Author: Editor's Desk, Tattva News

ఉత్తర ప్రదేశ్ లో చెప్పుకోదగిన బలం లేకపోయినా సుమారు 100 సీట్లలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో వెనుక ఉంది నడిపిస్తున్నది బిజెపి అని, ముస్లిం ఓట్లను చీల్చడం కోసం ఈ ఎత్తుగడ వేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీహార్, పశ్చిమ బెంగాల్ లో కూడా ఆ విధంగానే ఆరోపించగా, బీహార్ లో ఆర్ జె డి అధికారం చేజిక్కించుకోలేక పోవడంలో ఒవైసి కీలక పాత్ర వహించారు. అయితే బెంగాల్ లో ఆయన ఎత్తుగడలు సాగలేదు.  ఉత్తర ప్రదేశ్ లో ఒవైసి పాత్ర ఏమైనా, ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా గట్టి గట్టి పోటీదారునిగా ఉంటూ వచ్చిన బీఎస్‌పీ    అధినేత్రి మాయావతి ఈ పర్యాయం ఒక విధంగా మౌనంగా ఉండడం, మరోవంక ఎట్టి పరిస్థితులలో  సమాజవాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని ధీమా వ్యక్తం చేస్తుండడం చూస్తుంటే ఆమె వ్యూహాత్మకంగా బిజెపి తిరిగి గెలుపొందడానికి సహకరిస్తున్నారని అనుమానాలు పలువురికి కలుగుతున్నాయి.  ఈ మధ్య కేంద్ర హోమ్…

Read More

బిజెపి తీవ్రమైన ఫలితాలు ఎదుర్కొంటున్నట్లు భావిస్తున్న కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు, దాని సైద్ధాంతిక మార్గదర్శిగా భావించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్‌ఎస్‌ఎస్ ) బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాల పట్ల బహిరంగంగా తన అభిప్రాయం వ్యక్తం చేసే ప్రయత్నం ఆసక్తి కలిగిస్తున్నది. ఇప్పటి వరకు ఎక్కువగా `స్నేహపూర్వక సలహాలు’ ఇవ్వడానికి పరిమితం అవుతుండేవారు. ఆర్‌ఎస్‌ఎస్ అత్యున్నత విధాన నిర్ణయ వేదిక, అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) బైఠక్ అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించే మరుసటి రోజు నుండి అహ్మదాబాద్‌లో మార్చి 11-13 మధ్య జరుగనున్నాయి. ఈ వార్షిక సమావేశానికి ముందు, మహిళల వివాహ వయస్సుపై మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టంపై ఆర్ ఎస్ ఎస్ తన బేదాభిప్రాయంను వ్యక్తం చేయడం గమనార్హం. ఇటువంటి సమస్యలను సమాజం నిర్ణయానికి వదిలేయాలని పేర్కొంటూ, ప్రభుత్వ జోక్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. అదేవిధంగా, కర్నాటకలోని హిజాబ్ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారితీయడం కూడా…

Read More

తక్షణమే హింసకు తెర దించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌ కు విజ్ఞప్తి చేశారు. అన్ని పక్షాలు దౌత్యపరమైన చర్చల మార్గానికి తిరిగి రావాలని ఆయన కోరారు. ఉక్రెయిన్ రష్యా దాడి తర్వాత గత రాత్రి పుతిన్ తో ఆయన టెలిఫోన్ లో మాట్లాడారు. యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత పుతిన్‌తో మాట్లాడిన తొలి దేశాధినేత మోదీయే కావడం గమనార్హం. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ టెలిఫోన్ సంభాషణ అనంతరం ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, ‘‘హింసకు తక్షణమే తెర దించాలని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. దౌత్యపరమైన చర్చలు, సంభాషణల మార్గానికి తిరిగి రావడం కోసం అన్ని పక్షాలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు’’ అని తెలిపింది. అదేవిధంగా ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల భద్రతపట్ల భారత దేశ ఆందోళన గురించి పుతిన్‌కు తెలిపారని ఈ ప్రకటన పేర్కొంది. భారతీయులు, ముఖ్యంగా విద్యార్థుల భద్రత పట్ల తమకు ఆందోళన ఉందని, వీరిని…

