భారత దేశంలో తలెత్తిన హిజాబ్ వివాదంను ఇస్లాంపై జరుగుతున్న దాడిగా అంతర్జాతీయ తీవ్రవాద ఇస్లాం సంస్థలు అభివర్ణిస్తున్నాయి. దీనిపై పోరాడాలి అంటూ భారత్ లోని ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా, అల్ ఖైదా చీఫ్ అయ్‌మన్ అల్ జవహిరి యుద్ధ రంగంలో ఆయుధాలతో తెలివిగా పోరాడాలని అంటూ ఓ వీడియో ద్వారా పిలుపిచ్చారు. దానితో ఇప్పటి వరకు మృతి చెందినట్లు భావితున్న ఆయన సజీవంగానే ఉన్నట్లు రుజువవుతోంది. 2020లో ఆయన సహజ కారణాలతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. జవహిరి వీడియోను అల్ ఖైదా మీడియా పోస్ట్ చేసింది. కర్ణాటకలో హిజాబ్ వివాదం సందర్భంగా కొందరు విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అని నినాదాలు చేస్తుండగా, ముస్కాన్ ఖాన్ అనే ముస్లిం విద్యార్థిని ‘అల్లా హు అక్బర్’ అని నినదించడాన్ని జవహిరి ఈ వీడియోలో ప్రశంసించాడు. ఆమె తక్బీర్ నినాదాన్ని సాటిలేని రీతిలో వినిపించిందని కొనియాడాడు. హిందూ బహుదేవతారాధకులను ఆమె సవాలు చేసిందని అభినందించాడు. ఆమె నినదించడంతో జీహాద్ స్ఫూర్తి మరింత…
Author: Editor's Desk, Tattva News
సాగరమాల కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో లక్ష కోట్ల రూపాయల విలువైన 120 ప్రాజెక్ట్‌లను గుర్తించినట్లు రేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ వెల్లడించారు. విజయసాయి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రాష్ట్రంలో రేవుల చుట్టు పక్కల పారిశ్రామీకరణకు అవసరమైన మౌలిక వసతులను మరింత మెరుగు పరచడం, రేవులను ఆధునికీకరించడం, రేవులకు కనెక్టివిటీని అభివృద్ధి చేయడం, కోస్టల్ షిప్పింగ్, జలరవాణా వ్యవస్థలను అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌లను సాగరమాల కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వేస్, ఎన్‌హెచ్‌ఏఐ, రాష్ట్ర ప్రభుత్వాలు, మేజర్ పోర్ట్‌లు అమలు చేస్తాయని మంత్రి చెప్పారు. సాగరమాల కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో 1380 కోట్ల రూపాయల విలువైన 12 ప్రాజెక్ట్‌లు చేపట్టడం జరిగింది. అందులో 754 కోట్ల రూపాయల విలువైన 5 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయి. 316 కోట్ల రూపాయల విలువైన 3 ప్రాజెక్ట్‌లు…
పెట్రోల్, డీజిల్‌ధరలు రోజురోజుకు పెరగుతున్నాయి. గత 12 రోజుల్లో పదిసార్లు ధరలను పెంచారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ రోడ్‌సెస్‌లను వసూలు చేస్తోంది. దీంతో పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్ర ప్రదేశ్ లోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ 121.31కి చేరుకోగా డీజిల్ రూ 106.84 అయ్యింది. వారం క్రితం పెట్రోలు రూ.112వ మాత్రమే ఉంది. గత ఏడాది ఏప్రిల్‌లో పెట్రోల్ ధర లీటర్‌కు 87.71 ఉంది. ఏడాది కాలంలో ఏకంగా రూ.34 పెరిగింది. డీజిల్ ధర ఏడాది క్రితం రూ 80.66 వుంటే ఇప్పుడు రూ 106.84కు చేరింది. అంటే ఒక్క ఏడాదిలో రూ 25.77 పెరిగింది. సరఫరాలో ఉన్న దూరాన్ని బట్టి రాష్ట్రంలో జిల్లాల వారీగానూ ధరల్లో మార్పులున్నాయి. చిత్తూరులో లీటర్ పెట్రోల్ రూ 121.31 అయితే నెల్లూరులో రూ 120.89, విజయవాడలో రూ 120.66 ఉంది. డీజిల్ చిత్తూరులో రూ106.84 వుంటే…
