నేతి మహేశ్వరరావు,అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ నాయకుడు ఎప్పుడు ఇప్పటి అవసరాలతో పాటు భవిష్యత్తు అవసరాలకు ఏమికావాలి? భవిష్యత్తు తరాలు ఎదుర్కోబోయే సమస్యలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రణాళిక ఉండాలి. ఒక రాష్ట్ర బడ్జెట్ ప్రిపరేషన్ ముందు రాష్ట్ర సమస్యలేంటి రాష్ట్ర భవిష్యత్తు ఏమి చర్యలు తీసుకుంటే భవిష్యత్తు ఉంటుంది అన్నది ఆలోచించాల్సిన అంశం. ఒక చిన్న కుటుంబం కూడా తమకు వచ్చే ఆదాయం రోజువారీ ఖర్చులు భవిష్యత్తు అవసరాల నిమిత్తం పెట్టే ఖర్చులు వంటి ప్రణాళిక వేసుకుంటుంది. ఒక చదువు లేని పాతతరం మన అమ్మ వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అలాంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆలోచించాలి? అంత ఆలోచించే బడ్జెట్ తయారు చేశారా? రాష్ట్ర ఆదాయం 2022-23 కి అంచనా రూ 1,91,225 కోట్లు. అలాగే మూలధన వసూళ్లు రూ 65,031 కోట్లు అంటే. మొత్తంగా రాష్ట్ర బడ్జెట్ రెవిన్యూ లోటు రూ 17,036 కోట్లు. ఆర్థిక లోటు రూ 48,724 కోట్లుప్రాధాన్య రంగాలు…
Author: Editor's Desk, Tattva News
అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గెలుపు 2024 ఎన్నికలలో తిరిగి గెలుపు ప్రజల సానుకూలతను వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొనడాన్ని తొందరపాటు అంటూ ప్రతిపక్ష నేతలు చురకలు వేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఫలితాలతో సంబంధం లేకుండా 2024లో పోరుకు సిద్దమే అంటూ మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ కిషోర్, సంజయ్ రౌత్ వంటి వారు ప్రకటనలు చేశారు. అయితే, ఒక విధంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బిజెపికి వ్యతిరేకంగా ఎవ్వరికీ వారుగా సొంతంగా కూటమి ఏర్పాటు చేసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలకు గండి పడినట్లయింది. ఇప్పటి వరకు అటువంటి ప్రయత్నాలు చేస్తున్న మమతా బెనర్జీ, కేసీర్ వంటి నేతలలో మార్పు కనిపిస్తున్నది. ఈ ఫలితాలపై ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదు. మమతా బనెర్జీ మాత్రం కాంగ్రెస్ కలసి వస్తే, ఆ పార్టీతో కలసి 2024లో పోరాడటానికి సిద్దమే అని ప్రకటించారు. గత ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో వరుసగా మూడోసారి గెలుపొందిన తర్వాత ఆమె కాంగ్రెస్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఈ…
ఉత్తర ప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) ఒక సీట్ కు పరిమితం కావడం, ఓట్ల శాతం కూడా గణనీయంగా పడిపోవడం రాజకీయంగా ఆమెను వ్యతిరేకించే వారికి సహితం విస్మయం కలిగిస్తున్నది. ఎన్నికల ముందు నుండీ గతంలో వలే ఆమె రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. దానితో భారత రాజకీయాలలో మాయావతి (66) శకంతో పాటు దళిత్ రాజకీయాలకు కాలం చెల్లిందా? అనే ప్రశ్న తెలత్తుతోంది. భారత రాజకీయ అజెండాలో దళిత్ రాజకీయాలకు కీలక స్థానం ఏర్పర్చిన ఘనత బిఎస్‌పి వ్యవస్థాపకులు కన్షిరామ్, ఆయన వారసురాలిగా మాయావతికి దక్కుతుంది. ఉత్తర ప్రదేశ్ లో సొంతంగా పార్టీని అధికారంవైపు నడిపించి, ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడం ఒక విధంగా చరిత్ర సృష్టించడమే. దేశంలో ముఖ్యమంత్రి పదవిలో దళితులు మరెవ్వరు అంత సుదీర్ఘకాలం లేరు. అయితే ఇప్పుడు మాయావతి రాజకీయంగా అసంబద్ధం అయ్యారని, సాంప్రదాయ దళిత రాజకీయాలు అంతరించిపోయే అంచున ఉన్నాయని ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలకు హాజరై,…
