Author: Editor's Desk, Tattva News

 ఆరు నూరైనా ముందస్తు ముచ్చటే లేదని స్పష్టం చేయడం ద్వారా తాము ముందస్తు ఎన్నికలకు వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెరదించారు. ప్రభుత్వ పథకాలు పూర్తి చేయాల్సి ఉన్నందున గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లామని ఆయన చెప్పారు.  ఈసారి 95 నుంచి 105 స్థానాల్లో తాము గెలుస్తామని భరోసా వ్యక్తం చేశారు. 30 స్థానాల్లో సర్వే చేస్తే 29 చోట్ల గెలుస్తామని రిపోర్ట్‌ వచ్చిందని ఆయన తెలిపారు. ఆ ఒక్క సీటు కూడా 0.3 ఓట్ల తేడాతో పోతుందని తేలిందని ఆయన పేర్కొన్నారు.  సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్‌లో ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు.  2018 నాటి పరిస్థితులు రాష్ట్రంలో ఇప్పుడు లేవని తేల్చి చెప్పారు.  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్  కిశోర్‌ తనతో కలిసి పనిచేస్తున్నాడని, అయితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. దేశంలో పరివర్తన కోసం తాను ప్రశాంత్‌ కిశోర్‌తో కలిసి…

Read More

రాష్ట్ర పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిపై కొంతకాలంగా తిరుగుబాటు ధోరణిలో బారంగంగా సవాళ్లు విసురుతున్న సంగారెడ్డి ఎంఎల్‌ఎ జగ్గారెడ్డికి పిసిసి షాక్ ఇచ్చింది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చిన అదనపు బాధ్యతల నుంచి పిసిసి జగ్గారెడ్డిని తప్పించింది. అంతేకాకుండా, పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతల నుంచి, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి కూడా ఆయనను తప్పించింది. జగ్గారెడ్డి ఇప్పటి వరకు నిర్వహించిన బాధ్యతలను పిసిసి ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగించింది. అంజన్ కుమార్, అజారుద్దీన్, మహేష్ గౌడ్ లకు రేవంత్ ఆ బాధ్యతలను అప్పగించారు. కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం మేరకే పిసిసి జగ్గారెడ్డిపై చర్యలు తీసుకుంది. తాను స్వతంత్రంగా ఉంటానని, కాంగ్రెసు ఎంఎల్‌ఎగా ఉండబోనని గతంలో జగ్గారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. ఆ నేపథ్యంలోనే జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధిష్టానం పిసిసికి సూచించినట్లు తెలుస్తోంది. తాజాగా రేవంత్‌కి జగ్గారెడ్డి ఆదివారం సవాల్ విసిరారు. తనపై కాంగ్రెసు తరఫున ఎవరినైనా పోటీకి దించి గెలిపించుకోవాలని ఆయన ఆ…

Read More

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి), ప్రభుత్వ భాగస్వామ్యంలోని ఐడిబిఐ బ్యాంక్‌ను అమ్మడానికి మోడీ సర్కార్‌ కసరత్తును వేగవంతం చేసింది. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి రోడ్‌ షోలు నిర్వహించనున్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరడ్‌ తెలిపారు.  ఐడిబిఐ బ్యాంక్‌ అమ్మకానికి గతేడాది మేలోనే ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ప్రస్తుతం ఈ బ్యాంక్‌లో ఎల్‌ఐసి, కేంద్రానికి కలిపి 95 శాతం వాటా ఉంది. అయితే ఇందులో ఎవరి వాటాలను ఎంత విక్రయించేదనేది ఇంకా స్పష్టత లేదని మంత్రి పేర్కొన్నారు.  మూలధనం కోసం ఎల్‌ఐసి,  ప్రభుత్వంపై ఆధారపడకుండా ఆ బ్యాంక్‌ కార్యకలాపాలు సాగడానికి ప్రయివేటీకరణ చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. వాటాల విక్రయం ద్వారా పెట్టుబడులు సమీకరణ, నూతన టెక్నలాజీ. మెరుగైన మేనేజ్‌మెంట్‌ నిర్వహణకు అవకాశాలున్నాయని తెలిపారు. ఐడిబిఐ బ్యాంక్‌లో ప్రస్తుతం ఎల్‌ఐసికి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం, నాన్‌ ప్రమోటర్‌ షేర్‌హోల్డర్లకు 5.29 శాతం చొప్పున వాటాలున్నాయి. ఇందులోని…

