Author: Editor's Desk, Tattva News

మాజీ టిడిపి మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పి నారాయణ అరెస్ట్ నాటకీయ మలుపులు తిరుగుతున్నది. మొదట పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో అరెస్ట్ చేస్తున్న  చెప్పారు. తెలంగాణ సరిహద్దు దాటగానే ఏపీ రాజధాని భూముల కుంభకోణం కేసులో కూడా అరెస్ట్ చేశామని మాటమార్చారు.  ఇందుకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని కూడా అధికారులు చూపిస్తున్నారు. ఈ కేసును సోమవారం సాయంత్రమే, ఆయనను రెండో నిందితుడిగా పేర్కొంటూ నమోదు చేశారు. మాజీ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నిందితుడు కావడం గమనార్హం.  పశ్నపత్రాల లీకేజ్ కేసులో వెంటనే బెయిల్ ఇవ్వొచ్చని, అప్పుడు ఈ కేసు కింద అరెస్ట్ చూపాలని ముందుగానే పథకం వేసినట్లు కనిపిస్తున్నది. వారి అసలు లక్ష్యం చివరకు చంద్రబాబు నాయుడుగా వెల్లడి అవుతున్నది. అమరావతి రాజధాని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగినట్లు ఇది వరకే ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదు ఆధారంగా నిన్ననే ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులోఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ3గా లింగమనేని రమేష్‌, ఏ4గా…

Read More

పార్టీ వేదికలపై ఆత్మవిమర్శలు అవసరమేనని, అయితే అవి ఆత్మవిశ్వాసాన్ని, నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉండరాదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ విమర్శలు వినాశకరమైన వాతావరణాన్ని సృష్టించేలా ఉండొద్దని పార్టీ నేతలకు హితబోధ చేశారు. ‘చింతన్ శిబిర్’ కోసం మే 13, 14,15 తేదీల్లో ఉదయ్‌పూర్‌లో సమావేశమవుతున్నామని, దాదాపు 400 మంది కాంగ్రెస్ నేతలు ఇందులో పాల్గొంటారని ఆమె తెలిపారు. ‘నవ సంకల్ప్ శిబిర్’ పేరుతో జరగనున్న ఈ సమావేశంలో పాల్గొనే సభ్యుల విషయంలో అన్ని కోణాల్లో సమతుల్య ప్రాతినిధ్యం కల్పించినట్టు ఆమె పేర్కొన్నారు. ‘చింతన్ శిబిర్‌’లో 6 ప్రధానాంశాలు (రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం, రైతులు, యువత, సంస్థాగత సమస్యలు)పై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సోనియా గాంధీ చెప్పారు. నేతలు ఎవరు ఏ గ్రూప్‌లో పాల్గొనాలనే విషయంపై ప్రతినిధులకు ఇప్పటికే తెలియజేసినట్టు…

Read More

ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగిస్తూ రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన రోజు (మే 9) సందర్భంగా రష్యా విజయోత్సవాలు జరుపుకొంటున్న సమయంలో పోలాండ్ రాజధాని వార్సాలో ర‌ష్యా అంబాసిడ‌ర్ సెర్గీ ఆండ్రియేవ్‌పై ఉక్రేనియన్లు దాడి చేశారు. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో మృతిచెందిన రెడ్ ఆర్మీ సైనికులకు సెర్గీ ఆండ్రియేవ్‌ నివాళులు అర్పిస్తుండగా ఉక్రెయిన్‌ జెండాలు పట్టుకున్న కొందరు వ్యక్తులు ఆయనపై ఎరుపు రంగు సిరాను చల్లి నిరసనలు తెలిపారు. ఈ దాడిలో తనకు గాయాలేవీ కాలేదని సెర్గీ చెప్పారు. ఉక్రెయిన్‌లో దాడుల నేపథ్యంలో విక్టరీ సందర్భంగా పోలాండ్‌లో పుష్ప నివాళి ఈవెంట్‌ను ర‌ద్దు చేయాలని అధికారులు ర‌ష్యాను కోరారు. కానీ, సెర్గీ ఆండ్రియేవ్‌ మాత్రం సైనిక శ్మ‌శాన‌వాటిక‌కు వచ్చి పెద్ద సాహసం చేశారు. దీంతో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఇలా ఉండగా,నియో నాజీలతో పొంచి ఉన్న ముప్పు నుంచి ఉక్రెయిన్‌లోని ‘మాతృభూమి’ని రక్షించుకోవడం కోసమే తమ సేనలు పోరాడుతున్నాయని రష్యా…

