Author: Editor's Desk, Tattva News

కరోనా సమయంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆర్డర్ పై వస్తువులను ఇంటి వద్దనే డెలివరీ చేయడానికి ఉపయోగించే స్విగ్గీ జీనీ సర్వీసులను ప్రస్తుతం హైదరాబాద్​, ముంబై, బెంగళూరులలో నిలిపి వేశారు. ఈ నగరాల్లో జీనీ పేరుతో అందిస్తున్న పిక్–​అప్​, డ్రాప్​–ఆఫ్ ​సర్వీసులు తాత్కాలికంగా ఆపేసినట్లు స్విగ్గీ తెలిపింది. ఉద్యోగుల కొరత వల్లే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జీనీ సర్వీసు తాత్కాలికంగా అందుబాటులో లేదని స్విగ్గీ యాప్​లో చెబుతోంది. వారం రోజులుగా జీనీ సేవలు అందుబాటులో లేవని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఫుడ్​–డెలివరీ, క్విక్​ కామర్స్​ బిజినెస్​ ఇన్​స్టామార్ట్​ల పైనే స్విగ్గీ ఫోకస్​ పెడుతోందని పేర్కొంటున్నాయి. జీనీ సేవలను 68 నగరాలలో అందిస్తుండగా, 3 నగరాలలో మాత్రమే నిలిచిపోయాయి. ఐపీఎల్​, పండుగల సీజన్​తో ఫుడ్​ డెలివరీ, ఇన్​స్టామార్ట్​ సర్వీసులకు డిమాండ్​ పెరగిందని, ఫలితంగా వాటికి పెద్దపీట వేయాల్సి వస్తోందని స్విగ్గీ స్పోక్స్​ పర్సన్​ వెల్లడించారు. త్వరలోనే మళ్లీ సర్వీసులను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. డెలివరీలు ఇచ్చే గిగ్​…

Read More

డ్రోన్‌ సర్వీసులకు దేశీయంగా నానాటికీ డిమాండ్‌ పెరిగిపోతున్నది. ఈ సర్వీసులను మరింత మెరుగుపరచడం కోసం కేంద్రంలోని 12 మంత్రిత్వ శాఖలు కృషి చేస్తున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలియజేశారు. రానున్న కొద్ది కాలంలోనే లక్ష మంది డ్రోన్‌ పైలట్లు అవసరమవుతారని ఆయన తెలియజేశారు. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన డ్రోన్ల అనుభవ స్టూడియోను ఆయన ప్రారంభిస్తూ 2030 నాటికి భారత్ డ్రోన్ల హబ్ గా మారగడాలని చెప్పారు. ఈ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నదని ఆయన తెలిపారు. . ఈ త్రిముఖ వ్యూహంలోని… మొదటి అంశం విధనాల రూపకల్పన. డ్రోన్‌ రంగానికి సంబంధించి కేంద్రం స్పష్టమైన విధానం అనుసరిస్తున్నదని, ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. ఇక రెండవ అంశం.. ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సహాకాలు (ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్‌సెంటివ్స్‌- పీఎల్‌ఐ). డ్రోన్ల్‌ తయారీ, సేవల రంగంలో ఈ స్కీమ్‌ మంచి ఫలితాలు ఇస్తున్నది. 2021లోనే…

