Author: Editor's Desk, Tattva News

దేశంలో కరోనా  ఆంక్షలను ఈ నెల 31 నుంచి పూర్తిగా ఎత్తివేయనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. దేశంలో కరోనా కేసుల్లో భారీ తగ్గుదల కనిపిస్తున్న నేపధ్యంలో ఆంక్షలను ఎత్తివేస్తున్నా, మాస్కులు, భౌతిక దూరం పాటించడం గతంలో మాదిరిగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది.  అన్ని రాష్ట్రాల కార్యదర్శలకు హోం శాఖ కార్యదర్శి అజరు భల్లా ఈ మేరకు సమాచారం అందించారు. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన సామర్ధ్యాన్ని, వ్యవస్థలను అభివృద్ధి చేశాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో రెండేళ్ల నుంచి కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నాయి.  ‘‘కరోనా కట్టడి చేసేందుకు గత 24 నెలలుగా రోగనిర్ధారణ, నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్, చికిత్స, టీకా, ఆసుపత్రుల్లో సౌలతులు.. వంటి వివిధ అంశాల్లో మన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు సాధారణ ప్రజలకు కరోనా విషయంలో చాలా అవగాహన వచ్చింది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు…

Read More

సికింద్రాబాద్ లోని బోయగూడలో అగ్నిప్రమాదం సంభవించింది. టింబర్ డిపోలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 11 మంది సజీవదహనమయ్యారు. కొందరు సజీవదహనం, పొగతో ఊపిరాడక మరికొందరు ప్రాణాలు వదిలారు. అగ్నిప్రమాద సమయంలో టింబర్ డిపోలో 15 మంది కార్మికులు ఉన్నారు. ఇద్దరు కార్మికులు మంటల నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మృతులంతా బిహార్ కు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు.  స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదం జరిగిన భవనంలో టింబర్ డిపో, స్ర్కాప్ గోదాం ఉన్నాయి. టింబర్ డిపో నుంచి స్ర్కాప్ గోదాముకు మంటలు వ్యాపించాయి.  దట్టంగా వ్యాపించిన పొగ వల్ల మృతదేహాల వెలికితీతలో ఇబ్బందులు అవుతున్నాయని, అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని  అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు టింబర్ డిపోలో ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. మృతులు సికిందర్(40), బిట్టు(23), సత్యేందర్(35), గోలు(28), దమోదర్(27), రాజేశ్(25), పంకజ్(26), దినేశ్(35), రాజేశ్(25),…

Read More

కాలుష్యం అరికట్టడం గురించి అంతర్జాతీయ వేదికలపై ఘనమైన ప్రకటనలు చేస్తున్న భారత దేశంలో పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన రాజధానిగా ఢిల్లీ వరుసగా రెండోసారి అపఖ్యాతి మూటగట్టుకొంది. భారత్‌లో వాయు కాలుష్యం 2021 లో చాలా అధ్వాన్నస్థితికి చేరుకుందని స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్ అనే సంస్థ నివేదిక వెల్లడించింది. కాలుష్య కొలమానం పిఎం 2.5 ప్రకారం సగటు వాయు కాలుష్య ప్రమాణం క్యూబిక్ మీటర్‌కు 58.1 మైక్రో గ్రామ్స్ కాగా, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన వాయుకాలుష్య ప్రమాణం కన్నా పది రెట్లు ఎక్కువగా ఉందని వివరించింది. భారత్ లోని ఏ నగరం కూడా వాయు నాణ్యతలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు తగినట్టు లేదని పేర్కొంది. 117 దేశాల్లోని 6475 నగరాల్లో ఉన్న వాయు కాలుష్య పరిశీలన కేంద్రాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు ఐక్యూఎయిర్ వెల్లడించింది. ఉత్తర భారతం చాలా అధ్వాన్న స్థితిలో ఉందని,…

Read More

పశ్చిమ బెంగాల్ లో . అత్యంత అమానవీయంగా జరిగిన హింసాకాండలో 8మంది సజీవ దహనమయ్యారు. ఇళ్ళల్లో బంధించి మరీ ఇళ్ళకు నిప్పంటించారు. అక్కడ అధికారమలో ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ లోని కుమ్ములాటలు ఫలితమే ఈ అమానుషం చోటుచేసుకోవడం గమనార్హం. బీర్భం జిల్లాలోని భక్తు గ్రామంలో సోమవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. హింసను గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ తీవ్రంగా ఖండించారు. మానవ హక్కులు కాలరాయబడ్డాయని, చట్టబద్ధ పాలన తొక్కివేయబడిందని విమర్శించారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. ఈ సంఘటన నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌పై ప్రతిపక్షం తీవ్రంగా ధ్వజమెత్తింది. హోం శాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. కాగా ఈ హింసకు నిరసనగా 22మంది బిజెపి ఎంఎల్‌ఎలు అసెంబ్లీ నుండి వాకౌట్‌ చేశారు. ముఖ్యమంత్రి దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ హింసాత్మక ఘటనపై నివేదికను సమర్పించాలని కేంద్రం కోరింది. ఈ హింసాకాండపై విచారణకు బిజెపి నిజనిర్ధారణ…

