వస్త్రధారణ వివాదం మళ్లీ ముందుకొచ్చింది.  విద్యా సంస్థలలో హిజాబ్ ధరించడానికి అనుమతించాలని శనివారం మంగళూరు యూనివర్సిటీ లో డిమాండు చేసిన 12 మంది విద్యార్థినులు సోమవారం కూడా క్యాంపస్‌కు చేరుకున్నారు. విద్యార్థినులకు డ్రెస్ కోడ్ ఉండడంతో శనివారం వారిని క్యాంపస్‌లోకి అనుమతించని యూనివర్సిటీ అధికారులు సోమవారం కూడా వారిని అడ్డుకున్నారు.  దీనిపై జిల్లా డిప్యుటీ కమిషనర్‌ను కలుసుకోవాలని అధికారులు సూచించడంతో విద్యార్థినులు ఆయనను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు. అనంతరం డిప్యుటీ కమిషనర్ డాక్టర్ రాజేంద్ర కెవి విలేకరులతో మాట్లాడుతూ యూనివర్సిటీ సిండికేట్ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని తాను ప్రశ్నించలేనని చెప్పారు. యూనివర్సిటీలో డ్రెస్ కోడ్ మినహా మరే ఇతర వస్త్రాలకు అనుమతి లేదన్న సిండికేట్ నిర్ణయానికి…

Read More

మేడ్చల్ జిల్లా ఘట్​కేసర్​లో ఆదివారం రాత్రి జరిగిన రెడ్డి సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై చెప్పులు, రాళ్లతో దాడి జరగడం రాజకీయ కలకలం రేపుతున్నది. పోలీసుల రక్షణతో ఆయన ఆ దాడి నుండి బయటపడినా, సోమవారం ఉదయం స్పందిస్తూ  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను చంపాలని ఇదంతా చేయించారని మల్లారెడ్డి సంచలన ఆరోపణ చేశారు.   సింహగర్జన సభలో తనపై దొంగ చాటుగా రేవంత్ రెడ్డి దాడి చేయించారని ధ్వజమెత్తారు. రెడ్డీల ముసుగులో రేవంత్ మనుషులు తనపై దాడి చేశారని మండిపడ్డారు. తనను హతమార్చేందుకు రేవంత్ చేసిన కుట్ర ఇది అని స్పష్టం చేశారు. తనపై రెడ్డీలెవరు దాడి చేయలేదని.. రేవంత్ రెడ్డి ఉసిగొల్పిన గుండాలే తనను చంపాలని చూశారని మల్లారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.  రేవంత్ రెడ్డి వల్ల తాను గత ఎనిమిదేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అతని వేధింపులకు తట్టుకోలేక ఎన్నో నిద్రలేని రాత్రిళ్లు గడిపానని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ మెయిల్ భరించడం తన వల్ల…

Read More

2014 మే 26న దేశ చరిత్రలో అద్బుతమైన ఎన్నికల విజయం తర్వాత నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. 2019లో వరుసగా రెండోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబరు 2013లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని బిజెపి  ప్రకటించిన తర్వాత, ‘బహుత్ హో గయీ మెహగన్యీ కి మార్, అబ్ కీ బార్ మోడీ సర్కార్’ మరియు ‘హమ్ మోడీ జీ కో లానే వాలే హై, అచ్ఛే దిన్ ఆనే వాలే హై’ వంటి నినాదాలు ప్రతిధ్వనించాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు.  2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి 282 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెసేతర పార్టీ పూర్తి మెజారిటీ సాధించడం ఇదే తొలిసారి. 2014 మే 26న నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదేళ్ల  తర్వాత 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు…

Read More

ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నాయకులు సిద్ధూ మూసేవాలా (28) దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్‌ రాష్ట్రంలోని మాన్సా జిల్లాలోని జహవర్కే గ్రామంలో ఆదివారం ఈ హత్య జరిగింది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళుతుండగా, మార్గ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు సిద్ధూను తుపాకీతో కాల్చి చంపారు.  ఈ ఘటనలో మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. రాష్ట్రంలోని ప్రముఖులకు పోలీసు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. మూసేవాలా వాహనంపై నిందితులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బుల్లెట్‌ గాయాలతో ఆయన తన సీటుపైనే కుప్పకూలారు.  వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సిద్ధూ మృతిపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోషులను వదిలిపెట్టమని తెలిపారు. సిద్ధూ మూసేవాలాగా పేరుపొందిన శుభ్‌దీప్‌ సింగ్‌ సిద్ధూ గతేడాది డిసెంబరులో కాంగ్రెస్‌ చేరారు.  ఇటీవల అసెంబ్లీ…

Read More