రెండు వారాలుగా రష్యా ముప్పేట దాడి జరపడానికి ప్రధాన కారణమైన `నాటో సభ్యత్వం’ అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ చేతులెత్తేశారు. ఇంతకాలం తనకు రక్షణగా ఉంటామని భరోసా ఇస్తూ వచ్చిన వారెవ్వరూ యుద్ధం సమయంలో ఆదుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఒక విధమైన నిర్వేద ధోరణి ప్రదర్శిస్తున్నారు. తామిక నాటోలో తాము చేరబోమని, తమకు సభ్యత్వం వద్దని తేల్చి చెప్పారు. పైగా, రష్యాతో ఘర్షణ విషయంలో నాటో భయపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుక్కునే దేశంగా ఉక్రెయిన్ ఎంతమాత్రమూ ఉండబోదని స్పష్టం చేసారు. యుద్ధం పేరుతో తమ దేశ పౌరులు చనిపోవడాన్ని చూడలేక పోతున్నానని చెబుతూ రష్యా కోరుకున్న విధంగా శాంతి చర్చలకు సిద్దమే అంటూ వెల్లడించాయిరు. అంతేకాక, రష్యా అనుకూల లుహాన్‌స్క్, డెనెట్‌స్క్ రీజియన్ల విషయంలో చర్చల ద్వారా రాజీకి వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అమెరికాకు చెందిన ఏబీసీ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన వాఖ్యలు చేశారు. ‘చర్చలకు రెడీ. కానీ మేం సరెండర్…
Author: Editor's Desk, Tattva News
తీర రాష్ట్రమైన గోవాలో మరోసారి హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ సూచిస్తుండటంతో కూటమి సర్దుబాట్లలో ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లు ఓట్ల లెక్కింపుకు ముందు నుండే ప్రయత్నాలు ప్రారంభించాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారే చిన్న పార్టీలు, స్వతంత్రులతో మంతనాలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో తృణమూల్ మిత్రపక్షమైన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి) కీలకంగా మారింది. ఆ పార్టీ నేత సుదిన్ ధవలికర్ ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే బిజెపి తమను సంప్రదించినట్లు ఎంజిపి తెలిపింది. అయితే ముఖ్యమంత్రి సావంత్‌కి మద్దతు ఇవ్వబోమని ఎంజిపి గతంలోనే ఈ పార్టీ స్పష్టం చేసింది. గోవాలో 22 సీట్ల కంటే ఎక్కువే సాధిస్తామని, ఒకవేళ మెజార్టీ సాధించలేకపోతే.. స్వతంత్రులు, ఎంజిపి పార్టీ మద్దతు తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని సావంత్ వెల్లడించారు. ఇప్పటికే బిజెపి అధిష్టానం ఆ పార్టీతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. గతంలో కూడా ఎంజిపికి చెందిన ముగ్గురు ఎమ్యెల్యేల మద్దతుతో…
వైసిపిలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మరో రెండేళ్ల తర్వాత జరుగవలసిన అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుండే ప్రచార సన్నాహాలలో మునిగేవిధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. మంత్రులు, ఎమ్యెల్యేలు వచ్చే మే నుండి ఎక్కువగా జనం మధ్యనే ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో విడిగా సమావేశమైన ఆయన ఈ విషయమై సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు. మే నెల నుంచి అందరం రోడ్ల మీదకు రావాలని.. ఇంటింటికీ వెళ్లి ప్రజలందరికీ చేరువ కావాలని మంత్రులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. వీలైనంత త్వరలోనే వైఎస్సార్‌ఎల్పీ సమావేశం నిర్వహించి, ఎమ్మెల్యేలకు భవిష్యత్ కార్యాచరణ వివరిస్తానని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు.ప్రజల వద్దకు వెళ్లే ముందు వారికి సేవలందిస్తున్న వాలంటీర్లకు సన్మాన కార్యక్రమాలను ఏప్రిల్‌లో నిర్వహించాలని సిఎం జగన్ చెప్పినట్లు సమాచారం. మంత్రులంతా వారానికి 3 రోజులకు తగ్గకుండా పార్టీకి సమయం కేటాయించాలని సిఎం స్పష్టం చేశారు. ‘ వచ్చే రెండేళ్లలో ఏమేం చేద్దాం…
