భారత్‌లో రాబోయే ఐదేళ్లలో సుమారు రూ.3.2 లక్షల కోట్ల (5 ట్రిలియన్ యెన్‌లు) పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు జపాన్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిదా శనివారం ప్రకటించారు. ఈ పెట్టుబడుల ద్వారా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ), చిన్న తరహా పరిశ్రమల్లో పరస్పర పోటీ భాగస్వామ్యం కోసం ఒక రోడ్‌మ్యాప్ సిద్ధమైందని భారత విదేశాంగ కార్యదర్శి హర్షా తెలిపారు. భారత్-జపాన్ వార్షిక సదస్సును పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కిషిదా శనివారం హైదరాబాద్ హౌస్‌లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య గల ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని సమీక్షించి, మరింత బలోపేతం చేయడాన్ని చర్చించారు. కాగా, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తవుతున్నాయి. గతేడాది ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా కిషిదా భారత్‌లో పర్యటిస్తున్నారు. భారత్‌తో భద్రతా, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ రెండు…
Author: Editor's Desk, Tattva News
దేశంలోనే పేపర్ రహిత తొలి అసెంబ్లీగా నాగాలాండ్ నిలిచింది. శాసన సభా కార్యకలాపాల్లో నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ (ఎన్‌ఇవిఎ) కార్యక్రమాన్ని అమలు చేసిన అసెంబ్లీగా నాగాలాండ్ చరిత్ర సృష్టించింది. దీంతో సభా కార్యకలాపాల్లో పేపర్‌ను వినియోగించలేరు. 2022-23 ఆర్థిక సెషన్ బడ్జెట్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విధానంలో… 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రతి టేబుల్‌పై ఈ-బుక్ లేదా ట్యాబ్లెట్‌ను అమర్చారు. ‘కాగిత రహిత సభను ఏర్పాటు చేయడంలో భాగంగా మేము అసెంబ్లీలో ఎన్‌ఇవిఎ అప్లికేషన్ మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చాం’ అని స్పీకర్ షేరింగైన్ లాంగ్‌కుమార్ తెలిపారు. ఇదే వ్యవస్థ హిమాచల్ ప్రదేశ్‌లో అమలులో ఉందని, ఇతర రాష్ట్ర అసెంబ్లీలు సైతం ఈ విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ విధానం ద్వారా శాసనసభలోని ఒక్కో సభ్యుడికి ఒక్కో స్మార్ట్ టాబ్లెట్ ను వారి వారి సీట్ల వద్ద అమర్చుతారు. టాబ్లెట్ లో ప్రత్యేకంగా రూపొందించిన అప్లికేషన్ లో…
వైసిపి, టిడిపి నాయకుల సవాళ్లతో కృష్ణాజిల్లా నూజివీడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు రావాలని గత పది రోజులుగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప్ అప్పారావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. స్థానిక గాంధీబమ్మ కూడలిలో శనివారం సాయంత్రం బహిరంగ చర్చకు రావాలంటూ పరస్పర సవాళ్లు విసురుకున్నారు. పార్టీ నాయకుల సవాళ్లతో ముందు జాగ్రత్తగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. 400 మందికి పైగా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ చర్చకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీసులు అరెస్టు చేస్తారని శుక్రవారం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన ముద్దరబోయిన… చర్చ కోసం గాంధీబమ్మ కూడలికి రావడంతో ఆయన్ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ముద్దరబోయిన సవాల్‌ను స్వీకరించిన ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావును గృహనిర్బంధం చేశారు. సాయంత్రం ఎమ్మెల్యే వెంకట ప్రతాప్ అప్పారావు సెంటరుకు వచ్చి మీడియాతో…
