ఆంధ్రప్రదేశ్ లో మరో టిడిపి నేత, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తో సహా మరో ఐదుగురిపై పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట లో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చిలకలూరిపేటలో ఓ కార్యక్రమం నిర్వహించటానికి వచ్చిన మాజీ పుల్లారావు తనను కులం పేరుతో దూషించారని, తనను నెట్టి వేశారని మున్సిపల్ అధికారిణి కోడిరెక్క సునీత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. చిలకలూరిపేటలో మంచినీటి చెరువు దగ్గర శుక్రవారం ఎన్టీఆర్ సుజల ప్లాంట్ పునః ప్రారంభోత్సవం సందర్భంగా వివాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ సుజల ప్లాంట్ పునః ప్రారంభోత్సవం చేయనున్న మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావును పోలీసులు, మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. ప్లాంట్ పునః ప్రారంభోత్సవానికి అనుమతి లేదని వారు టిడిపి నేతలను అడ్డుకున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సౌజన్యంతో సుమారు రూ 7 కోట్ల…
Author: Editor's Desk, Tattva News
కోర్టు ధిక్కార కేసులో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) మాజీ కమిషనర్ ఎం.హరి నారాయణ్‌కు హైకోర్టు మూడు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.రెండు వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై అప్పీల్ దాఖలు చేసుకోడానికి వీలుగా శిక్ష అమలును ఆరు వారాలపాటు నిలిపివేసింది. ఈ మేరకు జస్టిస్ బి.దేవానంద్ ఇటీవల తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇవ్వకపోతే జూన్ 16న హైకోర్టు జ్యుడీషియల్ రిజిస్ట్రార్ ఎదుట లంగిపోవాలని షరతు విధించారు. ఇదే కోర్టు ధిక్కార కేసు నుంచి గంట్యాడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సోమశేఖర్, మాజీ ఎమ్మెల్యే పి.శ్రీనివాస్‌లకు విముక్తి లభించింది. వీరిపై కోర్టు ధిక్కార కేసును మూసేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. వీధి వ్యాపారాలకు గుర్తింపు కార్డులిచ్చిన అధికారులు తమ విషయంలో చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, షాపుల్ని మూసేసి జీవనాన్ని దెబ్బతీస్తున్నారని పేర్కొంటూ 2017లో కూరగాయలు, చిల్లర వ్యాపారుల సంఘం రిట్ దాఖలు చేసింది.…
దేశోధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు దాతృత్వం త్యాగం దేశ భక్తి నేటితరానికి ఆదర్శమని కృష్ణా జిల్లా ఉపకులపతి ఆచార్యా కె.బి చంద్రశేఖర్ తెలిపారు. పామర్రు మండలం ఎలకుర్రు గ్రామం లో శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ని ప్రముఖులకు విశ్వదాత అవార్డులను ఆయన అందచేసారు. విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవం లో స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, ప్రముఖ విశ్లేషకులు గ్రంధాలయ ఉద్యమకారులు డాక్టర్ నాగులపల్లి భాస్కర రావు, ప్రముఖ రచయిత్రి తేళ్ళ అరుణ, ఓఎస్డి ఎన్ ఎస్ కే ఖాజావలి, ప్రముఖ జర్నలిస్ట్ విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు, రాజమండ్రి ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు పసుమర్తి శ్రీనివాస శర్మ లకు అవార్డులను అందజేశారు. ఈ సభలో ఉపకులపతి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ కాలంలో గాంధీజీ అడుగుజాడల్లో నాగేశ్వరరావు పంతులు తాను నడుస్తూ పలువురిని నడిపించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్…
