2021- 22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అన్ని విలువల కరెన్సీల నకిలీ నోట్ల చెలామణి బాగా పెరిగిపోయిందని రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వార్షిక నివేదిక వెల్లడించింది. రూ.500 నకిలీ నోట్లు 101.9 శాతం, రూ.2,000ల నకిలీ నోట్లు 54.16 శాతం మేర పెరిగాయని తెలిపింది. ఈ నేపథ్యంలో నకిలీ నోట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా నల్లధనంలో పాటు నకిలీ నోట్ల చెలామణిని అరికట్టేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2016 నవంబర్‌లో పెద్ద నోట్లయిన పాత వెయ్యి రూపాయలు, రూ.500 నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో ఆధునిక ఫీచర్లు, సేఫ్టీతో కూడిన రూ.2,000, రూ.500, రూ.100,రూ.50, రూ.20, రూ.10 విలువైన కొత్త నోట్లను వివిధ రంగుల్లో అందుబాటులోకి తెచ్చింది. అయితే రూ.2,000నోట్లు మార్కెట్‌నుంచి మాయమవుతుండడంతో వీటిని పెద్దఎత్తున నల్లధనం రూపంలో దాస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ నోట్ల ముద్రణను చాలావరకు తగ్గించారు. మరో వైపు కొత్త…
Author: Editor's Desk, Tattva News
గుజరాత్ టైటాన్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ 15 ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్‌పై ఏకపక్ష విజయంతో నయా చాంపియన్‌గా అవతరించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (45 నాటౌట్, 43 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్య (34, 30 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), డెవిడ్ మిల్లర్ (32 నాటౌట్, 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) కదం తొక్కటంతో 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ మరో 11 బంతులు ఉండగానే ఛేదించింది. రాయల్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్‌ను టైటాన్స్ బౌలర్లు వణికించారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య (3/17), స్పిన్నర్లు సాయికిశోర్ (2/20), రషీద్ ఖాన్ (1/18) రాణించటంతో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులే చేసింది. జోశ్ బట్లర్ (39, 35 బంతుల్లో 5 ఫోర్లు) అంచనాలను…
రుతుపవనాలు రావడానికి ముందు దేశంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు తక్కువగా ఉండడం జూలై, ఆగస్టు నెలల్లో మరో విద్యుత్ సంక్షోభానికి మరో సంకేతం కావచ్చని స్వతంత్ర పరిశోధనా సంస్థ పేర్కొంది. ప్రస్తుతం దేశంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నిటివద్ద కలిపి కేవలం 20.7 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ‘విద్యుత్ డిమాండ్ స్వల్పంగా పెరిగినా దాన్ని తట్టుకునే స్థితిలో దేశంలోని బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలు లేవని అధికార వర్గాల ద్వారా సేకరించిన గణాంకాలన బట్టి అర్థమవుతోందని, అందువల్ల చాలా ముందుగానే బొగ్గు రవాణాకు ప్రణాళికలను రూపొందించుకో వలసిన అవసరం ఉందని ‘సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్’( సిఆర్‌ఇఎ) అనే సంస్థ దేశంలో విద్యుత్ సంక్షోభం, బొగ్గు నిర్వహణ సంక్షోభంపై రూపొందించిన తాజా నివేదిక హెచ్చరించింది. ఆగస్టు నెలలో విద్యుత్ పీక్ డిమాండ్ 214 గిగావాట్లుగా సెంట్రల్…
