పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో అభివృద్దిని గాలికొదలి ప్రజల్ని కులం, మతం, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటూన్నారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఐటీడీపీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాలన చేతకానివాడే కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సమర్ధ నాయకుడు అభివృద్ది చేస్తాడని, అయితే వైసీపీ వాళ్లు తనకు కులం అంటగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. . ఉమ్మడి రాష్ట్రంలో హైదాబాద్ ఐటి నగరంగా అభివృద్ది చేశా. అక్కడ తన కులం వాళ్లున్నారని అభివృద్ది చేశానా? అని ప్రశ్నించారు. తనకు కులం లేదు, మతం లేదని అంటూ తన కులం, మతం తెలుగు జాతే. తెలుగు వారంతా తన కుటుంబ సభ్యులే అని ప్రశ్నించారు. తెలుగు జాతిని ప్రపంచలో నెం.1 గా చేయాలన్నదే తన తపన అని తెలిపారు. భవిష్యత్తు టెక్నాలజీదే అన్న భావనతో…
Author: Editor's Desk, Tattva News
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును కేంద్రమే భరిస్తుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సందర్భంగా మాట్లాడిన షెకావత్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలోనే ఈ ప్రకటన చేశారు. ఏపీకి జీవనాడిగా పోలవరాన్ని అభివర్ణించిన షెకావత్ జాతీయ హోదా కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని ప్రకటించారు. రెండు రోజుల ఏపీ పర్యటనకు వచ్చిన షెకావత్ శుక్రవారం ఉదయం జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు నిర్వాసిత కాలనీలను కూడా ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షెకావత్.. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, సవాళ్లను పరిశీలించానని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఒక్కొక్క రాయికి అయ్యే ఖర్చును చెప్పిన ప్రకారమే కేంద్రం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని తెలిపారు. ప్రాజెక్టుకు సవరించిన అంచనాల విషయంలో రాష్ట్రం…
ప్రజాప్రతినిధులు ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండటం ద్వారా చట్టసభల వంటి ప్రతిష్టాత్మక సంస్థల గౌరవాన్ని, పవిత్రను కాపాడాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని చెప్పారు. గోవా రాజ్ భవన్ ఆవరణలో అత్యాధునిక హంగులతో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరాన్ని (దర్బార్ హాల్ ను) ఉపరాష్ట్రపతి ప్రారంభిస్తూ చట్టసభల్లో చోటు చేసుకుంటున్న అంతరాయాలు, ఇతర పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. విమర్శలు చేసేందుకు ప్రజాప్రతినిధులకు అన్ని రకాల హక్కులు ఉన్నాయన్న ఆయన, అదే సమయంలో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యలు మానుకోవాలని హితవు చెప్పారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధమైన సంస్థలను గౌరవించి, వాటి గౌరవాన్ని కాపాడుకోవాలని స్పష్టం చేశారు. అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉందన్న ఉపరాష్ట్రపతి, శాంతియుతమైన ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న ఎవరికైనా అధికారాన్ని చేపట్టే హక్కు ఉంటుందని, అదే సమయంలో…
ఇప్పుడు దేశానికి కొత్త దిశానిర్దేశం కావాలనిరు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిలుపిచ్చారు. రాంచీలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సరైన దిశలో నడవడం లేదు.. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని స్పష్టం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశం సరిగ్గా అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు. భారత్‌ను సరైన దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశాన్ని బాగు చేసేందుకు ఏం చేయాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయని చెబుతూ త్వరలో అందరం కలుస్తామని వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి ఏ ఫ్రంట్ లేదని, ఉంటే చెప్తామని తెలిపారు. .భవిష్యత్తులో ఏమవుతుందో త్వరలో తెలుస్తుందని చెప్పారు. కొత్త దిశానిర్దేశం కోసం పలువురి నేతల్ని కలవడం జరుగుతోందని చెబుతూ కొత్త పంథాలో.. కొత్త విధానంలో దేశాన్ని నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధముందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి శిబూ సోరెన్…
రాజధానిని మారుస్తూ శాసనం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని, పార్లమెంట్ మాత్రమే చేయాలని స్పష్టం చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కొంత ఇరకాటంలో పడినా, మూడు రాజధానుల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. అందుకనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ను ఆశ్రయించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. హైకోర్టు తీర్పు అమలులో రాష్ట్ర ప్రభుత్వంకు ముఖ్యంగా నిధుల సమస్య ఎదురు కానున్నది. రైతులకు ఇవ్వవలసిన ప్లాట్ లను అభివృద్ధి చేసి మూడు నెలల్లో ఇవ్వాలని, ఆరు నెలల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం హైకోర్టు నిర్మాణం జరగాలని హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే ఇబ్బందు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టే పరిస్థితుల్లో లేదు. మరోవంక, హైకోర్టు తీర్పును టిడిపికి `నైతిక విజయం’గా ప్రజలకు సందేశం వెడుతుందని వైసిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. తద్వారా వచ్చే ఎన్నికలలో తాము మూల్యం చెల్లింపవలసి ఉంటుందని భావిస్తున్నారు. అందుకనే ఎన్నికల వరకు…
