Author: Editor's Desk, Tattva News

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలో హాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈ వేడుకలో మొత్తం 23 విభాగాల్లో అవార్డులు అందజేశారు.  ఉత్తమ చిత్రంగా ‘కోడా’, ఉత్తమ నటుడిగా విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), ఉత్తమ నటిగా జెస్సికా చాస్టెయిన్ ( ది ఐస్ ఆఫ్ టామీ ఫే), ఉత్తమ దర్శకుడిగా జేన్ కాంపెయిన్ (ది పవర్ ఆఫ్ డాగ్) నిలిచి ఆస్కార్ అవార్డులు దక్కించుకున్నారు. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో పోటీపడిన భారతీయ చిత్రం ‘రైటింగ్ విత్ ఫైర్’కు నిరాశే ఎదురైంది. ఈ అవార్డును ‘సమ్మర్ ఆఫ్ సోల్’ కైవసం చేసుకుంది.  రెజీనా హాల్, అమీ షుమర్, వాండా సైక్స్‌లు ఆతిధేయులుగా వ్యవహరించారు. ‘సిఒడిఎ’ ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా మూడు విభాగాల్లో నామినేట్…

Read More

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ గత సంవత్సరకాలంగా లెక్కచేయకుండా వస్తున్న జి23 నేతలను అకస్మాత్తుగా శాంతింపజేసేందుకు ప్రయత్నించడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది.  పార్టీ అగ్ర నాయకత్వం చట్టబద్ధతను ప్రశ్నిస్తూ, ముఖ్యంగా పార్టీని ‘ఒక్క కుటుంభం’ ఆస్తిగా మారుస్తున్నారని అంటూ కఠినమైన పదజాలంతో లేఖ వ్రాసి, తరచూ మీడియాలో పార్టీ నాయకత్వం నడవడికను ప్రశ్నిస్తూ వస్తున్నా వారిని పట్టించుకోవడం లేదు.  మొత్తం ఐదు అసెంబ్లీ ఎన్నికలలో పార్టీకి ఘోరమైన ఫలితాల తర్వాత, పార్టీకు బలమన  పంజాబ్‌ను అవమానకార రీతిలో కోల్పోవడం,  ప్రియాంక గాంధీ `ట్రంప్ కార్డ్’ ప్రయోగించినా ఉత్తరప్రదేశ్‌లో ఫలితం చూపక పోవడంతో జి23 నాయకులను దారిలోకి తెచ్చుకొనే ప్రయత్నాలు ప్రారంభించారని చాలామంది భావిస్తున్నారు.  అదే నిజమైతే, ఎన్నికల  ఫలితాల తర్వాత వెంటనే వారు జి23 నేతల పట్ల కొన్ని సానుకూల సంకేతాలు పంపించి ఉండేవారు.  కనీసం మార్చి 20న జరిగిన సిడబ్ల్యూసీ సమావేశంలో వారి అభిప్రాయాన్ని గౌరవించిఉండేవారు. కానీ అటువంటి…

Read More

అమరావతి రాజధాని అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి దోహదపడేలా అమరావతి రాజధాని నిర్మాణంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయ విజ్ఞత ప్రదర్శించి, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కోసం తీసుకొన్న భూముల్లో తక్షణం నిర్మాణ పనులను చేపట్టడం ద్వారా సానుకూల పాత్రను బాధ్యతతో పోషించాలని రాష్ట్ర ప్రజల తరుపున ప్రముఖ సామజిక కార్యకర్త టి లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన స్థలాన్ని ఆదివారం వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్, పోతుల బాలకోటయ్య, పరంధామయ్యలతో కలసి సందర్శించి అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమకారులు కొందరితో అక్కడ సమాలోచనలు జరిపారు. ప్రధాని మోదీ భారత పార్లమెంటు ప్రాంగణం నుండి మోసుకొచ్చిన మట్టి, గంగా జలం, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి సేకరించిన మట్టి, నదుల నుండి తీసుకొచ్చిన నీటిని, ఈ షేడ్ క్రింద…