Read More

పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన గంటలోనే ప్రాజెక్టు పనులను నిర్మాణ సంస్థ నిలిపివేసింది. మంగళవారం మధ్యాహ్నం పోలవరం పనులను మెగా ఇంజనీరింగ్ సంస్థ నిలిపివేసింది. పోలవరం పనుల కోసం గోదావరిలో ఇసుక తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా మంగళవారం మధ్యాహ్నం నుంచి మెగా ఇంజనీరింగ్ టిప్పర్లకు ఇసుక ఇవ్వడాన్ని జేపీ వెంచర్స్ ఆపేసింది. ఇసుక తవ్వుకునేందుకు వీలు లేదని, డబ్బు కట్టాల్సిందేనని కాంట్రాక్టు సంస్థ చెప్పింది. తమకు అనుమతులు ఉన్నాయని పోలవరం నిర్మాణ సంస్థ చెప్పింది. డబ్బు చెల్లించకుండా ఇసుక సరఫరా చేసేది లేదని జెపీ వెంచర్స్ తేల్చి చెప్పింది. ఇసుక ఇవ్వకపోవడంతో టిప్పర్లు వెనక్కి వచ్చాయి. ప్రభుత్వానికి మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు ఈ సమాచారాన్ని పంపారు 2023 ఖ‌రీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అతను ముందు అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ స్పష్టం చేశారు. సీడ‌బ్ల్యూసీ…

Read More

చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్ విమానం దేశంలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌లో కూలిపోయి, పెద్ద అడవి మంటలను రేకెత్తించి, అందులో ఉన్న 132 మందిని రెండు రోజులు అవుతున్నా ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందో చైనా ప్రభుత్వానికే కాకుండా ప్రపంచంలోని వైమానిక రంగ నిపుణులకు సహితం అంతుబట్టడం లేదు. ఆ విమానం కొన్ని నిమిషాల వ్యవధిలో 29,100 అడుగుల ఎందుకు,ఎలా పడిపోయిందో అర్థం చేసుకోవడానికి నిపుణులు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. విమానాన్ని నిటారుగా డైవ్ చేయడం నిపుణులను కలవరపరిచింది. ప్రత్యేకించి విషాదకరమైన ప్రమాదానికి నిమిషాల ముందు విమానం సాధారణంగా పనిచేస్తున్నట్లు అనిపించింది. విమాన ప్రమాదం సంభవించిన ప్రదేశంలో సహాయక బృందాల అన్వేషణ కొనసాగుతోంది. బోయింగ్ 737 విమానం పర్వతాన్ని ఢీకొని పేలిపోగా మృతదేహాల కోసం సహాయక బృందాలు మంగళవారం కూడా గాలింపు చర్యలు కొనసాగించాయి. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన వారు కాని మృతదేహాల ఆచూకీ కాని తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలను బయటపెట్టగల బ్లాక్‌బాక్స్…

Read More

పంజాబ్ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ఆప్ వెంటనే రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికలలో రాష్ట్రం నుండి తమ అభ్యర్థులుగా ఎంపిక చేసిన ఐదుగురి గురించి ఆ పార్టీలోనే కలకలం చెలరేగుతుంది. వారిలో ఒకరిద్దరు మినహా అసలు పార్టీకి సంబంధం లేనివారు కావడం, పంజాబ్ తో ఏమాత్రం సంబంధం లేనివారు కావడంతో వారిని ఏ ప్రాతిపదికపై ఎంపిక చేశారన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ నెల 31 జరిగే రాజ్యసభ ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులుగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్ మిట్టల్, ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ ఛద్దా, ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్ సందీప్ పాఠక్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాను ఆమ్ ఆద్మీ పార్టీ నామినేట్ చేసింది. ఈ ఐదుగురు అభ్యర్థులు సోమవారం పంజాబ్ శాసనసభ సముదాయంలో తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వీరిలో కేవలం హర్భజన్ సింగ్ మాత్రమే పంజాబ్ కు చెందిన వారు. ఆయనకు కూడా పార్టీతో…