యూపీ ఎన్నికల చివరి దశ ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీని రంగంలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది. మొదటి ఐదు దశల్లో చాలా వరకు గైర్హాజరైన ప్రధాని మోదీ, ఇప్పుడు పూర్వాంచల్‌లో పార్టీ గెలుపు కోసం తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్రాన్ని లోక్‌సభలో నిలబెట్టుకోవాలనే పట్టుదలను ఇది చూపుతోందా? లేక రాష్ట్ర నాయకత్వానికి ఏదైనా రహస్య సందేశం ఉందా? 2019 లోక్‌సభ ఎన్నికలలో, మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిని తన నామినేషన్ దాఖలు చేయడానికి మాత్రమే సందర్శించి రోడ్‌షో నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఆయన తిరిగి రాలేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత, వారణాసి నుండి రెండవసారి ఎంపీగా ఎన్నికైన తర్వాత, నగర ప్రజలు తన ప్రచారాన్ని నడిపించారని, ఫలితాల వరకు దూరంగా ఉండాలని తనను ప్రత్యేకంగా కోరారని ప్రధాని చెప్పారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఆయన మూడు రోజులపాటు అక్కడ మకాం వేసి విస్తృతంగా…
ప్రముఖ భారత సామజిక ఉద్యమకారులు జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావిత్రి బాయ్ ఫూలేలపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ చేసిన వివాదాస్పద వాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఫూలే దంపతులు చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారని అంటూ `బాల్య వివాహం’గా అభివర్ణిస్తూ ఆయన చేసిన వాఖ్యల పట్ల తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఓ కార్యక్రమంలో కోషియారీ మాట్లాడుతూ, పదేళ్ళ వయసున్న సావిత్రి బాయ్‌ని 13 ఏళ్ల వయసులో జ్యోతిబా ఫూలే పెళ్లి చేసుకున్నారని, ఆ చిన్నతనంలో వారు ఏం చేయగలరని, పెళ్లి జరుగుతున్నపుడు వారు ఏం ఆలోచించగలరని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆయనను తక్షణమే గవర్నర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. ఆ రోజుల్లో బాల్యంలోనే పెళ్లి చేసుకోవడం ఆచారమని, ఇటువంటి అసహ్యకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేయడానికి ఫూలేను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తున్నారు. …
మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరావు తాను తలపెట్టిన బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు గురించి వివిధ పార్టీల నేతలతో సమాలోచనలు జరుపుతారని కధనాలు వెలువడినప్పటికీ చెప్పుకోదగిన నేతలు ఎవ్వరిని కలవలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కూడా సమావేశం జరగలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి వెళ్లి అఖిలేష్ యాదవ్ కు మద్దతుగా ప్రచారంలో మమతా బెనర్జీ, కేజ్రీవాల్ తదితర నేతలతో పాల్గొంటారని కధనాలు వచ్చినా ఆయన వారణాసి వెళ్లనే లేదు. అయితే ఆసక్తి కరంగా గురువారం రాజ్యసభ ఎంపి, బిజెపి నేత సుబ్రమణ్యన్ స్వామి, సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేష్ తికాయత్, న్యూఢిల్లీలోని క్యాంప్ ఆఫీసులో భేటీ అయ్యారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని కెసిఆర్ విస్తృత ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ భేటీ జరగడం చర్చనీయాంశమైంది. రాజ్యసభ సభ్యతం మరొకొన్ని నెలలో ముగియనున్న స్వామిని తిరిగి రాజ్యసభకు…
కాంగ్రెస్ పార్టీ గతంతో పోలిస్తే `సాఫ్ట్ హిందుత్వ’తో సరసాలాడుతూ బిజెపిపై గట్టిగా పోరాడలేక పోతున్నదని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. అందుకనే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించే పరిస్థితి లేకపోయినదని విచారం వ్యక్తం చేశారు. ఎర్నాకుళంలో నాలుగు రోజుల పాటు జరుగుతున్న పార్టీ రాష్ట్ర సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏచూరి, హిందుత్వ శక్తులు విసురుతున్న సవాల్‌ను ప్రస్తుతం వామపక్షాలు మాత్రమే సైద్ధాంతికంగా, రాజకీయంగా, సంస్థాగతంగా ఎదుర్కోగలవని స్పష్టం చేశారు. “లౌకికవాదానికి దృఢంగా కట్టుబడి ఉండటం ద్వారా మాత్రమే ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిల హిందుత్వ ఎజెండాను ఓడించవచ్చు. మృదు హిందుత్వంతో ఎంత సరసాలాడినా అది హిందుత్వ శక్తుల అజెండాలోకి మాత్రమే ఫీలవుతుంది. కాంగ్రెస్ అదే చేస్తోంది” అని చెప్పారు. “ఆ కోణంలో, గతంతో పోలిస్తే నేడు కాంగ్రెస్ గణనీయంగా బలహీనపడింది. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లలో చాలా మంది దీనిని పెద్ద ముప్పుగా చూడటం లేదు. ప్రధానంగా ఏ సమయంలోనైనా, దాని నాయకులలో ఎవరైనా బీజేపీలో…
ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ 100 రోజుల పాటు మోటర్ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. యూకేలోని లండన్ నగరం నుంచి భారత్ కు బైక్ రైడ్ చేపట్టనున్నారు. ఒంటరిగానే ఆయన ఈ యాత్రను చేయనున్నారు. శివరాత్రి రోజున ఈశా ఫౌండషన్ లో జరిగిన మహోత్సవంలో వాసుదేవ్ ఈ విషయాన్ని తెలిపారు. నేలతల్లి కోసం ఖండాంతర మోటారు సైకిల్ యాత్ర చేయున్నానని తెలిపారు. భూసారాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేయటానికే ఈ బైక్ యాత్ర అని చెప్పారు. ఈ నెల 21న లండన్ నుంచి భారత్ వరకు 100 రోజుల పాటు బైక్ పై తాను ఒక్కడినే యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. తన ఈ మోటార్ సైకిల్ యాత్రలో భాగంగా పర్యటించిన ప్రతి దేశంలో నేల భూసారాన్ని పరిరక్షించేందుకు విధానపరమైన చర్యలు తీసుకోవాలంటూ అక్కడి పాలకులను కోరతామని సద్గురు తెలిపారు. 100 రోజుల యాత్రలో భాగంగా 27 దేశాల పరిధిలో 30,000 కిలోమీటర్ల…