Read More

స్థానికంగా తయారైన వస్తువులను (లోకల్‌)ను ‘గ్లోబల్‌’గా మార్చడానికి మరింత కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  పిలుపునిచ్చారు.ఎగుమతి లక్ష్యాన్ని అందుకోవడం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశం మాత్రమే కాదని దేశ సామర్థ్యానికి చెందిన అంశం కూడా అని, లోకల్‌ ఫర్‌ గ్లోబల్‌గా అభివృద్ధి చెందాలని ఆయన స్పష్టం చేశారు.  ప్రధాని ఆదివారం తన రేడియో ప్రసంగం 87వ ఎడిషన్‌ ‘మన్‌ కీ బాత్‌’లో మాట్లాడుతూ 400 బిలియన్‌ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని భారత్‌ చేరుకుందని తెలిపారు. ‘భారతదేశంలో తయారైన వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోందని,  భారతదేశ సరఫరా గొలుసు రోజురోజుకూ బలపడుతోందని చెప్పారు.  ఈ రోజు మనం మిల్లెట్‌, మామిడి, ప్రసిద్ధ నాగాలాండ్‌ మిర్చి ఎగుమతి చేస్తున్నాముని తెలిపారు. లడఖ్‌లోని నేరేడు పండు దుబారులో కూడా ప్రజాదరణ పొందిందని, సౌదీ అరేబియాకు తమిళనాడు నుంచి అరటిపళ్లు రవాణా చేస్తున్నామని పేర్కొన్నారు.  ‘‘భారత్ సత్తా ఏంటో ఈ ఎగుమతులు నిరూపించాయి. ఇది…

Read More

దేశంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి అమర్నాథ్. హిమాలయాల్లో కొలువుదీరే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. కేవలం కొన్ని రోజులు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉండటంతో యాత్రకు ఎప్పుడు అనుమతిస్తారా అని జనం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.  ఈ క్రమంలో భక్తుల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు సంబంధించిన తేదీలను ప్రకటించారు. జూన్ 30 నుంచి యాత్ర ప్రారంభవుతుందని శ్రీ అమర్నాథ్ జీ దేవస్థానం బోర్డు ప్రకటించింది. 43రోజుల పాటు కొనసాగుతుందని చెప్పింది.  ఆదివారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ట్విట్టర్లో ట్వీట్ చేశారు.  2019లో జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నేపథ్యంలో ఆ ఏడాది అమర్ నాథ్ యాత్ర అర్థాంతరంగా ముగిసింది. ఆ తర్వాత వరుసగా రెండేళ్లు, కరోనా మహమ్మారి కారణంగా 2020-, 2021లో యాత్రికులను అనుమతించలేదు. ప్రస్తుతం…

Read More

మరోసారి ఆద్యంతం నిలకడగా రాణించిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఈ ఏడాది తన ఖాతాలో రెండో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకుంది. ఆదివారం ముగిసిన స్విస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 టోర్నీలో ఈ ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ చాంపియన్‌గా అవతరించింది. గత ఏడాది కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన 26 ఏళ్ల సింధు ఈసారి మాత్రం పట్టుదలతో ఆడి తొలిసారి స్విస్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది. ప్రపంచ 11వ ర్యాంకర్‌ బుసానన్‌ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్‌ (థాయ్‌లాండ్‌)తో జరిగిన ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ సింధు 21–16, 21–8తో గెలిచింది. అంతర్జాతీయ టోర్నీలలో బుసానన్‌పై సింధుకిది 16వ విజయం కావడం విశేషం. 49 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో సింధుకు తొలి గేమ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. అయితే స్కోరు 16–15 వద్ద సింధు వరుసగా రెండు పాయింట్లు గెలిచి 18–15తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒక…

Read More

రాజధాని మాలెలో ప్రతిపక్షాల ‘ఇండియా అవుట్‌’ ర్యాలీపై నిషేధం విధిస్తూ.. మాల్దీవుల పార్లమెంట్‌ అత్యవసర తీర్మానాన్ని ఆమోదించింది. మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌, ఆయన పార్టీ ప్రొగ్రెసివ్‌ పార్టీ ఆఫ్‌ మాల్దీవ్స్‌, మిత్ర పక్షం పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లు ఈ ర్యాలీకి పిలుపునిచ్చాయి. ఈ అత్యవసర తీర్మానాన్ని మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎండిపి) సభ్యుడు, మాజీ అధ్యక్షుడు మొహ్మద్‌ నషీద్‌ ప్రవేశపెట్టారు. ఈ ర్యాలీ దేశ భద్రతకు ప్రమాదం కలిగిస్తోందని, పొరుగుదేశాల మధ్య విభేదాలను పెంచుతుందని పేర్కొన్నారు. ర్యాలీని, సంబంధిత కార్యక్రమాలను మాల్దీవ్‌ రక్షణ బృందం అడ్డుకోవాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ‘ఇండియా అవుట్‌’ అనేది ఈ ర్యాలీ నేపథ్యం. అధ్యక్షుడు ఇబ్రహీం సోలిహ్  నేతృత్వంలోని ఎండిపి ప్రభుత్వ మాల్దీవులను ఇండియాకు విక్రయించిందని రెండేళ్ల క్రితం నిరసనకారులు ఒక ఆందోళన చేపట్టారు.  భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జయశంకర్‌ మాల్దీవుల్లో పర్యటిండచంతో నిరసన చేపట్టేందుకు పోలీసులు అనుమతించలేదు. ఇతర ప్రాంతాల…

