ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 11 రోజులైనా బిజెపి గెలుపొందిన నాలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఒక్క చోట కూడా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయలేదు. ఇప్పటి వరకు అధికారికంగా కేవలం ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్, మణిపూర్ లో బీరెన్ సింగ్ ల పేర్లను మాత్రమే ప్రకటించారు. వారిద్దరూ ప్రస్తుత ముఖ్యమంత్రులే. అయితే వారిద్దరూ కూడా తాత్కాలికమే అని, తర్వాత మార్చే అవకాశం ఉన్నట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి. మరోవంక, ఉత్తరాఖండ్, గోవా లలో ఈ రోజు నూతన ముఖ్యమంత్రులు ఎవ్వరో తెలిసే అవకాశం ఉంది. శాసనసభ పార్టీల సమావేశాలు ఈ రోజు జరుగుతున్నాయి. ఆప్ గెలుపొందిన పంజాబ్ లో ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంతో ఐదు రోజుల క్రితమే ప్రమాణస్వీకారం చేయడం, మంత్రివర్గాన్ని విస్తరించడం కూడా జరిగిపోయింది. బిజెపి అంతర్గత కలహాలు, ముఠా తగాదాల కారణంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయలేకపోతోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. గోవాలో ఎన్నికల ప్రచారానికి…
Author: Editor's Desk, Tattva News
పార్టీ అగ్రనేతలు వరుసగా సమస్యలతో మృతి చెందడంతో, లొంగి పోవడమో, భద్రతా దళాల కాల్పులలో మరణించడమో, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడంతో జరగడంతో కొద్దీ కాలంగా తెలుగు జిల్లాలో మావోయిస్టు కార్యక్రమాలు స్తంభించి పోయాయి. సరిహద్దు ప్రాంతాలలో కొద్దిపాటి కార్యకలాపాలతో తమ ఉనికిని చాటుకొంటున్న వారిలో కొత్తగా చేరే యువత ఉండడం లేదు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాల నుండి పోలీస్ నిఘా పెరగడంతో వెళ్లిన మావోయిస్టు నాయకులే పార్టీని విస్తరించడంతో కీలక పాత్ర వహిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆయా రాష్ట్రాలలో స్థానిక నాయకత్వం అభివృద్ధి చెందడంతో తెలుగు ప్రాంతాల నాయకులతో అవసరం లేకపోయింది. రెండు రాష్ట్రాల పోలీసులు సహితం మావోయిస్టు సమస్యను పరిష్కరించమనే ధీమాతోనే, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీల ప్రయోజనాలను కాపాడటంలో నిమగ్నమై ఉండడంతోనే మావోయిస్టు సమస్యపై కొంతకాలంగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఫలితంగా కొద్దికాలంగా తెలుగు రాష్ట్రాలలో వారు తిరిగి పుంజుకొంటున్నట్లు తెలుస్తున్నది. వారిప్పుడు వ్యూహాత్మకంగా ఒకొక్క చోట…
ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నఫ్తలి బెన్నెట్ ఏప్రిల్ 2 నుంచి నాలుగురోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలు 30వ వార్షికోత్సవాన్ని నిర్వహించకుంటున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు నఫ్తలి బెన్నెట్ భారత పర్యటనకు విచ్చేస్తున్నారు. ఆవిష్కరణలు, సాంకేతికత, భద్రత, సైబర్, వ్యవసాయం, వాతావరణ మార్పు రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత విస్తరించే లక్ష్యంగానూ ఈ పర్యటన జరగనుంది. ఈ వివరాలను ఇజ్రాయిల్ ప్రధాని విదేశీ మీడియా సలహాదారు ఒక ప్రకటనలో తెలిపారు. ‘భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నఫ్తలి బెన్నెట్ తొలిసారిగా ఏప్రిల్ 2 నుంచి భారత్‌లో పర్యటించనున్నారు’ అని తెలిపారు. గ్లాస్కోలో గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన కాప్ 26 సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలూ తొలిసారి కలుసుకున్నారని, ఆ సమయంలో మోదీ ప్రధాని బెన్నెట్‌ను ఆహ్వానించారని ప్రకటన తెలిపింది. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 5 వరకూ…
కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ (74) తన నాయకత్వంలోని లోక్‌తంత్రిక్ జనతా దళ్ (ఎల్‌జెడి) పార్టీని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జెడి)లో ఆదివారం విలీనం చేశారు. శరద్ యాదవ్‌ను ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్ తమ పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. పాతిక సంవత్సరాల తరువాత ఈ పార్టీల విలీనం చోటుచేసుకుంది. బిజెపిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఐక్యమవ్వాలని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శరద్ యాదవ్, తేజస్వీ యాదవ్ పిలుపునిచ్చారు. ఇప్పుడు బీహార్‌కు తేజస్వీ యాదవ్ ఆశాజ్యోతి. బిజెపి వ్యతిరేక శక్తులకు స్ఫూర్తిగా నిలిచారు. ఇటువంటి యువతరం నేతల నాయకత్వం అత్యవసరం అని, ఆర్జేడీని అంతా బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ దిశలోనే తమ పార్టీని ఆర్జేడీలో విలీనం చేస్తున్నామని చెప్పారు. తొలినాళ్లలో ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్ ఇరువురు జనతా దళ్‌లో పనిచేశారు. 1997లో లాలూ జనతా దళ్ వీడి ఆర్‌జెడి స్థాపించారు. శరద్ యాదవ్ కూడా…
పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి దేశ పార్లమెంట్‌లో వచ్చే వారం కీలక పరీక్ష ఎదురవుతుంది. ఈ నెల 25వ తేదీన దేశ జాతీయ అసెంబ్లీ సమావేశం ఏర్పాటుకు సభ స్పీకర్ అసద్ ఖైసర్ ఆదివారం ఆదేశాలు వెలువరించారు. దానితో ఆయన పదవికి గండం తప్పకపోవచ్చని కధనాలు వెలువడుతున్నాయి. ద్రవ్యోల్బణం, ధరల పరిస్థితి ఇతర అంశాలను ప్రస్తావిస్తూ ఇమ్రాన్‌ఖాన్‌పై దేశ ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ, తరువాత బల నిరూపణకు ఓటింగ్‌కు పార్లమెంట్ ఈ నెల 25వ తేదీన భేటీ అవుతుండటంతో రాజకీయ వర్గాల్లో దీనిపై పలు ఊహాగానాలు చెలరేగాయి. ఈ నెల 8వ తేదీననే పాకిస్థాన్‌కు చెందిన పిఎంఎల్‌ఎన్, పిపిపి ఎంపిలు దాదాపు వంద మంది సంతకాలతో అవిశ్వాస తీర్మానానికి నోటీసు వెలువరించారు. సోమవారమే పార్లమెంట్ భేటీ జరగాల్సి ఉందని, నిబంధనలను పాటించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.అయితే ఆదివారం స్పీకర్ కార్యాలయం నుంచి వెలువడిన అధికారిక సమాచారం ప్రకారం ఈ నెల 25వ తేదీన…
తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే భరోసాతో ఉన్న పార్టీ కార్యకర్తలకు గత ఏడాది చివరిలో జరిగిన హుజురాబాద్ ఉపఎన్నికల్లో పార్టీ నాయకత్వ వైఫల్యం కారణంగా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయామని గుర్తు చేస్తూ, అటువంటి దుర్ఘటనలు పార్టీకి తిరిగి జరగకుండా ఉండాలంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మార్చవలసిందే అని తెలంగాణలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. మాజీ మంత్రి మర్రి శశిధరరెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు, ఎమ్యెల్యే జగ్గారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో జరిగిన `అసమ్మతి నేతల’ సమావేశం ఈ విషయమై పార్టీ అధిష్ఠానంతో తాడో, పేడో తేల్చుకోవాలని నిర్ణయించింది. తెలంగాణాలో పార్టీ ప్రగతికి అడ్డుకట్ట వేస్తున్న రేవంత్ తో పాటు కేంద్ర పార్టీ ఇన్ ఛార్జ్ మాణిక్ ఠాకూర్ లపై పార్టీ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. తమది అసమ్మతి వర్గం కాదని, పార్టీ విధేయులుగా కలుసుకున్నామని ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది తొలిసారి కాదని,…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విజృంభించడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఆందోళన వ్యక్తం చేసింది. అదేవిధంగా కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌పై వస్తున్న తప్పుడు ప్రచారం వల్ల కలుగుతున్న గందగోళ పరిస్థితిపై ఆవేదన చెందింది. ప్రపంచ వ్యాప్తంగా 8 శాతం లేదా 11 మిలియన్లకు పైగా కేసులు వెలుగు చూశాయని డబ్ల్యుహెచ్‌ఒలో కరోనా సంబంధిత వ్యవహారాలు చూస్తున్న టెక్నికల్ లీడ్ డా. మరియా వాన్ ఖెర్కోవ్ స్పష్టం చేశారు. ఇతర కారణాలతో పాటు ఈ తప్పుడు సమాచారం కూడా కేసుల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తోందని తెలిపారు. ‘ఒమిక్రాన్ ప్రభావం అధికంగా లేదు, మహమ్మారి ముగిసిపోయింది అని మాకు పెద్ద మొత్తంలో తప్పుడు సమాచారమంతా అందింది. ఇదే మనం ఎదుర్కొవలసిన చివరి వేరియంట్ అంటూ ఫేక్ సమాచారం సృష్టించబడింది. ఇదే వైరస్ వ్యాప్తికి కారణమౌతోంది’ అని ఖెర్కోవ్ హెచ్చరించారు. కరోనాను సమర్థంగా ఎదుర్కోవడానికి వ్యాక్సిన్లు ఒక్కటే మార్గమని ఖెర్కోవ్ ఉద్ఘాటించారు. ఒమిక్రాన్…
