ఒకవైపు చేనేత కార్మికుల కష్టాలు, ఇంకోవైపు వ్యవసాయం భారమై పొట్టకూటి కోసం వలస వెళ్లడంతో శిథిలమైన ఇండ్లు, ఇంకోవైపు నీళ్లు లేక వ్యవసాయం చేయలేకపోతున్నామంటూ రైతులు పడుతున్న బాధలు… ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 17వ రోజు పాదయాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నారాయణ పేట నియోజకవర్గంలో శనివారం కన్పించిన ద్రుశ్యాలివే. ఉదయమే నారాయణ పేట పట్టణం శివారు నుండి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర భీవండి కాలనీ, సింగారం గేట్, జాజాపూర్, గడ్డమీద అప్పంపల్, చిన్నజెట్రం, పెద్ద జెట్రం, అంత్వర గేట్ మీదుగా కొనసాగింది. సింగారం గేటు వద్ద రైతు సదస్సులో పాల్గొన్న బండి సంజయ్ కు రైతులు తమ కష్టాలు ఏకరవు పెట్టారు. సాగునీరు లేక వ్యవసాయం చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 69 జీవోను అమలు చేసి జయమ్మ చెరువు, జాజాపూర్ చెరువులను నింపితేనే తమకు సాగు నీరొస్తుందని చెప్పారు. సాయంత్రం చిన్న…
Author: Editor's Desk, Tattva News
దేశంలో ఎండలు మండిపోతున్నాయి.ఇళ్ల నుంచి జనం బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.పొద్దుగాల 8 గంటల నుంచే సూర్యుడు సుర్రు మంటున్నాడు.దేశంలో పలుప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.ఎండవేడిమికి తోడు వడగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ ఏడాది వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎండల తీవ్రత మే 2 వరకూ అదేవిధంగా కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. సాధారణంగా మే నెలలో ఎండలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ ఏడాది మే నెలలో పశ్చిమ రాజస్థాన్‌లోని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 50 డిగ్రీ సెల్సియస్ దాటేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జమ్ము కాశ్మీర్, పంజాబ్,హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.…
ప్రస్తుత జనరల్ ఎంఎం నరవాణే పదవీ విరమణ చేసిన తర్వాత 29వ ఆర్మీ చీఫ్‌గా జనరల్ మనోజ్ పాండే శనివారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత జనరల్ ఎంఎం నరవణే నుంచి ఆయన 29వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుండి ఆర్మీ చీఫ్‌గా నాయకత్వం వహించిన మొదటి అధికారి జనరల్ పాండే కావడం విశేషం. ఫిబ్రవరి 1న ఆర్మీ వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించే ముందు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్లలో సరిహద్దు వాస్తవాధీనరేఖ (ఎల్‌ఎసి)ని కాపాడే తూర్పు ఆర్మీ కమాండ్‌కు పాండే నాయకత్వం వహించారు. భారతదేశం అనేక భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో జనరల్ పాండే ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రభుత్వ ప్రణాళికలతో.. ఇండియన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈ బాధ్యతలను జనరల్ బిపిన్ రావత్ నిర్వహించేవారు. ఆయన గత డిసెంబర్‌లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు.…
దేశంలో పెద్ద ఎత్తున విద్యుత్ కోతలు చోటుచేసుకుంటుండంతో మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం కేంద్రాన్ని నిలదీశారు. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత కారణం కావడంతో కేంద్రాన్ని ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. చిదంబరం ఈ విషయంపై ఇంకా ప్రభుత్వాన్నిప్రశ్నిస్తూ “కావలసినంత బొగ్గు, రైల్ నెట్‌వర్క్, పూర్తి సామర్థాన్ని ఉపయోగించని థర్మల్ ప్లాంట్స్ ఉన్నాయి. అయినా, తీవ్ర విద్యుత్ కొరత నెలకొని ఉంది. ఇందుకు మోదీ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు. ఎందుకంటే దీనకంతటికీ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణం” అంటూ మర్మగర్భంగా ఎద్దేవా చేశారు. “బొగ్గు మంత్రిత్వ శాఖ ఉంది, రైల్వే మంత్రిత్వ శాఖ ఉంది, విద్యుత్ మంత్రిత్వ శాఖ ఉంది. అయితే తప్పంతా కాంగ్రెస్‌దేనని ఆ శాఖ మంత్రులు చేతులు దులిపేసుకుంటున్నారు” అని చిదంబరం చురకంటించారు. విద్యుత్ అంతరాయానికి సరైన పరిష్కారాన్ని కనుగొందని.. అదేంటంటే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసి.. బొగ్గును తరలించే రైళ్లను…