ఆర్టికల్ 370 రద్దుతో పాటు నేరుగా కేంద్రమే రెండున్నరేళ్ళకు పైగా పాలన సాగిస్తూ, ఉగ్రవాదంను అదుపు చేశామని, ప్రశాంతత నెలకొందని తరచూ ప్రకటనలు ఇస్తున్నప్పటికీ కాశ్మీర్ లోయలో తమ ప్రాణాలకు రక్షణ లేకపోయినదని కాశ్మీరీ పండిట్లు బిజెపి నాయకత్వంపై ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. నిరసనగా 350 మంది ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామాలను లెఫ్టనెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు సమర్పించారు. ముఖ్యంగా ఉగ్రవాదులు తమను లక్ష్యంగా చేసుకొని సాగిస్తున్న హత్యాకాండ పట్ల తిరిగి లోయలో స్థిరనివాసం ఏర్పర్చుకోవాలని చూస్తున్న పండిట్లలో భయాందోళనలు కలిగిస్తున్నాయి. తమకు భద్రత కరువైపోయిందని వాపోతున్నారు. తాజాగా, బుడ్గాం జిల్లాలో ఓ కశ్మీరీ పండిట్ ఉద్యోగి రాహుల్ భట్ (35)ను ఉగ్రవాదులు గురువారం దారుణంగా హత్యకు గురికావడంతో పండిట్లలో ఆగ్రహం, భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. జమ్ము ప్రాంతానికి చెందిన రాహుల్ భట్ పదేళ్లుగా బుద్గామ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం భద్రత దళాలు మట్టుబెట్టిన ముగ్గురు ఉగ్రవాదులతో ఇద్దరు రాహుల్ భట్ ను కాల్చిన వారు కూడా ఉన్నారు. కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు…
ఏపీలో కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన రూ.1100 కోట్ల నిధుల్ని దారి మళ్లించిన వ్యవహారం సుప్రీం కోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. విపత్తు నిర్వహణ నిధి కింద చెల్లించాల్సిన ఈ నిధుల్ని ప్రభుత్వం పీడీ ఖాతాలకు మళ్లించినట్లు పిటిషనర్ ఆరోపించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపై ప్రభుత్వం నుంచి అలా జరగలేదని అఫిడవిట్ తీసుకుంది. అయితే దీనిపై నిజా నిజాలు తేల్చాలని కాగ్ ను ఆదేశించింది. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పిన సాయం చేయాలని గతంలో సుప్రీంకోర్టు కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చింది. అయితే దీన్ని చాలా ప్రభుత్వాలు అమలు చేయలేదు. ఇందులో ఏపీ కూడా ఉంది. విపత్తు నిర్వహణ నిధి కింద కరోనా మృతుల కుటుంబాలకు ఇలా చెల్లించాల్సిన రూ.1100 కోట్లు చెల్లించక పోవడంపై సుప్రీంకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఈ నిధులు…
వారాణసీ లోని జ్ఞానవాపి మసీదులో వీడియో సర్వేను తక్షణమే నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ అంశాన్ని సరైన సమయంలో పరిశీలిస్తామని తెలిపింది. ఉత్తరప్రదేశ్ వారాణసీలోని కాశీ విశ్వనాథుని ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదును.. అటు హిందూవులు, ఇటు ముస్లింలు తమదేనని వాదిస్తూ వస్తున్నారు. ఈ వివాదం కోర్టులదాకా వెళ్లడంతో వారాణసీ స్థానిక కోర్టు ఈ మసీదులో వీడియో సర్వే చేపట్టాలని ఆదేశించింది. దీంతో శనివారం నుంచి ఇక్కడ వీడియో సర్వే ప్రారంభంకానుంది. అయితే ఈ సర్వే చేపట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది హుజెఫా అహ్మది వాదనలు వినిపిస్తూ జ్ఞానవాపి మసీదు చాలా పురాతనమైనదని, దీనిలో ఎన్నో…
దేశ రాజధానిలో శుక్రవారం సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో 27 మంది సజీవ దహనమయ్యారు. ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని మూడంతస్తుల భవంతిలో సాయంత్రం 4.40 సమయంలో మంటలు చెలరేగాయి. కనీసం 40 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దాదాపు 60 నుంచి 70 మందిని రక్షించామని పేర్కొన్నారు. ఇంకా ఒక ఫ్లోర్‌ను గాలించాల్సి ఉండటంతో మృతుల సంఖ్య పెరగవచ్చని చెప్పారు. ఘటన గురించి తెలియగానే 24 మంది అగ్నిమాపక సిబ్బందిని పంపామని ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనలో మరో 19 మంది గల్లంతు అయ్యారు. మృతదేహాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ అధికారులు మృతదేహాల భాగాలకు డీఎన్ఏ పరీక్షలు చేశారు.మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ భవనంలో పలు కంపెనీల కార్యాలయాలున్నాయి. తొలి అంతస్తులోని సీసీటీవీ కెమెరాల ఉత్పత్తి సంస్థలో మంటలు ఆరంభమై భవనమంతా పాకాయని డీసీపీ శర్మ చెప్పారు. ప్రమాదానికి…