ఐటి సంబంధిత సాంకేతికతతో దేశంలోనే ప్రముఖ కేంద్రంగా అంతర్జాతీయ ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్ ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్ సదుపాయలం కల్పించడంలో కూడా అగ్రగామిగా నుండబోతున్నది. దేశంలోనే మొట్టమొదటగా ఫైబర్ గ్రిడ్ పథకం (టి-ఫైబర్) ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం శరవేరంగా అడుగులు వేస్తోంది. సుమారు రూ 4,000 కోట్లతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫైబర్‌గ్రిడ్ పథకానికి 2017లో రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 33 జిల్లాలు, 585 మండలాలు, 12,751 గ్రామ పంచాయతీల్లోని 83.5 లక్షల గృహాలకు హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు అందించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఇందులో తొలి దశ పనులను ఏప్రిల్ చివరి నాటికల్లా పూర్తి చేయాలని లక్షంగా పెట్టుకుంది. వాస్తవానికి తొలి దశ పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల ముగిసేలోగా మొదటి దశ పనులను పూర్తి చేయాలని…
కాంగ్రెస్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వాలు సవాల్ చేస్తున్నరీతిలో గత ఏడాది కాలంగా అసమ్మతి బహిరంగంగా వ్యక్తం చేస్తున్న జి23 నేతలతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాజీ పడ్డారా? మొదటిసారిగా, సోనియా, రాహుల్ ఒక మెట్టు దిగి వారితో మాటలు కలపడంతో, వారు మెత్తబడినట్లు కనిపిస్తున్నది. జి23 బృందంలో కీలక నేతగా వ్యవహరిస్తున్న రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాబీ నబి ఆజాద్ శుక్రవారం రాత్రి సోనియా గాంధీ ఇంటికి వెళ్లి, ఆమెతో గంటసేపటికి పైగా సమాలోచనలు జరపడం, బైటకు వచ్చిన తర్వాత తమ నాయకురాలు సోనియా గాంధీనే అని స్పష్టం చేసినప్పటికీ పార్టీ అధ్యక్ష పదవిని గాంధీ కుటుంభం వదులుకోవాలని స్పష్టం చేసిన్నట్లు తెలుస్తున్నది. రాహుల్ గాంధీ లోక్ సభలో పార్టీ నాయకత్వ పదవిని చేపట్టి, పార్టీ అధ్యక్ష పదవిని కుటుంభం వెలుపల వ్యక్తికి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. అందుకు సోనియా సహితం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు. ఈ భేటీలో పార్టీలో అధికార పంపకమే కీలక…
వనదేవతలు సమ్మక్క, సారలమ్మల మీద తాను అభ్యంతరకర వాఖ్యలు చేసాను అంటూ తనపై పెద్ద వివాదం చెలరేగడం పట్ల త్రిదండి చినజీయర్ స్వామి విస్మయం వ్యక్తం చేశారు. తానెప్పుడో 20 ఏళ్ళ క్రితం, ఏదో సందర్భంలో చేసిన కొన్ని వాఖ్యాలను అటు, ఇటు మార్చి వివాదాన్ని ఎవ్వరు, ఎందుకు సృష్టించారో తనకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వైదిక మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో చినజీయర్ స్వామి ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ గ్రామదేవతలను తూలనాడినట్లుగా ఆరోపణలని తీవ్రంగా ఖండించారు. “కానీ, అది వాస్తవం కాదు. పనికట్టుకుని.. వాళ్ల సొంత లాభం కోసమే కొందరు ఇదంతా చేస్తున్నారు” అని ఆరోపించారు. ఉక్రెయిన్ యుద్ధ హడావిడి తగ్గింది కాబట్టే పనికట్టుకుని తన వ్యాఖ్యలను తెర మీదకు తీసుకొచ్చినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. “ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. అది సబబాకాదా అనేది వారి విచక్షణకే వదిలేస్తున్నాం. సమాజ హితం లేని వాళ్లే ఇలాంటి ప్రచారాలకు పూనుకుంటున్నారు”…
ఢిల్లీలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉపరాష్ట్రపతి కార్యాలయ సిబ్బందితో కలిసి భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హోలీ పండగను జరుపుకున్నారు. రంగుల కేళి హోలీ సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని ఐదు కార్పొరేషన్ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు ఉపరాష్ట్రపతిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులు దేశభక్తి పాటలు పాడారు. మరికొందరు కథలు చెప్పారు. దాదాపు గంట సేపు వారితో ఉపరాష్ట్రపతి ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి ‘మీరు ఎప్పుడైనా నిరాశకు గురయ్యారా?’ అని ఉపరాష్ట్రపతిని అడగగా.. ‘నేనెప్పుడూ నిరాశ చెందలేదు. కానీ కొన్నిసార్లు పార్లమెంటులో కొందరు సభ్యుల ప్రవర్తన కారణంగా ఆవేదన చెందాను’ అని ఆయన తెలిపారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అహరహం పాటుపడిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ తనకు స్ఫూర్తి అని రాష్ట్రపతి ఈ సందర్భంగా తెలిపారు. విధి నిర్వహణను, కుటుంబ బాధ్యతలను ఎలా సమన్వయం చేసుకుంటారని మరో విద్యార్థి ఉపరాష్ట్రపతిని…