Read More

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని సింగపూర్‌ నిషేధించింది. ఈ సినిమా ఆ దేశ చలన చిత్ర వర్గీకరణ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నందున నిషేధించినట్లు స్థానిక మీడియా తెలిపింది. సింగపూర్‌ చలన చిత్ర వర్గీకరణ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ హిందీ భాషా చిత్రం ఉందని అధికారులు అంచనా వేశారని ఇన్ఫోకామ్‌ మీడియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఎండిఎ), కల్చర్‌, కమ్యూనిటీ, యూత్‌ మంత్రిత్వ శాఖ (ఎంసిసివై), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఎ) సంయుక్త ప్రకటనలో తెలిపాయి. కాశ్మీర్‌ లోయలో జరిగిన ఘర్షణల్లో హిందువులు హింసించబడుతున్నట్లు ఏకపక్షంగా చిత్రీకరించడం, ముస్లింలను రెచ్చగొట్టే విధంగా ఉన్నందున ఈ చిత్రాన్ని వ్యతిరేకించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం వివిధ వర్గాల మధ్య శతృత్వాన్ని కలిగించేలా, విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందని, మత సామరస్యానికి భంగం కలిగించేలా ఉందని ఆ వర్గాలు తెలిపాయి. చలనచిత్ర వర్గీకరణ మార్గదర్శకాల ప్రకారం సింగపూర్‌లో జాతి, మత వర్గాలను కించపరిచే ఏ…

Read More

హైదరాబాద్ కు చెందిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా  ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ అయిన యుఎస్ ఓపెన్ తర్వాత  రిటైర్మెంట్ తీసుకోనుంది. 35 ఏళ్ల భారత టెన్నిస్ స్టార్ 2022 తన వృత్తి జీవితంలో చివరిది అని ఈ సంవత్సరం ప్రారంభంలోనే  ప్రకటించింది. ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్‌కు సిద్ధమవుతూ రోమ్‌లో ఉన్న మీర్జా, ఆగస్ట్ 29న ప్రారంభమయ్యే టోర్నమెంట్ తర్వాత రిటైర్ అవ్వాలనే తన నిర్ణయం గురించి ఆనందబజార్ ఆన్‌లైన్‌లో చెప్పింది. అయితే,  వింబుల్డన్ కూడా ఆడాలని యోచిస్తున్నట్లు చెప్పింది. ఫ్రెంచ్ ఓపెన్ మే 22న ప్రారంభం కాగా, వింబుల్డన్ జూన్ 26 నుంచి జూలై 10 వరకు జరగనుంది. భారత టెన్నిస్ ఐకాన్ ఇటీవలే మార్టినా హింగిస్‌తో కలిసి ఇటాలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. రోలాండ్ గారోస్‌పై ఆమె దృష్టి పెట్టింది. సానియా 2003లో అరంగేట్రం చేసి, డబుల్స్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకుని డబుల్స్ ప్రపంచ నంబర్…

Read More

రాజద్రోహం చట్టంపై రెండు రోజులలో మాట మార్చి, సుప్రీం కోర్టులో రెండు అఫిడవిట్ లను దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రాలు మైనారిటీ హోదా ప్రకటించడంపై కూడా భిన్న వాదనలు వినిపించినట్లు వెల్లడైనది. కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హిందువులకు మైనారిటీ హోదాను కల్పించడంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి మారడంతో సుప్రీంకోర్టు మంగళవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతకుముందు సమర్పించిన అఫిడవిట్‌లో రాష్ట్రాలపైకి బాధ్యతను నెట్టేసి, తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో మైనారిటీలను నోటిఫై చేసే అధికారం తనకు ఉందని చెప్పడం ప్రశంసించదగినది కాదని స్పష్టం చేసింది. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ 2020 ఆగస్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టంలోని సెక్షన్ 2(సీ)ని పిటిషనర్ సవాల్ చేశారు. అదేవిధంగా ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను సవాల్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం లక్షద్వీప్, మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, జమ్మూ-కశ్మీరు,…