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. అవినీతి లేకుండా కేంద్ర ప్రభుత్వం పాలన సాగుతుందని అంటూ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా కేంద్ర పాలన సాగిస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి 58 శాతం పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశంలో మౌలిక వసతులు, రక్షణ అవసరాలకు వినియోగిస్తున్నట్లుగా ఆయన వివరించారు. ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయడం లేదని తేల్చి చెప్పారు. దేశంలో ఎయిర్‌పోర్టులు, జల మార్గాలు, రైల్వేలు, రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులను కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు తగ్గించిందని ఆయన గుర్తు చేశారు. దీంతో రూ.2 లక్షల 20 వేల కోట్లు కేంద్రం ఆదాయం కోల్పోయిందని వివరించారు. భారతదేశం తలచుకుంటే ఏమైనా చేస్తుందని నిరూపించిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల శిబిరాలపై దాడులను ఆయన…
’పోయి ఇంట్లో వంటవండుకో’ అని ఎన్ సిపి నాయకురాలు సుప్రియ సూలేను అన్నందుకు మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చివరికి క్షమాపణ చెప్పినట్లు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలి చకంకర్ తెలిపారు. తాము నోటీసు ఇవ్వడంతో ఆయన క్షమాపణ చెప్పినట్లు వివరించారు. చంద్రకాంత్ పాటిల్ క్షమాపణ చెప్పిన తర్వాత సుప్రియా సూలే స్పందిస్తూ, ‘‘నేను ఆయన అన్న ఆ రోజు నుంచే దుమారానికి దూరంగా ఉన్నాను. అయినా ఆయన పెద్ద మనస్సు చేసుకుని క్షమాపణ చెప్పారు. ఇంతటితో దీన్ని ఇక్కడే ఆపేయమని నేను అందరినీ కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. అంతకు ముందు, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారంత్ బిజెపి నేత వాఖ్యాలను ఖండించారు. భారత రాజకీయాల్లో లైంగికత్వ ధోరణి విపరీతం అవుతోందని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇక డిఎంకె ఎంపీ కనిమొళి అయితే పబ్లిక్ ప్లాట్ ఫారాల్లో మహిళలను కించపరచడానికి వ్యతిరేకంగా బిల్లు తీసుకురావాలని…
ఒక వార్తా చర్చ సందర్భంగా మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల ద్వారా మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు బిజెపి అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రజా అకాడమీ ఫిర్యాదు మేరకు మతపరమైన భావాలను దెబ్బతీయడం, శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, ప్రజలకు విఘాతం కలిగించడం వంటి ఆరోపణలపై పైడోనీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రజా అకాడమీ ముంబై విభాగం జాయింట్ సెక్రటరీ ఇర్ఫాన్ షేక్ వాంగ్మూలం ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. శర్మ పాల్గొన్న జ్ఞానవాపి సమస్యపై చర్చకు సంబంధించిన వాట్సాప్‌లో అతనికి లింక్ వచ్చింది. ప్రవక్తపై, ఆయన భార్యపై శర్మ చేసిన వ్యాఖ్యలు చూసి తాను బాధపడ్డానని ఇర్ఫాన్ షేక్ పేర్కొన్నారు. కాగా అతను పైడోనీ పోలీసులను ఆశ్రయించాడు. శర్మపై వ్రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చాడు. చర్చకు సంబంధించిన వీడియో లింక్‌ను కూడా అతడు షేర్ చేసినట్టు అధికారులు తెలిపారు. స్థానిక పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు…
చైనాను అధిగమించి అమెరికా 2021-22 లో భారత్ అగ్ర వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. దీంతో రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని నిపుణులు తెలిపారు. భారత్ విశ్వసనీయ వాణిజ్య భాగస్వామిగా ఎదుగుతోందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఖలీద్ ఖాన్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు తమ వాణిజ్య అవసరాల కోసం చైనాపై మాత్రమే ఆధారపడకుండా, భారత్ వంటి ఇతర దేశాలతో వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నాయని తెలిపారు. వాణిజ్య శాఖ అందించిన నివేదిక ప్రకారం 2021-22లో అమెరికా, భారత్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 119.42 బిలియన్ డాలర్లు జరిగినట్లు తెలిపింది. ఇది 2020-21లో 80.51 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికాకి ఎగుమతులు 2020-21లో 51.62 బిలియన్ డాలర్లగా ఉండగా, ఈ ఏడాది 76.11 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అలాగే అమెరికా నుండి భారత్‌కు దిగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 29 బిలియన్ డాలర్లుగా ఉండగా,…