తెలంగాణ ప్రతిష్టాత్మకంగా పుననిర్మించిన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పునఃదర్శనం భక్త జనానికి దొరకనుంది. ఈ మేరకు ఆలయ కమిటీ అధికారులు ఈ నెల 28 న ముహుర్తం ఖరారు చేసి, అందుకు సంభంధించి సఖల ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఆ రోజున ఉదయం 11:55 నిమిషాలకు మహా కుంభ సంప్రోక్షణ పూజ తో శాస్త్రోక్తంగా ఆలయం పునఃప్రారంభం కానుందనీ, సంప్రోక్షణానంతరం మూలవిరాట్ దర్శనానికి అనుమతిస్తామనీ యాదగిరి గుట్ట ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. మొదటి రోజైన సోమవారం నాడు మహా కుంభ సంప్రోక్షణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గోనున్నారని తెలిపారు. సంప్రోక్షణానంతరం యధావిధిగా పూజాకార్యక్రమాలుంటాయని పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి వారం రోజుల పాటు బాలాలయంలో పంచ కుండాత్మక యాగం నిర్వహించనున్నారనీ, 108 మంది పారాయణదారులు, ఆలయ అర్చకులు, వారి శిష్య బృందంతో ఈ మహా క్రతువు నిర్వహిస్తారని తెలియజేశారు. అంతే కాకుండా ఆలయంలోని స్వామివారి ఉత్సవమూర్తులను…
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమెరికా, ఐరోపా దేశాలు కఠినమైన ఆర్ధిక ఆంక్షలు విధించడంతో, వెసులుబాటు కోసం రాయితీ ధరకు రష్యా ఇవ్వజూపిన ముడి చమురు కొనుగోలు విషయంలో భారత్ ఇరకాటంలో పడినట్లు కనిపిస్తున్నది. మిత్రదేశంగా, ముఖ్యంగా భద్రతా పరమైన అనుబంధం గల రష్యాకు ఇటువంటి సమయంలో అండగా ఉండడం అవసరం కాగా, మరోవంక, తన ఇంధన అవసరాల కోసం కూడా ఇది ఒక మంచి అవకాశం కాగలదు. అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆర్ధిక ఆంక్షలతో మూడు చమురు, ఇంధనం లేకపోవడం, జర్మనీ వంటి ఐరోపా దేశాలు కూడా ఇంకా రష్యా నుండి కొనుగోలు చేస్తూ ఉండడంతో వాస్తవానికి భారత్ కు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. అమెరికా సహితం ముడిచమురు తమ ఆంక్షల పరిధిలోకి రాదంటూనే చరిత్రలో ఇటువంటి కీలక సమయంలో ఒక `దురాక్రమ’ దేశం వైపు ఉంది కలకం తెచ్చుకోవద్దని అంటూ భారత్ ను సున్నితంగా హెచ్చరిస్తున్నది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి తదితర వేదికలపై ఓటింగ్ కు…
తెలంగాణ కాంగ్రెస్ మొదటి నుండి విలక్షణమైన నాయకులుగా ఉంటూ, తమకంటూ సొంత బలం ఏర్పర్చుకున్న కోమటిరెడ్డి సోదరులు పార్టీ అధిష్టానం వైఖరి పట్ల తమ అసంతృప్తిని తరచూ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా అవినీతి పాలకుడు, నియంత కేసీఆర్‌ను గద్దెదింపడమే తన లక్ష్యమని అంటూ అందుకు ఏ పార్టీతో అయినా చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ప్రకటించారు. అంతకు రెండు రోజుల ముందే ప్రధాని నరేంద్ర మోదీని కలసి సింగరేణి బొగ్గు గనులలో ఒక టెండర్ ను కైవసం చేసుకోవడం ద్వారా కేసీఆర్ కుటుంభం భారీ అవినీతికి స్కెచ్ వేస్తున్నట్లు ఆరోపణలు చేశారు. ఈ దోపిడీని అరికట్టామని కోరారు. ఈ ప్రకటనలు చూస్తుంటే వారిద్దరూ బీజేపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది. చాలా సంవత్సరాలుగా తెలంగాణలోని కాంగ్రెస్ నాయకత్వం అధికార పార్టీతో కుమ్మక్కై పార్టీని ఎదగనీయడం లేదని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తమకు పిసిసి నాయకత్వం అప్పగిస్తే రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తామని చెబుతున్నారు. `తెలుగు…