Author: Editor's Desk, Tattva News

తూర్పులద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సో సరస్సు వద్ద వివాదాస్పద వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి చైనా మరో వారధి నిర్మాణం చేపట్టింది. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైందని అంతర్జాతీయ నిఘా రంగ నిపుణులు డేమియన్‌ సైమన్‌ ట్విటర్‌లో తెలిపారు. అందుకు సంబంధించిన చిత్రాలను కూడా ఆయన పంచుకున్నారు.  అత్యవసర పరిస్థితుల్లో వేగంగా సైన్యాన్ని సమీకరించేందుకు ఈ వారధులు చైనాకు ఉపకరిస్తాయని రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు. మొదటి దానికంటే పెద్దదైన ఈ రెండో బ్రిడ్జి, ఎల్‌ఏసీని దాటి ఏకంగా 20 కిలోమీటర్లు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు తెలుస్తోంది.  లడఖ్ నుండి సిక్కిం వరకు విస్తరించి ఉన్న భారత్ చైనా సరిహద్దు వెంబడి అనేక కీలక ప్రదేశాల్లో చైనా అక్రమ నిర్మాణాలను చేపడుతోందని తరచూ సాటిలైట్ చిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి.  వారి వాహనాలు, ఇతర అవసరాల కోసం మౌలిక సదుపాయాల నెట్‌వర్క్ ను విస్తరిస్తున్నట్లు తాజాగా వెలువడ్డ ఉపగ్రహ చిత్రాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.  పాంగాంగ్…

Read More

2024 ఎన్నికలు లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీలో పునరుత్తేజం కలిగించడం కోసం ఎంతో ఆర్భాటంగా రాజస్థాన్ లోని ఉదయపూర్ లో మూడు రోజుల పాటు జరిపిన `చింతన్ సివిర్’ అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనిపించడం లేదు. విదేశాలకు వెళ్లారని అంటున్నారు. ఈ లోగా పార్టీలో ఒకొక్క కీలక నేత జారుకొంటున్నారు. ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపడంలో రాజస్థాన్‌లో జరిగిన మేధోమథనం సమావేశాల ప్రభావం కనిపించడం లేదు. గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ ఆ పార్టీని వదిలిపెట్టి, విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం గల కుటుంభంకు చెందిన పంజాబ్‌ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సునీల్ జక్కర్ ఆ పార్టీని వదిలిపెట్టి బీజేపీలో చేరిపోయారు. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకుని, రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పటిష్ట వ్యూహాలు రచించవలసిన సమయంలో రాహుల్…

Read More

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జాతీయ జాతీయ స్థాయి ద్రుష్టి ఆకట్టుకునే కార్యక్రమాల వైపు దృష్టి సారిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ పర్యటనను అందులో భాగంగానే ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయిలో పలు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజకీయ, అర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ కానున్నారు. దేశంకోసం వీర మరణం పొందిన సైనిక కుటుంబాలను ఆదుకోనున్నారు. వ్యవసాయం రైతుల హక్కుల కోసం పోరాడి కేంద్రాన్ని నిగ్గదీసి సంచలనం సృష్టించిన జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలను కలిసి సిఎం పరామర్శించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కెసిఆర్ ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో సిఎం సమావేశం కానున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తలతో సమావేశమౌతారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. అదే సందర్భంగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థల జర్నలిస్టు ప్రముఖులతో సిఎం కెసిఆర్ సమావేశాలు నిర్వహిస్తారు. మే 22వ తేదీన మధ్యాహ్నం ముఖ్యమంత్రి…

Read More

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన నల్లాల ఓదెలు, ఆయన సతీమణి, మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నల్లాల ఓదెలు 2009, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో గెలిచాకా ప్రభుత్వ విప్ గా పని చేశారు. ఇక ఆయన సతీమణి నల్లాల భాగ్యలక్ష్మి ప్రస్తుతం మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్నారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తమని రాజకీయంగా వేధిస్తున్నారని ఓదెలు ఆరోపించారు. 2018లో తనకు టికెట్ ఇవ్వకపోయినా కేసీఆర్ ఆదేశాల మేరకు సుమన్ గెలుపు…