డ్రగ్స్ కేసు విచారణను తెలంగాణ ప్రభుత్వం అటకెక్కించడం పట్ల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, అందుకనే దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆయన ఆరోపించారు. డ్రగ్స్ కేసు విషయంలో ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ఈడీ జాయింట్ డైరెక్టర్‌ను కలిసి హైకోర్టు తీర్పు కాపీ, వినతిపత్రం అందజేస్తూ డ్రగ్స్ కేసును ఈడీ అధికారులు విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వారి విచారణను వ్యతిరేకిస్తోందని, ప్రభుత్వం సహకరించడం లేదని ఈడీ స్పష్టంగా చెబుతోందని ఆరోపించారు. ” డ్రగ్స్ సరఫరా చేసేవాళ్లు, వాడిన వాళ్లు, అమ్మే వాళ్లు.. ఇలా 3 రకాల నేరస్థులు ఉన్నారు. గుజరాత్, ముంబై పోర్టుల్లో 100 క్వింటాళ్ల డ్రగ్స్ పట్టుపడింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో స్వతంత్రంగా విచారణ చేయాలని కోరుతున్నా” అని తెలిపారు. మీరు సేకరించిన ఆధారాలు, సాక్షాలు వెంటనే ఈడీకి అందజేసి…
ఈ నెల 14న జరుగనున్న పార్టీ ఆవిర్భావ సదస్సు సందర్భంగా జిల్లాలో నిర్వహిస్తున్న సమావేశాలలో జనసేన పార్టీలో భారీగా చేరుతున్నారు. పలు పార్టీల నుంచి స్థానిక నేతలు జనసేన కండువా కప్పుకొంటున్నారు. తాజాగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ- ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో పలువురు నాయకులు చేరారు. తూర్పు గోదావరి జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం డైరెక్టర్, రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్లు అల్లంకి నాగేశ్వరావు, కోటంశెట్టి సత్యనారాయణ, సలాది సుబ్రమణ్యం, రెడీమేడ్స్ వర్తక సంఘం వైస్ ప్రెసిడెంట్ వడగన వీరభద్రరావు, బోగిరెడ్డి బాబ్జి, సప్పా శ్రీనివాసరావులతో పాటు- మరికొందరు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరంతా జనసేన కండువా కప్పుకొన్నారు. వీరందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన మనోహర్ అంతా కలసికట్టు-గా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ…
భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రొసీడింగ్స్ ఉత్తర్వులు, వీడియో రికార్డులు సమర్పించేందుకు ఆదేశాలు ఇవ్వాలన్న పిటీషనర్ల అభ్యర్థనలను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అయితే పూర్తి స్థాయి విచారణకు శాసనసభ కార్యదర్శికి మరోసారి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. బిజెపి ఎమ్మెల్యేల సప్పెన్షన్‌పై విచారణ మరో నాలుగు వారాలకు వాయిదా పడింది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి తమను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ బిజెపి ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, రాజాసింగ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తమపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసి అసెంబ్లీ సమావేశాలకు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి విదితమే. సస్పెన్షన్ తీర్మానంతో పాటు సమావేశాల వీడియో రికార్డింగ్‌లను తెప్పించాలని ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలివ్వాలని బిజెపి ఎమ్మెల్యేలు కోరారు. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు (ఈనెల 7)న ఆర్థిక మంత్రి హరీష్‌రావు…
ఈ నెల 14న గుంటూరు జిల్లాలో జరుగనున్న జనసేన ఆవిర్భావ సదస్సు ఏపీ రాజకీయాలలో కీలకంగా మారే అవకాశం కనిపిస్తున్నది. ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సదస్సులో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలకమైన ప్రకటన చేయగలరని ప్రచారం జరుగుతున్నది. ఒక విధమైన రాజకీయ స్తబ్దత నెలకొన్న ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన రాజకీయ శక్తిగా జనసేన ఎదిగే అవకాశాలున్నట్లు పలువురు భావిస్తున్నారు. అధికారపక్షం ఒకవంక అంతర్గత కుమ్ములాటలు, పరిపాలనాపరమైన వైఫల్యాలు, ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తితో సతమతమవుతూ ఉండగా, అధికార పక్షంను ధీటుగా ఎదుర్కోగల సత్తా ప్రధాన ప్రతిపక్షం టిడిపిలో కనిపించడం లేదు. ఈ సందర్భంగా వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయ శక్తుల పునరేకీకరణలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర వహించే అవకాశం ఉండే సంకేతాలు వెలువడుతున్నాయి. సంస్థాగతంగా జనసేన బలమైన ప్రాతిపదికను ఏర్పర్చుకోలేకపోతున్నా, ప్రజల మద్దతు కూడా దీసుకోవడంలో మాత్రం వెనుకబడి లేదు. నేడు రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లిన అత్యంత ప్రజాకర్షణ గల నేతగా పవన్…