Read More

 టీడీపీ హయాంలో పెగాసెస్‌ కొనలేదని, ఎవ్వరి ఫోన్లు టాప్ చేయడం కూడా జరగలేదని మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ ఆరోపించడం, దానిపై  వైసిపి సభ్యులు రాష్ట్ర శాసనసభలో చర్చకు పెట్టి, స్పీకర్ సభాసంఘం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం పట్ల స్పందిస్తూ  పెగాసెస్‌ను కొనలేదని డీజీపీ కార్యాలయమే చెప్పిందని గుర్తుచేశారు.  పెగాసెస్‌ పట్ల తనపై ఆరోపణలు చేయడంతో వల్ల ప్రజల్లో అభద్రతా భావం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిఘా చీఫ్‌గా ఉన్నందున తనకు పూర్తి సమాచారం ఉందని, మే 2019 వరకు ఏ ప్రభుత్వ సంస్థ పెగాసెస్‌ కొనలేదని తెలిపారు. మే 2019 తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పారు.  లేనిపోని అపోహలతో ప్రజల్లో భయాందోళన కలిగించవద్దని సూచించారు. కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని ఏబీవి  ఎద్దేవాచేశారు. గత…

Read More

ఉక్రెయిన్‌పై ప్రస్తుతం రష్యా జరుపుతున్న యుద్ధం వల్ల కలిగే విషాదాలకు, ప్రాణ నష్టాలకు రష్యాను జవాబుదారీ చేయాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా ప్రధానిస్కాట్‌ మారిసన్‌ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం జరిపిన వీడియో సమావేశంలో ఐరోపాలో భయానకమైన పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితులు తమ ప్రాంతంలో తలెత్తరాదని అప్రమత్తం చేశారు.  స్వేచ్ఛా, పారదర్శక, సంపద్వంతమైన ఇండో-ఫసిఫిక్‌ ప్రాంతానికి భావ సారూప్యత కలిగిన ఉదారవాద ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారం కీలకమని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇండో పసిఫిక్‌కి సంబంధించి ఐరోపాలో జరిగిన పరిణామాల పర్యవసానాలపై చర్చించేందుకు ఇటీవల జరిగిన క్వాడ్‌ సమావేశం ఒక అవకాశానిు కల్పించిందని చెప్పారు.  ఇటువంటి కీలకమైన అంశాలపై దృష్టి పెట్టడానికి క్వాడ్‌లో భారత్‌ నాయకత్వానిు మారిసన్‌ స్వాగతించారు. ఇరు దేశాల మధ్య గల సహకార స్థాయి గణనీయమైనదని, ఇది ఇంకా పెరగాలని ఆయన ఆకాంక్షించారు. భారత్‌, ఆస్ట్రేలియా సంబంధాల్లో కీలక…

Read More

సుమారు ఐదు నెలల అనంతరం దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌లపై లీటరుకి 80 పైసలు పెంచింది. పెరిగిన ధరలు మంగళవారం అమల్లోకి రానున్నాయని ప్రకటించింది.   ఆయా రాష్ట్రాల్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.110.82. కాగా, డీజిల్‌ ధర రూ. 95గా ఉంది. కోల్‌కతా, చెన్నైలలో వరుసగా పెట్రోల్‌ ధర రూ. 105.51, రూ.102.16 కాగా, డీజిల్‌ ధరలు వరుసగా రూ. 90.62, రూ.92.19 గా ఉన్నాయి. తెలంగాణలో లీటర్‌ పెట్రోల్‌పై 90పైసలు, డీజిల్‌పై 87పైసలుగా ఉంది. ఎపిలో పెట్రోల్‌పై 88 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.109.10, డీజిల్‌ రూ95.40పైసలకు చేరింది. విజయవాడలో పెట్రోల్‌ రూ.110.80, డీజిల్‌ రూ.96.83గా ఉంది. గుంటూరులో పెట్రోల్‌ రూ.111.21, డీజిల్‌ రూ.97.26కు చేరింది. గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ నవంబర్ 2021 నుంచి ఇంధన ధరలు మారలేదు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం…

Read More

చైనాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. 133 మందితో వెళుతున్న బోయింగ్‌ 737 విమానం నైరుతి చైనాలో కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా మంటలు అలముకున్నాయి. ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయి ఉంటారని స్థానిక మీడియా చెబుతోంది.  సోమవారం మధ్యాహ్నం 1.11 నుంచి బయలుదేరిన ‘చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌’కు చెందిన విమానం 2.22 గంటలకు ప్రమాదానికి గురైంది. గ్వాంగ్చీ ప్రాంతంలోని కొండల్లో విమానం కూలిపోయినట్టుగా తెలుస్తోంది. ఈమేరకు చైనా అధికారిక ప్రసార మాధ్యమాల్లో ప్రసారమైంది. ప్రమాదం జరిగిన కొండ ప్రాంతంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. విమానం నుంచి మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. గ్వాంగ్జౌ రీజియన్‌లోని వుజౌ నగరానికి సమీపంలోని ఓ గ్రామీణ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాంతీయ అత్యవసర మేనేజ్‌మెంట్‌ బ్యూరో తెలిపినట్లు పేర్కొంది. సమాచారం అందిన వెంటనే.. రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. చైనా ఈస్ట్రన్‌ విమానం కున్మింగ్‌…