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆదేశాల మేరకే ఆయన మద్దతుదారులు తనను ట్విట్టర్ వేదికగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మాజీ అధ్యక్షురాలు, నటి దివ్య స్పందన (రమ్య) ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్పందించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఆమె కోరారు. తాను ఎక్కడికి పారిపోలేదని, వ్యక్తిగత కారణాల వల్లే తన పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేస్తూ డీకే శివకుమార్ తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేయమని కాంగ్రెస్ తన కార్యకర్తలను ఆయన ఆదేశించారని ట్విటర్‌లో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను బయటికి వచ్చాక నా విశ్వసనీయతను దెబ్బతీసేందుకు, ప్రత్యేకించి కన్నడ వార్తా ఛానళ్లలో ‘ఆమె కాంగ్రెస్ పార్టీని ఎనిమిది కోట్లకు మోసం చేసి పారిపోయింది’ అనే కథనాన్ని నాటారు. నేను పారిపోలేదు. నా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశాను. నేను కచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎనిమిది…
దేశంలో పుష్కలంగా బొగ్గు ఉత్పత్తులు కొనసాగుతున్నా బొగ్గు సరఫరా సరిగ్గా లేక దేశ వ్యాప్తంగా ధర్మల్ విద్యుత్ సరఫరా పెను సంక్షోభం ఎదుర్కొంటున్నది. ఇటువంటి పరిస్థితులలో అవసరాలమేరకు బొగ్గు సరఫరా చేయలేమని కేంద్రం చేతులు ఎత్తేసింది. కావాలంటే అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గును కొనుగోలు చేసుకోమని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. నేడు దేశంలో అనేక రాష్ట్రాల్ని బొగ్గు కొరత తీవ్రంగా వేధిస్తోంది. దాంతో ప్రయివేటుగా అధిక ధర చెల్లించి రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. విద్యుత్ కోతలు పెరిగితే..ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందని, ఆదాయం గణనీయంగా పడిపోతుందని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. బొగ్గు కొరతపై పది రోజుల క్రితం కేంద్రం రాసిన లేఖతో ఏం చేయాలో రాష్ట్రాలకు దిక్కుతోచటం లేదు. ”మీకున్న మొత్తం బొగ్గు అవసరాల్లో..10శాతం అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు చేసుకోండి. తద్వారా మీ బొగ్గు సమస్యను పరిష్కరించుకోండి” అన్నది ఆ లేఖలో సారాంశం. కేంద్రం చూపిన పరిష్కారం పట్ల నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.…
కేసీఆర్ పై సాగిస్తున్న రాజకీయ పోరాటాన్ని పతాక సన్నివేశంకు తీసుకు వెళ్లడం ద్వారా వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి శనివారం ప్రతిష్టాకరంగా బహిరంగ సభ నిర్వహిస్తున్న ఓ రోజు ముందు రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రను పూర్తి చేసుకుంటున్న రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు రాష్ట్ర ఐటి మంత్రి, టి ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటి రామారావు లీగల్ నోటీసు పంపారు. ఈ బహిరంగ సభకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నెల 11వ తేదీన ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్ చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించాలని కేటీఆర్ అందులో డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించకుంటే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. అయితే, లీగల్ నోటీసుల పేరుతో కేసీఆర్, కేటీఆర్ లు చేసే తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదని సంజయ్…