Read More

ఉక్రెయిన్‌పై జరిగే యుద్ధంలో రష్యాను గెలవనిచ్చేది లేదని జి-7 దేశాలు స్పష్టం చేశాయి. కీవ్‌కు మరింతగా సైనిక, ఆర్థిక తోడ్పాటు అందించేందుకు సిద్ధమన్నాయి. రష్యా ప్రజలు సాగించిన చారిత్రక విజయాలకు సిగ్గుచేటైన రీతిలో పుతిన్‌ వ్యవహరిస్తున్నారని జి-7 ఆన్‌లైన్‌ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విమర్శించారు. పైగా అంతర్జాతీయ నిబంధనలు, చట్టాలను రష్యా ఉల్లంఘిస్తున్నదని మండిపడ్డాయిరు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సహా జి 7 దేశాధినేతలు, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఆదివారం చర్చలు జరిపారు. ఇప్పటికే 2400 కోట్ల డాలర్ల మేర ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ సమాజం నుండి సాయం అందిందని పేర్కొంది. ప్రపంచ బ్యాంక్‌, ఐఎంఎఫ్‌లు చేపట్టిన కార్యక్రమాలను సమావేశం ప్రశంసించింది. కెనడా తరపున మరో 5 కోట్ల డాలర్ల సైనిక సాయం అందుతుందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడెయు తెలిపారు. ఇదిలా వుండగా, రష్యా చమురు, గ్యాస్‌ దిగుమతులకు స్వస్తి పలికే ప్రణాళికలను జి 7 దేశాల…

Read More

రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని మినిరత్న పిఎస్‌యూలో భాగంగా ప్రైమ్‌ మినిస్టర్‌ వైఫై యాక్సెస్‌ నెట్‌వర్క్‌ ఇంటర్‌ఫేస్‌ (పిఎమ్‌ – డబ్ల్యుఎఎన్‌ఐ)ను ప్రారంభించిన రైల్‌టెల్‌ ఒక కీలక మైలురాయిని అధిగమించింది. ఈ పథకం కింద 2384 హాట్‌స్పాట్లతో 100 రైల్వే స్టేషన్లలో ప్రజలకు వైఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ స్టేషన్లు 22 రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. వీటిలో 71 స్టేషన్లు ‘ఏ1’, ‘ఏ’ కేటగిరీకు చెందినవి కాగా 29 ఇతర కేటగిరి స్టేషన్లకు చెందినవి. రైల్‌టెల్‌ సీఎండీ పునీత్‌ చావ్లా ఈ ప్రజా స్నేహ పూర్వక సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ అటానమస్‌ టెలికాం ఆర్‌ అండ్‌ డి సంస్థ సెంటర్‌ ఆఫ్‌ డవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌ (సి –డిఓటి) ఈడీ, చైర్మన్‌ డాక్టర్‌ రాజ్‌కుమార్‌ ఉపాధ్యాయ పాల్గొన్నారు. రైల్‌టెల్‌ దేశంలో 17,792 వైఫై హాట్‌స్పాట్లతో 6102 రైల్వే స్టేషన్లలో విస్తరించబడిందని తెలిపారు. ఇది మరింత పురోగతిలో సాగనుంది.…

Read More

ఢిల్లీలోని అక్బర్‌ రోడ్‌, హుమయూన్‌ రోడ్‌, తుగ్లక్‌ రోడ్‌ల పేర్లను మార్చాలని బిజెపి కోరింది. ముస్లిం పాలనను సూచించే ఈ రహదారుల పేర్లను మార్చాలని ఢిల్లీ బిజెపి చీఫ్‌ అదేష్‌ గుప్తా న్యూఢిల్లీ మునిసిపల్‌ కౌన్సిల్‌ (ఎన్‌డిఎంసి)కి లేఖ రాశారు. తుగ్లక్‌ రోడ్‌ను గురు గోవింద్‌ సింగ్‌ మార్గ్‌గా, అక్బర్‌ రోడ్‌ను మహారాణా ప్రతాప్‌ రోడ్‌గా, ఔరంగజేబ్‌ లైన్‌ను అబ్దుల్‌ కలామ్‌ లైన్‌గా, హుమయూన్‌ రోడ్‌ని మహర్షి వాల్మీకి రోడ్‌గా, షాజహాన్‌ రోడ్‌ని జనరల్‌ బిపిన్‌ రావత్‌గా, బాబర్‌ లైన్‌ని స్వాతంత్య్ర సమరయోధుడు ఖుధీరామ్‌ బోస్‌గా మార్చాలని ఆ లేఖలో సూచించారు. ఈ మార్పుల ప్రతిపాదనను ఎన్‌డిఎంసి పానెల్‌ ఆమోదించింది. చరిత్ర, సెంటిమెంట్‌ ఇతర అంశాలను గుర్తించాల్సి వుందా అనే అంశాలనుపరిగణలోకి తీసుకుని పేర్లను మార్చాలని నిబంధనలు సూచిస్తున్నాయి. 2014 బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి ఉత్తరప్రదేశ్‌ వంటి బిజెపి పాలిత రాష్ట్రాల్లో పలు పేర్లు మార్చడం జరిగింది. మరోవంక, ఢిల్లీలోని కుతుబ్‌…