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు బుల్డోజర్ సెగ తగిలింది. బ్రిటన్ ఎంపీలు స్థానిక చట్టసభల్లో బోరిస్ జాన్సన్ వైఖరిని తప్పుబట్టారు. ఓ వర్గానికి వ్యతిరేకంగా చేస్తున్న హింసపై భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించడంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విఫలమయ్యారని బ్రిటన్ విపక్ష లేబర్ పార్టీకి చెందిన ఎంపీ జారా సుల్తానా విమర్శించారు. మోదీని ప్రశ్నించేందుకు బదులుగా జేసీబీ ఫ్యాక్టరీని సందర్శించారని తప్పుబట్టారు. మానవ హక్కుల విషయంలో జాన్సన్ ఎంత శ్రద్ధ వహిస్తున్నారో అర్థమవుతోందని విమర్శించారు. ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన గుజరాత్ లో జేసీబీ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడున్న బుల్డోజర్ పైకి ఎక్కి అభివాదం చేశారు. అదే సమయంలో భారత్ లోని పలు రాష్ట్రాల్లో మతపరమైన ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఇండ్లను, దుకాణాలను బుల్డోజర్ లతో ధ్వంసం చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో జాన్సన్ ప్రవర్తన తీవ్ర చర్చలకు దారి…
బిగ్‌బాస్ ఓ చెత్త రియాలిటీ షో, ఇలాంటి వాటివల్ల యువత పెడదారి పడుతోంది, సమాజం ఎటు వెళుతోందో అర్థం కావటంలేదు. పెడధోరణులు పెచ్చరిల్లుతున్నాయని హైకోర్టు ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా స్తబ్దతుగా ఉంటే అనర్థాలు తప్పవు.. దీనిపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించింది. ఎలాంటి సెన్సార్‌షిప్ లేకుండా బిగ్‌బాస్‌షోను ప్రసారం చేస్తున్నారని కేవలం ధనార్జనే ధ్యేయంగా యువతను పెడమార్గం పట్టిస్తున్న ఇలాంటి షోలను నియంత్రించాలని కోరుతూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అహ్సదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావుల నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. పిల్‌పై జగదీశ్వర్‌రెడ్డి తరుపు న్యాయవాది గుండాల ప్రసాదరెడ్డి ధర్మాసనం ముందు ప్రస్తావించి విచారణ జరపాలని అభ్యర్థించారు. బిగ్‌బాస్ లాంటి కార్యక్రమాలు యువత భవిష్యత్‌ను కాలరాస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ సమాజానికి ఉపయోగంగా ఉండే మంచి వ్యాజ్యం దాఖలు చేశారని ప్రశంసించింది. బిగ్‌బాస్ లాంటి షోలపై ఇన్నిరోజులు పిటిషన్‌లు ఎందుకు రావటంలేదా అనుకున్నాం.. ఇప్పుడు…
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంకా వలసలు కొనసాగడానికి ముమ్మాటికీ బాధ్యుడు కేసీఆరేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. వడ్ల కొనుగోలు పేరుతో డ్రామాలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శుక్రవారం 16వ రోజు పాదయాత్ర చేస్తున్న సంజయ్ కుమార్ నారాయణపేట పట్టణంలోని మైదానంలో జరిగిన భారీ బహిరంగసభలో మాట్లాడుతూ పాలమూరులో వలసలు ఆగాయంటూ కేసీఆర్ పచ్చి అబద్దాలు చెబుతున్నడు అని విమర్శించారు. ఈరోజు పాదయాత్ర చేస్తుంటే నారాయణపేట నుండి ముంబయి వెళుతున్న బస్ కన్పించిందని చెబుతూ ఆ బస్సెక్కి ప్రయాణీకులను, డ్రైవర్ ను అడిగితే రోజూ ముంబయికి వలసలు వెళతారని తెలిసిందని చెప్పారు. చిన్న పిల్లలు, చంటి పిల్లల తల్లులు కూడా వలస వెళుతున్నరు. చిన్నపిల్లలు ఏడుస్తూ చెబుతున్న బాధలు చూస్తే ఏడుపొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోలు ధరలు పెంచి జనంపై భారం…