2024లో వైసిపి అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. . ‘గెలవని పార్టీ కోసం మీరు తపన పడొద్దు’ అంటూ గీత దాటి వ్యవహరిస్తున్న కొందరు అధికారులను , ముఖ్యంగా పోలీస్ అధికారులను ఉద్దేశించి ఆయన హెచ్చరించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం జనసేన పార్టీ విస్తృతస్ధాయి సమావేశం నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన పవన్ మాట్లాడుతూ వైసిపి వ్యతిరేక ఓటు చీలనివ్వనని నేనంటే పార్టీలో కొందరు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని విచారం వ్యక్తం చేశారు. వ్యూహాలు తనకు వదిలేయాలని కోరుతూ ఎవరి పల్లకి మోసే దానికి తాములేమని, ప్రజలను పల్లకి వెక్కించేందుకు ఉన్నామని స్పష్టం చేశారు.ఏ పార్టీతో పొత్తులో ఉన్నా మాట చెప్పేందుకు భయపడాల్సిన అవసరం లేదని, 70 శాతం అభిప్రాయాలు కలిస్తే చాలని 30 శాతం అభిప్రాయాలను ఏకీభవించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆర్థిక కష్టాలతో ఆత్మహత్య చేసుకున్న కౌలు…
ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. కొందరు ఈడీ అధికారులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇప్పటికే ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సంబంధించి ‘సిట్’ను ఉద్ధవ్ సర్కార్ ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర హోం శాఖ మంత్రి దిలీప్ వాల్షే పాటిల్ మీడియాతో మాట్లాడుతూ, వీరేష్ ప్రభు అనే అధికారి నేతృత్వంలో సిట్ పని చేస్తుందని చెప్పారు. నిర్దేశిత గడువులోగా దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పారు. సంజయ్ రౌత్ గత నెలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొందరు ఈడీ అధికారులు కొందరిపై విమర్శలు చేశారు. కొందరు అధికారులు బీజేపీకి ‘ఏటీఎం’లుగా పని చేస్తున్నారని ఆరోపించారు. నలుగురు ఈడీ అధికారులపై బలవంతపు వసూళ్ల ఆరోపణలపై ముంబై పోలీసులు దర్యాప్తు…
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పార్టీలో అందరికి దిగ్భ్రాంతిని, నిరాశను కలిగించినట్లు తనకు తెలుసని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మొదటిసారిగా అంగీకరించారు. మంగళవారం జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో మాట్లాడుతూ ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని విధాలా కృషిచేస్తున్నట్టు పార్టీ నేతలకు ఆమె భరోసా ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దిగ్భ్రాంతికరమైనవి, బాధాకరమైనవి అని అభివర్ణిస్తూ పార్టీకి ముందున్న మార్గం మునుపెన్నడూ లేనంత సవాలుగా ఉంది, ఇది పార్టీ అంకితభావం, దృఢ సంకల్పం, స్ఫూర్తిని పరీక్షించగలదని ఆమె చెప్పారు. ఆమె జి-23 నాయకుల వ్యాఖ్యలను లేదా అనేక పలు రాష్ట్రాలలో జరుగుతున్న తర్జనభర్జనలని పరోక్షంగా ప్రస్తావిస్తూ పార్టీలో ఐక్యతను కాపాడడానికి నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అందుకోసం అన్ని స్థాయిలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని, పార్టీ బలోపేతానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆమె ఈ సందర్భంగా పిలుపిచ్చారు. కాంగ్రెస్‌కు పూర్వవైభవం కోసం ఏం చేయాలో అన్నీ చేస్తున్నామని హామీ ఇచ్చారు. తమ పనితీరును సమీక్షించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ…
నగరంలో ఎన్నో పబ్‌లపై డ్రగ్స్ ఆరోపణలు ఉన్నా.. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కొన్నింటిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. బంజారాహిల్స్‌లోని పబ్‌పై పోలీసులు దాడి చేసిన ఘటనను ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు నడిపే పబ్‌లపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేందంటూ ఆమె ప్రశ్నించారు. హైదరాబాద్‌లో బట్టబయలైన డ్రగ్స్ పార్టీ సంచలనం రేపుతోంది, సెలబ్రిటీలు, ప్రముఖుల పిల్లలే కాకుండా మైనర్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఆమె చెప్పారు. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని ఆమె స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ సర్కార్ మోద్దు నిద్ర పోతోందని, హైదరాబాద్‌లోని ఎన్నో పబ్స్ మీద డ్రగ్స్ ఆరోపణలున్నా, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కొకైన్, చరస్ లాంటి మత్తు పదార్థాలతో విచ్చలవిడిగా దందా నడిపిస్తున్నా బంజారాహిల్స్‌లోని ఒక పబ్ పైనే రెయిడ్స్ చేయడం…