Read More

2014 మార్చి 14వ తేదీన‌ జనసేన పార్టీ ఆవిర్భావ సభ నుంచి 2022 మార్చి 14న ఇప్పటంలో నిర్వహించిన ఆవిర్భావ సభ వరకూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు, వెల్లడించిన అభిప్రాయాలను పుస్తక రూపంలో పార్టీ మీడియా విభాగం సిద్ధం చేసింది.  ఏడు సంపుటాలుగా ఉన్న ఈ పుస్తకాలను  హైదరాబాద్ లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు అందచేశారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌ మాట్లాడుతూ “ఈ పుస్తకాలు నాకు ఎంతో ఆశ్చ్యర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. పార్టీ ఎదుగుదలను తెలియచేసేలా ఏడు సంకలనాలతో కూడిన జనసేన ప్రస్థానం పుస్తకాలు ఉన్నాయి” అని చెప్పారు.  ఈ ప్రయాణంలో జనసేన పార్టీ ఎంతగా ప్రజలతో మమేకమైంది, ప్రజా సేవకు చిత్తశుద్ధితో అంకితమైందో ఇవి తెలియచేస్తున్నాయని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను తెలియచెప్పిన అభిప్రాయాలూ, ప్రజా సమస్యలు, రాజకీయ, సామాజిక అంశాలపై చేసిన ప్రసంగాలను అక్షరబద్ధం చేయడం.. పార్టీ శ్రేణులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం…

Read More

నవంబర్‌ 1 నుంచి కేరళ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఓటీటీని ప్రారంభించనుంది. దీంతో భారత్‌లో తొలిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఓటీటీ నిర్వహించనున్న ఘనతను సొంతం చేసుకుంటుంది.  ‘సీ స్పేస్‌’ పేరిట రూపొందిస్తున్న ఈ ఓటీటీలో పలు చిత్రాలు, జాతీయంగా, అంతర్జాతీయంగా అవార్డులు గెలిచిన సినిమాలు, షార్ట్‌ఫిల్మ్‌లు ఉంటాయని, ప్రస్తుతమున్న ఓటీటీలకు భిన్నంగా ఈ ఓటీటీలో కొన్ని ఫీచర్లను పొందుపరచనున్నట్లు ఆ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖామంత్రి సాజీ చెరియన్‌ వెల్లడించారు.  ఈ ఓటీటీని కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (కెఎస్‌ఎఫ్‌డిసి) చొరవతో ప్రభుత్వం నిర్వహించనుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే ఓటీటీని ప్రారంభించడం ఓ కొత్త ప్రారంభాన్ని సూచిస్తుందని, అలాగే మలయాళ సినిమా అభివృద్ధికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. కొత్త ఓటీటీ ద్వారా సినిమా వ్యాపారానికి ఎలాంటి సంక్షోభం తలెత్తదని ఆయన భరోసా ఇచ్చారు. సినిమాలను థియేటర్లలో విడుదల చేసిన తర్వాతే.. ‘సీ స్పేస్‌’లో ప్రసారం చేయడం…

Read More

తెలుగు ప్రజల ఆరాధ్యదైవమైన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల లోగోను తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్  హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల అసోసియేషన్ ప్రెసిడెంట్ కనపర్తి రవి ప్రసాద్, జనరల్ సెక్రటరీ తుమ్మల రమేష్ నేతృత్వంలోని బృందం నారా లోకేష్ కలిశారు.  ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 28 నుంచి వచ్చే ఏడాది 28 వరకు నిత్యం నిర్వహించే వివిధ కార్యక్రమాల సమాహారాలను లోకేష్ కు అసోసియేషన్ బృందం వివరించింది. ఇదే సందర్భంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకల బ్రోచర్ కూడా లోకేష్ ఆవిష్కరించారు.  ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం అందించాలని కోరుతూ సంతకాల సేకరణ కూడా ఈ అసోసియేషన్ చేపట్టిన విషయాన్ని వివరించారు . అందుకు సంబంధించిన సంతకాలన్నింటినీ క్రోడీకరించి రూపొందించిన బుక్ లెట్ ను కూడా ఆవిష్కరించారు.  అంతేకాకుండా ఎన్టీఆర్…