Read More

ఎపి అసెంబ్లీలో సోమవారం కూడా రసాభాస చోటుచేసుకుంది. జంగారెడ్డిగూడెం మరణాలు, పెగాసస్‌ అంశాలు అసెంబ్లీని కుదిపేశాయి. అధికార విపక్ష సభ్యుల వాగ్వివాదంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఒకరోజుపాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. పెగాసస్‌పై చర్చకు వైసిపి డిమాండ్‌ చేసింది. జంగారెడ్డిగూడెం మరణాల అంశంపై సభలో చర్చకు ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియం వద్ద బైఠాయించి నినాదాలతో నిరసన చేశారు. జంగారెడ్డి గూడెం మరణాలపై జుడీషియల్‌ విచారణకు డిమాండ్‌ చేశారు.  మార్షల్స్‌ సహకారంతో సభ్యులు తమ తమ స్థానాల్లోకి వెళ్లేటట్లు చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం. టిడిపి సభ్యులు బల్లలు ఛరుస్తూ సభను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో టిడిపి సభ్యులను సభాపతి శాసససభ నుంచి ఒక్కరోజు సస్పెండ్‌ చేశారు. అసెంబ్లీ టిడిపి సభ్యుల ఆందోళనపై నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం సూచించారు. సభలో సంస్కారవంతంగా, గౌరవప్రదంగా వ్యవహరించాలని అన్నారు. ‘ఇది శాసససభ.. వీధి మార్కెట్‌ కాదు.. మీరు వీధి రౌడీలు…

Read More

ఇప్పటికే ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు గురవుతుండగా  కాఫీ, టీ పొడి , నూనె, గోధుమపిండి వంటి నిత్యావసరాల ధరలు మరో 10-15 శాతం పెరిగే అవకాశముందని మార్కెట్  వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయంగా సరుకుల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదవుతుండటంతో పాటు ప్యాకేజింగ్‌ ముడిపదార్థాల ధరలూ పెరుగుతున్నాయి.  దీంతో అంతర్జాతీయంగా పరిస్థితులను ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎంసిజి) కంపెనీలు నిశితంగా గమనిస్తున్నాయి. హెచ్‌యూఎల్‌, నెస్లే కంపెనీలు గత వారమే కొన్ని ఆహారోత్పత్తుల ధరలను పెంచాయి. వంటనూనెలు, ముడిచమురు ధరలు గతం కంటే పెరిగినా, ఇటీవలి గరిష్ట స్థాయిల  నుంచి కొద్దిగా వెనక్కి వచ్చాయి.  పామాయిల్‌ ధర లీటరుకు రూ.180కి చేరినా, ఇప్పుడు రూ.150 వద్ద ఉంది. ముడిచమురు బ్యారెల్‌ ధర 139 డాలర్లను మించినా, ఇప్పుడు 100 డాలర్ల వద్ద ఉంది. ఈ ధరలు కంపెనీలకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా పరిణామాల అనంతరం గిరాకీ మళ్లీ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అన్ని…

Read More

కాల్పుల విరమణ ఒప్పందం గురించి రష్యా – ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చలు పురోగతిలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే కొన్ని సమస్యలపై ఈ రెండు దేశాల అధినేతలు ఒక నిర్ణయం తీసుకోవలసి ఉన్నట్లు ఈ చర్చలకు సారధ్యం వహిస్తున్న టర్కీ విదేశాంగ మంత్రి మెవ్‌లుట్ కావూసోగ్లు చెప్పారు. “ఈ రెండు దేశాల ప్రతినిధులు ఇప్పటి వరకు తాము చెబుతున్న మాట్లా నుండి వెనుకకు వేళ్ళని పక్షంలో కాల్పుల విరమణ ఒప్పందంకు అవకాశాలు ఆశాజనకంగా ఉన్నట్లు చెప్పగలను” అని తెలిపారు. అధికార జస్టిస్ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ సమావేశానికి హాజరైనప్పుడు తన ఆశావాదాన్ని పునరుద్ఘాటిస్తూ, “పార్టీలు ప్రాథమిక సమస్యలపై ఒప్పందానికి దగ్గరగా ఉన్నాయని మేము చూస్తున్నాము,” అని కావుసోగ్లు పేర్కొన్నారు. గత వారంలో, కావూసోగ్లు తన రష్యన్, ఉక్రేనియన్ సహచరులతో వరుసగా మాస్కో, ఎల్వివ్‌లలో సమావేశాలు నిర్వహించారు. శనివారం టర్కీ అధ్యక్ష ప్రతినిధి ఇబ్రహీం కలిన్ మాట్లాడుతూ, మాస్కో , కీవ్ ఆరు…

Read More