Read More

భీమ్లా నాయక్ పవన్‌ను రాష్ట్రంలో అడ్డుకోవాలని జూమ్లా నాయక్ జగన్ విశ్వప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత లంకా దినకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మద్యం కొట్టు, చికెన్ కొట్టు, మటన్ కొట్టు, చేపల కొట్టుతో మొదలు పెట్టి సినిమా టికెట్ల వరకు వచ్చారని ధ్వజమెత్తారు. రెవిన్యూ అధికారుల విలువైన సమయం సినిమా థియేటర్ల బాత్ రూమ్లకి అంకితం చేసిన ఘనత సీఎం జగన్ సాధించారని దుయ్యబట్టారు. సినిమా పెద్దలకు బడ్జెట్‌ని బట్టి టికెట్ ధరల నిర్ణయం జీఓ ఇస్తామని అని జూటా హామీ ఇచ్చారా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ కోసం ఇంత ప్రహసనం అవసరమా? అని నిలదీశారు. పాలకుడు అందరిని సమానంగా చూడాలని హితవుపలికారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంటే టీటీడీ భారీగా పెంచిన స్వామివారి సేవల టిక్కెట్ల ధరలు తగ్గించాలని లంకా దినకర్ డిమాండ్ చేశారు.  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నటించిన…

Read More

సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకుపైగా సమయం ఉండగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సన్నాహాలు ప్రారంభించినట్లు కనిపిస్తున్నది. ఇటీవల గత మూడేళ్ళుగా ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులను బదిలీ చేసి, కొత్తవారిని నియమించడం `ఎన్నికల బృందం’ను ఏర్పాటు చేసుకోవడంగా పలువురు భావిస్తున్నారు.  సిఎం ప్రిన్సిపాల్ కార్యదర్శి, డిజిపి, నిఘా అధిపతి వంటి వారిని ఒకేసారి మార్చడం గమనార్హం. పార్టీ ఎమ్యెల్యేలు, మంత్రుల పనితీరుపై ప్రజల మనోభావాలను తెలుసుకోవడం కోసం విస్తృతంగా సర్వేలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. మరోవంక, ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనపై కూడా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తున్నది.  గతంలో వలే మేనిఫెస్టో రూపకల్పనలో ఉద్యోగ విరమణ చేసిన సీనియర్ అధికారుల సేవలను వినియోగించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటున్న సమయంలో ఆర్ధిక వ్యవహారాలను చక్కదిద్దడంతో పాటు, సంక్షేమ- అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చేవిధంగా నిపుణుల అభిప్రాయం సేకరిస్తున్నట్లు తెలిసింది.  2019లో తయారు చేసిన మ్యానిఫెస్టోలో ఆర్ధికశాఖలో దీర్ఘకాలం పనిచేసి, తరువాత…

Read More

ఉక్రెయిన్‌పై రష్యాదాడి మొదలైంది. ఈ పరిస్థితుల్లో భారతీయులు ఎక్కడివారక్కడే ఆగిపోవాలని, సురక్షిత ప్రాంతాలకు చేరుకుని ఆ దేశంలో పరిస్థితులు చక్కబడేవరకు వేచి ఉండాలని భారత విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాల నుంచి ఆ దేశ రాజధాని కీవ్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్న భారతీయులంతా తిరిగి తమతమ ప్రదేశాలకు వెళ్లి పోవాలని కోరింది.  తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ సూచనలే పాటించాలని కోరింది. ఇప్పటికే విదేశాంగ శాఖ భారతీయుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. ఉక్రెయిన్ వివాదం తెరపైకి రాకముందు ఆ దేశంలో 22వేల మంది భారతీయులు ఉండేవారని అధికార వర్గాలు అంచనా వేశాయి. ఇందులో సుమారు వెయ్యిమంది వరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు.  ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు భారీ సంఖ్యలో భారత ఎంబసీ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో భయభ్రాంతులకు గురైన విద్యార్థులు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని…

Read More

నేడు 115వ జయంతి సందర్భంగా నివాళులు జనరల్ కోడెండెర సుబ్బయ్య తిమ్మయ్య (1906-1965), భారత సైన్యంలోని సైనిక దిగ్గజం. 1962లో చైనాతో వివాదానికి దారితీసిన కీలక సంవత్సరాల్లో 1957 నుండి 1961 వరకు ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా పనిచేశారు. ఈరోజు 115 సంవత్సరాల క్రితం ఆయన జన్మించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో యుద్ధంలో పదాతిదళ దళానికి నాయకత్వం వహించిన ఏకైక భారతీయుడు తిమ్మయ్య. భారత సైన్యం సృష్టించిన అత్యంత విశిష్ట పోరాట అధికారిగా ఆయనను పరిగణిస్తారు. కొరియా యుద్ధం తరువాత, యుద్ధ ఖైదీలను స్వదేశానికి రప్పించే ఐక్యరాజ్యసమితి విభాగానికి నాయకత్వం వహించారు. ఆయన సైన్యం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, జూలై 1964 నుండి డిసెంబర్ 1965 వరకు సైర్పస్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళానికి కమాండర్‌గా పనిచేశారు. 18 డిసెంబర్ 1965న విధినిర్వహణలో ఉండగానే సైప్రస్‌లో మరణించారు. ఆయన అన్నయ్య పొనప్ప నేతాజీ ఏర్పాటు చేసిన ఐఎన్ఎ లో పనిచేశారు. తమ్ముడు సోమయ్య…