తెలుగు రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ జలాల పంచాయితీ మరోసారి తలెత్తింది. విద్యుత్ ఉత్పత్తికి నాగార్జునసాగర్ నుంచి తెలంగాణ ప్రభుత్వం నీటిని అక్రమంగా వాడుకుంటోందని, దీనికి అడ్డు కట్ట వేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు మంగళవారం లేఖ రాసింది. జల వనరుల శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి ఈ లేఖను రాశారు. ఏపీ ప్రభుత్వం రాసిన లేఖపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. నాగార్జునసాగర్ నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం ఎలా లేఖ రాస్తుందని ఆయన నిలదీశారు. కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదని అందుకే కేంద్రానికి చిల్లర మల్లర ఫిర్యాదులు చేస్తోందని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని ఆపివేస్తే ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటూ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తోందని ధ్వజమెత్తారు.…
జమ్మూకశ్మీరులోని సరిహద్దుల్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడేందుకు సమాయత్తం అయ్యారని ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేర సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్)మంగళవారం హైఅలర్ట్ ప్రకటించింది. పాకిస్థాన్ దేశంలో నెలకొన్న రాజకీయ గందరగోళం నేపథ్యంలో పాక్ ఉగ్రవాదులు భారత్ సరిహద్దుల్లో తమ కార్యకలాపాలను ముమ్మరం చేశారని కేంద్ర భద్రతాదళాలకు సమాచారం అందింది. గత వారం రోజుల్లో 117 మంది ఉగ్రవాదులు జమ్మూకశ్మీరులోని బందిపొరా జిల్లాలోని గురేజ్ సెక్టారు, కుప్వారా జిల్లాలోని కేరన్, మచిల్ సెక్టార్లకు చేరుకున్నారని సమాచారం వచ్చింది. దీంతో సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ దగ్గర 24 పోస్టుల వద్ద బీఎస్ఎఫ్ సిబ్బంది గస్తీ తిరుగుతున్నారు.కెరాన్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి లష్కరే తోయిబా, జైషే మహ్మద్, అల్ బదర్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలకు చెందిన 41 మంది కార్యకర్తలు పీఓకేలో ఉన్నారు. ఈ ఉగ్రవాదులు దుధానియాల్, అత్ముగం లాంచ్ ప్యాడ్‌ల వద్ద ఉన్నారని నిఘా వర్గాలు భద్రతా బలగాలకు సమాచారం అందించాయి.…
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవికి ముప్పు ఏర్పడడానికి ఆయన ఆరోపిస్తున్నట్లు `విదేశీ హస్తం’ (అమెరికా) కారణమా? అవుననే ఇప్పుడు రష్యా కూడా స్వరం కలుపుతున్నది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా- అమెరికాల మధ్య బహిరంగ నడుస్తున్న సమయంలో వాషింగ్టన్‌కు అవిధేయత చూపినందుకే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మూల్యం చెల్లించుకుంటున్నారని మండిపడింది. ఈ సంవత్సరం ఇమ్రాన్ ఖాన్ మాస్కోను సందర్శించినందుకు శిక్షించబడుతున్నారని రష్యా ఆరోపించింది. ‘ఈ ఏడాది ఫిబ్రవరి 23-24 తేదీల్లో ఇమ్రాన్ ఖాన్ మాస్కో పర్యటన గురించి ప్రకటించిన వెంటనే, అమెరికన్లు, వారి పాశ్చాత్య సహచరులు ప్రధానమంత్రిపై మొరటుగా ఒత్తిడి చేయడం ప్రారంభించారు. పర్యటన రద్దు చేయాలని అల్టిమేటం డిమాండ్ చేశారు’ అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవాను ధ్వజమెత్తారు. రష్యా దళాలు ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్ర ప్రారంభించిన ఫిబ్రవరి 25న ఇమ్రాన్ ఖాన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను మాస్కోలోని క్రెమ్లిన్‌లో కలిశారు. గత 23 ఏళ్లలో రష్యాను సందర్శించిన రెండవ…