జైలు నుండి విడుదలై వచ్చినప్పటి నుండి అన్నాడీఎంకేపై తిరిగి పూర్తి ఆధిపత్యం సాధించడం ద్వారా తమిళనాడు రాజకీయాలలో మరోసారి చక్రం తిప్పాలని ఆశపడిన మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళకు అప్పట్లో సాధ్యం కాలేదు. ఆమె జైలుకు వెళ్లిన తర్వాత పార్టీలో కీలక నేతలుగా మారిన నాటి ముఖ్యమంత్రి పళనిసామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఒకటిగా ఉంటూ, ఆమె రాకను తీవ్రంగా అడ్డుకున్నారు. దానితో ఆమె రాజకీయంగా తెరమరుగు కావలసి వచ్చింది. అయితే గత ఏడాది ఎన్నికలలో అధికారం కోల్పోయినప్పటి నుండి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. పైగా, వరుసగా ఎన్నికలలో ఓటమి చెందుతూ రావడంతో ఈ అగాధం మరింతగా పెరుగుతున్నది. దానితో వారి మధ్య మరింతగా చిచ్చు రాజేయడం ద్వారా, పార్టీని హస్తగతం చేసుకొనే ఎత్తుగడ ఇప్పుడు శశికళ వేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఆమెను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని డిమాండ్లు పార్టీ వర్గాల నుండి తెరపైకి వస్తుండడం కూడా వారి మధ్య అగాధం మరింతగా పెరగడానికి దారితీస్తుంది. పన్నీర్‌సెల్వంను…
”గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం మంచిది కాదని చెప్పాం. 20 ఏళ్ల అనుభవం ఉన్న శాసనసభ్యుడిగా స్పకర్‌కు పదేపదే గుర్తు చేశాను. మా సీట్లో ఉండి నిరసన తెలిపితే సస్పెండ్ చేశారు. ఈ దుర్మార్గమైన పద్ధతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కాకూడదు.” అని హుజురాబాద్ బీజేపీకి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్‌రావు.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీలేదని చేసిన ఆరోపణలపై ఈటెల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలు కట్టే పన్నుల మీద ప్రభుత్వాలు నడుస్తాయి తప్పితే.. కేంద్రప్రభుత్వం నిధులతో కాదనే విషయాన్ని హరీష్‌రావు గుర్తించుకోవాలని హితవు చెప్పారు. ”బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవి. ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు 20 రోజులకుపైగా జరిగేవి. తెలంగాణ ప్రభుత్వం 7 రోజులు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. ఇది ప్రజలు గమనించాల్సిన విషయం” అని తెలిపారు. కిరాయి భవనాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి…
ప్రపంచవ్యాప్తంగా మహిళలకు అంతర్జాతీయ మహిళాదినోత్సవం వేడుకగా సాగిన దశలో ఉక్రెయిన్‌లో సైన్యంలోని మహిళలు భుజాన తుపాకులతో వీరోచిత పోరు సంకల్ప బలంతో ముందుకు సాగారు. రష్యా అతిక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ దళాలు సాగిస్తున్న పోరులో ఈ అసాధారణ మహిళల బృందం పోరులో తాము ముందుండి సాగుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఈ మహిళా సైనికుల స్ఫూర్తి వారి పోరాట పటిమ అంతర్జాతీయ స్థాయిలో అందరి మన్ననలు పొందింది. మహిళా సైనికుల ఫోటోలు ఆన్‌లైన్‌లో వెలువడ్డాయి. వారు సైనిక దుస్తులలో చేతులలో రైఫిల్స్‌తో కన్పించారు. శత్రువును తుదముట్టించే పోరులో తాము తమ వంతు పాత్రను ఎవరికి తీసిపోకుండా నిర్వరిస్తామని ఈ సందర్భంగా ఓ సైనికురాలు ధైర్యంగా తెలిపారు. తమ నేల ఇక్కడి ప్రజలను కాపాడుకునేందుకు తాము మగవారిని సైన్యంలోకి పంపించామని, వీరితో పాటు తాము కూడా ముందుకు వెళ్లుతున్నామని తెలిపారు. తమ పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. ముందు వారి…
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం 13వ రోజుకు చేరింది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఖార్కివ్‌లో నిన్న రష్యా మేజర్ జనరల్ విటాలీ గెరసిమోవ్‌ను హతమార్చినట్టు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. రష్యా దళాల ఆధిపత్యంలోకి వెళ్లిన కీవ్ నగర సమీపంలో ఉక్రెయిన్ దళాలు రష్యా సేనలపై విరుచుకుపడ్డాయి. రష్యా దళాలపై ఊహించని రీతిలో ఉక్రెయిన్ దళాలు ప్రతిదాడులకు దిగాయి. ఎదురు కాల్పులు చూసి ఉలిక్కిపడ్డ రష్యా దళాలు తేరుకునేలోపే భారీ మూల్యం చెల్లించుకున్నాయి. మేజర్ జనరల్ విటాలీ గెరాసిమోవ్ రష్యాలోని సెంట్రల్ మిలిటరీ డిస్ట్రిక్ట్ 41వ సైన్యానికి మొదటి డిప్యూటీ కమాండర్. రెండో చెచెన్ యుద్ధం, సిరియాలో జరిగిన రష్యన్ సైనిక కార్యకలాపాలలో విటాలీ కీలక పాత్ర పోషించారని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. అంతేకాదు, 2014లో క్రిమియాను తిరిగి సొంతం చేసుకున్నందుకు ఆయనకు మెడల్ కూడా లభించింది. కాగా, ఈ యుద్ధంలో రష్యాకు చెందిన చాలామంది రష్యన్…