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు ప్రతిబింబమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు.ఈ సారి హోలీ మార్చి 10నే మొదలైందన్న మోదీ బిజెపి శ్రేణులకు అభినందనలు తెలిపారు. సుపరిపాలన వల్లే ఈ విజయాలు వచ్చాయని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే గురువారం సాయంత్రం ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవాలలో పాల్గొని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బిజెపి విజయంలో మహిళలు, యువతది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ‘37 ఏళ్ల తర్వాత యుపిలో ఒక పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. యుపి ప్రజలు 2014 నుంచి అభివృద్ధికే ఓటేశారు. 2017 యుపి ఫలితాలు 2019 ఫలితాలను చూపాయి. 2022 ఫలితాలు 2024 ఎన్నికలను చూపాయి’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. యుపి ప్రజలు దేశ విచ్ఛిన్న శక్తులను దూరం పెట్టారని చెబుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న చోట ప్రజాక్షేమమే ధ్యేయంగా పాలన ఉందని చెప్పారు. ఈ ఎన్నికలు…
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంభంలో విబేధాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపిపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సోదరి వై ఎస్ షర్మిల పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉంటూ, గత ఏడాది తెలంగాణలో ఓ ప్రాంతీయ పార్టీని అన్న అభిష్టంకు వ్యతిరేకంగా ప్రారంభించి, హైదరాబాద్ కే పరిమితమవుతూ వస్తున్నారు. అయితే కొద్దీ రోజులుగా ఆమె భర్త, ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ లో తిరుగుతూ ఉండడం అధికార పక్షంలో కలకలం రేపుతున్నది. ఏపీలో కూడా మీరు పార్టీ ప్రారంభిస్తారా అని అడిగితే `ఎందుకు ప్రారంభింప కూడదు” అంటూ షర్మిల కొద్దిరోజుల క్రితం సమాధానం ఇవ్వడం గమనార్హం. స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడిగా పేరొందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను అనిల్ కుమార్ రాజమండ్రిలో `మర్యాదపూర్వకం’గా కలవడం, విజయవాడలో వివిధ వర్గాలతో సమాలోచనలు జరపడం గమనిస్తే రాజకీయ…
పంజాబ్ లో అందరి అంచనాలను తలదన్నుతూ ఖనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు పూర్తి జోష్ లో ఉంది. ఢిల్లీ తర్వాత రెండో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఇతర రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నాలు ఇప్పటివరకు ఫలించలేదు. పంజాబ్ విజయంతో నెలకొన్న ఉత్సాహంతో ఈ సంవత్సరం చివరిలో ఎన్నికలు జరుగనున్న గుజరాత్ వైపు ఆ పార్టీ ఇప్పుడు దృష్టి సారింపనున్నది. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం రాబోతున్నట్లు ముందుగానే పలు సర్వేలు వెల్లడి చేయడంతో ఇక దేశంలో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ ఆ పార్టీ నాయకులు ప్రచారం ప్రారంభించారు. అంతేకాదు, పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను కాబోయే ప్రధానిగా కూడా పేర్కొంటున్నారు. పంజాబ్ ఎన్నికల విజయ ఉత్సవాలను వచ్చే నెలలో గుజరాత్ లో పెద్ద ఎత్తున జరపడం ద్వారా అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించే సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఆప్ బరిలోకి…