Read More

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరిగ్గా అధికారంలోకి రాగలనని అంచనాలు వేసుకొని భంగపడిన సమాజవ్వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇక రాష్ట్ర రాజకీయాల్లోనే పూర్తి సమయం కేటాయిస్తూ, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై పోరాటం చేయడానికి నిర్ణయించుకోవడానికి సిద్ధపడుతున్నట్లు సంకేతం ఇచ్చారు.  అఖిలేష్ తో పాటు ఆ పార్టీ మరో ఎంపీ ఆజంఖాన్ కూడా రాంపూర్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.అఖిలేష్ యాదవ్, ఖాన్ తమ అసెంబ్లీ స్థానాలను వదిలి లోక్‌సభ సభ్యత్వాన్ని నిలుపుకుంటారని ఇప్పటి వరకు  ఊహాగానాలు వచ్చాయి. తన రాజీనామాకు ముందు, అఖిలేష్ యాదవ్ మార్చి 18న కర్హల్‌లో ఎస్పీ ఆఫీస్ బేరర్లు, మద్దతుదారులతో సమావేశమయ్యారు.  గెలుస్తానని నమ్మకం లేకనే అసెంబ్లీకి పోటీచేయడం లేదని ఆదిత్యనాథ్ ఎద్దేవా చేయడంతో, మొదటిసారి అసెంబ్లీకి పోటీచేసి గెలుపొందిన ఆయన అధికారంలోకి రాలేకపోవడంతో ఆ పదవికి రాజీనామా చేస్తారని అందరు అనుకున్నారు. ఆయన పార్టీ వర్గాలు సహితం  లోక్‌సభ   సభ్యునిగా కొనసాగుతారని భావించారు. అయితే అనూహ్యంగా ఆయన లోక్‌సభ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసారు.  మంగళవారం…

Read More

ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించకుండా, తటస్థ వైఖరి ఆవలంభిస్తున్న భారత్ పట్ల అమెరికా, ఐరోపా దేశాలలో నెలకొన్న అసంతృప్తి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మాటలలో మొదటిసారిగా బహిర్గతమైంది. రష్యా విషయంలో భారత్ కాస్త వణుకుతోందని ఆయన  విమర్శించారు.  ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను శిక్షించే పాశ్చాత్య ఆంక్షలను ప్రస్తావిస్తూ  అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ `భారత్ ‘కొంతవరకు వణుకుతోంది’ అని పేర్కొన్నారు. బిజినెస్ రౌండ్‌టేబుల్ సీఈఓ  క్వార్టర్లీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఒంటరిగా చేసే విషయంలో అమెరికా, ఇతర మిత్రదేశాలలో భారతదేశం ఒక మినహాయింపుగా నిలుస్తుందని బిడెన్ సూచించారు. రష్యాకు వ్యతిరేకంగా కూటమి కట్టే విషయంలో భారత్‌ తీసుకునే నిర్ణయాల్లో అస్థిరత కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాల తరహాలో భారత్ రష్యాపై కఠిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను జారీ చేయలేకపోతోందని, వణుకుతోందని చెప్పారు. రష్యా వ్యతిరేక కూటమిలో భారత్‌ను మినహాయించినట్టేనని పేర్కొన్నారు. భారత్‌లో స్థిరమైన నిర్ణయాలు, అభిప్రాయాలు కనిపించట్లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. క్వాడ్ సభ్య దేశాల్లో…

Read More

టిడిపి ప్రభుత్వ హయాంలో పెగాసెస్‌ స్ప్తెవేర్‌ కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణ ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ  ఆరోపణలపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు సభా కమిటీని వేస్తున్నట్లు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. కమిటీలో సభ్యుల వివరాలు ఒకటి, రెండు రోజుల్లో తెలియచేస్తామని ఆయన చెప్పారు.  సోమవారం ఉభయ సభల్లోనూ అధికార వైసిపి సభ్యులు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం స్పైవేర్‌ను కొనుగోలు చేసిందంటూ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చేసిన ప్రకటనను ప్రస్తావించారు. దీనిపై పూర్తిస్థాయి చర్చ జరపాలనికోరుతూ పభుత్వ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి శాసనసభలో స్పీకర్‌కు నోటీస్‌ ఇచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కూడా చర్చ జరపాలని కోరారు. దీంతో స్వల్పకాలిక చర్చకు స్పీకర్‌ అనుమతిచ్చారు. అప్పటికే టిడిపి సభ్యులను సస్పెండ్‌ చేసి ఉండటంతో సభలో చర్చ ఏకపక్షంగా సాగింది. వైసిపి సభ్యులు అంబటి రాంబాబు, అబ్బయ్య చౌదరి, గుడివాడ…

Read More