Read More

పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ పీసీసీ చీఫ్‌, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్దూకు భారీ షాక్‌ తగిలింది. సిద్దూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అయితే, 1988 రోడ్డుపై ఘర్షణ కేసు విచారణలో భాగంగా సిద్దూకు కోర్టు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించింది. కాగా, 1988 డిసెంబరు 27న పాటియాలాలోని షెరన్‌వాలా గేట్ క్రాసింగ్ దగ్గర రోడ్డు మధ్యలో పార్క్ చేసిన జిప్సీలో సిద్ధూ, ఆయన సన్నిహితుడు రూపిందర్​ సింగ్​ సంధు ఉన్నారు. ఆ సమయంలో గుర్నామ్ సింగ్‌ అనే వ్యక్తి.. తన స్నేహితులతో డబ్బులు విత్‌డ్రా చేసేందుకు బ్యాంకుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సిద్దూ జిప్సీని తొలగించాలని గుర్నామ్‌సింగ్‌ కోరాడు. దీంతో వారి వాగ్వాదం చోటుచేసుకుని గుర్నామ్‌పై సిద్ధూ దాడి చేశాడు. ఈ దాడిలో బాధితుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 1999లో ఈ కేసు విచారించిన పాటియాలా సెషన్స్ కోర్టు… సాక్ష్యాలు లేవంటూ సిద్ధూ,…

Read More

ఉగ్రవాదులకు నిధులు అందించిన కేసులో జమ్ముకశ్మీర్​ వేర్పాటువాద నాయకుడు యాసిన్‌ మాలిక్‌ను ఢిల్లీలోని పటియాల హౌస్‌ కోర్టు గురువారం దోషిగా తేల్చింది. ఈ నెల 25వ తేదీన యాసిన్​ మాలిక్ కు న్యాయస్థానం శిక్షను ఖరారు చేయనుంది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేశారన్న కేసులో పటియాల ప్రత్యేక ఎన్‌ఐఎ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. టెర్రర్‌ ఫండింగ్‌ కేసులో తనపై నమోదైన అన్ని అభియోగాలను యాసిన్‌మాలిక్‌ అంగీకరించాడని తెలుస్తోంది. యాసిన్ మాలిక్ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవాలని, అతడి ఆస్తులకు సంబంధించి అఫిడవిట్ ఇవ్వాలని కోర్టు ఎన్ఐఏను ఆదేశించింది. ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్​, హిజ్బుల్​ ముజాహిద్దీన్ చీఫ్​ సయ్యద్​ సలావుద్దీన్​ సహా పలువురు వేర్పాటువాద నేతలపై ఎన్​ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. జ‌మ్ముకశ్మీర్‌లో సంఘ విద్రోహ కార్య‌కలాపాలు న‌డిపేందుకు నిధులు స‌మీక‌రించిన‌ట్లు యాసిన్ మాలిక్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 2017కు సంబంధించిన ఈ కేసులో మాలిక్ పై ఢిల్లీ…

Read More

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఇతరుల అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఓ మొబైల్‌ యాప్‌ను రూపొందించాలన్న ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ యాప్‌ రూపొందించారు.  దీంతో అవినీతి నిరోధక శాఖ ‘14400 యాప్‌’ను రూపొందించింది. అవినీతిపై ఫిర్యాదుల కోసం ఏసీబీ కొంతకాలంగా 14400 టోల్‌ఫ్రీ నంబర్‌ను నిర్వహిస్తోంది. ఈ నంబర్‌తో ఫిర్యాదు మాత్రమే చేయగలరు. టోల్‌ఫ్రీ నంబరుకు వచ్చే ఫోన్‌ కాల్స్‌పై ఏసీబీ అధికారులు స్పందించి తరువాత ఆకస్మిక దాడులు, తనిఖీలు చేస్తారు. కొందరు అధికారులు సిబ్బంది లంచాలు తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేరుగా లంచాలు తీసుకోకుండా తమ ఏజెంట్లకు ఇవ్వమని చెబుతున్నారు. ఇలాంటి సమస్యలకు ముగింపు పలుకుతూ అవినీతిని తక్షణం ఆధారసహితంగా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించేందుకు వీలుగా 14400 యాప్‌ను ఏసీబీ రూపొందించినట్లు ఉన్నతాధికారులు…

Read More