పార్టీ నాయకత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో సంవత్సరకాలంగా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న జి23 బృందంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చివరకు రాజీ ధోరణి ప్రదర్శించనున్నారు. ఈ బృందం నేత గులాబీ నబి ఆజాద్ సోనియా గాంధీని కలిసి, గంట సేపటికి పైగా సురదీర్గంగా చర్చించిన అనంతరం ఆయనకు తిరిగి పార్టీలో కీలక బాద్యక్తలు అప్పచెప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. గత ఏడాదిగా పార్టీ వ్యవహారాలకు ఆయనను దూరంగా ఉంచుతూ వస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో సహితం ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పలేదు. అయితే ఈ ఏడాది చివరిలో గాని, వచ్చే ఏడాది ప్రారంభంలో గాని జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఆయనను పార్టీ ఇన్ ఛార్జ్ గా నియమించనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది అక్కడి నుండే రాజ్యసభకు కూడా పంపగలనని సోనియా హామీ ఇచ్చిన్నట్లు చెబుతున్నారు. ఆజాద్ తో సమావేశం పర్యవసానంగా వచ్చే నెలలో భారీస్థాయిలో ఎఐసిసిలో మార్పులు చేర్పులకు దిగాలని సోనియా గాంధీ సంకల్పించిన్నట్లు తెలుస్తున్నది పరాజయానికి కారకులుగా నిర్థారిస్తూ ఇప్పటికే…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కొద్దిరోజులు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తిరిగి కేంద్రంపై పోరుకు సిద్దపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మళ్లీ వడ్ల కొట్లాటకు సై అంటున్నారు. యాసంగి వడ్లను తాము కొనేది లేదని, కేంద్రమే కొనాలని తేల్చిచెప్పారు. ఎర్రవల్లిలోని తన ఫాం హౌస్‌లో శనివారం మంత్రులు, అధికారులతో కేసీఆర్ జరిపిన అత్యవసర సమావేశంలో ఈ మేరకు కార్యాచరణ ప్రణాలికను రూపొందించారు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా పాల్గొన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ఉద్యోగాల భర్తీ ప్రకటన తర్వాత యువతలో స్పందన ఎట్లా ఉంది అనే అంశాలతో పాటు యాసంగిలో వడ్ల కొనుగోళ్లపైనా చర్చించినట్టు తెలిసింది. యాసంగి సీజన్‌లో వడ్ల కొనుగోళ్లపై చర్చించేందుకు సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ ఎల్పీ జాయింట్ మీటింగ్ నిర్వహించనున్నారు. మంత్రులతో…
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 20 రోజులుగా వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ పొందుతున్నారని, శనివారం సాయంత్రం మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. స్వరాజ్యం పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల దాకా హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నట్లు సీపీఎం వర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం 12 గంటలకు భౌతికకాయాన్ని నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించి అక్కడ సభ నిర్వహించనున్నట్లు తెలిపాయి. తర్వాత నల్గొండ మెడికల్ కాలేజీ విద్యార్థులకు పరిశోధన నిమిత్తం భౌతికకాయాన్ని అప్పగించనున్నట్లు పేర్కొన్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931లో మల్లు స్వరాజ్యం జన్మించారు. 5వ తరగతి వరకు చదువుకున్న ఆమె.. తన సోదరుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి అడుగుజాడల్లో సాయుధ…