Read More

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కుటుంభంకు చెందిన టీవీ చానల్‌ ‘సాక్షి’కి కేంద్ర సమాచార, ప్రసార శాఖ అనుమతిని రద్దు చేసింది. అయితే హైకోర్టును ఉద్యోగులు ఆశ్రయించడంతో తాత్కాలికంగా ఉపశమనం పొందిన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  గత నెల 20వ తేదీన కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. ‘సాక్షి’కి కేంద్ర హోం శాఖ ‘సెక్యూరిటీ క్లియరెన్స్‌’ ఇవ్వకపోవడంతో అనుమతి లభించలేదు. దేశ అంతర్గత భద్రతను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రమాణాలకు లోబడి మాత్రమే చానళ్లకు కేంద్ర హోంశాఖ ‘సెక్యూరిటీ క్లియరెన్స్‌’ మంజూరు చేస్తుంది.  అది ఉంటేనే ఛానల్స్ కు  కేంద్ర సమాచార, ప్రసార శాఖ అనుమతి లభిస్తుంది. స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి చెందిన చానల్‌కు హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్‌ ఎందుకు ఇవ్వలేదు? ఆ చానల్‌ నుంచి అంతర్గత భద్రతకు ముప్పు ఉందని భావించిందా? లేక  జగన్‌పై అక్రమాస్తుల కేసులు ఉన్నందుకేనా? ఇవేవీ కాకుండా… మరేవైనా…

Read More

మొత్తం ప్రపంచ మానవాళి గత కొంతకాలంగా ఆందోళన చెందుతున్న ఉక్రెయిన్ పై యుద్ధం నీడలు కార్యరూపం దాల్చాయి. ఇప్పటివరకు బెదిరిస్తూ వస్తున్న రష్యా, ప్రపంచ దేశాల ఆందోళనలను, అభ్యంతరాలను ఖాతరు చేయకుండా ఉక్రెయిన్‌లోకి రష్యా సైన్యం ప్రవేశించిం, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంపై బాంబుల వర్షం కురిపించింది. ఉక్రెయిన్ దేశంపై మిలటరీ ఆపరేషన్‌ మొదలైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్న పుతిన్‌ ఇప్పటికే చెప్పారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ దేశం ఎమర్జెన్సీ విధించింది. ఉక్రెయిన్‌ ప్రభుత్వంరష్యాకు దీటుగా బలగాలు సిద్ధం చేసుకుంది. రష్యా దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. రష్యా బాంబు దాడులతో కైవ్, ఖార్కివ్ నగరాల్లో పేలుళ్ల శబ్ధం వినిపించింది.తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడితో అట్టుడికింది. ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో ప్రత్యేక సైనిక చర్య నిర్వహించడానికి రష్యన్ దళాలకు అధికారం ఇచ్చామని వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్…

Read More

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోమొదటి మూడు దశ  చవిచూస్తోందన్నపోలింగ్ లో గట్టి పోటీ ఎదురైనట్లు స్పష్టం కావడం, సమాజవాద్ పార్టీ బాగా కోలుకున్నట్లు వెల్లడి కావడంతో బీజేపీ,  ఆర్‌ఎస్‌ఎస్   నేతలు దిద్దుబాటు చర్యలకు దిగిన్నట్లు తెలుస్తున్నది.  యుపి ఎన్నికలను 2024లో జరుగబోయే లోక్ సభ ఎన్నికలకు రిహార్సల్ గా భావిస్తూ ఉండడంతో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడవలసిందే అని భావిస్తున్న  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నేతలు రంగంలోకి దిగి బిజెపి ప్రచారాన్ని ఫలప్రదం చేసేందుకు కార్యాచరణకు పూనుకున్నట్లు చెబుతున్నారు.  ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో హిందువులు ఉత్సాహంగా ఓట్ వేయడం లేదని తెలియడంతో  ప్రజలను సమీకరించేందుకు కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి సహాయాన్ని కోరినట్లు తెలిసింది. అయితే ఆమె అందుకు విముఖత వ్యక్తం చేసిన్నట్లు చెబుతున్నారు. 2012 యుపి ఎన్నికలలో ఆమె బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కావడం గమనార్హం.  ఆర్‌ఎస్‌ఎస్ సహా సర్ కార్యవాహ  అరుణ్ కుమార్ నాల్గవ దశకు ముందు జలౌన్ (యుపి)లో భారతిని కలుసుకుని బిజెపికి ప్రచారం చేయమని కోరగా, ఆమె అంగీకరించలేదని చెబుతున్నారు. బిజెపి నాయకత్వం తన పట్ల అవమానకరంగా వ్యవహరించడాన్ని…

Read More