బొగ్గు కొరత కారణంగా దేశంలోని దాదాపు 10 రాష్ట్రాలు ఇప్పుడు కనివిని ఎరుగని విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. రోజుకు దాదాపు 11 గంటలు అంతకు మించి అధికారిక విద్యుత్ కోతలతో జనం అల్లాడిపోతున్నారు. ప్రత్యేకించి ఎప్రిల్ రాకముందే మార్చి నెల మధ్యనుంచే అత్యధిక స్థాయిలో ఎండలు మండాయి. దీనితో కుటుంబాలలో విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతూ రావడం, బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరం అయిన ముడి ఇంధన సరుకు బొగ్గు సకాలంలో చేరకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి క్రమేపీ పడిపోతూ ఉండటంతో ప్రధాన విద్యుత్ పంపిణీ కేంద్రాలకు వాటి అవసరాల మేరకు విద్యుత్‌ను సరఫరా చేసే పరిస్థితి లేకుండా పోయింది. తరిగిపోతున్న విద్యుత్ సామర్థం, ముందు చూపులేని వైఖరి, బొగ్గు నిల్వలు ఉన్నా సాంకేతిక కారణాలతో వాటిని థర్మల్ కేంద్రాలకు చేర్చలేని స్థితితో దేశంలో ఇప్పుడు 10 రాష్ట్రాలలో విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఆ రాష్ట్రాలు : 1 జార్ఖండ్,…
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమంపై ఏమాత్రం శ్రద్ధ లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఏ ప్రాంతంలో చూసినా రైతులు, కౌలు రైతులు నష్టాలు చవిచూస్తూ మానసిక స్థైర్యం కోల్పోయారని ఆయన తెలిపారు. వారి కష్టాలు తెలుసుకొని కన్నీళ్లు తుడవాల్సిన ప్రభుత్వం బాధ్యతను విస్మరించిందని మండిపడ్డారు. సాగు నష్టాలు, అప్పుల భారంతో కుంగిపోయి అన్నదాతలు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా లింగారెడ్డిపల్లికి చెందిన జయరామిరెడ్డి, నంద్యాల జిల్లా తాటిపాడుకి చెందిన కౌలు రైతు, ఆ గ్రామ ఎంపీటీ-సీ చిన్న శంకర్, ఎన్టీఆర్ జిల్లా జయంతికి చెందిన ఇప్పల శ్రీనివాసరెడ్డి బలవన్మరణం చెందినట్లు తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. వారి కుటు-ంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు తెలిపిన పవన్ కళ్యాణ్ వైసీపీ పాలనలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట రైతు ఆత్మహత్య గురించి వింటూనే ఉన్నామని, పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా పాలకుల్లో చలనం రాకపోవడం గర్హనీయమని ఆయన పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం భరోసా…
ఓ ప్రాపర్టీ షోను ప్రారంభిస్తూ ఏపీలో పరిస్థితులపై రాష్ట్ర ఐటి మంత్రి కె తారక రామారావు చేసిన వాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పక్క రాష్ట్రం పరిస్థితులపై తన మిత్రుడు చెప్పిన విషయాలను కేటీఆర్ ప్రస్తావిస్తు ఏపీలో విద్యుత్ లేదని, నీళ్ళు లేవని, రోడ్లు ధ్వంసం అయ్యాయని, అక్కడి పరిస్థితి అధ్వాన్నంగా ఉందని హైదరాబాద్ నుండి తన ఊరుకి వెళ్లి వచ్చిన ఓ మిత్రుడు చెప్పాడని అంటూ ఏపీలోని పరిస్థితులపై వ్యంగ్యంగా చెప్పుకొచ్చారు. దేశంలోనే `బెస్ట్ సిటీ’ హైదరాబాద్ అంటూ మరో రాష్ట్రం నుండి వచ్చిన ఓ బిజెపి ఎంపీ సహితం ఇక్కడి వలే ఫ్లై ఓవర్లు, మంచి రోడ్లు మరెక్కడా లేవని చెప్పారని తెలిపారు. బెంగళూరు కంపెనీలు కూడా ఏపీ రోడ్లపై మండిపడుతున్నారని చెప్పుకొచ్చారు. రూపాయి లంచం లేకుండా అనుమతులు ఇస్తుంది తెలంగాణే ఒక్కటేనని పేర్కొంటూ పక్క రాష్ట్రాల్లో అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి కూడా లంచాలు ఇస్తేనే అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. అయితే తన వాఖ్యలపై ఏపీ మంత్రుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో స్పందించిన కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. ఎవరినో కించపరచాలనో, బాధపెట్టాలనో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. అన్యాపదేశంగా అవి…