మాజీ మంత్రి, కేసీఆర్ పై తిరుగుబాటు జరిపి బిజెపి అభ్యర్థిగా ఉపఎన్నికల్లో గెలుపొందిన ఈటల రాజేందర్‌ను శాసనసభలో చూడాల్సి వస్తుంది కాబట్టి తొలిరోజే సభ ప్రారంభమైన పది నిమిషాలకే సస్పెండ్ చేశారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రగతి భవన్‌లో రాసిన సస్పెన్షన్ తీర్మానాన్ని బట్టి పథకం ప్రకారం ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్యబద్డంగా జరగట్లేదని పేర్కొంటూ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పాలకులు వ్యవహరిస్తున్నపుడు ప్రశ్నించే అధికారం తమ పార్టీ శాసనసభ్యులకు ఉంటుందని స్పష్టం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో ఏ రాష్ట్రం కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి ఈవిధంగా గవర్నర్‌ను అవమానపరచలేదని చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం దిగజారుడు, దివాలాకోరుతనమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపితే వారిని సస్పెండ్ చేశారని మండిపడుతూ పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఉభయ సభల్లో ఆందోళన చేసినా కేంద్ర…
రష్యా అధ్యక్షులు పుతిన్‌కు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కావల్సి ఉందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రపంచ నేతలకు పిలును నిచ్చారు. ఈ దిశలో ముందుకు సాగేందుకు కలిసిరావాలని వారిని ఆహ్వానించారు. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలోనే బ్రిటన్ ప్రధాని సోమవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ ర్యూటేలకు లండన్‌లోని అధికారిక నివాసం డౌనింగ్ స్ట్రీట్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ త్రయం బ్రిటన్ సాయుధ దళాల సభ్యులను కలుసుకునేందుకు ఇక్కడి రాయల్ ఎయిర్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్) స్థావరాన్ని సందర్శించారు. రష్యా అతిక్రమణ ధోరణి, అరాచాకాలను ఎదుర్కొనే దిశలో ప్రపంచవ్యాప్త స్పందన అవసరం అని ఈ దిశలో కదలిక ఆచరణాత్మకం కావల్సి ఉందని, ముగ్గురు నేతల భేటీ ఈ దిశలో ఆరంభ ఘట్టం అని డౌనింగ్ స్ట్రీట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పటి ప్రయత్నాలతో ఇక ఉక్రెయిన్‌కు ప్రపంచ దేశాల సాయం మరింత వేగవంతం అవుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్…
మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అక్రమ రవాణా బాధిత మహిళలు, సెక్స్ వర్కర్ల సంక్షేమం, పునరావాసం, ప్రత్యామ్నాయ జీవనోపాదాల కల్పనలో పూర్తిగా విఫలమైందని, పైగా వీరిని అసలు మహిళలుగా కూడా చూడటం లేదని విముక్తి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి హెహరున్నీసా ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణా బాధిత మహిళలు, సెక్స్ వర్కర్ల రాష్ట్ర సమాఖ్య ‘విముక్తి’ , హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం విజయవాడలోనిరాజీవ్ నగర్, జి.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్‌లో అక్రమ రవాణా బాధితులు, సెక్స్ వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీమతి మెహరున్నీసా మాట్లాడుతూ రాష్ట్రంలో 2016 నుంచి 2020 వరకు 1669 మంది మహిళలు ఇండియన్ పీనల్‌కోడ్ సెక్షన్ల క్రింద, 550 మంది అక్రమ రవాణా నిరోధక చట్టం (ఐ.టి.పి.ఎ) క్రింద కాపాడటం జరిగిందని తెలిపారు. అయితే, వీరిలో కనీసం 10 శాతం బాధిత…