Read More

చివరకు ప్రధాని మహిందా రాజపక్స రాజీనామా చేయడంతో శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆర్థిక సంక్షోభం కారణంగా లంక అధ్యక్షుడు, ప్రధానిపై విపక్షనేతలు, లంకేయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లంక ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం అధ్యక్షుడు గొటబయ రాజపక్సే అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవంక శ్రీ లంక రాజధాని కొలంబోలో సోమవారం నిరసనలు తీవ్రమయ్యాయి. రాజపక్సే మద్దతుదారులు నిరసనకారులను కర్రలతో చితకబాదారు. పోలీసులు నిరసనకారులపై టియర్‌ గ్యాస్‌, వాటర్‌ కెనన్లను ప్రయోగించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అత్తుకోరల నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ ఫైరింగ్‌లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనైన నిరసనకారులు ఆయన కారును అడ్డగించారు. ఈ క్రమంలో ఆయనపై దాడి చేయడంతో అమరకీర్తి మృతిచెందినట్టు లంక మీడియా తెలిపింది. తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితుల నేపథ్యంలో…

Read More

హనుమాన్‌ చాలీసా చాలెంజ్‌తో జైలుపాలై బెయిల్‌ మీద విడుదలైన ఎంపీ నవనీత్‌ కౌర్‌, ఆమె ఎమ్యెల్యే  భర్త రవి రానాలకు మళ్లీ జైలుకు వెళ్ళక తప్పదా? పిఈ జంటకు బెయిల్‌ రద్దు చేయాలంటూ ముంబై పోలీసులు సోమవారం స్పెషల్‌ కోర్టును ఆశ్రయించడంతో వారికి మరోమారు చిక్కులు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.  ఎంపీ నవనీత్‌ కౌర్‌, ఆమె భర్త రవి రానాలకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది ప్రత్యేక న్యాయస్థానం. అయితే.. షరతుల్లో ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దన్న కూడా స్పష్టం చేసింది. ఒకవేళ మాట్లాడితే గనుక బెయిల్‌ దానంతట అదే రద్దు అయిపోతుందని హెచ్చరించింది కూడా.  ఈ నేపథ్యంలో వాళ్లు మీడియాతో మాట్లాడినందుకుగానూ బెయిల్‌ రద్దు చేయాలని, అంతేకాదు వాళ్లమీద నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేయాలని పోలీసులు తమ అభ్యర్థన పిటిషన్‌లో ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ముంబై పోలీసుల దరఖాస్తుపై స్పందించాలంటూ నవనీత్‌ కౌర్‌ దంపతులకు నోటీసులు జారీ…

Read More

సీఎం కేసీఆర్ కారణంగా నల్గొండ పట్టణంలో 5 ఎకరాల్లో ఉన్న నీలగిరి నందనవనం ధ్వంసమవుతోందని బిజెపి సీనియర్ నేత, మరి ఎంపీ విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాదిలో ఒకటి, రెండు సార్లు కూడా వస్తారో రారో తెలియని సీఎం హెలీప్యాడ్ కోసం అధికారులు వనాన్ని నాశనం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సీఎం కేసీఆర్ హ‌రిత‌హారం పేరుతో వేల చెట్ల‌ను నాటించిన‌ట్టు చెప్పుకుంటారని, కానీ ఆ సీఎం కారణంగానే ఒక ఉద్య‌ాన‌వ‌నం ధ్వంసం అవుతోందని ఆమె ధ్వజమెత్తారు. దానికి దగ్గర్లో 150 ఎకరాల భూములున్నా కేవలం జిల్లా కలెక్టరేట్ పక్కనే హెలిప్యాడ్ ఉండాలనే ఒకే ఒక్క కారణంతో సుమారు 30 ఏండ్ల నాటి 300 చెట్లు నరికేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎకరం ఉంటే సరిపోయే హెలీప్యాడ్ కోసం జనావాసాల మధ్య తెలుగు విశ్వవిద్యాలయం నిర్మాణానికి కేటాయించిన రెండెకరాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందిన మరో మూడెకరాలు స్వాధీనం చేసుకున్నారని ఆమె విస్మయం వ్యక్తం చేశారు.…