Read More

మే 3వ తేదీన చార్‌ధామ్ యాత్ర మొదలైంది. మొదలైన ఆరు రోజుల్లోననే 20 మంది యాత్రికులు మృతి చెందారు. ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో చాలా మంది హుద్రోగ సమస్యలతో మరణించారు. హృద్రోగ సమస్యలతోపాటు ఎత్తైన ప్రాంతాల గుండా ప్రయాణించడం వల్ల శ్వాస సంబంధ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. 14 మంది యాత్రికులు యమునోత్రి, గంగోత్రి ధామ్‌లలో మరణించారు. ఇందులో ఒక నేపాలీ కార్మికుడు కూడా ఉన్నాడు. వీటితోపాటు కేదార్‌నాథ్‌లో ఐదుగురు, బద్రినాథ్‌లో మరొకరు మరణించారని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఆరు రోజుల్లో 20 మంది యాత్రికులు మరణించార‌ని చెప్పారు. ఈ పరిణామంపై యాత్ర నిర్వాహకులు, పాలకులు ఆందోళనలు చెందుతున్నారు. చార్‌ధామ్ యాత్రలో పాల్గొనే యాత్రికులు కేదార్‌నాథ్, యమునోత్రి ధామ్‌కు వెళ్లడానికి కఠినమైన దారుల గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఎత్తైన ప్రాంతాల గుండా ప్రయాణించడంతో వారు ఆక్సిజన్ కొరత, కోల్డ్‌తో బాధపడుతారు.…

Read More

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తేనీ స్థానిక రైతులను బహిష్కరిస్తామంటూ బెదిరించే ప్రకటనలు చేయకపోతే నలుగురు రైతులతో సహా ఎనిమిదిమంది గత అక్టోబర్‌లో లఖింపూర్‌ ఖేరీలో ప్రాణాలు కోల్పోయే ఘటన జరిగేది కాదని అలహాబాద్‌ హైకోర్టు పేర్కొంది. 2021 అక్టోబర్‌ 3న టికోనియాలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టును హత్యకు గురయిన కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్‌ మిశ్రా (మంత్రి కుమారుడు), నలుగురు సహ నిందితులు బెయిల్‌ పిటిషన్లను తిరస్కరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.  నలుగురు నిందితులు సుమిత్‌ జైస్వాల్‌, అంకిత్‌ దాస్‌, శిష్పాల్‌, లవకుష్‌లలో ప్రతి ఒక్కరిపై సాక్ష్యాలున్నాయని కోర్టు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి బాబూ బనారసీ దాస్‌ మనవడు అంకిత్‌ దాస్‌ బెయిల్‌ దరఖాస్తును తిరస్కరిస్తూ జస్టిస్‌ దినేష్‌ కుమార్‌ సింగ్‌ ఇలా వ్యాఖ్యానించారు:  ”ఉన్నత పదవుల్లో ఉన్న రాజకీయ వ్యక్తులు సమాజంలోని పరిణామాలను పరిగణనలోకి తీసుకుని బహిరంగంగా మంచి…

Read More