కరోనా విజృంభణ సమయంలో తల్లిదండ్రులను కోల్పొయిన చిన్నారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్‌ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రయోజనాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 30న వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన పాస్‌బుక్‌తోపాటు ఆయుష్మాన్ భారత్ హెల్త్‌కార్డ్‌ను కూడా ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. దేశంలో కరోనా విజృంభణ మొదలైన 11 మార్చి 2020 నుంచి 28 ఫిబ్రవరి 2022 మధ్యకాలంలో ప్రాణాలు కోల్పొయిన బాధిత పిల్లలను ఆదుకునేందుకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ కార్యక్రమాన్ని 29 మే 2021న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సమగ్ర రక్షణలో భాగంగా బాధిత పిల్లలకు వసతి కల్పించడం, విద్యా, స్కాలర్‌షిప్స్ అందించి వారికి మద్దతుగా నిలుస్తున్నారు. ఉన్నత చదువుల్లోనూ సహాయం చేయడంతో పాటుగా 23 ఏళ్ల వయసు వచ్చేనాటికి ఆర్థికంగా స్వయం సమఅద్ధి చెందేలా…
భారతదేశం చూసిన చురుకైన, ప్రజారంజక ముఖ్యమంత్రుల్లో కరుణానిధి ఒకరని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. పేదలు, వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు విశేషమైన కృషి చేశారని కొనియాడారు. చెన్నైలోని ఓమందూరార్ ఎస్టేట్‌లో ఏర్పాటు చేసిన కరుణానిధి విగ్రహాన్ని శనివారం సాయంత్రం ఉపరాష్ట్రపతి లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలైవానర్ అరంగంలో జరిగిన సభలో వెంకయ్య మాట్లాడుతూ తమిళనాడులో పారిశ్రామిక ప్రగతి, సమాచార, సాంకేతిక విప్లవానికి అవసరమైన మౌలిక వసతుల కల్పలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దశాబ్దాలుగా కరుణానిధితో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తన రాజకీయ సిద్ధాంతం విషయంలో కరుణానిధి నిబద్ధతతో వున్నారని పేర్కొన్నారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా విధించిన అత్యయిక పరిస్థితులను కరుణ తీవ్రంగా వ్యతిరేకించారని వెంకయ్య గుర్తు చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కరుణానిధి దాదాపు 50 ఏళ్ల పాటు తాను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ గెలిచారని గుర్తు చేశారు. తన వాక్చాతుర్యం, చక్కటి పద ప్రయోగంతో శ్రోతలను కట్టి పడేసే ప్రసంగాలెన్నో కలైంజర్ చేశారని…
గత మార్చ్ లో ఉత్తర ప్రదేశ్ తో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడగానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా తమ స్వరాష్ట్రమైన గుజరాత్ పై దృష్టి సారిస్తున్నారు. సుదీర్ఘకాలం పార్టీ అధికారంలో ఉన్న ఇక్కడ ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగనున్నాయి. తమ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్ కు సహితం ఈ ఎన్నికలు కీలకం కావడంతో, వ్యూహాత్మకంగా పావులు గడుపుతున్నారు. 2017 ఎన్నికలలో బిజెపిని దాదాపు ఓటమి అంచువరకు తీసుకు వెళ్లడంలో పాటిదారు ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కీలక పాత్ర వహించాడు. ఆ సమయంలో కాంగ్రెస్ కు మద్దతు కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఇద్దరు అగ్రనేతలు ఒకేసారి రెండురోజుల పాటు గుజరాత్ పర్యటనలు ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలలో నిర్ణయాత్మక శక్తిగా పేరొందిన పాటిదార్లు, సహకార సంఘాలపై దృష్టి సారిస్తున్నారు. పాటీదారులలో విశేషమైన పలుకుబడి గల హార్దిక్ పటేల్ ను కాంగ్రెస్ కు దూరం చేయడంలో ముందుగా విజయం…