Read More

మగవారు లేకుండా ఆడవాళ్లను విమానాలు ఎక్కేందుకు తాలిబన్‌ ప్రభుత్వ నిరాకరించింది. ఫలితంగా ముందే టికెట్లు బుక్‌ చేసుకొని కూడా ఆఫ్ఘన్‌ మహిళలు విమానాలెక్కలేకపోయారు. మహిళలు 72 కిలోమీటర్ల దూరానికి మించి ప్రయాణించాలంటే మగవారు తప్పనిసరిగా ఉండాలని తాలిబన్‌ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.  దీంతో కెనడా వంటి ఇతర దేశాల పౌరసత్వం ఉన్న ఆఫ్ఘన్‌ మహిళలను కూడా అనుమతించేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. పాకిస్తాన్‌, దుబాయ్,   టర్కీ దేశాలకు వెళ్లడానికి కాబుల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన అనేకమంది మహిళలను విమానాలు ఎక్కనివ్వలేదని విమానాశ్రయ అధికారులు తెలిపారు.  మగవారి తోడు లేకుండా వారు విమాన ప్రయాణాలు చేయకూడదని స్పష్టం చేస్తున్నారు.  తాలిబాన్ల నుండి వచ్చే పరిణామాలకు భయపడి పేరు తెలుప నిరాకరిస్తూ మాట్లాడిన అధికారులు, దేశీయ , అంతర్జాతీయ విమానాలలో ఎక్కడానికి శుక్రవారం కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన డజన్ల కొద్దీ మహిళలు మగ సంరక్షకుడు లేకుండా అలా చేయలేకపోయారని వెనుదిరిగారని తెలిపారు. బాలికలను…

Read More

జాతీయ భావనకు వ్యతిరేకంగా ఉన్న వాదనలన్నీ క్రమంగా నీరుగారి, తమ అస్తిత్వం కోల్పోతున్నాయని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలిపారు. సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆర్ ఎస్ ఎస్ ప్రాంత ప్రచారక్ గా పనిచేసి, వేలాదిమంది సామజిక కార్యకర్తలకు మార్గదర్శిగా నిలచిన సోమేపల్లి సోమయ్య గురించి నవయుగ భారతి ప్రచురించిన `స్ఫూర్తి ప్రదాత శ్రీ సోమయ్య’ గ్రంధాన్ని ఆయన శనివారం సాయంత్రం హైదరాబాద్ లో ఆవిష్కరిస్తూ పితృవాత్సల్యంతో తన ఎదుగుదలకు మార్గనిర్దేశం చేసిన సోమేపల్లి సోమయ్య జీవితాన్ని పుస్తకరూపంలో తీసుకురావడం, ఆ పుస్తకాన్ని తాము స్వయంగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందని తెలిపారు.  దివిసీమ సమయంలో పుననిర్మాణ కార్యక్రమాలు చేపట్టడంలో సోమయ్య అసాధారణమైన నాయకత్వ లక్షణాలు ప్రదర్శించారని ఆయన గుర్తు చేశారు. రెండు  తెలుగు రాష్ట్రాలలో ఎందరో యువకులు సామజిక సేవలో నిమగ్నం కావడానికి స్ఫూర్తి కలిగించారని చెప్పారు.  ప్రజల సాంఘిక జీవనం ఆందోళనలో పడ్డ ప్రతి సందర్భంలోనూ వారు ముందుకు వచ్చారన్న ఆయన, ప్రకృతి బీభత్సాలు జరిగిన…

Read More

రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు జరిపిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు దర్యాప్తుతో పాటు కోర్టుకు సమర్పించిన ఆధారాలలో కీలకమైనవి సమర్పించలేదని  ఈడీ అనేక అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఎక్సైజ్‌ శాఖ కావాలని కేసు దర్యాప్తును పక్కదారి పట్టించిందన్న అభిప్రాయంతో ఉన్న ఈడీ పూర్తి ఆధారాలను కోర్టుకు సమర్పించలేదని భావిస్తోంది.  ఇదే విషయాన్ని హైకోర్టుకు ఈడీ దాఖలు చేసిన సీఎస్‌ సోమేష్‌కుమార్‌, ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌లపై వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో స్పష్టం చేసింది. టాలీవుడ్‌ కేసులో కీలకుడైన కెల్విన్‌ నుంచి స్వాధీనం చేసుకున్న ఐ ప్యాడ్‌లో తారల చిట్టా ఉందని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.  దర్యాప్తు వివరాలను ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా ఎక్సైజ్‌ శాఖ ఇవ్వడం లేదన్న ఈడీ సినీతారల కాల్‌ రికార్డ్స్‌ను కోర్టుకు సమర్పించలేదని ఈడీ తన పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు దర్యాప్తునకు సంబంధించిన పూర్తి…

Read More