Read More

కాలం చెల్లిన దేశద్రోహ చట్టాన్ని సమీక్షించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం కేంద్రం సుప్రీంకోర్టుకు సంబంధిత వైఖరిపై సమగ్ర అఫిడవిట్ సమర్పించింది. శనివారమే దేశద్రోహ చట్టాన్ని సమర్ధిస్తూ ఈ వలసపాలకుల చట్టంలోని నిబంధనలను మార్చాల్సిన అవసరం కానీ, చట్టాన్ని రద్దు చేయాల్సిన అగత్యం కానీ లేదని పేర్కొంటూ మరో అడుగు ముందుకేసి చట్టం రద్దుకు దాఖలైన పిటిషన్లన్నింటిని కొట్టివేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. అయితే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ విజన్, దేశ స్వాతంత్య్ర ఘట్టం ఆజాదీ కా అమృత్ మహోత్సవం స్ఫూర్తి నేపథ్యంలో ఈ చట్టం సమీక్షకు కేంద్రం సంకల్పించింది. ఈ విషయాన్ని అఫడివిట్ రూపంలో ఇప్పుడు న్యాయస్థానం దృష్టికి తద్వారా దేశ ప్రజల ముందుకు తీసుకువస్తున్నామని తెలిపింది. చట్టంలోని 124 ఏ అధికరణ సంబంధిత నిబంధనలు రూల్స్‌ను తిరిగి పరిశీలించేందుకు, వీటిపై సమీక్షించుకుని ఓ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ మేరకు కేంద్రం ఓ నిర్ణయం తీసుకుందని ఈ…

Read More

రూపాయి విలువ సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో ఎన్నడూ లేనంతగా కనిష్టానికి పడిపోయింది. డాలర్‌కు రూ.77.41గా ట్రేడవుతోంది. చైనాలో లాక్‌డౌన్‌లు, అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, యుద్ధ భయం, దేశీయ స్టాక్‌ మార్కెట్ల పతనం, ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడుదారుల నిష్క్రమణ రూపాయి పతనానికి కారణమవుతున్నాయి. రాయిటర్స్‌, పిటిఐ నివేదిక ప్రకారం.. గత శుక్రవారం భారత్‌ కరెన్సీ రూపాయి ఆల్‌టైమ్‌ కనిష్టానికి చేరి రూ 77.05 వద్ద ముగిసింది. ఇది సోమవారం మరింత బలహీనపడి మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో డాలరుతో రూపాయి మారకపు విలువ రూ.77.37 వద్ద ట్రేడవుతోంది. కీలక వడ్డీరేట్లను 50 బేసిస్‌ పాయింట్లు పెంచనున్నట్లు గతవారం ఫెడరల్‌ రిజర్వు ప్రకటించడంతో డాలర్‌కు డిమాండ్‌ పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రానున్న రోజుల్లో వడ్డీరేటును మరింత పెంచుతున్నట్లు ప్రకటించడం కూడా డాలర్‌ విలువను మరింత పెంచింది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే… (అభివృద్ధి చెందుతున్న దేశాలు) భారత్‌ మార్కెట్ల…

Read More

తెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఈ అంశంపై చర్చిద్దామంటే ఎందుకు మొఖం చాటేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కేంద్రంపై ఏడుపు మానుకుని, టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏం ఒరగపెట్టిందో చెప్పాలని ధ్వజమెత్తారు.  ప్రజలు కట్టిన పన్నులతో సంపద పెంచుకుని రుణాలిచ్చే స్థాయికి చేరుకున్న కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని మాత్రం అప్పులు పాల్జేసి ప్రజల చేతికి చిప్ప మిగిల్చిందని మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 26వ రోజు సోమవారం  పాదయాత్ర చేస్తున్న సంజయ్ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జడ్చర్ల మండలం కోడుగల్, ముక్తపల్లి గేట్ వరకు పాదయాత్ర చేశారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కలలు కంటున్నాయని ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరిందని, కాంగ్రెస్ కు 31 అసెంబ్లీ,…

Read More

మానసిక వైకల్యం ఉన్న బాలుడిని అతని కుటుంబంతో కలిసి విమానం ఎక్కేందుకు అనుమతించక పోవడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తనను ఎన్నటికీ సహించేది లేదని, ఏ వ్యక్తీకి ఇలాంటి అనుభవం జరగకూడదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్వయంగా విచారణ చేపట్టి తగిన చర్యలు చేపడతామని ఆయన ట్వీటర్‌లో తెలిపారు. ఈ ఘటనపై ఏవియేషన్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) కూడా దర్యాప్తు ప్రారంభించిందని, ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.వివరాల ప్రకారం హైదరాబాద్‌ వెళ్లేందుకు గత శనివారం ఓ చిన్నారితో కుటుంబం రాంచీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆ బాలుడు మానసిక వైకల్యం కలిగి ఉండటంతో విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. చిన్నారి భయాందోళనతో ఉన్నాడని, దాని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో చిన్నారిని ఎక్కనివ్వలేదు. ఈ…

Read More